Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’ | Maharashtra 3rd Language Notification Hindi Not Mandatory | Sakshi
Sakshi News home page

Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’

Jun 18 2025 11:48 AM | Updated on Jun 18 2025 12:21 PM

Maharashtra 3rd Language Notification Hindi Not Mandatory

ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీష్ తర్వాత మూడవ భాషగా  హిందీని పరిగణిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని మూడవ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నూతన నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఒక తరగతిలో 20కి మించిన విద్యార్థులు హిందీకి బదులుగా మరొక భాష నేర్చుకోవాలనుకుంటే,  సంబంధిత ఉపాధ్యాయుణ్ణి అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక- 2024 ప్రకారం మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతులకు హిందీ ఇకపై మూడవ భాషగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషలలో ఒకదాన్ని మూడవ భాషగా నేర్చుకోవాలనుకుంటే వారికి అందుకు అనుమతి కల్పిస్తారు. మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మరాఠీ భాషను తప్పనిసరి చేశారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement