
మైసూరులో 3 ఇళ్లు దగ్ధం
మైసూరు: ఆకస్మికంగా మంటలు అంటుకుని మూడు ఇళ్లు కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. మైసూరు తాలూకాలోని బోరె ఆనందూరిలో ఈ ప్రమాదం జరిగింది. శనివారె గౌడ, వెంకటేష్ గౌడ, శ్రీనివాస్‌గౌడల ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినా నష్టం జరగిపోయింది. ఇళ్లలో ఉన్న వస్తువులు, బట్టలు, డబ్బు, బంగారం దగ్ధమయ్యాయి. మొదట ఓ ఇంటిలో మంటలు చెలరేగి తరువాత ఇళ్లకు వ్యాపించినట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ లేదా, కరెంటు వైర్లే కారణమని అనుమానాలున్నాయి. ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా తలా రూ. లక్ష సహాయాన్ని అందజేశారు.
రైలు ఢీకొని ఇద్దరు మృతి!
మైసూరు: మైసూరు నగరంలో రెండు వేర్వేరు సంఘటనల్లో ఒక మహిళ, ఓ పురుషుడు రైలు ఢీకొని మరణించారు. మొదటి కేసులో 40 నుంచి 45 సంవత్సరాలున్న గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అలాగే పట్టాల మీద మరో మహిళ మృతదేహం లభ్యమైంది. మైసూరు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదమా, ఆత్మహత్యలా అనేది తేలాల్సి ఉంది.