కన్నడిగులకు శాపంగా కాంగ్రెస్‌ సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

కన్నడిగులకు శాపంగా కాంగ్రెస్‌ సర్కార్‌

May 20 2025 1:18 AM | Updated on May 20 2025 1:18 AM

కన్నడిగులకు శాపంగా కాంగ్రెస్‌ సర్కార్‌

కన్నడిగులకు శాపంగా కాంగ్రెస్‌ సర్కార్‌

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని సాధన సమావేశం నిర్వహిస్తున్నారు, కన్నడిగులకు కాంగ్రెస్‌ సర్కార్‌ శాపంగా మారింది అని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 శాతం కమీషన్‌తో పనులు చేస్తోందని మండిపడ్డారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఏటీఎంగా మార్చుకొని ఆ పార్టీ హైకమాండ్‌ లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. బళ్లారిలో అవినీతి రహిత పాలన అందిస్తామని గెలిచిన ఎమ్మెల్యే ప్రతి పనికీ కమీషన్‌ తీసుకొని అవినీతి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కమీషన్‌ దందా ఎన్నడూ జరగలేదన్నారు. ఎస్పీ సర్కిల్‌లో అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంచినీరు, పాలు, పెట్రోల్‌, నిత్యావసర ధరలు పెరిగి పోయి సామాన్యుల జీవితానికి ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. అభివృద్ధి శూన్యం అని అన్నారు. కిలోమీటర్‌ కూడా రోడ్డు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. టీబీ డ్యాం గేట్లు పటిష్టం చేయడంపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

జన సమీకరణపైనే దృష్టి

జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మోకా మాట్లాడుతూ జిల్లాలో 5 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సాధన సమావేశానికి పెద్ద ఎత్తున జన సమీకరణపై దృష్టి పెట్టినట్లుగా అభివృద్ధి పనుల విషయంలో పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన రూ.187 కోట్ల నిధులు స్వాహా చేసిన వారిని పక్క పెట్టుకొని సాధన సమావేశం నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. కర్ణాటక లూటీ కాంగ్రెస్‌ డ్యూటీగా మారిందన్నారు. పాల ధర రూ.9 పెంచారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పేరుకు మాత్రమేనని, పురుషుల నుంచి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. బళ్లారి నుంచి బెంగళూరు వరకు మహనగర పాలికెలో కూడా అవినీతి పెరిగి పోయి కాంగ్రెస్‌ నాయకులకు ఏటీఎంగా మలుచుకున్నారన్నారు. కాంగ్రెస్‌ సర్కారులో రైతులకు మోసం జరుగుతోందని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సీఎం సిద్దరామయ్య కుటుంబ సభ్యులపై ముడాలో అవినీతి జరిగిందని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు డాక్టర్‌ బీకే సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇది 60 శాతం కమీషన్‌ సర్కారు

బళ్లారిలో పాలన అవినీతిమయం

ఏం పొడిచారని సాధన సమావేశం?

మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement