ఎయిమ్స్ కోసం మానవహారం
● రెండో రోజు కూడా కొనసాగిన ఆందోళన
రాయచూరు రూరల్: రాయచూరులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నాయని ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ కళస ఆరోపించారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో చర్చించి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించేలా చూడాలన్నారు. ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు మౌనం వహించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. మూడేళ్ల నిరంతర పోరాటానికి ఫలితం దక్కేలా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
బ్రాహ్మణ సంఘం
కార్యవర్గం ఎంపిక
రాయచూరు రూరల్ : అఖిల కర్ణాటక బ్రాహ్మణ సంఘం కార్యవర్గ ఎన్నికల్లో సంఘం జిల్లాధ్యక్షుడిగా గురురాజ్ ఆచార్ జోషి, కార్యదర్శిగా జయకుమార్ దేశాయి ఎంపికయ్యారు.
అక్రమ రేషన్ బియ్యం లారీ బోల్తా
రాయచూరు రూరల్: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం లారీ బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నభాగ్య బియ్యాన్ని లారీలో నింపుకొని మాన్వి నుంచి సకలేశపురకు తరలిస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్ బియ్యాన్ని, లారీని వదిలి పరారైన ఘటన జరిగింది. పోలీసులు లారీని సీజ్ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మాన్వి సీఐ తెలిపారు.
వైభవంగా
హిందూ ముస్లిం ఉత్సవాలు
రాయచూరు రూరల్: గదగ్ జిల్లా శిరహట్టిలోని ఫక్కీరేశ్వర మఠంలో బుధవారం హిందూ, ముస్లిం సోదరులు ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గుర్రాలపై ఫక్కీరేశ్వరుడిని పెద్ద ఎత్తున ఊరేగించారు. హిందూ ముస్లిం సోదరత్వాన్ని చాటి చెప్పే సందేశాలను జాతికి వివరించేలా ఉత్సవాలను నిర్వహించారు.
ఐదుగురు ఇంటి దొంగల అరెస్టు
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా చిగటేరి, అరసీకెరె పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల జరిగిన వేర్వేరు దొంగతనం కేసులకు సంబంధించి ఐదుగురు ఇంటి దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మణికంఠ, కుంట చంద్ర, భీమేష్, ముబారక్ అలీ, మనోజ్‌లను పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.11.99 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన వస్తువులు, వారు దొంగలించిన ద్విచక్ర వాహనం, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు, హరపనహళ్లి డీఎస్పీ వెంకటప్ప నాయక్ మార్గదర్శకత్వంలో సీఐ మహంతేష్ సజ్జన ఈ దాడి నిర్వహించారు. పీఎస్‌ఐ శంభులింగ హిరేమఠ, రంగయ్య, నాగరత్న, సిబ్బంది ముబారక్, రవి దాదాపూర్, మాలకాటి బిలిచోడ పాల్గొన్నారు.
ఎయిమ్స్ కోసం మానవహారం
ఎయిమ్స్ కోసం మానవహారం
ఎయిమ్స్ కోసం మానవహారం
ఎయిమ్స్ కోసం మానవహారం


