
మన చెట్లు లేక ఇక్కట్లు
బనశంకరి: ఉద్యాననగరిగా ఖ్యాతి గడించిన బెంగళూరు నగరంలో టబూబియా, రోసియా, కాపర్‌వుడ్, రైన్ ట్రీ, సిల్వర్‌ఓక్, గుల్‌మొహర్ లాంటి విదేశీ చెట్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. నగర అందాలకోసం పెంచిన మొక్కలు మొత్తం చెట్లలో 60 శాతం వరకూ చేరాయి. వేగంగా పెరిగే ఈ చెట్లకు వేర్లు మాత్రం గట్టిగా ఉండవు. భూమి లోపలి వరకూ చేరుకోవు. ౖపైపెన వేర్లతో పెద్ద చెట్టుగా పెరిగి వర్షాల సమయంలో విరిగి జనం మీద పడుతున్నాయి. ఇదో పెద్ద ఇబ్బందిగా మారింది. ఫలితంగా ఆస్తి, ప్రాణనష్టాలు సాధారణమయ్యాయి.
ఏయే వృక్షాలు..
బెంగళూరు నగరంలో టబూబియా, రోసియా, కాపర్‌వుడ్, రైన్‌ట్రీ, సిల్వర్‌ఓక్, గుల్ మొహర్ లాంటి విదేశీ చెట్లు విరివిగా దర్శనమిస్తున్నాయి. వీధులకు శోభనిస్తాయని బీబీఎంపీ అటవీ శాఖ అధికారులు వీటిని ఎక్కువగా పెంచుతారు. ఇప్పటికీ పార్కుల్లో, రోడ్ల పక్కన విదేశీ మొక్కలను అధికంగా పెంచుతున్నారు.
రెండు నెలల్లో ఇద్దరు మృతి
ఈ ఏడాదిలో మార్చి 22 , మే 1వ తేదీన గాలివానలకు పలుచోట్ల ఈ చెట్లు నేలకూలి మరణాలు సంభవించాయి. ఈ రెండు రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 93 చెట్లు, 163 చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయని బీబీఎంపీ అధికారులు తెలిపారు. పులకేశినగరలో మార్చి 22వ తేదీన తండ్రితో కలిసి ద్విచక్రవాహనంలో కూర్చుని వెళుతున్న మూడేళ్ల బాలిక, కత్రిగుప్పెలో మే 1వ తేదీన ఆటో రిక్షాపై విదేశీచెట్టు కూలిపోవడంతో డ్రైవరు చనిపోయారు. ఇలాంటి ఘటనలతో నగరవాసులు చెట్ల కింద నుంచి వెళ్లాలంటే గుబులు పడుతున్నారు.
కారణాలున్నాయి
విదేశాల్లో, బెంగళూరులో నేల స్వభావాలు వేర్వేరు. విదేశీ చెట్లు నగరానికి సరిపడవు. చెట్ల చుట్టూ నీరు ఇంకిపోకుండా సిమెంటు ఫుట్‌పాత్‌లు, తారు రోడ్లు ఉండడం వల్ల చెట్టు బలహీనపడుతుంది. అలాగే వయసు మీరిన చెట్లు, తెగుళ్లు వచ్చి, వేరు కుళ్లు వల్ల కూకటివేళ్లుతో కూలిపోవడానికి కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
దేశీయ చెట్లే ఉత్తమం
బెంగళూరు లో వెదురు, బూరుగ, రాణి పువ్వు చెట్లు, పారిజాత, అల్ల నేరేడు, పనస, తెల్లనంది, వేప, తామ్ర, గుళిమావు, కదంబ, కానుగ లాంటి చెట్లు నీడతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. కార్బన్ డైఆకై ్సడ్‌ను పీల్చుకుని కాలుష్యాన్ని తగ్గిస్తాయి. అలాంటి చెట్లను ఎక్కువగా నాటాలని పర్యావరణవాదులు, విశ్రాంత సస్యశాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్ కేపీ శ్రీనాథ్ తెలిపారు. చెట్ల పెంపకంలో శాసీ్త్రయత పాటించాలని సూచించారు.
తరచూ దుర్ఘటనలు
వాతావరణ మార్పులతో వరద పరిస్థితులు, నీటికొరత ఎదుర్కొంటున్న రాజధానిలో చిన్నపాటి గాలివర్షానికి సైతం తట్టుకోలేక చెట్లు పడిపోతూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా విదేశీ చెట్లు ప్రమాదకంగా మారాయి. రాజాజీనగర, బసవనగుడి, జయనగర, జేపీ.నగర, ఎన్‌ఆర్.కాలనీ, చామరాజపేటే, త్యాగరాజనగర, గాంధీనగర, శివాజీనగర, మల్లేశ్వరం, చిక్కపేటే, విజయనగర తదితర పాత ఏరియాలు, వ్యాపార ప్రదేశాల్లో చెట్లు కూలిపోవడం, కొమ్మలు విరిగిపడుతున్న ఘటనలు ఎక్కువ. ఉద్యానవనాల్లో, విశాలమైన ప్రదేశాల్లో కంటే రోడ్లు, ఇంటి కాంపౌండ్‌లు, డ్రైనేజీల మీద కూలిన ఘటనలు అధికం. దీని వల్ల ప్రాణనష్టం కూడా ఉంటోంది. వర్షాకాలంలోనే కాదు, మిగతా కాలాల్లోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
బెంగళూరు నిండా విదేశీ వృక్షాలే
టబూబియా, గుల్ మొహర్‌ల కనువిందు
చిన్న గాలివానకే కూలి ఆస్తి, ప్రాణనష్టాలు
బీబీఎంపీ తీరుపై నగరవాసుల అసంతృప్తి
కొత్తొక వింత, పాత ఒక రోత అన్నట్లు నాణ్యమైన మన దేశీ చెట్లు బెంగళూరులో కనిపించేది తక్కువ. రంగు రంగు పూలతో విదేశీ వృక్షజాతులు కనువిందు చేస్తాయి. కానీ అందం మాటున అపాయం దాగి ఉంది. తరచూ విరిగిపడే ఈ విదేశీ చెట్లు నగరవాసులకు భయం పుట్టిస్తున్నాయి.

మన చెట్లు లేక ఇక్కట్లు

మన చెట్లు లేక ఇక్కట్లు

మన చెట్లు లేక ఇక్కట్లు

మన చెట్లు లేక ఇక్కట్లు