ఉద్యోగాలంటూ వసూళ్లు
బనశంకరి: బెంగళూరు నగరంలో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఐటీ ఇంజినీరును గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. జేపీ నగర సారక్కి చెరువు నివాసి పత్నూర్ కలందర్‌ఖాన్ (43) వంచకుడు. కేరళ నుంచి గతేడాది ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చిన నిందితుడు బీటీఎంలేఔట్ డాలర్స్‌కాలనీలో ఓ కంపెనీలో హెచ్‌ఆర్ ట్రైనర్‌గా చేరాడు. ఉద్యోగాలకు వచ్చే యువతీ యువకులతో పరిచయం పెంచుకున్నాడు. మీకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి 8 మంది నుంచి రూ.14.23 లక్షలు వసూలు చేసి ముఖం చాటేశాడు. తరువాత గీత అనే యువతి నుంచి రూ.2.70 లక్షలు గుంజాడు.
బాధితులు సీసీబీకి ఫిర్యాదు చేయడంతో విచారించి కలందర్‌ఖాన్ ను అరెస్ట్‌చేశారు. అతని నుంచి రూ.1.50 లక్షలు, మొబైల్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.


