
సెల్‌ఫోన్‌కు బానిస కావొద్దు
కోలారు : యువత, విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిస కావద్దని, వేసవి శిబిరాల్లో పాల్గొని ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ పొందాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి ముజఫర్ మాంజరి సూచించారు. రాష్ట్ర బాలభవన సొసైటీ బెంగళూరు, జిల్లా యంత్రాంగం సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని జిల్లా బాలభవన సొసైటీలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వేసవి శిబిరాన్ని జడ్జి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో ఎన్నో విషయాలను పిల్లలకు అవగాహన కల్పిస్తారని, మానసికంగా, దైహికంగా పెరుగుదలకు శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ చిత్రకళ, కౌశల్యాలు, యోగా, కరాటే, సంగీతం, నృత్యం తదితరాలలో శిక్షణ ఇస్తారన్నారు. జిల్లా పిల్లల రక్షణాధికారి నాగరత్న , వంశీకృష్ణ, కేజీఎఫ్ తాలూకా క్షేత్ర శిక్షణాధికారి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.