
20న సాధన సభకు రాహుల్, ఖర్గే రాక
హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంఽధీ, రాజ్యసభ సభ్యులు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి, డీకే.శివకుమార్ హొసపేటెలో జరిగే ప్రభుత్వ సాధన సదస్సుకు హాజరవుతారని జిల్లా ఇన్‌చార్జి, గృహ నిర్మాణ, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. నగరంలో పునీత్ రాజ్‌కుమార్ జిల్లా మైదానాన్ని ఆయన సందర్శించి, వేదిక నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడారు. ఈ నెల 20న హొసపేటెలో జరగనున్న ప్రభుత్వ సాధన సమావేశంలో లక్ష మంది లబ్ధిదారులకు అర్హత పత్రాలను పంపిణీ చేస్తారన్నారు. ఈ వేడుకకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. విజయనగర జిల్లాపై సీఎం సిద్దరామయ్యకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరిస్తారన్నారు. జిల్లా మైదానంలోకి వచ్చే ప్రజలకు వేదికతో సహా అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ సమావేశానికి కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా అనేక మంది నాయకులు హాజరవుతున్నారని ఆయన అన్నారు. ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు హెచ్‌ఆర్.గవియప్ప, ఎమ్మెల్యే జే.గణేష్, కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, డీసీసీ అధ్యక్షుడు సిరాజ్ షేక్, రవి బోసురాజు పాల్గొన్నారు.
రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా
జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్
అహ్మద్ ఖాన్