మామూలు నేరాల కంటే ఎక్కువ
బనశంకరి: సైబర్ నేరాల బాధితులకు, వయసుకు సంబంధం ఉందా అని ప్రశ్నిస్తే, అశ్చర్యం కలిగించే సమాధానం వస్తుంది. సైబర్ నేరాల గురించి రాష్ట్ర సీఐడీ పోలీసుల నివేదికలో ఇలాంటి కుతూహలం కలిగించే అంశం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు నిత్యం ప్రజలకు గాలంవేసి లక్షలాది రూపాయలను దోచేస్తున్నారు. అన్ని వయసులవారు బాధితులుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ వయసు వారు ఎక్కువగా ఎలాంటి మోసానికి గురయ్యారో సీఐడీ విశ్లేషణ చేసి, జాగృతి అభియాన చేపడుతోంది.
వయసును బట్టి మారే మోసం
● సైబర్ వంచకులు 16 ఏళ్ల వయసు వారికి సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపెట్టి , మధ్య తరగతికి పెట్టుపెడి పేరుతో మోసం చేస్తున్నారు. వృద్ధులను డిజిటల్ అరెస్ట్ ద్వారా బెదిరించి నగదు దోచేస్తున్నారు.
● 18–20 వయస్సు– ఈ వయస్సులో బాధితులు చాలావరకు విద్యార్థులు ఉంటారు. సోషల్ మీడియాలో శ్రమలేకుండా డబ్బు సంపాదించవచ్చునని నమ్మించి సైబర్ మోసగాళ్లు వలలో వేసుకుంటారు. నకిలీ లింక్ పంపించి నగదు దోచేస్తున్నారు.
● 30–45 వయసు– ఈ వయసువారికి సంపాదించాలని ఆశ ఎక్కువ. పెట్టుబడిపెట్టి అధిక ఆదాయం పొందాలని ప్రలోభ పెడతారు. షేర్‌మార్కెట్, అధిక వడ్డీ ఇచ్చే క్రిప్టో కరెన్సీ అని చెప్పి డబ్బు కాజేస్తారు.
● 50–70 ఏళ్లు – ఈ వయసువారు సంపాదించిన డబ్బును బ్యాంకులో పెడతారు. ఖాతాల్లో బాగా డబ్బున్న వారిని గుర్తించి డ్రగ్స్ కేసు, అశ్లీల వీడియోలు, ఫోటోలు, మనీ లాండరింగ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు డిజిటల్ అరెస్టు అని బెదిరించి దోచేస్తున్నారు.
పార్ట్ టైం ఉద్యోగాలు, టాస్కులు, షేర్లలో పెట్టుబడి, గిప్టులు, డిజిటల్ అరెస్ట్ తరహా కేసులు హెచ్చుమీరుతున్నాయని సీఐడీ డీజీపీ డాక్టర్ ఎంఏ.సలీం తెలిపారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని సైబర్ నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, దీనికోసం కొత్త యాప్‌లను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సైబర్ సురక్షత పట్ల జాగృతం చేస్తున్నామని, సైబర్ వంచకులు బెదిరించిన తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు దోచేస్తారిలా
సీఐడీ విశ్లేషణలో కొత్త నిజాలు
ప్రస్తుతం దోపిడీలు, హత్యలు లాంటి భౌతిక నేర కార్యకలాపాల కంటే వైట్‌కాలర్, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సైబర్ నేరాల మీద నిత్యం 100 నుంచి 200 ఎఫ్‌ఐఆర్లు నమోదు అవుతున్నాయి. దేశంలో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొచ్చి తో పాటు మహానగరాల్లో జరిగే నేరాల్లో 20 శాతం కంటే ఎక్కువగా సైబర్ నేరాలు ఉంటున్నాయి. కన్నడనాట గత నాలుగేళ్లలో 52 వేల కేసులు నమోదైతే, పరిష్కరించినవి చాలా తక్కువ.
యుద్ధం చాటున సైబర్ క్రైమ్స్
నకిలీ లింక్‌లతో జాగ్రత్త
పోలీస్ కమిషనర్ సూచన
శివాజీనగర: భారత్– పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో సైబర్ వంచకుల గురించి జాగ్రత్తగా ఉండాలని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ ప్రజలకు సూచించారు. యుద్ధ వార్తలపై సామాన్య ప్రజల కుతూహలాన్ని వినియోగించుకునే సైబర్ వంచకులు తప్పుడు వార్త, ఫిషింగ్, నకిలీ లింక్‌ల ద్వారా మోసగించే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఇండో–పాక్ యుద్ధాల ప్రత్యేక దృశ్యాలు, వైరల్ వీడియోలు, ఆఫర్లు అంటూ ప్రలోభపెడతారన్నారు. అలా వచ్చే మెసేజ్‌లను నొక్కితే మీ ఫోన్‌లలో మాల్‌వేర్ చొరబడవచ్చు. నకిలీ లింక్‌ల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాలను సైబర్ నేరగాళ్లు దొంగిలించవచ్చు. అత్యవసరంగా ఆర్మీ నియామకాలు అని వచ్చే మెయిల్స్‌ను, లింక్‌లను ఓపెన్ చేయకూడదన్నారు. వాట్సాప్‌తో పాటుగా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా స్వీకరించే అపరిచిత మెసేజ్‌ల జోలికి వెళ్లరాదని తెలిపారు. వచ్చినవాటిని డిలిట్ చేయాలని సూచించారు. కాగా, యుద్ధం దాడుల నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి.
మామూలు నేరాల కంటే ఎక్కువ
మామూలు నేరాల కంటే ఎక్కువ
మామూలు నేరాల కంటే ఎక్కువ
మామూలు నేరాల కంటే ఎక్కువ


