ఇందిరా కట్టకు కొత్త రూపు
హొసపేటె: నగరంలోని జిల్లా పునీత్ రాజ్‌కుమార్ క్రీడామైదానంలో ఇందిరాగాంధీ కట్ట కొత్త రూపు సంతరించుకుంది. 1980లో ఇందిరా ఈ కట్టపైనుంచి నగర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అప్పటి నుంచి ఈ కట్టను ఇందీరాగాంధీ కట్టగా పిలుస్తారు. ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ రెండేళ్ల సాధన సమావేశం నేపథ్యంలో ఈ కట్టకు మెరుగులు దిద్దారు. నూతన పాలరాయితో ఇందిరా విగ్రహాన్ని తయారు చేయించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు.


