ఆకట్టుకుంటున్న సిల్క్, చేనేత వస్త్రాలు
సాక్షి బళ్లారి: స్థానిక అనంతపురం రోడ్డులోని సెంటనరీ హాల్‌లో ఈనెల 26వ తేదీన ప్రారంభమైన ది గ్యాడ్ ఎగ్జిబిషన్ కమ్ సెల్‌కు స్పందన లభిస్తోంది. హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్, హ్యాడ్‌క్లప్, చీరలు, వివిధ రకాలు దుస్తులు, షాదీ బట్టలు, గృహ అలంకరణ వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో గ్రామీణ కళాకారులు తయారు చేసిన కాటన్, సిల్క్, చేనేత వస్త్రాలు, తదితర వాటిని ప్రదర్శనలో ఉంచారు. రాజస్తాన్‌లో చేతితో తయారు చేసిన తివాచీలు, మోజారిలు/జుటిస్, మార్బుల్ క్రాఫ్ట్స్, ఐవరీ, ఒడిశా పట్టచిత్ర పెయింటింగ్, మధుబని పెయింటింగ్స్, బంధానిబంధేజ్ వంటి రంగురంగుల వస్త్రాలు, ఒరిస్సా సంస్కృతిని చిత్రీకరించే అందమైన రూపాలు, వీవల్స్ హ్యాండ్లూమ్‌లో రంగురంగుల చేనేత ఉత్పత్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నగర వాసులు విశేషంగా భారీగా తరలివచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.


