అయ్యప్ప ఆలయంలో కుంభాభిషేకం
హొసపేటె: నెహ్రూ కాలనీలో అయ్యప్ప ఆలయంలో ద్రవ్య కలశం, కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వార్షిక మండల పూజలో భాగంగా విశేష పూజలు చేపట్టారు. సాయంత్రం పటేల్ నగర్‌లోని గోపాలకృష్ణ ఆలయం నుంచి అయ్యప్ప గుడి వరకు అయ్యప్ప స్వామిని ఊరేగించారు. ఆలయ ప్రధాన పూజారి ఈఎన్ శంకరన్ నంబూద్రి నేతృత్వంలో అన్ని మతపరమైన ఆచారాలు జరిగాయి. వేలాది మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి భూపాల్ ప్రహ్లాద్, కోశాధికారి రవీంద్రనాథ్ గుప్తా, సభ్యులు రాజేష్, బరాడే నారాయణ్, శివప్రసాద్, మహాంతేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై
అవగాహన తప్పనిసరి
హొసపేటె: విజయనగర జిల్లాలో జనవరి 1 నుంచి 30 వరకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కేఎం.రాజశేఖర్ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ప్రమాదాలను తగ్గించడానికి ప్రజల్లో ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్ నిర్వహించాలని పేర్కొన్నారు. ఇటీవల, ప్రైవేట్, రవాణా సంస్థ బస్సుల్లో జరగిన అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. జనవరి 3న నగరంలోని డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ సర్కిల్ వద్ద అవగాహన ర్యాలీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీ సర్కిల్ నుంచి ప్రారంభమై జిల్లా స్టేడియం వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
మహిళా ప్రయాణికులే టార్గెట్‌గా చోరీలు
రాయచూరు రూరల్: మహిళా ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకుని విలువైన ఆభరణాలను దొంగిలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. కలబుర్గి ఆర్టీసీ బస్టాండ్‌లో మాంగరవాడికి చెందిన శకిలాబాయి, మాదురి సఖత్ బస్సు ఎక్కుతున్న సమయంలో వీరు ధరించిన బంగారు నగలు చోరీకి గురయ్యారు. సేడమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శనివారం సాయంత్రం నగలను చోరీ చేసిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.13 లక్షలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
రైతులను గౌరవించడం మన కర్తవ్యం
రాయచూరు రూరల్: దేశానికి వెన్నెముక అయిన రైతులను గౌరవించడం మన ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతన్నల కృషి వెలకట్టలేనదని తెలిపారు. అనంతరం 11 మంది రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శారద, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, లక్ష్మణ్ గౌడ తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయంలో కుంభాభిషేకం
అయ్యప్ప ఆలయంలో కుంభాభిషేకం
అయ్యప్ప ఆలయంలో కుంభాభిషేకం


