పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి
రాయచూరు రూరల్: సమాజానికి పాత్రికేయులు వారధిలాంటి వారు అని రాష్ట్ర చిన్న నీటి పారుదల, సైన్స్ సాంకేతిక, విద్యాశాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భనవంలో ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత పాత్రికేయ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. సమాజంలో పేరుకుపోయిన సమస్యలపై స్పందించాలని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం అధికమైందన్నారు. అనంతరం రఘునాథ్ రెడ్డికి జీవమాన సాధక అవార్డు, చంద్ర కాంత్ మసాని, అబ్దుల్ ఖాదర్, శ్రీనివాస్, రాజుకు నగర స్థాయి అవార్డులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ, విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్, నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ, సమాచార కమిషనర్ వెంకట సింగ్, జిల్లాధికారి నితీష్, అదనపు ఎస్పీ కుమార స్వామి, డి.కె.కిషన్ రావ్, జగన్నాథ్ దేశాయి, రిపోర్టర్ గిల్డ్ అధ్యక్షుడు విజయ జాగటగల్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సత్యనారాయణ, చెన్న బసవ, ఖాన్‌సాబ్ తదితరులు పాల్గొన్నారు.


