
కుటుంబాన్ని చిదిమిన అప్పులు
యశవంతపుర: అప్పుల బాధను తట్టుకోలేక కుటుంబ యజమాని బావిలోకి దూకగా, కాపాడాలని భార్య, కుమారుడు కూడా దూకారు. ఈ హృదయ విదారక దుర్ఘటన ఉడుపి జిల్లా కుందాపురలో జరిగింది. తెక్కట్టి సమీపంలోని కంచుగారుబెట్టు గ్రామానికి చెందిన మాధవ దేవాడిగ (56), కుమారుడు ప్రసాద్ దేవాడిగ (22)లు చనిపోగా, మాధవ భార్య తార పరిస్థితి విషమంగా ఉంది.
వివరాలు.. మాధవ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం బ్యాంకులలో అధికంగా అప్పులు చేశారు. అప్పులు కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. అప్పులు తీర్చే మార్గం లేక, విరక్తి చెంది బుధవారం రాత్రి ఇంటి సమీపంలోని బావిలోకి దూకాడు. తండ్రిని రక్షించడానికి కొడుకు, ఆపై తల్లి కూడా బావిలోకి దూకారు. ముగ్గురినీ గ్రామస్థులు, ఫైర్ సిబ్బంది బయటకు తీసేటప్పటికీ తండ్రీ కుమారుడు మరణించగా, ఆమెను ఆస్పత్రికి తరలించారు.
తండ్రీ కొడుకు ఆత్మహత్య
తల్లి పరిస్థితి విషమం