
బెంగళూరు: నగరంలో దారుణం జరిగింది. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్‌లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం హోసూర్ ప్రధాన రహదారిలోని పాత చందాపుర రైల్వే బ్రిడ్జి సమీపంలో, రైలు పట్టాల దగ్గర నీలం రంగులో ఉన్న ట్రావెల్ సూట్‌కేస్ పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.
అందులో యువతి మృతదేహం ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ట్రావెల్ బ్యాగ్‌లోని యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి వయస్సు 18 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.