
బెంగళూరు– బీదర్ మధ్య స్పెషల్ రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు– బీదర్– బెంగళూరు మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో బెంగళూరు జంక్షన్ నుంచి నంబరు– 06589 రైలు రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు బీదర్ జంక్షన్‌కు చేరుతుందన్నారు. అలాగే ఈ నెల 23, 25, 27వ తేదీల్లో బీదర్ జంక్షన్ నుంచి ( రైలు నంబరు 06590) మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరు జంక్షన్‌కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాద్గరి, షాహబాద్, కలబురిగి, హుమ్నాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ రైళ్లకు 3ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయన్నారు.