
ఊపందుకున్న ఖరీఫ్ వ్యవసాయ పనులు
రాయచూరు రూరల్: ఖరీప్ సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో పొలాలను దుక్కి దున్నడం, చదును చేయడంలో అన్నదాతలు బిజీగా ఉన్నారు. రోజూ ఏ పొలంలో చూసినా రైతుల సందడి కనిపిస్తోంది. గ్రామాల్లో వేకువజామునే రైతులు నాగళ్లు తీసుకొని పొలాలకు బయల్దేరుతున్నారు. మరో వైపు ఖరీఫ్‌లో పంటల సాగు కోసం విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆమేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాకు తెప్పించడంలో బిజీగా ఉన్నారు. 84 వేల హెక్టార్లలో నీటి పారుదల సదుపాయాలు ఉన్నాయి. మిగిలిన భూముల్లో ఏక దళ, ద్వి దళ ధాన్యాలు సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాకు 1.71లక్షల మెట్రిక్ టన్నుల ఏరువులు అవసరం కాగా ఖరీఫ్‌లో పంటల సాగుకు అవసరమైన ఎరువులు ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బసవరాజ తెలిపారు. జిల్లాలోని 35 రైతు సంపర్క కేంద్రాలలో రైతులకు ఏరువులు, క్రిమిసంహర క మందులు నిల్వ వున్నాయని వివరించారు. రైతులు సద్వినియెగ పరుచుకోవాలని కేంద్రం ప్రత్యేక అధికారి నాగిరెడ్డి తెలిపారు.
3.44 లక్షల హెక్టార్లలో పంటల సాగు లక్ష్యం
ఎరువుల కొరత లేదు
రైతు సంపర్క కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీ