
భగవాన్ బుద్ధ.. ప్రపంచానికి స్ఫూర్తిదాత
బళ్లారిటౌన్: భగవాన్ బుద్ధుడు యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాత అని బాబూ జగ్జీవన్‌రామ్ చర్మ పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో ఉన్న తారతమ్య ధోరణికి విరుద్ధంగా కొత్త వ్యవస్థ కోసం పోరాడిన మహనీయుడన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ప్రోత్సహించారని గుర్తు చేశారు. గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార జిల్లాధ్యక్షుడు చిదానందప్ప మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా బుద్ధ జయంతిని జరపడం శ్లాఘనీయం అని కొనియాడారు. ఏసీ ప్రమోద్, హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వెంకటగిరి దళవాయి, కన్నడ సంస్కృతి శాఖ ఏడీ నాగరాజు, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు కమలరత్న, అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల ముందు నుంచి జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరం వరకు ఊరేగింపు నిర్వహించారు.

భగవాన్ బుద్ధ.. ప్రపంచానికి స్ఫూర్తిదాత