నిందితులను బంధించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

నిందితులను బంధించాలని వినతి

May 16 2025 12:41 AM | Updated on May 16 2025 12:41 AM

నింది

నిందితులను బంధించాలని వినతి

రాయచూరు రూరల్‌: జిల్లాలోని లింగసూగూరులో వివాహిత శాంతలా మృతికి కారకులైన నిందితులను బంధించడంలో పోలీసులు నిరక్ష్ల్యం వహిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ సంచాలకుడు రమేష్‌ ఆరోపించారు. లింగసూగూరు అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. గత నెలలో శాంతలా భర్త సునీల్‌పై ఆమె తండ్రి దశరథ్‌ ఫిర్యాదు చేశారన్నారు. శాంతలాను మెట్టినింటి వారు అదనపు కట్నం తేవాలని చిత్రహింస పెడుతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు మౌనం వహించారన్నారు. వరకట్నానికి తోడు పిల్లలు పుట్టలేదంటూ మానసికంగా, శారీరకంగా హింసించారన్నారు. ఈ బాధలు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. దీనికి సునీల్‌ కుటుంబ సభ్యులు బాధ్యులని వారందరిని అరె్‌స్ట్‌ చేయడంలో సీఐ పుండలీక ఆమె భర్త నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

భీమానాయక్‌ క్షమాపణ చెప్పాలి

హొసపేటె: తాలూకా పంచాయతీ మాజీ అధ్యక్షుడు సోమశేఖర్‌ వివాహానికి మీరు ఎలా వెళ్లారు? అని అడుగుతూ మాదిగ సమాజాన్ని అవమానించిన మాజీ ఎమ్మెల్యే, కేఎంఎఫ్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్‌.భీమానాయక్‌ క్షమాపణ చెప్పాలని మాదిగ సంఘం నాయకుడు వీరాస్వామి డిమాండ్‌ చేశారు. గురువారం ప్రెస్‌ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా సమాజానికి, మన సమాజానికి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా అన్ని సందర్భాల్లో వీరాభిమానాన్ని ప్రదర్శించడం ద్వారా వారు తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే భీమానాయక్‌ వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే కాంగ్రెస్‌ సాధన సమావేశంలో ఆయనను అడ్డుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ, నింబగల్‌ రామకృష్ణ, సోమశేఖర్‌, వెంకప్ప, శేషు, కొటగినాళ మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ రంగ

ప్రైవేటీకరణ తగదు

రాయచూరు రూరల్‌: కాంగ్రెస్‌ సర్కార్‌ ఽవిద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు నరసింహ నాయక్‌ పేర్కొన్నారు. గురువారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. రైతులు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ కార్డు, డిజిటల్‌ మీటర్‌ ఏర్పాటు, రూ.10 వేల డిపాజిట్లను ఉపసంహరించుకోవాలన్నారు. అక్రమ, సక్రమ పథకంలో రైతులకు విద్యుత్‌ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయాలని, ఆధార్‌ కార్డులను లింక్‌ చేయడం వంటి వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ విద్యుత్‌ శాఖ ఇంజినీర్‌కు వినతిపత్రం సమర్పించారు.

15 మంది

బాల కార్మికులకు విముక్తి

రాయచూరు రూరల్‌: జిల్లాలో బాల కార్మికుల నియంత్రణకు పోలీస్‌, కార్మిక శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా బాల కార్మికులను వ్యవసాయ పనులకు తీసుకెళుతున్న వాహనాలపై దాడి జరిపి 15 మంది బాల కార్మికులకు విముక్తి కల్గించారు. గురువారం దేవదుర్గ తాలూకాలో వివిధ ప్రాంతాల నుంచి వరి, ఇతర పంటల కోతకు బాల కార్మికులను ఐదు వాహనాల్లో తరలిస్తుండగా బాల కార్మిక శాఖ అధికారి మంజునాథరెడ్డి, అధికారులు రాకేష్‌, రాజనగౌడ, వెంకటేష్‌, శివకుమార్‌లు దాడిలో పాల్గొన్నారు.

మెరుగైన ఫలితాలకు

కృషి చేయండి

రాయచూరు రూరల్‌ : జిల్లా స్థాయిలో రెండో సారి పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్‌ పేర్కొన్నారు. గురువారం యరమరస్‌ ప్రభుత్వ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలితాల్లో ఉత్తమ సాధన చేయాలన్నారు. ఈ సందర్భంగా తాలూకా విద్యాశాఖాధికారి ఈరణ్ణ, డయట్‌ ప్రిన్సిపాల్‌ ఇందిర, చంద్రశేఖర్‌లున్నారు.

నిందితులను  బంధించాలని వినతి 1
1/4

నిందితులను బంధించాలని వినతి

నిందితులను  బంధించాలని వినతి 2
2/4

నిందితులను బంధించాలని వినతి

నిందితులను  బంధించాలని వినతి 3
3/4

నిందితులను బంధించాలని వినతి

నిందితులను  బంధించాలని వినతి 4
4/4

నిందితులను బంధించాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement