
నాణెం మింగిన బాలిక
హోసూరు: రూపాయి నాణేన్ని మింగిన బాలిక అందరికీ టెన్షన్ పెట్టించింది. వివరాల మేరకు హోసూరుకు చెందిన నాలుగేళ్ల బాలిక సారా, 9వ తేదీన ఇంట్లో ఆటలాడుకొంటూ రూపాయి బిళ్లని మింగేసింది. అది తెలిసి తల్లిదండ్రులు వెంటనే బాలికను హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయించగా ఆహారనాళంలో రూపాయి నాణెం కనిపించింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స విభాగ డాక్టర్ల బృందంచే ఆధునిక వైద్య ఉపకరణాలను ఉపయోగించి సురక్షితంగా నాణేన్ని బయటకు తీశారు. చికిత్స చేసి మంగళవారం డిశ్చార్జ్ చేశారు.