
జమ్మూ కశ్మీర్ భరతమాత సిందూరం
మైసూరు: నగరంలో జై భారత్ నినాదాలు మిన్నంటాయి. మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. పవల్గాం ఊచకోతకు సంబంధించి పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడాన్ని పురస్కరించుకొని భారత జవాన్లకు జేజేలు పలుకుతూ శుక్రవారం వేలాది మంది ప్రజలు నగరంలో జాతీయ జెండాలను పట్టుకొని తిరంగాయాత్ర చేపట్టారు. భారత సైన్యానికి మద్దతుగా ప్రాణాలైనా ఇస్తాం కాని జమ్ముకశ్మీర్‌ను మాత్రం ఇవ్వబోమని నినాదాలు చేశారు. ఫీల్డ్ మార్షల్ కార్యప్ప సర్కిల్ వద్దకు జాతీయ జెండాలతో వచ్చిన రాజకీయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వివిధ పోరాట సంఘాల నాయకులు, పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు వివిధ ధర్మాల మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాగరికులు, మహిళలు, చిన్నారులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పహల్గాంమ్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సుమారు 26 మంది పర్యాటకులకు, ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన భారత సైనికులకు నివాళి అర్పించారు.
పాల్గొన్న స్వామీజీలు, ప్రజాప్రతినిధులు
అనంతరం వేదికపైకి వచ్చిన సుత్తూరు మఠానికి చెందిన పీఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామీజీ, ఆదిచుంచనగిరి మఠానికి చెందిన సోమనాథ స్వామీజీ, అవధూత దత్తపీఠ శ్రీగణపతి సచ్చిదానంద స్వామితో పాటు అనేక మంది ధర్మగురువులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రజా ప్రతినిధులు సైతం జాతీయ జెండాలు పట్టుకొని వేలాది మందితో కలిసి మైసూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 4 కిలో మీటర్ల దూరం వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాను పట్టుకొని అడుగు ముందుకు వేశారు.
మైసూరులో తిరంగా యాత్ర
వేలాదిగా పాల్గొన్న నగరవాసులు
4 కి.మీ. మేర మువ్వన్నెల జెండాతో ర్యాలీ

జమ్మూ కశ్మీర్ భరతమాత సిందూరం

జమ్మూ కశ్మీర్ భరతమాత సిందూరం