
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్టు
బనశంకరి: ప్రజల నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే, బ్యాంకు ఖాతాల ద్వారా నగదు జమచేసుకుని వంచనకు పాల్పడుతున్న 12 మంది అంతర్రాష్ట్ర వంచక ముఠాని బుధవారం బెంగళూరు ఆడుగోడి పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి 400 మొబైల్ సిమ్ కార్డులు, 140 ఏటీఎం కార్డులు, 17 చెక్‌బుక్‌లు, 27 మొబైల్ ఫోన్లు, 22 బ్యాంకు పాస్‌బుక్స్, చిట్టాపద్దులు , రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎల్‌ఆర్ నగర నివాసి మొబైల్ నంబరు కు గతనెలలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి వర్క్ ఫ్రం ఉందని చెప్పాడు. అతని బ్యాంకు ఖాతాకు రూ.10,83,502 నగదు జమచేసినట్లు, అది విత్‌డ్రా చేసుకోవాలంటే రూ. 5 లక్షలు చెల్లించాలని మభ్యపెట్టి రూ.5 లక్షలు వసూలు చేశారు. దీంతో బాధితుడు ఆడుగోడి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
కూలీలతో బ్యాంకు ఖాతాలు తెరిచి
పోలీసులు విచారణ చేపట్టగా యూపీ, ముంబైలో దుండగుల బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తేలింది. ముంబై కి వెళ్లి లేబర్ కాంట్రాక్ట్ పని చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. కూలీల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి బాధితుల నుంచి సొమ్మును సైబర్ మోసగాళ్లు మళ్లించేవారు. కూలీలకు కమీషన్‌గా కొంత మొత్తం ఇచ్చేవారు. ఉత్తరప్రదేశ్‌లో మరో నిందితున్ని పట్టుకున్నారు. తరువాత ప్రయాగ్‌రాజ్‌లో అద్దె ఇంట్లో ఉండే 10 మంది నేరగాళ్లను అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు.
ముంబై, యూపీలో పట్టివేత