కుంభవృష్టికి సిలికాన్ సిటీ అస్తవ్యస్తం
బనశంకరి: బెంగళూరులో వరద బీభత్సానికి అన్ని లేఔట్లు విలవిలాడాయి.
● ఐడియల్‌హోమ్స్ 1వ క్రాస్ వృషభావతి వ్యాలీలో నీటి ఉధృతికి మూడు ఆవులు, దూడ, ఎనుము మృత్యవాత పడ్డాయి. మహదేవపుర వలయ పరిధిలో 10 చోట్ల జలమయమైంది. సాయిలేఔట్ పూర్తిగా జలమయం కాగా 6 ట్రాక్టర్లు, 2 జేసీబీ, 35 మంది సిబ్బంది, 3 అ గ్నిమాపక వాహనాలతో, ఎన్‌డీఆర్‌ఎప్ బృందాలతో 2 స్థానికులను తరలించారు.
● మారతహళ్లి దీపానర్సింగ్ హోమ్, చిన్నప్పనహళ్లి 5 వక్రాస్, పణత్తూరు రైల్వే అండర్‌పాస్, గ్రీన్‌హుడ్, ఇబ్బలూరు జంక్షన్, బాలాజీలేఔట్ కొత్తనూరు, ఏ.నారాయణపుర కృష్ణనగర , సునీల్‌లేఔట్, హరళూరు, బీఎస్‌పీ లేఔట్ కసవనహళ్లిలో ఇళ్లలోకి వర్షంనీరు చొరబడింది. పాలికె సిబ్బంది ఇళ్లలోచేరిన నీటిని పంప్‌సెట్లుతో తోడేశారు.
● సిల్క్‌బోర్డు జంక్షన్‌లో రాజకాలువ పొంగి పొర్లడంతో రోడ్లు జలమయం కాబడ్డాయి. హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్ 6–7 సెక్టార్లు, బన్నేరుఘట్టరోడ్డు బీలేకహళ్లి సిగ్నల్ రోడ్లు నీరు నిలిచింది. యలచేనహళ్లిలో ఇళ్లలోని నీరుచేరడంతో సహాయక చర్యలు చేపట్టారు.
● రాజ కాలువల్లోవర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హెచ్‌ఆర్‌బీఆర్,5,6,7,8 బ్లాకులు, బైరసంద్రలేఔట్, కెంపేగౌడ రోడ్డు, కామరాజనగర ప్రదేశాలు జలమయమయ్యాయి. 10 పంప్ సెట్లతో నీటి తొలగింపు చేపట్టారు.
● మడివాళ డాలర్స్‌కాలనీ, కోరమంగల 6 వబ్లాక్, ఈజీపుర ప్రదేశాలు జలమయమయ్యాయి. బెల్లందూరు వద్ద జేసీబీ ద్వారా బండ్ తొలగించి నీటిని మళ్లించడంతో ప్రవాహం క్రమేణా తగ్గింది.
● వృషభావతి వ్యాలీ గాలి ఆంజనేయ ఆలయం వద్ద ముంపు ఏర్పడింది. ఇళ్లలోకి నీరుచేరింది.చౌడేశ్వరినగర అట్టూరు లో సుమారు 15 ఇళ్లలోకి , డిఫెన్స్ లేఔట్, ద్వారకానగలో సుమారు 5 ఇళ్లలోకి నీరు చేరింది. ఈప్రదేశాల్లో పంపుసెట్లు అమర్చి నీరు తొలగించారు. విజయశ్రీలేఔట్ హెమ్మెగెపుర రాజకాలువ నీరు వచ్చి ఈ ప్రాంతం జలమయమైంది.
● కెంగేరి వద్ద కోటే లేఔట్‌లో సుమారు 100 ఇళ్లలోకి నీరుచేరింది 4 పంపుసెట్లను అమర్చి నీటిని తొలగించారు. మైసూరురోడ్డు జలమయం కాగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
● 27 చెట్లు కూలిపోగా 43 చోట్ల చెట్లుకొమ్మలు విరిగిపడ్డాయి.
కుంభవృష్టికి సిలికాన్ సిటీ అస్తవ్యస్తం
కుంభవృష్టికి సిలికాన్ సిటీ అస్తవ్యస్తం


