హొసపేటె: విజయనగర జిల్లా హడగలి తాలూకాలోని ఇటగి గ్రామంలో గతనెల 30న జరిగిన ఇంటి చోరీ కేసు మిస్టరీని ఇటగి పోలీసులు చేధించారు. దొంగతనం కేసులో ముగ్గురు నిందితులు సాదిక్ (21), ముబారక్(21), జుబేర్(25)లను అరెస్టు చేసి జైలుకు పంపారు. దొంగతనం జరిగిన రోజు ఇంటి యజమాని రాజశేఖర్ ఎవరో ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులకు నిందితుల గురించి అందిన సమాచారం మేరకు ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, 80 గ్రాముల బంగారం, రూ.70 వేల నగదుతో సహా మొత్తం రూ.5.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మిస్టరీ ఛేదనలో పోలీసుల కృషిని ఎస్పీ శ్రీహరిబాబు ప్రశంసించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సొంతదారులకు అప్పగించారు.
80 గ్రాముల బంగారం, రూ.70 వేల నగదు స్వాధీనం
ముగ్గురు దొంగల అరెస్టు
ముగ్గురు దొంగల అరెస్టు
ముగ్గురు దొంగల అరెస్టు