విజయపుర జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం విజయపుర (బిజాపుర) జిల్లాలో మనగోళి వద్ద షోలాపూర్– చిత్రదుర్గ హైవే–50 లో స్కార్పియో కారు డివైడర్‌కు ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో లారీ కూడా ఈ రెండు వాహనాలను ఢీకొంది. స్కార్పియో కారు తుక్కు తుక్కు కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదు మంది అక్కడికక్కడే మరణించారు. అలాగే బస్సు డ్రైవర్ బసవరాజ్ రాథోడ్ కూడా గాయాలతో మృతి చెందారు.
బ్యాంకు మేనేజర్ కుటుంబం బలి
స్కార్పియో వాహనంలో తెలంగాణకు చెందిన గద్వాల కెనరా బ్యాంక్ మేనేజర్ టి.భాస్కరన్, ఆయన భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న, కుమారుడు అభిరాం, డ్రైవర్ వికాస్ శివప్ప ప్రాణాలు కోల్పోయారు. వీరు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్తున్నట్లు తెలిసింది. భాస్కరన్ కుమారుడు ప్రవీణ్ తేజ, లారీ డ్రైవర్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం తాండవించింది. విజయపుర జిల్లా ఎస్పీ, పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను, మృతదేహాలను విజయపుర ఆసుపత్రికి తరలించారు.
బస్సును ఢీకొన్న స్కార్పియో
వాటిని టిప్పర్ లారీ ఢీ
6 మంది మృత్యువాత
స్కార్పియో డ్రైవరు, బ్యాంకు మేనేజర్, భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం
బస్సు డ్రైవర్ సైతం మృతి
విజయపుర జిల్లాలో ఘోర ప్రమాదం
విజయపుర జిల్లాలో ఘోర ప్రమాదం


