అవినీతిపై విచారణకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

అవినీతిపై విచారణకు డిమాండ్‌

May 22 2025 12:24 AM | Updated on May 22 2025 12:24 AM

అవినీ

అవినీతిపై విచారణకు డిమాండ్‌

రాయచూరు రూరల్‌: రాయచూరు ఽథర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్‌)లో రూ.130 కోట్ల మేర జరిగిన అవినీతిపై విచారణ జరపాలని జయ కర్ణాటక సంఘం డిమాండ్‌ చేసింది. బుధవారం ఆర్టీపీఎస్‌ ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శివకుమార్‌ యాదవ్‌ మాట్లాడారు. స్యాండ్‌ బ్లాస్టింగ్‌, ఐపాక్స్‌ పెయింటింగ్‌ పనుల్లో నియమాలను గాలికొదిలి ఒకే కంపెనీకి 4 కాంట్రాక్ట్‌ పనులు కేటాయించారని ఆరోపించారు. ఆర్టీపీఎస్‌ అధికారులు భాగస్వాములై నాసిరకంతో పనులు చేపట్టి రాష్ట్ర సర్కారు ఖజానా నుంచి రూ.వందలాది కోట్లను లూటీ చేశారన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎండీకి వినతిపత్రం సమర్పించారు.

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి

బళ్లారిఅర్బన్‌: జిల్లాతో పాటు తాలూకాలోని ప్రైవేట్‌ పరిశ్రమల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సువర్ణ కర్ణాటక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ స్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లాధికారికి వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాలూకాలోని హలకుంది, హరగినడోణి, జానెకుంటె, వేణివీరాపుర, తోరణగల్లు, బెళగల్లు, శిడిగినమొళతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్‌ కర్మాగారాల్లో అత్యధిక సంఖ్యలో రాష్ట్రేతరులే ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికులను నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే ఆయా కర్మాగారాల్లో పని చేసే స్థానికుల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉండగా, బయట రాష్ట్రాల వారు గరిష్ట సంఖ్యలో ఉన్నారన్నారు. నేల, నీరు, ఊరు మనది. అయితే ఇక్కడ పని చేస్తున్న వారు మాత్రం స్థానికేతరులు ఎక్కువేనన్నారు. ఇది శోచనీయమైన విషయం అన్నారు. స్థానికులకు అవకాశం కల్పించాలి లేకుంటే జిల్లా పరిధి నుంచి కర్మాగారాలను తరలించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులు వేలాది సంఖ్యలో ఉన్నారు. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. వీరందరికీ ఆయా ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పించాలని ఆయన ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలను డిమాండ్‌ చేశారు. వేదిక జిల్లాధ్యక్షుడు, ఇతర పదాధికారులున్నారు.

29న ఇందిరా క్యాంటీన్‌

ప్రారంభం

కేజీఎఫ్‌ : పేదల ఆకలి తీర్చేందుకు నగరంలో ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్‌ను ఈ నెల 29వ తేదీన జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి భైరతి సురేష్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే రూపా శశిధర్‌ తెలిపారు. బుధవారం ఆమె నగరంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రి ముందున్న ప్రభుత్వ స్థలంలో రూ. కోటితో ఇందిరా క్యాంటీన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రికి వచ్చి వచ్చే పేదలకు ఈ క్యాంటీన్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందిరా క్యాంటీన్‌కు మెరుగులు దిద్దడం కోసం నగరసభ నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. టిఫిన్‌ రూ.5, భోజనం రూ.10తో అందజేస్తారని తెలిపారు. నగరసభ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, నగరసభ స్థాయీ సమితి అధ్యక్షుడు వళ్లల్‌ మునిస్వామి ఉన్నారు.

పరిసరాలను నిర్లక్ష్యం చేయొద్దు

కోలారు : ప్రతి ఒక్కరూ సంపాదనలో పడి ప్రకృతిని, పరిసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది ప్రమాదకర పరిణామమని జిల్లా కలెక్టర్‌ ఎం ఆర్‌ రవి అన్నారు. వాతావరణ పరిస్థితులపై నగరంలోని పాత్రికేయుల భవనంలో గ్రామ వికాస సంస్థ, పాత్రికేయుల సంఘం, భారతీయ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యాగారంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ప్రజలకు సరైన రీతిలో తెలియజేయాల్సిన బాధ్యత విలేకరులపై ఉందన్నారు. వదంతులను ప్రచారం చేయకుండా వాస్తవాంశాలను ప్రజల ముందుంచాలన్నారు. పాత్రికేయుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీవీ గోపినాథ్‌, వాతావరణ శాఖ డైరెక్టర్‌ కేజీ రమేష్‌, బెంగళూరు ఎంసీ యోజనా విజ్ఞాని షేక్‌దర్గా సాహెబ్‌, రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యుడు కేఎస్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అవినీతిపై విచారణకు డిమాండ్‌ 1
1/3

అవినీతిపై విచారణకు డిమాండ్‌

అవినీతిపై విచారణకు డిమాండ్‌ 2
2/3

అవినీతిపై విచారణకు డిమాండ్‌

అవినీతిపై విచారణకు డిమాండ్‌ 3
3/3

అవినీతిపై విచారణకు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement