
భారీ వర్షం.. రోడ్లు జలమయం
అణ్ణిగేరి పురసభ హస్తగతం
● అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
హుబ్లీ: అణ్ణిగేరి పురసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఎస్టీ అభ్యర్థి శివానంద అధ్యక్షుడిగా, బీసీఏ కేటగిరికి చెందిన నాగప్ప దళవాయి ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎన్‌హెచ్.కోనరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో అందరూ సామానులే అన్నారు. శాసకాంగం, కార్యాంగం సంయుక్తంగా పని చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు సూచించారు. తహసీల్దార్ మంజునాథ్, సీఐ రవికుమార్, రెహమాన్ సాబ్, మంజునాథ్, పురసభ ముఖ్యాధికారి వైజీ.గద్దిగౌడరు, పురసభ సభ్యులు పాల్గొన్నారు. కాగా పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహొళి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న పురపాలక నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరులో ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన చేపట్టారు. మంగళవారం ప్రభులింగ బృహన్మఠంలో కిల్లె మఠాధిపతి శాంతమల్ల శివాచార్య 22వ పట్టాధ్యక్షుడు ప్రభులింగ శివాచార్యుల మూల విరాట్‌కు అభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన, మంగళళహారతి నెరవేర్చారు. అనంతరం ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన చేశారు. గబ్బూరు మఠాధిపతి బూదిబసవ శివాచార్యులు, సుల్తాన్‌పుర మఠాధిపతి శంభు సోమనాథ శివాచార్యులు, రేణుకాచార్య, శరణయ్యలున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
26న గ్రంథాలయ పర్యవేక్షకుల సంఘం ఆందోళన
హుబ్లీ: గత 30 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న గ్రంథాలయ పర్యవేక్షకులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 26న గ్రంథాలయ పర్యవేక్షకుల సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులోని స్వతంత్ర ఉద్యానవనంలో నిరవధిక ఆందోళన చేపడుతున్నారు. అరివు కేంద్రం గ్రంథ పాలకులను గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులుగా ఆదేశాలు వెల్లడించి ఒకే నియమావళిని రూపొందించాలి లేకుంటే తమను మాతృశాఖ ప్రజా గ్రంథాలయ శాఖకు పంపించాలి. పూర్తిగా కనీస వేతనాలను ప్రతి నెల 5వ తేదీలోగా నేరుగా వారి ఖాతాలకు చెల్లించాలి. గ్రాచ్యుటీ, పింఛన్ సౌకర్యం కల్పనతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం ఈ ఆందోళన చేపట్టినట్లు ఆ సంఘం ధార్వాడ జిల్లాధ్యక్షుడు యల్లప్ప బోవి ఓ ప్రకటనలో తెలిపారు.
జీవితంలో భక్తిభావం
పెంచుకోవాలి
రాయచూరు రూరల్: మానవుడు తన జీవితంలో భక్తిభావాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సనాతన సంస్థ సంస్థాపకుడు సచ్చిదానంద అథవాలే పిలుపు ఇచ్చారు. సోమవారం గోవాలోని పోండాలో మూడు రోజుల పాటు జరిగే సనాతన శంఖునాద మహోత్సవాలను ప్రారంభించి సభికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిడితో ప్రతి నిత్యం ఎంతో మదనపడుతున్నాడన్నారు. కొంత సమయాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. ప్రతి ఆలయంలో ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో 23 దేశాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మందికి పైగా సాధకులు హాజరయ్యారు. సభలో సత్‌శక్తి, బిందా నీలేష్ సింగబాళ, అంజలి, చిత్‌శక్తిలున్నారు.
ఉద్యోగాల పేరుతో వంచన
● ముంబై వాసి అరెస్ట్
యశవంతపుర: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసిన ముంబైకి చెందిన మసీవుల్లా అతివుల్లాఖాన్(36) అనే నిందితుడిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు నగర పోలీసుకమీషనర్ అనుపమ్ అగర్వాల్ మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితుడు అతివుల్లాఖాన్ పలువురు నిరుద్యోగులకు వల వేసి విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తనని ఆశ పెట్టాడు. ఓ నిరుద్యోగి వద్దనుంచి రూ.1.65 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. దీంతో బాధితుడు మంగళూరు తూర్పు పోలీసుస్టేషన్‌లో 2024 డిసెంబర్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే కేసు దర్యాప్తులో సీఐ సోమశేఖర్, విచారణాధికారి ఎస్‌ఐ ఉమేశ్ నిర్లక్ష్యం వహించారు. అప్పట్లో వీరిద్దరూ సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం ఈకేసుపై పోలీసులు దృష్టి సారించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. పలువురి నుంచి రూ.1.82 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
హొసపేటె: అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. గతవారం రోజులుగా నగరంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోయారు. ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు, ఆపై చల్లని వాతావరణం, అక్కడక్కడ మాత్రం చిరుజల్లులు కురిసేవి. ఇలాంటి తరుణంలో మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల రోడ్లపై నీరు పొంగి ప్రవహించింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినా ఉదయం 10 గంటలైనా వర్ష ప్రభావం తగ్గని పరిస్థితి నెలకొనడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. మరి కొన్ని చోట్ల వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
బైపాస్ రోడ్డుపై నిలిచిన వాహనాలు

భారీ వర్షం.. రోడ్లు జలమయం

భారీ వర్షం.. రోడ్లు జలమయం

భారీ వర్షం.. రోడ్లు జలమయం

భారీ వర్షం.. రోడ్లు జలమయం

భారీ వర్షం.. రోడ్లు జలమయం