
మురిసిన మువ్వన్నెల జెండా
సాక్షి,బళ్లారి: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌పై భారత్ సైనికులు వీరోచితంగా పోరాడి, ఉగ్రవాదులకు, అందుకు సహకరిస్తున్న పాకిస్థాన్‌ను వణుకు పుట్టించి భారత కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పడంతో నగరంలో భారత సైనికులకు జేజేలు పలికారు. శనివారం నాగరిక పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిరంగయాత్ర ర్యాలీ చేపట్టారు. నగరంలోని కనక దుర్గమ్మ ఆలయం నుంచి రాయల్ సర్కిల్, బెంగళూరు రోడ్డు, బ్రూస్‌పేట పోలీసు స్టేషన్, తేరువీధి తదితర కాలనీల గుండా మూడు రంగుల జెండాలు పట్టుకుని, భారత సైనికులకు జేజేలు, జిందాబాద్‌లు పలుకుతూ ముందుకు కదిలారు. మహిళలకు ఒకరికొకరు నుదిటిపై సిందూరాన్ని పెట్టుకుని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. భారత విజయంలో కీలక భూమిక పోషించిన సైనికుల త్యాగాలు ఈ దేశం ఎన్నటికీ మరవదన్నారు. వారి వెంట తామందరం ఉన్నామని గుర్తు చేశారు.
పాకిస్తాన్‌కు వణుకు పుట్టించారు
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ పహల్గాంలో అమాయకులైన భారతీయులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు, అందుకు సహకారం అందిస్తున్న పాకిస్థాన్‌కు 23 నిమిషాల్లో వణుకు పుట్టించారన్నారు. 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేశారన్నారు. వందలాది మంది ఉగ్రవాదులను హతం చేశారన్నారు. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణకు ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్ మాట్లాడుతూ ప్రపంచంలో భారత్ సైన్యం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, సురేఖ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాయచూరులో...
రాయచూరు రూరల్: నగరంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం మహాత్మాగాంధీ క్రీడా మైదానం నుంచి తిరంగ యాత్రను చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరనగౌడ మాట్లాడుతూ భారత దేశంలోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి కశ్మీర్‌లోని పహల్గాంలో దాడికి పాల్పడి భారతీయులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో మన సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అపరేషన్ సిందూర్ చేపట్టి విజయవంతమైనందుకు తిరంగ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఉగ్రవాదులను ఎన్నటికీ క్షమించరాదన్నారు. శాంత మల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, మాజీ ఎమ్మెల్యే బసవనగౌడ బ్యాగవాట్, మాజీ అధ్యక్షుడు రమానంద యాదవ్, సభ్యులు శంకరరెడ్డి, చంద్రశేఖర్, మల్లికార్జున, పాటిల్, లలిత, నాగరాజ్ భాల్కి, ఆంజనేయ, రవీంద్ర, సుమ, నాగవేణి, రవిలున్నారు.
విజయనగరలో...
హొసపేటె: ఆపరేషన్ సిందూర్ విజయవంతం నేపథ్యంలో భారత సైన్యానికి అభినందనగా శనివారం హొసపేటె చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నేతృత్వంలో హొసపేటెలో తిరంగయాత్ర పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని వడకరాయ ఆలయం వద్ద నుంచి ర్యాలీని ప్రారంభించి అంబేడ్కర్ సర్కిల్ వరకు చేపట్టారు. ర్యాలీలో ప్రజలు మన దేశ సైన్యం సాహసాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. ర్యాలీలో వివిధ సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు అశ్విని కోత్తంబరి, కాకుబాళు రాజేంద్ర, భూపాల్ ప్రహ్లాద్, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, నందిపురమఠం గడ్డికెరె చరంతేశ్వర శివాచార్య మహాస్వామి, హగరిబొమ్మనహళ్లి హాల శంకర మఠం హాల శంకర మహాస్వామి, నగరసభ అధ్యక్షుడు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షులు రమేష్ గుప్లా, కే.రాఘవేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గనినాడులో ఆకట్టుకున్న తిరంగయాత్ర
నగరంలో జాతీయ పతాకాలతో ఊరేగింపు
దారి పొడవునా సైనికులకు
జయజయధ్వానాల నినాదాలు

మురిసిన మువ్వన్నెల జెండా

మురిసిన మువ్వన్నెల జెండా