
కొత్త పోలీస్ బాస్ ఎవరు?
శివాజీనగర: రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ అధికారావధి బుధవారం ముగుస్తోంది, ఇక కొత్త పోలీసు బాస్ ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది. సీనియర్లు ప్రశాంత్‌కుమార్ ఠాకూర్, ఎం.ఏ.సలీం ఇద్దరిలో ఒకరు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరులోనే అలోక్ మోహన్ పదవీకాలం ముగిసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మే 21 వరకు విస్తరించింది. మళ్లీ పొడిగింపు లేనందున కొత్త డీజీపీని నియమించడం సిద్దరామయ్య ప్రభుత్వానికి అనివార్యమైంది.
రేసులో ఎవరెవరు?
● సీనియర్ ఐపీఎస్‌లు ప్రశాంత్‌కుమార్ ఠాకూర్ బిహార్‌వాసి కాగా, ఎం.ఏ.సలీం బెంగళూరువాసి. సలీం కంటే ఠాకూర్ సుమారు ఏడాది సీనియారిటీని కలిగి ఉన్నారు.
● మహిళా ఐపీఎస్ మాలిని కృష్ణమూర్తి కూడా రేసులో ఉన్నట్లే లెక్క. ఈమె ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని వాస్తవ్యులు, దీనిని బట్టి బిహారి, కన్నడిగ, తెలుగువారు డీజీపీ పదవికి పోటీలో ఉన్నారు.
● ఈ ముగ్గురిని మినహాయిస్తే మరో ఐపీఎస్ కే.రామచంద్రరావుకు కూడా అవకాశం ఉండింది. అయితే ఆయన పెంపుడు కూతురు, నటి రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు కావడంతో ఆయనను సర్కారు సెలవు మీద పంపింది. దీంతో అవకాశం దూరమైంది.
● అలాగే ప్రణవ్ మొహంతి, దూకుడు ఐపీఎస్ అలోక్ కుమార్ వీరి కంటే కొంచెం జూనియర్లు అయినందున పదవి రాకపోవచ్చని భావిస్తున్నారు.
నేడు డీజీపీ అలోక్ మోహన్‌కు వీడ్కోలు
డీజీపీ అలోక్ మోహన్‌కు నగరంలోని కోరమంగల కేఎస్‌ఆర్‌పీ కవాతు మైదానంలో బుధవారం ఉదయం 8 గంటలకు వీడ్కోలు వేడుక జరుగుతుంది. అందరు ఐపీఎస్‌లు పాల్గొని ఆయనను సాగనంపుతారు.
రేసులో ఠాకూర్, సలీం, మాలిని
నేడు అలోక్ మోహన్ ఉద్యోగ విరమణ

కొత్త పోలీస్ బాస్ ఎవరు?