పసికందుపై లైంగిక దాడి | - | Sakshi
Sakshi News home page

పసికందుపై లైంగిక దాడి

May 12 2025 1:03 AM | Updated on May 12 2025 1:03 AM

పసికం

పసికందుపై లైంగిక దాడి

రాయచూరురూరల్‌: పసికందుపై మృగాడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సింధనూరు తాలూకా జవుళగేర వద్ద చోటు చేసుకుంది. సీఐ వీరారెడ్డి, ఎస్‌ఐ యర్రప్ప అంగడి తెలిపినమేరకు నాలుగేళ్ల బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా అజ్మీర్‌ సాబ్‌(25) అనే యువకుడు ఆ చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక బాధపడుతుండగా తల్లిదండ్రులు గమనించి ఏమైందని ఆరా తీశారు. సున్నిత భాగాల్లో రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించగా లైంగిక దాడి జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బైక్‌లు ఢీ... మహిళ మృతి

రాయచూరురూరల్‌: రెండు బైక్‌లు పరస్పరం ఢీకొని మహిళ మృతి చెందింది. ఈఘటన సిందనూరు తాలూకా తుర్విహళ్‌లో చోటు చేసుకుంది. హత్తిగుడ్డకు చెందిన బైరమ్మ అనే మహిళ తన భర్త శరణప్పతో కలిసి చిక్కబేరిగి నుంచి స్వగ్రామానికి బైక్‌లో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్‌ ఢీకొంది. ప్రమాదంలో బైరమ్మ(40) గాయపడింది. ఎస్‌ఐ సుజాత నాయక్‌ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బైరమ్మ మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది.

దొంగ అరెస్టు, బైక్‌లు స్వాధీనం

హొసపేటె: వరుస బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్న హనుమంత అనే నిందితుడిని విజయనగరం జిల్లాలోని కొట్టూరు పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నుంచి రూ.3 లక్షల విలువైన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఇతర కేసులతో సంబంధం ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది . కొట్టూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

13న ఉచిత కంటి వైద్య శిబిరం

హుబ్లీ: క్యాటరాక్ట్‌ బ్లూడే సందర్భంగా పాతకోటసర్కిల్‌ వాసన్‌కంటి ఆస్పత్రిలో ఈనెల 13న ఉచిత సమగ్ర కంటి పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్‌చంద్రకాంత్‌ పూజార తెలిపారు. ఆయన ఆదివారం హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ అదే రోజు ఉదయం 9 నుంచి సాయంకాలం ఐదు గంటలు వరకు శిబిరం జరగనుందన్నారు. కంటి సమస్యలు ఉన్నవారు శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 9900 282644లో సంప్రదించాలన్నారు డాక్టర్‌ ప్రీతి,వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణోత్సవం

కణేకల్లు: కణేకల్లులోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, మంగళారతిల నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలను పఠిస్తూ కళ్యాణోత్సవాన్ని జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు.

సిలిండర్ల దందా..

ఆరుగురి అరెస్ట్‌

కోలారు: అక్రమంగా సిలిండర్లు నింపుతున్న ఆరుమందిని ఉరిగాం పోలీసులు అరెస్టు చేశారు. బిజిఎంఎల్‌కు చెందిన పాత డిఎంఎస్‌ కార్యాలయం హోటళ్లు, గృహాలకు సరఫరా చేసే సిలిండర్లను సేకరించి వాటినుంచి ఇతర సిలిండర్‌లకు గ్యాస్‌ నింపి విక్రయిస్తున్న నాగాలాండ్‌కు చెందిన కోర్నాలిక్‌, అసోంకి చెందిన ఇషాక్‌, జార్ఖండ్‌కు చెందిన సుధీర్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అజీం, శేఖ్‌ ఇనావర్‌, రాజస్థాన్‌వాసి కబీర్‌ పుల్వాలి లను పోలీసులు అరెస్టు చేశారు. సిలిండర్లు, గ్యాస్‌ రీఫిల్లింగ్‌ యంత్రాలు, గ్యాస్‌ సిలిండర్‌లు రవాణా చేయడానికి ఉపయోగిస్తున్న క్యాంటర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శాంతరాజు తెలిపారు.

పసికందుపై లైంగిక దాడి 1
1/1

పసికందుపై లైంగిక దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement