రాయచూరురూరల్: యువకుడు హత్యకు గురైన ఘటన రాయచూరు నగరంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. జహిరా బాద్‌కు చెందిన సాధిక్ (27) అనే వ్యక్తి నగరంలోని జాకీర్ హుసేన్ చౌక్‌లో ఇడ్లీ తినేందుకు వచ్చాడు. ఆ సమయంలో కరీం(28), అతని మిత్రులతో వాగ్వాదం జరిగింది. దీంతో సాధిక్‌పై కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో ఉన్న సాధిక్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సదర్ బజార్ సీఐ ఉమేస్ కాంబ్లే తెలిపారు. డీఎస్పీ శాంతవీర ఘటన స్థలాన్ని పరిశీలించారు. అరు నెలల క్రితం వాహనం విషయంలో సాధిక్, కరీం మధ్య గొడవ జరిగిందని డీఎస్పీ తెలిపారు. పాతకక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
పాతకక్షలతోనే అంటున్న పోలీసులు