
మైసూరు నుంచి
హిమాలయ పర్వత యాత్ర
మైసూరు: హిమాయల పర్వతాలను చూసే భాగ్యం అందరికీ దక్కేది కాదు. దూరాభారం, ఆర్థిక సమస్యలే అందుకు కారణం. కానీ మైసూరులోని మావటీలు, పౌరకార్మికుల పిల్లలు హిమాలయ పర్వతాలను అధిరోహించి ఔరా అనిపిచారు. ఉత్తరాఖండ్‌లో ఉన్న సుమారు 13,990 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ కువారి పాస్ అనే పర్వతాన్ని ఎక్కారు. ఎనిమిది మంది పిల్లలు, కొందరు అటవీ ఉద్యోగులు, మహిళలు, యువతీ యువకులు కలిసిన 24 మంది మైసూరులోని టైగర్ అడ్వెంచర్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవల హిమాలయ యాత్రకు వెళ్లారు. ఏప్రిల్ 27వ తేదీన తుగాసి బేస్‌క్యాంప్‌ను చేరుకొని ఆరోహణ సాగించారు. ఎన్నో సవాళ్లను ఓర్చుకుని ఓ ఎత్తైన పర్వతాన్ని ఎక్కి రికార్డు సృష్టించామని తెలిపారు.

మైసూరు నుంచి