
తూటా పేలి యువకుడికి గాయాలు
రాయచూరు రూరల్: నగరంలో తూటా పేలి యువకుడు గాయాపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేస్ కాంబ్లే కథనం మేరకు వివరాలు.. నగరంలోని హెచ్‌ఆర్‌బీ కాలనీలో నివాసమున్న జియా సౌదాగర్ అనే యువకుడు ఈ నెల 3న తన స్నేహితుడు మహ్మద్ సోహైల్‌ను ఇంటిికి తీసుకెళ్లి పిస్తోల్‌ను చూపించాడు. తూటాలున్న పిస్తోలు ఉన్నఫళంగా పేలడంతో సోహైల్ కాలికి గాయమైందన్నారు. ఈ విషయం ఎవరికై నా చెపితే చంపుతానని సౌదాగర్ సోహైల్‌ను హెచ్చరించాడు. దీంతో గాయపడ్డ సోహైల్ మిన్నకుండి పోయి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
యాదగిరిలో గర్భిణి మృతి
రాయచూరు రూరల్: యాదగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిండు గర్భిణి మృతి చెందింది. తల్లీ బిడ్డల ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నిండు చూలాలు బలి అయింది. ఈ నెల 3న గర్భిణి మహిళ సంగీత(20) ప్రసవం కోసం తల్లీ బిడ్డల ఆస్పత్రిలో చేరారు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని గర్భిణి మృతితో ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా తనువు చాలించింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ సంగీత కుటుంబ సభ్యులు ఆస్పత్రి అంబులెన్సు వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
వడదెబ్బకు కండక్టర్ బలి
రాయచూరు రూరల్: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత అధికమైన నేపథ్యంలో వడ దెబ్బకు గురై ఆర్టీసీ కండక్టర్ ఒకరు మృతి చెందిన ఘటన జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. జిల్లాలోని మస్కి తాలూకా హసమకల్‌కు చెందిన మల్లయ్య(45) అనే వ్యక్తి బెంగళూరులోని బీఎంటీసీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల భార్య, పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన మల్లయ్య మస్కిలో సంతకు వచ్చి వడ దెబ్బకు గురై ప్రాణాలు వదిలాడు. మస్కి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
డిమాండ్ల సాధన కోసం ధర్నా
చెళ్లకెరె రూరల్ : వివిధ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘం, హసిరు సేనె కార్యకర్తలు నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డిహళ్లి వీరణ్ణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఆశ చూపి రైతులను సోలార్ కంపెనీలకు తాకట్టు పెట్టడం ఖండనీయమన్నారు. వ్యవసాయ క్షేత్రాలను కార్పొరేట్ కంపెనీలకు మార్పు చేయడం క్షమించరాని విషయమన్నారు. 2022–23లో ఉన్న అక్రమ, సక్రమ చట్టం ప్రకారం రైతులకు అందించాల్సిన సౌకర్యాలను అందించాలన్నారు. రైతులు విద్యుత్‌ను తమ స్వంతానికి వాడడం లేదు. పైగా పంటలను పండించడానికి వాడుతున్నారు. అలాంటి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని సక్రమంగా అమలు చేయాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి స్వామినాథన్ నివేదిక ఆధారంగా రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతు నాయకులు తిప్పేస్వామి, శివకుమార్, ఓబయ్య, రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు.
వీరయోధుడికి అశ్రునివాళి
హొసపేటె: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ బంజార కమ్యూనిటీ యోధుడు మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం గంగావతి తాలూకా బంజార సమాజ్ విరుపాపుర తండాలోని సేవాలాల్ సర్కిల్ వద్ద అశ్రునివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. పురపాలక సంఘం మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీరాంనాయక్, వ్యవసాయ అధికారి ప్రకాశ్ రాథోడ్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సేవాలాల్ మహారాజ్, పాండునాయక్ మేసీ్త్ర, హనుమంత మేసీ్త్ర, వెంకటేష్ జాడ, కృష్ణప్రకాష్, ఠాకు నాయక్ మేస్త్రి, రాజు మేసీ్త్ర, వెంకటేష్, వెంకన్న లోకేష్, మంజునాథ్, ఉమేష్ పాల్గొన్నారు.

తూటా పేలి యువకుడికి గాయాలు

తూటా పేలి యువకుడికి గాయాలు

తూటా పేలి యువకుడికి గాయాలు

తూటా పేలి యువకుడికి గాయాలు