
కృష్ణరాజపురం(కర్ణాటక): విదేశాల్లో చదువుకుని ఇటీవలే ఇంటికి వచ్చిన యువకుడు ఏం కష్టం వచ్చిందో కానీ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.. ఇంటిలో ఉన్న సింగిల్ బ్యారెల్ గన్‌తో షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరు గ్రామీణ జిళ్లాలోని హోసకోటె నియోజకవర్గం పరిధిలోని దేవిశెట్టిహళ్ళి గ్రామంలో జరిగింది.
గ్రామవాసి బైయేష్ (28) తుపాకీతో తలలో కాల్చుకోవడంతో తల ఛిద్రమై చనిపోయాడు. ఇంటిలోవారు ఆందరు ఆదివారం తిరుపతికి వెళ్లారు. అతడు ఒక్కటే ఇంట్లో ఉన్నాడు. సోమవారం కుటుంబీకులు తిరుపతి నుంచి తిరిగి వచ్చి చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే తిరుమలశెట్టిహళ్ళి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.