
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు దిగుతున్న శ్రీకాకుళానికి చెందిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకొంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్‌లకు వాట్సాప్ మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎస్డీ పేరుతో నాగరాజు ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. నాగరాజును శ్రీకాకుళంలోఅదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలించారు.