ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు | Cheating Case Filed In Film Nagar Police Station Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

May 22 2025 8:41 AM | Updated on May 22 2025 12:05 PM

cheating case in film nagar police station hyderabad

ఫిలింనగర్‌(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్‌ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్‌ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. 

ఇటీవల అర్చిత్‌ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్‌తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. 

తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్‌తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement