
మంత్రాలయంలో తారల సందడి
రాయచూరు రూరల్: మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వామి వారిని బహుభాషా నటుడు ఉపేంద్ర కుటుంబం, సినీ నటి తార కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. సోమవారం మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ వారికి శాలువా కప్పి జ్ఞాపికను అందించి సన్మానించి ఆశీర్వదించారు.
వేదాంత సామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవాలు
మంత్రాలయంలో ఘనంగా సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ 13వ ఏడాది వేదాంత సామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠంలో మూల విరాట్‌్‌కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభిషేక ఉత్సవ వేడుకల్లో వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు.

మంత్రాలయంలో తారల సందడి

మంత్రాలయంలో తారల సందడి