
పౌర కార్మికులకు కిట్ల పంపిణీ
రాయచూరు రూరల్: నగరంలో పారిశుధ్య పని చేసే పౌర కార్మికులకు దుస్తుల కిట్లను పంపిణీ చేశారు. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద కమిషనర్ జుబిన్ మహాపాత్రో పౌర కార్మికులకు కిట్లను అందించి మాట్లాడారు. చలికాలం, వేసవి కాలంలో పౌర కార్మికులకు ఆరోగ్య రక్షణకు దుస్తుల కిట్, పలుగు, పార తదితర పనిముట్లు, చేతులకు గ్లౌజ్, మాస్క్, షూను అందించారు.
ఎయిమ్స్‌పై సవతి తల్లి ప్రేమ
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నాయని ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ కళస ఆరోపించారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ఆందోళనకు మద్దతు పలికారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గళం విప్పాలన్నారు. మూడేళ్ల పోరాటానికి ఫలితం లభించేలా చూడాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రం సమర్పించారు.
ప్లాస్టిక్ బెడద అరికట్టండి
రాయచూరు రూరల్: నగరంలో అధిక భాగం ప్లాస్టిక్ కప్పులతో టీ, కాఫీలను తాగుతుండటాన్ని అరికట్టాలని క్రాంతి వీర బెళవడి యువక సంఘం జిల్లాధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ కప్పులతో టీ, కాఫీలను తాగడం వల్ల మానవుడి దేహంలోకి 75 వేలకు పైగా సూక్ష్మమైన జీవులు ప్రవేశిస్తాయన్నారు. వాటి వల్ల క్యాన్సర్ తదితర వ్యాధులు సంక్రమిస్తున్నందున నగరసభ, ఆరోగ్య శాఖ అధికారులు ప్లాస్టిక్ కప్పులను పూర్తి స్థాయిలో నిషేధించాలని కోరుతూ తహసీల్దార్ సురేష్‌వర్మకు వినతిపత్రం సమర్పించారు.
మదీనా యాత్రికులకు ఆత్మీయ వీడ్కోలు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ నవాజ్ కిత్తూరు, సతీమణి సహీరాబాను, కుమారుడు అహ్మద్ రజాక్ కిత్తూరు, కుమార్తె అమరాన్ బాను, అలాగే వందలాది మంది ఇటీవల బెంగళూరు హజ్‌భవన్ నుంచి సౌదీ అరేబియాలోని మదీనాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులు మక్కా మదీనా యాత్రకు వెళుతున్న అల్తాఫ్ కుటుంబ సభ్యులకు అత్మీయంగా వీడ్కోలు పలికారు. షౌకత్ కిత్తూరు లియాఖత్, రఫీక్, అల్లాబకాష్, మహమ్మద్ యూసఫ్, దావల్‌సాబ్ మున్నా, సాధిక్ యూసఫ్, మహమ్మద్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ తరలింపును
వ్యతిరేకిస్తూ నిరసన
హొసపేటె:విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని చిక్కజోగిహళ్లి ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో ఉన్న బీడీసీసీ బ్యాంకును తరలించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. సహకార సంఘం ఉపాధ్యక్షురాలు సుమంగళమ్మ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై న డైరెక్టర్లు రైతు వాటాదారులకు తెలియజేయకుండా బీడీసీసీ బ్యాంకును తరలించడం తగదని తెలిపారు. గతంలో కొత్త బ్యాంకు నిర్మించేటప్పుడు రుణం కోసం ఆమోదించిన ప్రతి రైతు నుంచి రూ.2000 వసూలు చేశారన్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో స్థాపించిన ఈ కొత్త బ్యాంకులో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. 2019లో అసోసియేషన్ ప్రాంగణంలో ప్రారంభించిన బ్యాంకు, ప్రకృతి సంఘం మధ్య 15 సంవత్సరాల ఒప్పందం ఉందన్నారు. సహకార సంఘం నేతలు కోదండ రామన్న, మాజీ ఉపాధ్యక్షులు ఎస్‌పీ ప్రకాష్, గ్రామ పంచాయతీ అధ్యక్షులు అశోక్ నాయక్, మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పౌర కార్మికులకు కిట్ల పంపిణీ

పౌర కార్మికులకు కిట్ల పంపిణీ