రాయచూరురూరల్: రాయచూరును రెండేళ్లలో అదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని నగరసభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో అన్నారు. నగరసభ పరిధిలోని భరత్‌నగర్‌లో ఆదివారం ఆయన బీ ఖాతాలు పంపిణీ చేసి మాట్లాడారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందిస్తామన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకారం అందించాలన్నారు. నేతలు రవీంద్ర జాలదార్, నరసింహులు, అంజినేయ్య ,శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీకి అవార్డు
రాయచూరురూరల్: రాయచూరు జిల్లా ఎస్పీ పుట్ట మాదయ్య, బళగనూరు ఎస్‌ఐ ఏరియప్ప, హెడ్ కానిస్టేబుల్ రామణ్ణలు డీజీ ఐజీపీ కమాండేషన్ అవార్డులకు ఎంపికయ్యారు. 2024– 2025 సంవత్సరానికి ఈ అవార్డులను అందజేయనున్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రాయచూరు రూరల్: నగరంలో కాంగ్రెస్‌ను బలిష్టం చేయాలని ఆ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి సూచించారు. షియ తలాబ్‌లో ఆదివారం కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించాలన్నారు.
బంజారాలు విద్యావంతులు కావాలి
హొసపేటె: బంజారా సముదాయ ప్రజలు తమ పిల్లలను విద్యావంతులను చేయడం ద్వారా అన్ని రంగాల్లో రాణించవచ్చని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ అన్నారు. నగరంలోని బంజారా స్నేహ జీవి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆ సముదాయ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కార ప్రదానోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పిల్లలు విద్యావంతులైతే ఆ సమాజం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం పది, పీయూసీలో ఉత్తమ ఫలితాన్ని సాధించిన విద్యార్థులను సన్మానం చేసి గౌరవించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భీమానాయక్, తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ తహసీల్దార్ దాదాగిరి
హుబ్లీ: డిప్యూటీ తహసీల్దార్ తన కార్యాలయంలో ఓ వ్యక్తి పై దాదాగిరికి పాల్పడ్డారు. ఈఘటన గదగ్‌లో జరిగింది. అక్షయ్ బొలుల్లి అనే యువకుడి మిత్రుడి బైక్‌కు డిప్యూటీ తహసీల్దార్ ఎస్‌డీ వాల్మీకికి పరిచయస్తుడి కారు ఢీకొంది. నిందితులను గుర్తించేందుకు అక్షయ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్షయ్ అడిగిన ప్రశ్నకు కోపంతో ఉగిపోయిన సదరు ఎస్‌డీ వాల్మీకి, ఆయన అనుచరులు అక్షయ్‌పై దాడి చేశారు. పోలీస్ అధికారులు ఇరువర్గాల మద్య రాజీబేరం కుదేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అశ్వవాహనంపై నృసింహుడు
ఉరవకొండ రూరల్: ెపన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆదివారం శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అభిషేకం మహామంగళహారతులు, దీక్షా హోమమం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మినరసింహుడు అశ్వవాహనంపై విహరించారు.
నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం