
గొడవపడి.. బైక్‌ను కారుతో ఢీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సిటీలో ఇటీవల కొందరు ఎందుకు గొడవపడుతున్నారో, ఎందుకు హత్యలు చేస్తున్నారో తెలీని అయోయం నెలకొంది. ట్రాఫిక్‌లో వాహనాలు టచ్ అయినా రోడ్డుమీదే కొట్టుకుని,కత్తులతో పొడుచుకుంటున్నారు. సిగరెట్ తెచ్చివ్వలేదని ఓ కారు ఓనరు ఇద్దరి మీదకు దూసుకెళ్లడంతో ఒకరు చనిపోయారు. వివరాలు... మే 10వ తేదీన తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. నిందితుడు ప్రతీక్ భార్యతో కలిసి క్రెటా కారులో కోణనకుంట క్రాస్‌కు వచ్చాడు. కారు దిగకుండానే రోడ్డుపక్కన టీకొట్టు ముందు సిగరెట్ కాలుస్తున్న చేతన్, సంజయ్ అనే ఇద్దరినీ పిలిచి సిగరెట్ తెచ్చి ఇవ్వమని అడిగాడు. నువ్వే తీసుకో అని వారు చెప్పడంతో వాగ్వాదం జరిగింది. తరువాత చేతన్, ప్రతీక్‌లు తమ బైక్‌పై బయల్దేరారు. ప్రతీక్ వారి బైక్‌ను వెనుక నుంచి వేగంగా కారుతో ఢీకొట్టాడు. ఈ రభసకు సంజయ్, చేతన్ బైక్‌తో పాటు రోడ్డుపక్కన షాపులోకి ఎగిరిపడ్డారు. సంజయ్ మృతిచెందగా చేతన్ మృత్యువుతో పోరాడుతున్నాడు. సంజయ్ టెక్కీగా పనిచేస్తాడని తెలిసింది. సుబ్రమణ్యపురం పోలీసులు ఉన్మాది ప్రతీక్‌ను అరెస్టు చేశారు.
టెక్కీ మృతి, మరొకరికి గాయాలు
సిగరెట్ తెచ్చివ్వలేదని గొడవ

గొడవపడి.. బైక్‌ను కారుతో ఢీ