
ముందే ముప్పును పసిగట్టి..
● పరిశ్రమల్లో భద్రతపై డ్రిల్
దొడ్డబళ్లాపురం: ఫ్యాక్టరీలలో భద్రతపై పలు నగరాల్లో మాక్ డ్రిల్స్‌ను నిర్వహించారు. బయో మాస్ బాయిలర్‌లు, గ్యాస్ ట్యాంకర్లు పేలి అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలా రక్షించుకోవాలి, ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి అనే అంశాలపై బెళగావి, ధార్వాడలో పోలీసులు, ఫైర్ సిబ్బంది, ప్రకృతి విపత్తుల నివారణ దళం విన్యాసాలను నిర్వహించారు. బెళగావి ఆటోనగర్‌లోని ఫ్యాక్టరీలో డ్రిల్ జరిపారు. మంటలను ఆర్పడం, గాయపడినవారిని త్వరగా ఆస్పత్రులకు తరలించడం విన్యాసాలను ప్రదర్శించారు. ధార్వాడలో గ్యాస్ ట్యాంకర్ లీకై తే నివారణ చర్యలు తీసుకోవడం తదితర విన్యాసాలను నిర్వహించారు.

ముందే ముప్పును పసిగట్టి..

ముందే ముప్పును పసిగట్టి..

ముందే ముప్పును పసిగట్టి..