పులకించె.. పుష్ప పల్లకి
బనశంకరి: సిలికాన్ సిటీలోని యలహంకలో శ్రీ మహేశ్వరమ్మ దేవస్థానం కరగ మహోత్సవం, మహేశ్వరమ్మ పూలకరగ, వివిధ దేవతల పూల పల్లకీల ఉత్సవాలను రమణీయంగా నిర్వహించారు. బుధవారం రాత్రి మహేశ్వరమ్మ ఆలయంలో వేడుకలకు యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్.విశ్వనాథ్ హాజరై పూజలు చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పూజారి అయ్యప్ప పూల కరగను ఎత్తుకుని యలహంక వీధుల్లో నాట్యమాడుతూ సంచరించారు. గ్రామదేవతలైన చౌడేశ్వరీదేవి, మహేశ్వరమ్మ, మద్దూరమ్మ, యల్లమ్మ, వేణుగోపాలస్వామి, ప్లేగమ్మ, గంగమ్మ, వీరచౌడేశ్వరి, వెంకటేశ్వరస్వామి, అన్నపూర్ణేశ్వరీదేవి, సత్యనారాయణస్వామి, అమర నారాయణస్వామి, బాలాంజనేయస్వామి, పుళేగలమ్మ, శనేశ్వరుడు, గణపతి, ముత్యాలమ్మ తదితర 25 గ్రామదేవతలు పూల పల్లకీలను సుందరంగా పుష్పారాశులతో అలంకరించి ఊరేగించారు.
యలహంకలో గ్రామ దేవతల జాతర
పులకించె.. పుష్ప పల్లకి
పులకించె.. పుష్ప పల్లకి
పులకించె.. పుష్ప పల్లకి
పులకించె.. పుష్ప పల్లకి


