
మీ పిల్లల్ని నేలపై పడుకోబెడతారా?
రాయచూరు రూరల్: జిల్లాలో వెనుక బడిన వర్గాల, మైనార్టీ సంక్షేమ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పందించక పోవడంతో అధికారులపై జిల్లా ఇన్‌చార్జి ప్రభుత్వ కార్యదర్శి రితేష్‌కుమార్ సింగ్ మండిపడ్డారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్టల్‌లో విద్యార్థులు నేలపై పడుకోబెడుతున్న విషయంపై సమావేశంలో ప్రస్తావించారు. మీ స్వంత పిల్లలను ఇలానే నేలపై పడుకోబెడతారా? అని అధికారులను ప్రశ్నించారు. నగరసభలో పన్నుల వసూలు విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఆదాయ వనరులను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు, మాన్వి తాలూకాల్లో వర్షం వల్ల సంభవించిన నష్ట నివారణకు అధికార యంత్రాంగం సిద్ధం చేసుకున్న ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఏసీ గజాననలున్నారు.
అధికారులపై జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి మండిపాటు