
డ్యాం గేట్ల మార్పునకు ఏజెన్సీల నుంచి బిడ్లు
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 32 గేట్ల మార్పు కోసం పిలిచిన ఈ–టెండర్‌కు నాలుగు ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. తుంగభద్ర బోర్డు సాంకేతిక బిడ్‌ను తెరిచింది. బిడ్‌ను దక్కించుకున్న వారిని మే 17న ప్రకటిస్తారు. రిజర్వాయర్ 19వ గేటు నిర్మాణ పనులను ఇప్పటికే గుజరాత్‌కు చెందిన ఒక కంపెనీకి అప్పగించారు. మిగిలిన 32 గేట్ల భర్తీకి టెండర్ పిలిచారు. నాలుగు ఏజెన్సీలు ఇప్పుడు దరఖాస్తులు సమర్పించాయని, తుది టెండర్ విజేతను మే 17న ప్రకటిస్తామని మండలి వర్గాలు తెలిపాయి. 19వ గేట్ వర్కింగ్ డిజైన్‌ను ఆంఽధ్రప్రదేశ్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌కు కూడా సమర్పించగా ఆమోదం లభించింది. త్వరలో 19వ గేట్ అమరిక పనులు ప్రారంభమవుతాయి.