
పిడుగుపాటుకు ఒకరు బలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు, 10 పశువులు బలి కాగా ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. మస్కి తాలూకా పామన కల్లూరు ఫిర్కా పర్వతాపూర్‌కు చెందిన నింగప్ప(38) అనే రైతు మరణించారు. పొలంలో పని చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, ఎస్‌ఐ ఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మి(28), రామయ్య(30) గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే బసనగౌడ మృతదేహానికి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల పరిహారధనం చెక్‌ను అందించారు. కాగా సింధనూరు తాలూకా సుల్తాన్‌పూర్‌లో హనుమంతు, తిప్పణ్ణ, నాగేష్, లక్ష్మణ్‌ల పొలాల్లో కుప్పవేసిన వడ్లు తడిచిపోయాయి. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం సంభవించినట్లు రైతులు వాపోయారు.
10 పశువుల మృతి, ఇద్దరికి గాయాలు
పొలాల్లో కల్లాల్లో తడిచిన వరిధాన్యం

పిడుగుపాటుకు ఒకరు బలి

పిడుగుపాటుకు ఒకరు బలి