
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మోసాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో ఎండగట్టారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు.
‘‘ఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
ఏపీఎండీసీకి గనులు తాకట్టుపెట్టి 9 వేలకోట్లు అప్పు చేశారు. 293(1) ప్రకారం బాబు అప్పులు చేసే విధానం చట్ట విరుద్ధం. ఏపీఎండీసీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్ర గనులపై ప్రైవేట్ వ్యక్తులు అజమాయిషి ఇస్తున్నారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
