
సమాజంలో గురువుల పాత్ర కీలకం
రాయచూరు రూరల్: సమాజంలో మానవుడు చేస్తున్న సర్వకర్మలను కడిగేవారు గురువులని సీనియర్ ఆడిట్ అధికారి సుబ్రమణ్యం పేర్కొన్నారు. మంగళవారం వేదాంత పాఠశాలలో వేసవి శిబిరం ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటి గురువు తల్లి అయితే రెండో గురువు ఉపాధ్యాయుడని అన్నారు. పాప కర్మలను తొలగించుకోవడానికి గురువుల అండదండలు ఉండాలన్నారు. విద్యారంగంలో విద్యార్ధులను ఉత్తమ ప్రజలుగా తీర్చిదిద్ది వారికి సంస్కారం, ఆచార విచారాల గురించి తెలపడంలో గురువుల పాత్ర ప్రధానమన్నారు. పిల్లలు యోగా, ధ్యానం, సత్సంగం, ప్రాణాయామం, సంగీతం, నృత్యం, సంతోష జీవనశైలితో జీవితాన్ని గడపాలన్నా రు. కార్యక్రమంలో వేదాంత పాఠశాల ప్రధానోపాధ్యాయిని గౌరీ, రామచంద్ర, రాజేష్ రాజలబండి, ప్రమీల, వినూత, స్మృతిలున్నారు.