breaking news
Karnataka
-
కామపిశాచులకు అడ్డాగా..
వరస ఘటనలు బెంగళూరులో మహిళలను బెంబేలెత్తిస్తున్నాయి. తమకు భద్రత కరువైందని వాపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సహోద్యోగిణి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఘటనతో ఐటీ క్యాపిల్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు కామపిశాచులకు అడ్డాగా మారుతోందన్న చర్చ నెట్టింట నడుస్తోంది. అసలేం జరిగిందంటే.. బెంగళూరు: నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా సహోద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఈ దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగి టాయిలెట్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించాడు. అయితే.. పక్కనున్న క్యూబికల్ ద్వారా ఏవో కదలికలు గమనించిన ఆమె అప్రమత్తమై గట్టిగా అరిచింది. దీంతో ఆమె కొలీగ్స్ అప్రమత్తమై అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తిని సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్న స్వప్నిల్ నాగేశ్ మాలి (28)గా గుర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు తొలుత హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసింది. స్వప్నిల్ ఫోన్ పరిశీలించగా.. 30కి పైగా మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు నమోదు అయిన నేపథ్యంలో.. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిందితుడిపై బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ స్పందించింది. సదరు ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డు మీద, మెట్రో రైళ్లలో జరిగిన ఉదంతాలు సీసీఫుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా ఆఫీసుల్లో.. అదీ ప్రముఖ ఐటీ కంపెనీల్లోనూ చోటు చేసుకోవడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగళూరులో ప్రధానంగా జరిగిన కొన్ని ఘటనలు.. 2023 నవంబర్ 22 – మెట్రో స్టేషన్లో వేధింపులుమెజెస్టిక్ మెట్రో స్టేషన్.. రద్దీ సమయంలో ఓ యువతిని వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి. బాధితురాలు సహాయం కోరినా ప్రయాణికులు స్పందించలేదు. 2024 జనవరి 27 – క్యాబ్‌లో వేధింపులుకమ్మనహళ్లి వద్ద.. ఓ యువతి బుక్ చేసిన క్యాబ్లోకి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి వేధించారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. Woman molested in Bengaluru while she was out on a morning walk. The man fled the spot soon after and a case against him was registered. Efforts are on to nab him.#Bengaluru pic.twitter.com/k8xlSOvXK7— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2024 కిందటి ఏడాది ఆగష్టులో.. మరో ఒంటరి మహిళపై చోటు చేసుకున్న వేధింపుల తాలుకా వీడియో ఇది.. Video Credits: Vani Mehrotra2025 ఏప్రిల్ 4 – వీధిలో వేధింపులు (BTM లేఅవుట్)సుద్దగుంటెపాళ్య, BTM లేఅవుట్ వద్ద తెల్లవారుజామున ఇద్దరు మహిళలు నడుస్తుండగా, ఓ వ్యక్తి వారిలో ఒకరిని వెనుక నుంచి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీ కెమెరాలో రికార్డు, వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు నగరాల్లో సాధారణమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు, ఇది వేధింపులను ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. 2025 మే 23న.. బెంగళూరు మెట్రో రైలులో మహిళలను అసభ్యరీతిలో రహస్యంగా చిత్రీకరించి.. ఆ ఫొటోలను సోషల్ మీడియా(ఇన్‌స్టా)లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఫోన్లో ఫొటోలు, వీడియోలు లభ్యం. 2025 జూన్ 22 మైలసంద్ర, బెంగళూరు శివారులో.. కిరాణా దుకాణానికి వెళ్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను రక్షించిన స్నేహితుడిపై కూడా దాడి జరిగింది. -
‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి?’.. డీకేఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో ముఖ్యమంత్రి త్వరలోనే మారతారంటూ ఊహాగానాలు వినిపించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో మొదలు.. బీజేపీ, జేడీఎస్‌ల సెటైర్లతో అది జరగొచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి ఎట్టకేలకు తెర పడింది. తానే ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించగా.. దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కొట్టిపారేశారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మీడియాతో అన్నారాయన. అయితే కాసేపటికే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.‘‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి. ఆయనకు మద్దతుగా నిలవడం తప్ప..’’ అంటూ డీకేఎస్ బదులిచ్చారు. ‘‘నన్ను సీఎంగా చేయాలని నేరు ఎవరినీ కోరలేదు. నాకు మద్దతుగా మాట్లాడమని ఎవరినీ పురమాయించలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. ఒకరు సీఎం ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రకటనలు ఎందుకు?. పార్టీలో నాతో పాటు లక్షల మంది పని చేస్తున్నారు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం’’ అని స్పష్టం చేశారాయన. అంతకుముందు.. సీఎం మార్పు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య కాస్త కటువుగానే స్పందించారు. యస్.. ఐదేళ్లు నేనే సీఎంగా కొనసాగుతా. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మార్పు ఉందని చెప్పడానికి వాళ్లు(బీజేపీ, జేడీఎస్)ఏమైనా కాంగ్రెస్ అధిష్టానమా? అని మీడియాను ఎదురు ప్రశ్నించారాయన. 👉2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అప్పట్లోనే ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని ఇద్దరూ తోసిపుచ్చారు. కట్ చేస్తే..👉ఈ ఏడాది జూన్ 29వ తేదీన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్.. 2–3 నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని వ్యాఖ్యానించడంతో అసలు చర్చ మొదలైంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అని బదులిచ్చారు. అయితే.. 👉ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. పార్టీ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే మరెవరు?” అని ప్రశ్నించింది. మరోవైపు జేడీఎస్ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ను ఎద్దేవా చేస్తూ సీఎం మార్పు తథ్యమన్నట్లు ప్రకటనలు ఇచ్చింది. ఈ తరుణంలో.. ఇటు సిద్ధరామయ్య, అటు శివకుమార్‌లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. హుస్సేన్‌కు నోటీసులు ఇస్తాం: డీకేఎస్సీఎం మార్పు ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్‌కు నోటీసు ఇస్తాం. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరతాం. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలి.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని డీకే శివకుమార్ హెచ్చరించారు. -
ఆటోలో ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి,బళ్లారి(కర్ణాటక): వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్‌కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్‌లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్‌లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు. -
సెలూన్లో మహిళలకు మస్కా
యశవంతపుర: మగువలు అందచందాలకు మెరుగుల కోసం వెళ్తే వంచకులు పర్సులను ఖాళీ చేశారు. బెంగళూరుకు చెందిన పెరిమీటర్ సెలూన్ అనే సంస్థ పలు జిల్లాలలో స్పా సెలూన్లను నిర్వహిస్తోంది, ఈ సెలూన్లకు వెళ్లిన శ్రీమంత మహిళలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నిర్వాహకులు నూరిపోసేవారు. ఇది నమ్మిన మహిళలు డబ్బులు వస్తాయనే ఆశతో రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పారు. సదరు మహిళలకు అసలు, లాభం ఏదీ దక్కలేదు, సంస్థ యజమానులు రక్షా హరికాల్ సెల్వ, సునీత్ మెహతా, తివారీలు మోసం చేశారని బాధిత మహిళలు బెంగళూరు గోవిందరాజనగర, తలఘట్టపురతో పాటు అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వందలాది మంది మహిళలకు రూ.50 కోట్ల వరకు మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. -
ఆకస్మిక మరణాలపై కేంద్రం కీలక ప్రకటన
గుండె సంబంధిత సమస్యలతో.. వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాత పడుతున్న ఉదంతాలు రోజుకోటి చొప్పున చూస్తున్నాం. ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే కుప్పకూలిపోతున్నారు. అయితే కరోనా కాలం నుంచే ఇవి ఎక్కువగా నమోదు అవుతుండడంతో.. వైరస్-వ్యాక్సిన్లకు ముడిపెడుతున్నారు చాలామంది. ఈ తరుణంలో.. హఠాన్మరణాలకు గల కారణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.వ్యాక్సిన్ల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ అంశంపై విచారణ జరపడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారాయన. మరీ ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులోపు వాళ్లు ఉన్నట్లుండి మరణించడం కలవరపెడుతోందని అన్నారాయన. అయితే గుండె సంబంధిత హఠాన్మరణాలకు.. కోవిడ్ టీకాలతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టంచేసింది. ఈ మేరకు పలు అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం వెల్లడించింది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ విస్తృతంగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ టీకాలు సురక్షితమైనవే. ఆకస్మిక మరణాలకు కింది విషయాలు కారణాలై ఉండొచ్చు.. జన్యుపరమైన లోపాలుజీవనశైలి (ధూమపానం, ఒత్తిడి, వ్యాయామపు అలవాట్లు)కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలుఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు.. అని పేర్కొంది #HealthForAll Extensive studies by @ICMRDELHI and AIIMS on sudden deaths among adults post COVID have conclusively established no linkage between COVID-19 vaccines and sudden deathsLifestyle and Pre-Existing Conditions identified as key factorshttps://t.co/QEN1X1PKfv— Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2025టీకాలపై ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలు కలిగించొచ్చు. విజ్ఞానపరమైన ఆధారాలు లేని వ్యాఖ్యలు ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆధారాల ఆధారంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో నెల వ్యవధిలో 20 మంది గుండె సంబంధిత సమస్యలతో హఠాత్తుగా చనిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. గుండె సంబంధిత మరణాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ జిల్లా ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రెండేళ్ల కాలంలో 507 గుండె పోటు కేసులు నమోదుకాగా.. అందులో 190 మంది మరణించారు. అయితే కోవిడ్ టీకాల త్వరిత ఆమోదం, పంపిణీ కూడా ఈ మరణాలకు కారణమై ఉండొచ్చు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే.. తక్షణమే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి అని ప్రజలకు సూచించారు. అలాగే.. ఈ మరణాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారాయన. In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a committee of experts has been…— Siddaramaiah (@siddaramaiah) July 1, 2025 అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటనను తోసిపుచ్చింది. ఈ మేరకు అధ్యయనాల తాలుకా వివరాలను వెల్లడించింది. ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అధ్యయం.. 2023 మే–ఆగస్టు మధ్య 19 రాష్ట్రాల్లో 47 ఆసుపత్రుల్లో నిర్వహించారు. ఇందులో 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల, ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై అధ్యయనం జరిపారు. అందులో కోవిడ్ టీకాలకు సంబంధం లేదని తేలింది. అలాగే.. ఢిల్లీ AIIMS అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో గుండెపోటు (Myocardial Infarction) ప్రధాన కారణంగా గుర్తించారు. పైగా జన్యుపరమైన లోపాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రాథమిక విశ్లేషణలో తేలింది. -
శంషాబాద్ రావాల్సిన విమానాలు మళ్లింపు.. బెంగళూరులో ల్యాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్‌కు రావాల్సిన పలు విమాన సర్వీసులను అధికారులు దారి మళ్లించారు. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను బెంగళూరుకు తరలించారు. దీంతో, విమాన ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు.వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావలసిన పలు విమానాలను దారి మళ్లించారు. వాతావరణం సరిగ్గా లేని కారణంగా హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను బెంగుళూరు ఎయిర్ పోర్టుకు మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ముంబై-హైదరాబాద్, వైజాగ్-హైదరాబాద్, జైపూర్-హైదరాబాద్, లక్నో నుంచి రావలసిన విమానాలు బెంగళూరులో ల్యాండ్ అయ్యాయి. మరికొన్ని విమానాలను విజయవాడకు దారి మళ్లించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానాన్ని విజయవాడకు దారి మళ్లించారు. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. -
పోలీసులంటే దేవుళ్లు కాదు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గత నెల 4న జరిగిన తొక్కిసలాటకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) క్రికెట్ జట్టు బాధ్యత వహించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) పేర్కొంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి వికాశ్ కుమార్‌తోపాటు పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ వికాశ్ కుమార్ ‘క్యాట్’ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ఆయన విజ్ఞప్తిపై క్యాట్ విచారణ జరిపింది. విజయోత్సవాలకు దాదాపు 5 లక్షల మంది తరలివచ్చారని, ఇందుకు ఆర్సీబీదే బాధ్యత అని స్పష్టంచేసింది. పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోలేదని తప్పుపట్టింది. ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జట్టు యాజమాన్యం హఠాత్తుగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో లక్షల మంది తరలివచ్చారని, వారిని అదుపులో చేయడం పోలీసులకు సాధ్యం కాలేదని వెల్లడించింది. తగినంత సమయం లేకపోవడంతో వారు ఏర్పాట్లు చేయలేకపోయారని తెలిపింది. ‘పోలీసులు కూడా మామూలు మనుషులే. వారు దేవుళ్లు కాదు. ఇంద్రజాలికులు కూడా కాదు. వారు మాయలు మహిమలు ప్రదర్శించలేరు. పోలీసుల వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు’’అని క్యాట్ తేలి్చచెప్పింది. వికాశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది. -
కర్ణాటక సీఎం మార్పు.. డీకే కీలక వ్యాఖ్యలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ మంగళవారం కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి చర్చే లేదని అన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు. డి.కె.శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్.ఎ.ఇక్బాల్ హుస్సేన్‌కు నోటీసు ఇస్తామని, ఆయన వివరణ కోరుతామని వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. సీఎం మార్పును ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, తమ దృష్టి మొత్తం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చిచెప్పారు. తన గురించి ఇతరులు మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. అలాంటి అంశాలపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. -
చివరి భూములకు ఈసారైనా నీరందేనా?
రాయచూరు రూరల్: మూడు దశాబ్దాల నుంచి వర్షాభావంతో జిల్లా రైతులు తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్నారు. ఉన్న నీటి వనరులు వినియోగించుకోలేని రైతులను ఆదుకోవాలన్న ధ్యాస అధికారులకు, ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోంది. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల కింద రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారింది. పంట భూములు తమ కళ్ల ముందే బీళ్లుగా మారుతుంటే రైతులు తల్లడిల్లుతున్నారు. పిచ్చి మొక్కలు, పూడికతో నిండిన స్థితిలో కాలువలు ఉన్నాయి. జిల్లాకు వర్షపాతం ఒక శాపమైతే, పాలకుల శీతకన్నుతో ఎడమ కాలువ ఆధునికీకరణ పేరుతో రూ.కోట్లాది నిధుల విడుదల జరిగినా పనులు మాత్రం సక్రమంగా జరగకుండా పోయాయి. కాలువలకు నీరు వదిలితే ఏ క్షణంలోనైనా గండ్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాలువలకు ఇరువైపుల కట్టలకు ఉన్న సిమెంట్ కాంక్రీట్ జారిపోయింది. అక్కడక్కడ నాపరాళ్లు పగిలిపోయాయి. ఎర్రమట్టి కుదించుకు పోయింది. 99, 102వ డిస్ట్రిబ్యూటరీల కింద మమదాపుర, మర్చటహాళ్, నెలెహాళ్, మటమారి, ఆశాపుర, దిన్ని, యరగేర, మంజర్ల తదితర ప్రాంతాల్లో ఉపకాలువలకు నీరందడం కష్టమైంది. కాలువ గట్లు బలహీన పడిన వైనం పట్టించుకోని అధికారులు, పాలకులు -
ఆటోవాలాలపై ట్రాఫిక్ కొరడా
రాయచూరు రూరల్: నగరంలో ఎలాంటి అనుమతులు లేని 300 ఆటోలకు చెక్ పెట్టినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. మంగళవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిలో ఆటోల తనిఖీ చేపట్టి డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు లేని వాటన్నింటిని పట్టుకుని సీల్ వేసినట్లు తెలిపారు. నగరంలో దాదాపు 75 శాతం ఆటోలకు ఎలాంటి బీమా ఇతరత్ర పత్రాలు లేవని ఆయన అన్నారు. చెరువులో మొసలి పట్టివేత రాయచూరు రూరల్: తాలూకాలోని మర్చేడ్ చెరువులో మొసలి ప్రత్యక్షం కాగా అటవీ శాఖ అధికారులకు అప్పగించిన ఘటన తాలూకాలో చోటు చేసుకుంది. చెరువులో మొసలి ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళన చెందారు. గ్రామంలోని యువకులు ఏకమై చేపలు పట్టే వలతో మొసలిని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో గ్రామ ప్రజలు ఊరట చెందారు. పాము కాటుకు తల్లీకొడుకు మృతి రాయచూరు రూరల్: పాము కాటుకు గురై తల్లీకొడుకు మృతి చెందిన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో చోటు చేసుకుంది. దేవదుర్గ తాలూకా ఏరుండి గ్రామంలో సోమవారం రాత్రి ఇంటిలో నిద్రిసున్న సమయంలో వీరిని పాము కరిచింది. వారిని ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తల్లి సుబ్బమ్మ(35), బసవరాజ్(10) మరణించారు. రిమ్స్‌లో బాలుడి అపహరణ రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. రాయచూరు తాలూకా జులుంగేర తాండాకు చెందిన విష్ణు నాయక్(10)కు చేతులు కాలడంతో గత నెల 17న ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఆ బాలుడిని గత నెల 22న కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాబయ్య తెలిపారు. కార్మికుల సమస్యలు తీర్చండి రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలపై అధికారులు స్పందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బషీర్ పేర్కొన్నారు. మంగళవారం హట్టి పైభవనంలో జరిగిన సభలో కార్మికుల నుద్దేశించి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కార్మికుల జీవితం కష్టకరంగా మారిందన్నారు. కేంద్రం కార్మికుల హక్కులను హరిస్తోందన్నారు. సమావేశంలో రమేష్, ఫకృద్దీన్, వెంకటేష్, పెంచలయ్య, సాహీరా బేగంలున్నారు. ఎయిమ్స్ మంజూరుకు కమిటీ ఏర్పాటు తగదు రాయచూరు రూరల్: దేఽశంలో కేంద్ర సర్కారు ఆధీనంలో మంజూరు అవుతున్న విద్యా సంస్థలకు కమిటీ అధ్యయనం చేస్తుందని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనడాన్ని బసవేశ్వర క్రాంతికారి సంఘం అధ్యక్షుడు రాజేష్ తప్పు బట్టారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి, తెలంగాణలో బీబీనగర్, జమ్మూకశీ్మ్ర్లో విజయనగర్ల్లో ఎయిమ్స్, కశ్మీర్ అవంతికల్లో ఫోరోనిక్స్ విశ్వవిద్యాలయం మంజూరుకు కమిటీలు పరిశీలన చేశాయా? అని ప్రశ్నించారు. ఆ ప్రాంతాలకు లేని మార్గదర్శకాలు కర్ణాటకలోని రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు రూపొందిస్తామనడం అపహాస్యంగా ఉందన్నారు. -
నేడు తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల
హొసపేటె: తుంగభద్ర జలాశయానికి ఎగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరందుకోవడంతో డ్యాంకు వస్తున్న వరద రోజురోజుకు పెరుగుతోంది. ఈనేపథ్యంలో బుధవారం నుంచి కర్ణాటక కోటా కింద కొప్పళ, రాయచూరు జిల్లాలకు నీరందించే తుంగభద్ర ఎడమగట్టు ప్రధాన కాలువ(ఎల్‌బీఎంసీ)కు నీటిని విడుదల చేస్తున్నారు. అదే విధంగా ఈనెల 10న హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు నీటిని విడుదల చేస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయమైన తుంగభద్ర డ్యాంకు మంగళవారం ఇన్‌ఫ్లో 33,916 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. గత వారం రోజులుగా డ్యాంలోకి భారీగా ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాంలో నీటిమట్టం కూడా క్రమంగా పెరిగింది. జలాశయానికి ఎగువన శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళు, ఆగుంబె, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.38 అడుగులు, నీటినిల్వ 74.486 టీఎంసీలు ఉండగా ఔట్‌ఫ్లో 2,388 క్యూసెక్కులుగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నదికి టీబీ డ్యాం నుంచి నీరు తుంగభద్ర జలాశయంలోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రూపంలో 33,916 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ద్వారా నదిలోకి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం జలాశయంలో 71.790 టీఎంసీల నీరు నిల్వ చేరింది. నిపుణుల సలహా ఆధారంగా జలాశయం క్రస్ట్‌గేట్లు మార్చక పోవడంతో ఈ సంవత్సరం జలాశయంలో 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించారు. తుంగా, భద్ర నుంచి పెద్ద మొత్తంలో నీరు విడుదలైతే జలాశయం నుంచి నదిలోకి మరింత ఎక్కువగా నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల అధికారులకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్ హెచ్చరిక సందేశాన్ని పంపారు. 10న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీలకు టీబీ డ్యాం నుంచి నీటి విడుదల -
బళ్లారిలో కసాప సమ్మేళనంతో కొత్త చరిత్ర
బళ్లారిటౌన్: బళ్లారిలో త్వరలో జరిగే 88వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనం చరిత్ర సృష్టించనుందని జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం బెంగళూరులోని కసాప కార్యాలయంలో జరిగిన ముందస్తు సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కన్నడిగులు గర్వించదగ్గ ఉత్సవం అని, అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం సంపూర్ణంగా సన్నద్ధం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాల్సిన అన్ని సదుపాయాలకు ఆర్థిక సహాయం అందజేయనుందన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు, నాడోజ మహేష్ జోషి మాట్లాడుతూ బళ్లారి జిల్లాలో ఇంత వరకు 5 సమ్మేళనాలు జరిగాయని, ఇది 6వ సమ్మేళనం అన్నారు. స్వాతంత్య్ర అనంతరం రెండో సమ్మేళనం అని గుర్తు చేశారు. ఇప్పటికే బళ్లారిలో కసాప కార్యవర్గ సమితి సమావేశంలో అఖిల భారత కసాప సమ్మేళన అధ్యక్షురాలిగా బాను ముస్తాక్‌ను ఎంపిక చేశారని, ఈమె మొదటి మైనార్టీ మహిళ అని గుర్తు చేశారు. జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, కేంద్ర కసాప కార్యదర్శి బీఎం పాటిల్, మాధ్యమ కన్వీనర్ హెచ్.శ్రీధర్‌మూర్తి, జిల్లా ఎస్పీ శోభారాణి, మహమ్మద్ హ్యారీష్ తదితరులు పాల్గొన్నారు. -
9న దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన
హుబ్లీ: డీ క్రియేషన్స్ వారి దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు ధార్వాడ పద్మ థియేటర్లో ఏర్పాటు చేశామని ఆ చిత్ర దర్శకుడు మన్సూరే తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇది ప్రేమ కథ అని, హీరోగా విజయ్ కృష్ణ, హీరోయిన్గా ప్రియాంక కుమార్ నటించారని తెలిపారు. శృతి హరిహరన్, శరత్ లోహితాశ్వ, సుధా బెళవాడి, అరుణ్‌సాగర్, శోభరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. కార్తీక్, భక్కేష్ సంగీత దర్శకత్వం నిర్వహించారు. బెంగళూరు, ఉడిపి, కుందాపుర, గోవాల్లో షూటింగ్ చేశామన్నారు. ప్రత్యేక ప్రదర్శన బెంగళూరు, మైసూరుకు మాత్రమే పరిమితం అయిందన్నారు. అయితే కన్నడ సినీ రంగానికి ఉత్తర కర్ణాటక ఇచ్చిన సేవలు అనన్యం అని, అందుకే ధార్వాడలో ఈ ప్రత్యేక ప్రదర్శన చేశామన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్, పంపిణీదారులు రవిచంద్ర రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వృక్ష సంపద భద్రతకు చర్యలు చేపట్టండి బళ్లారి అర్బన్: మొహర్రం పండుగ వేళ జిల్లా వ్యాప్తంగా ఆయా తాలూకాల పరిధిలో అగ్నిగుండం తయారీ కోసం వృక్షాలను నాశనం చేయరాదు. ఎండుకట్టెలతో పండుగను జరుపుకొనేలా అవగాహన కల్పించాలని, ఎట్టిపరిస్థితిలోను పచ్చని చెట్లను నాశనం చేయకుండా చర్యలు చేపట్టాలని జిల్లాధికారికి కర్ణాటక రక్షణ వేదిక బళ్లారి జిల్లా శాఖ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. మొహర్రం పండుగ మతాల మధ్య సామరస్యానికి ప్రతీక అన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సందర్భంగా పచ్చని చెట్లు చేమలకు హాని వాటిల్లకుండా పోలీసులు సంబంధిత అధికారులు పండుగ నిర్వాహకులకు అవగాహన కల్పించి వారిని చైతన్య పరచాలని సంస్థ అధ్యక్షుడు పంపనగౌడ కోరారు. లింగేశ్వర్, అంజినమ్మ, ఆంజినేయ, శేఖర్, హులిగప్ప తదితరులు పాల్గొన్నారు. కవి మృతికి సంతాపం రాయచూరు రూరల్: నగరంలో సీనియర్ కవి బీ.వీ.వాల్మీకి నాగేంద్ర అకాల మృతికి రంగస్థల కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు మంగళవారం కన్నడ భవనంలో జరిగిన సమావేశంలో సీనియర రంగస్థల కళాకారుడు హక్కి మాట్లాడుతూ రంగాయణ, కళా రంగం, కవిత్వంలో రాటు దేలిన నాగేంద్ర వాల్మీకిగా పేరొందారని అభివర్ణించారు. కార్యక్రమంలో అయ్యనగౌడ, వెంకటేష్, బషీర్ అహ్మద్, నరేంద్ర రంగస్వామిలున్నారు. ఆ ప్రకటన ఖండనీయం హొసపేటె: సోషలిజం, లౌకికవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆర్ఎస్ఎస్కు చెందిన దత్తాత్రేయ హొసబాళె చేసిన ప్రకటనను అఖిల భారత బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసోసియేషన్ నాయకుడు ఎం.కరుణానిధి తెలిపారు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంఘ్ పరివార్ తన రహస్య ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. అంబేడ్కర్ పేరును ముందుకు తేవడం ద్వారా దేశ ప్రజల్లో కుల విద్వేషాన్ని నాటడానికి కూడా ప్రయత్నిస్తోందన్నారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు 1946 డిసెంబర్ 13న ఒక సంకలిత తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, అది 1947లో ఆమోదం పొందిందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగంలో చేర్చారన్నారు. అనంతరం అసోసియేషన్ నాయకుడు మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ కూడా కుల రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నియామక పరీక్షల శిక్షణకు విజ్ఞప్తి
బళ్లారిఅర్బన్: ఎన్ఎండీసీలో నియామకాల కోసం పరీక్షలకు సిద్ధతా శిక్షణ గురించి వినతిపత్రాన్ని జిల్లాధికారి కార్యాలయంలో తహసీల్దార్‌కు అందజేశారు. ఎన్ఎండీసీ పరీక్ష అభ్యర్థులు తమ సమస్యను వినతిపత్రంలో వివరించారు. గత మార్చిలో నియామకమైన ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల సిద్ధతా శిక్షణ శిబిరాన్ని దోణిమలైలోని ప్రభుత్వ హైస్కూల్లో గత నెల 30 నుంచి ఈనెల 8 వరకు జరుపుతామని ప్రకటన ఇచ్చారన్నారు. అయితే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరైన కారణంగా శిక్షణ శిబిరాన్ని వాయిదా వేశారన్నారు. దీంతో బళ్లారి వాసులకు బళ్లారిలోనే శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేలా విజ్ఞప్తి చేస్తున్నామని విద్యార్థులు సురేష్, విజయ్‌కుమార్, పల్లవి, ఈశ్వరి అరిణి, రాజేశ్వరి, సాగర్, రాయాపుర లక్ష్మణ్, పంపాపతి, మహంతేష్, రాజేష్, రుద్రముని, గాదిలింగప్ప తదితరులు తెలిపారు. -
కలబుర్గి రొట్టి.. సిరిధాన్యపు శక్తి
సాక్షి,బళ్లారి: ఉత్తర కర్ణాటకలోని కలబుర్గి, బళ్లారి, కొప్పళ, రాయచూరు, బాగల్కోటె, బీదర్ తదితర జిల్లాల్లో జొన్నలు, సజ్జ రొట్టిలను ప్రధానంగా భోజనం చేస్తుంటారు. అందులోను కలబుర్గి రొట్టిలకు, జొన్నలకు మరింత గుర్తింపు ఉంటుంది. వర్షాధారిత భూముల్లో విస్తృతంగా పండించే జొన్నలను ఈ ప్రాంత వాసులు ఎక్కువగా ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారంగా గుర్తింపు పొందిన జొన్నరొట్టిలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో కలబుర్గి జొన్న రొట్టిలను ప్రస్తావించడంతో ఈ ప్రాంతంలో తయారు చేస్తున్న జొన్న, సజ్జ రొట్టిలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మన్ కీ బాత్‌లో ఽప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలబుర్గి జొన్నరొట్టిలను ఽశ్లాఘించడంతో ఉత్తర కర్ణాటక పరిధిలోని కలబుర్గిలో కాకుండా కర్ణాటక జొన్న రొట్టిలకు పేరు వచ్చింది. కలబుర్గి జొన్నరొట్టిలను మోదీ ప్రస్తావించారంటే ఈ ప్రాంతంలోని ఆహారపు అలవాట్లు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పూర్వీకుల నుంచి బలవర్థక ఆహారం మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారిపోతున్నా మన పూర్వీకులు ముందు నుంచి ఆహారంలో ప్రతినిత్యం ఉపయోగిస్తున్న జొన్నరొట్టిలను తమ పిల్లలకు కూడా భోజనంలో ప్రతి నిత్యం తినేందుకు కృషి చేస్తుండడంతో ఆరోగ్యకరమైన జొన్న, సజ్జ రొట్టిల వాడకం ద్వారా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిత్యం వేలాది జొన్న రొట్టిలు తయారు చేసి అమ్మకాలు సాగిస్తుండటంతో, ప్రతి ఇంటా జొన్నరొట్టిల సవ్వడి ఉంటుందని కలబుర్గి వాసులు పేర్కొంటున్నారు. ఇక్కడ పండించే జొన్నలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. వర్షాధారిత భూముల్లో ఎలాంటి రసాయనిక, క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా కలబుర్గి జొన్నలంటే ప్రతి ఒక్కరూ లొట్టలు వేసుకుని తినాల్సిందే. అందుకే ప్రధాని మోదీని కూడా కలబుర్గి జొన్నరొట్టిలు ఆకర్షించాయని చెప్పవచ్చు. ఇక్కడ ఎండురొట్టిలతో అప్పటికప్పుడు తయారు చేసే జొన్నరొట్టిలకు మరింత గుర్తింపు ఉంటుంది. జొన్న రొట్టిలు తింటే వ్యాధులు దూరం ఉత్తమ ఆరోగ్యకరమైన జొన్నరొట్టిలను తినడం ద్వారా ముఖ్యంగా చక్కెర వ్యాధి పూర్తి నియంత్రణంలో ఉంచవచ్చని, బరువు తగ్గేందుకు దోహదం చేస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలబుర్గి రొట్టిలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు అధికారులు కూడా కృషి చేస్తున్నారు. కలబుర్గి జొన్నరొట్టిలను బ్రాండ్‌గా తీసుకుని రావడంతో రొట్టిలను తయారు చేస్తున్న మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ తయారు చేసే జొన్న రొట్టిలను కర్ణాటక వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు చేస్తుండటంతో కలబుర్గి రొట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరుగాంచింది. ఈ రొట్టిలు అమెజాన్, జొమ్యాటోల్లో కూడా అందుబాటులోకి వచ్చాయంటే జొన్న రొట్టిలను తినేవారి సంఖ్యరోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కలబుర్గి జొన్నరొట్టిలతో పాటు ఉత్తర కర్ణాటకలో పండించే జొన్నలతో తయారు చేసే జొన్న రొట్టిలకు ఎంతో గుర్తింపు ఉందని చెప్పవచ్చు. మన్ కీ బాత్‌లో జొన్నరొట్టిలకు ప్రధాని కితాబు ఆరోగ్యకరమైన ఆహారంగా ఈ రొట్టిలకు గుర్తింపు రొట్టిల తయారీతో మహిళలకు సైతం జీవనోపాధి -
బీదర్‌లో శాంతియుతంగా సద్భావన నడక
హుబ్లీ: బీదర్‌లో శాంతియుతంగా సద్భావన నడక చేపట్టారు. మహబూద్ గవాన్ మదరసా నుంచి ప్రారంభమైన ఈ నడక పలు వీధుల గుండా సాగి జిల్లాధికారి కార్యాలయానికి చేరుకొని ముగిసింది. ప్రదర్శన పొడవునా ఒక దేశం, ఒకే ధ్వని, ఒకే ఐక్యత, అన్ని మతాల సారం మానవత్వమే, ద్వేషం కాదు. ప్రేమను పంచుదాం. ప్రతి ధర్మం ఓ పువ్వులా శాంతి తోటలో కలిసి మెలసి బతుకుదాం. శాంతితో కలిసి నడుద్దాం. సౌభ్రాతృత్వమే మన శక్తి. మానవత్వం ఉన్న ఇంట్లో ద్వేషానికి స్థలం లేదు. అల్లర్లు వద్దు, హక్కులను గౌరవిద్దాం. ఐక్యత మన శక్తి, విభజన మన వినాశనం, అందరికీ సామరస్యం కావాలి తదితర నినాదాల ఫలకాలను చేతిలో పట్టుకొని ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఏడీసీ డాక్టర్ ఈశ్వర్ ఉళ్లాగడ్డి, జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటిలకు వినతిపత్రాలను అందజేశారు. అంతకు వముందు జగద్గురు చెన్నబసవానంద స్వామి తదితర మఠాధీశులు మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతె సత్యాదేవి, ఫాదర్ డిసౌజ, సంజయ్, షాహిన్ విద్యా సంస్థల అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ ఖదీర్‌తో పాటు అన్ని మతాలకు చెందిన ప్రముఖులు, సాధకులు, మత పెద్దలు పాల్గొన్నారు. -
ఏఐఐఈఏ ప్లాటినం మహోత్సవం
బళ్లారి రూరల్ : ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐఐఈఏ) 75 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా మంగళవారం ఎల్ఐసీ బ్రాంచ్–2లో ప్లాటినం మహోత్సవాన్ని ఆచరించారు. ఏఐఐఈఏ జెండాను ఆవిష్కరించి జ్యోతిప్రజ్వలనం చేశారు. ఈసందర్భంగా కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంపత్ కుమార్, ఏబీఎం ఐ.కె.గోపాల్, ఏఐఐఈఏ అధ్యక్షుడు ఆర్.దత్తాత్రేయ, కార్యదర్శి కామ్రేడ్ సూర్యనారాయణ, డీఓ శశిధర్, ఏజెంట్ కొట్రేశ్, బీఎఫ్ఐ, ఏయూయూటీయూసీ, కర్ణాటక గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
మిమ్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలి
మండ్య: మండ్య మెడికల్ కాలేజీ ఆస్పత్రి (మిమ్స్)కి చెందిన 18 ఎకరాల స్థలాన్ని కాపాడాలని రక్షణ వేదిక, కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం సహా పలు సంఘాల నేతలు, కార్యకర్తలు మండ్యలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి ర్యాలీని ఆరంభించారు. మిమ్స్ అనేది జిల్లాలో 30 లక్షల మందికి ఉపయోగపడే ప్రధాన ఆస్పత్రి అన్నారు. నిత్యం వందలాది మంది వైద్యసేవలకు వస్తుంటారని, 400 పడకల ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే మిమ్స్‌కు చెందిన 18 ఎకరాలు కబ్జా కోరల్లో ఉందని, దానిని రక్షించాలని నినాదాలు చేశారు. శివరామేగౌడ సునందా జయరాం, నాగణ్ణగౌడ, జయరాం తదితరులు పాల్గొన్నారు. డీకేశిని సీఎం చేయాలి● వంద మందికి పైగా ఎమ్మెల్యేల మాట ఇది ● ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ శివాజీనగర: కాంగ్రెస్‌లో వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుతున్నారు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తప్పకుండా సీఎం అవుతారని ఆయన మద్దతుదారు, రామనగర హస్తం ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. రామనగరలో విలేకరులతో మాట్లాడిన ఆయన, తాను చెప్పేది వాస్తవమన్నారు. శివకుమార్ పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుచేత ఆయనకు సీఎం స్థానం లభించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెప్పారు. ఇదే మాటను సుర్జేవాలాకు చెబుతానన్నారు. సుర్జేవాలా చర్చలు రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేల అసంతృప్తిని చల్లార్చి, సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరు గురించి ఆరా తీసేందుకు వచ్చిన ఇన్చార్జి రణదీప్‌సింగ్ సుర్జేవాలా 2వ రోజున మంగళవారం భేటీలు కొనసాగించారు. మంత్రులు పట్టించుకోవడం లేదు, వారికి బుద్ధి చెప్పండని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎన్.ఏ.హ్యారిస్, రిజ్వాన్, ఎం.కృష్ణప్ప, ప్రియాకృష్ణ, శివణ్ణ, ఏ.సీ.శ్రీనివాస్, ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ తదితరులు సుర్జేవాలను కలిసి మాట్లాడారు. సీబీఐకి వాల్మీకి మండలి స్కాం కేసు: హైకోర్టు బనశంకరి: రాజకీయ కలకలం రేకెత్తించిన మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం హైకోర్టు ఆదేశించింది. యూనియన్ బ్యాంక్ వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న సిట్ విచారణను రద్దు చేసింది. ఇప్పటివరకు సిట్ సేకరించిన ఆధారాలను సీబీఐ కి అందించాలని ఆదేశించింది. కేసు సీబీఐకి అప్పగిస్తే రాష్ట్రంలో పలువురు సీనియర్ నేతలకు ఇబ్బందులు తప్పవనే మాట వినిపిస్తోంది. ఈ కేసులో బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మంత్రి పదవిని కోల్పోవడం తెలిసిందే. ఆయనను ఈడీ అరెస్టు కూడా చేయగా ప్రస్తుతం బెయిలు పొందారు. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించింది. సెలూన్లో మహిళలకు మస్కా యశవంతపుర: మగువలు అందచందాలకు మెరుగుల కోసం వెళ్తే వంచకులు పర్సులను ఖాళీ చేశారు. బెంగళూరుకు చెందిన పెరిమీటర్ సెలూన్ అనే సంస్థ పలు జిల్లాలలో స్పా సెలూన్లను నిర్వహిస్తోంది, ఈ సెలూన్లకు వెళ్లిన శ్రీమంత మహిళలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నిర్వాహకులు నూరిపోసేవారు. ఇది నమ్మిన మహిళలు డబ్బులు వస్తాయనే ఆశతో రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పారు. సదరు మహిళలకు అసలు, లాభం ఏదీ దక్కలేదు, సంస్థ యజమానులు రక్షా హరికాల్ సెల్వ, సునీత్ మెహతా, తివారీలు మోసం చేశారని బాధిత మహిళలు బెంగళూరు గోవిందరాజనగర, తలఘట్టపురతో పాటు అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వందలాది మంది మహిళలకు రూ.50 కోట్ల వరకు మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. -
గుండెపోటుకు నవ వరుడు బలి
దొడ్డబళ్లాపురం: రెండున్నర నెలల క్రితం వివాహమైన కొత్త పెళ్లికొడుకును గుండెపోటు పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన గుండెపోటు మరణాలతో సతమతమవుతున్న హాసన్ జిల్లాలోనే జరిగింది. హొళేనరసీపుర తాలూకా సోమనహళ్లివాసి సంజయ్ (27)కు ఇటీవలే పెళ్లయింది. సోమవారంనాడు స్నేహితులతో పార్టీ చేసుకున్న సంజయ్ తరువాత గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు గ్రామంలోని ఆరోగ్య కేంద్రానికి తీసికెళ్లారు. అక్కడ బీపీ చెక్ చేయగా 220 ఉన్నట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతిచెందాడు. అయితే మృతుని కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శివమొగ్గలో విద్యార్థి.. శివమొగ్గ: గుండెపోటుతో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన నగర శివార్లలోని బసవనగంగూరు గ్రామంలో జరిగింది. మృతుడు శ్రీనిధి (20) అనే విద్యార్థి. ఇతను నగరంలోని డీవీఎస్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనిధికి అస్వస్థత కలిగింది, వెంటనే అతనిని నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిసింది. గుండెపోటు, న్యుమోనియా కారణమని వైద్యులు చెప్పినట్లు గ్రామ నివాసి ప్రసన్న తెలిపారు. యువకుని ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం అలముకొంది. హాసన్ జిల్లాలో విషాదం -
ఆటోలో ప్రేమజంట ఆత్మహత్య!
సుందర ప్రకృతిసీఎం జైలుకెళ్లడం ఖాయం: స్నేహమయి మైసూరు: గతంలో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా)లో జరిగిన కోట్లాది రూపాయల ఇళ్ల స్థలాల కుంభకోణం కేసులో సీఎం సిద్దరామయ్య జైలుకెళ్లడం ఖాయమని సామాజిక కార్యకర్త, ఫిర్యాదిదారు స్నేహమయి కృష్ణ అన్నారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం సిద్దరామయ్య అధికారం అండతో చట్టం కళ్లుగప్పే పని చేస్తున్నారన్నారు. ఈరోజు కాకపోతే రేపు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కేసులో తగిన సాక్ష్యాధారాలను సమకూర్చామన్నారు. సాక్ష్యాధారాలను నాశనం చేసే పనిని పోలీసులతో చేయిస్తున్నారన్నారు. సీఎం నిందితుడని 14 ఇళ్ల స్థలాలను వాపసు ఇచ్చినప్పుడే ప్రజలకు తెలిసిందన్నారు. ఈ కేసు విచారణలో మైసూరు లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేష్ పనితీరు బాగా లేదని ఆరోపించారు. సాక్ష్యాధారాలను ఆయనే నాశనం చేస్తున్నారని, సిద్దరామయ్యకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆయనను బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు. ● బెళగావి జిల్లాలో ఘోరం సాక్షి,బళ్లారి: వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్‌కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్‌లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్‌లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు. -
మృత్యు శకటమైన కారు
దొడ్డబళ్లాపురం: దేవస్థానానికి వెళ్తుండగా ప్రయాణిస్తున్న కారే మృత్యుశకటమైంది. బోల్తాకొట్టిన ప్రమాదంలో ఆరుమంది బంధువులు మరణించిన దుర్ఘటన దొడ్డబళ్లాపురం– హిందూపురం రహదారి మార్గంలోని నాయకరండనహళ్లి వద్ద చోటుచేసుకుంది. దొడ్డ పట్టణ పరిధిలోని కరేనహళ్లికి చెందిన ఈశ్వరప్ప (75), పురుషోత్తమ్ (75), కాళప్ప (68), నారాయణప్ప (70), గోపినాథ్(45), కారుడ్రైవర్ నరసింహమూర్తి (50) మృతులు. ఓవర్టేక్ చేయబోయి.. వివరాలు.. మంగళవారం ఉదయం దొడ్డబళ్లాపురం నుంచి మంచేనహళ్లి వద్ద ఉన్న భీమేశ్వర కొండ ఆలయానికి ఇన్నోవా కారులో బయలుదేరారు. గౌరిబిదనూరు మార్గంలోని నాయకరండనహళ్లి వద్ద కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డుమీద పల్టీలు కొట్టి బోల్తాపడింది. అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. మరో నలుగురు గాయపడగా, బెంగళూరుకు తరలించారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయానికి వెళ్తుండగా బోల్తా ఆరుగురు దుర్మరణం దొడ్డబళ్లాపుర వద్ద విషాదం -
ఐదేళ్లలో 82 పులులు చనిపోయాయా?
శివాజీనగర: రాష్ట్రంలో గత ఐదున్నర సంవత్సరాల్లో 82 పులులు మృతి చెందాయని సాక్షి దినపత్రిక సహా పలు మీడియాల్లో వార్తా కథనాలు రావడంపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టి సారించారు. అన్ని పులుల మరణాల గురించి నివేదిక ఇవ్వాలని అటవీ అధికారులకు సూచించారు. ఎన్ని పులులు సహజంగా మరణించాయి? ఎన్ని అసహజంగా మృతి చెందాయి? అసహజ మరణాలకు కారణాలేమిటి, నివేదికలు ఏమైనా వచ్చాయా అని అటవీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఆ పులుల కళేబరాల గోళ్లు, దంతాలు సేకరించారా, నిర్లక్ష్యం చూపిన సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారా? ఎన్ని పులుల హత్య కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారో వివరాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు పులుల హత్య కేసుల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎన్ని కేసులు తనిఖీ దశలో ఉన్నాయి తదితర సమాచారన్ని 10 రోజుల్లోగా తమకు సమ ర్పించాలని తెలిపారు. అటవీ ఉన్నతాధికారులపై చర్యలు మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని మలెమహాదేశ్వరబెట్ట అడవిలో తల్లి, నాలుగు పిల్ల పులులను కొందరు విషాహారం పెట్టి చంపిన కేసులో జిల్లా డీసీఎఫ్ చక్రపాణి, ఎసీఎఫ్ గజానన హెగడె, విభాగ అధికారి మాదేష్లకు ప్రభుత్వం బలవంతంగా సెలవు ఇచ్చింది. రోడ్డుకు సుమారు 100 మీటర్ల దూరంలోనే పులులు చనిపోతే పట్టించుకోలేదని సర్కారు ఆగ్రహించింది. అక్కడికి 800 మీటర్ల దూరంలో చెక్‌పోస్టు ఉన్నా స్పందన లేదని, పైగా అటవీ వాచర్లు ధర్నా చేస్తుంటే పరిష్కరించలేదని అసంతృప్తిని వ్యక్తంచేసింది. అటవీ అధికారులు, గస్తీ సిబ్బంది లోపం వల్లే పులులు చనిపోయినట్లు నిర్ధారించి సెలవు ఆదేశాలిచ్చింది. విచారణకు అటవీ మంత్రి ఆదేశం -
భారీగా బంగారు నగలు సీజ్
యశవంతపుర: తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన ఇద్దరు దొంగలను బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.58.60 లక్షలు విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు విల్లుపురానికి చెంది, ఆర్ఆర్ నగరలో నివాసం ఉంటున్న నాగమణి (47), రవికుమార్ (45) ఇటీవల ఓ ఫ్లాటు కిటికీలను బద్ధలు కొట్టి 55 గ్రాముల బంగారం, 3 కేజీల వెండిని దోచుకెళ్లారు. పోలీసులు గాలించిన అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. నిందితుల నుంచి 537 గ్రాముల బంగారం, 7.84 కేజీల వెండి, బైక్‌ని సీజ్ చేశారు. బైకు దొంగ అరెస్ట్ బైకులను మాయం చేస్తున్న దొంగను బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్‌లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్‌ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లిలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లి మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు. సిటీలో ఇద్దరు దొంగలకు సంకెళ్లు -
బైక్ ట్యాక్సీలు షెడ్డుకేనా?
సాక్షి బెంగళూరు: బెంగళూరులో గత నెల 16వ తేదీ నుంచి బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధం విధించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షకు పైగా బైక్ ట్యాక్సీలు బంద్ అయినట్లు అంచనా. బైక్ ట్యాక్సీ కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదని, మా మంచి భవిష్యత్తుకు ఒక భరోసా అని వేలాది మంది బైక్ట్యాక్సీదారులు సర్కారుకు విజ్ఞప్తి చేస్తూ నిషేధాన్ని సడలించాలని కోరారు. కొన్నిచోట్ల నిరసనలు కూడా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కన్నడనాట నిషేధించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్‌దాస్ పై కూడా ఎక్స్‌లో వారికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టేలా ట్వీట్ చేయడం వల్ల బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన చేశారని ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలను మీరి సుమారు 200కు పైగా బైక్ ట్యాక్సీదారులు విధుల్లోకి రాగా, పోలీసులు ఆ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. చార్జీల బాదుడు ఇప్పుడు ప్రత్యామ్నాయం లేక ప్రజలు ఆటో, క్యాబ్‌లలో ప్రయాణం సాగిస్తున్నారు. వాటికి గిరాకీ గణనీయంగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని యాప్ ఆధారిత ఆటోలు, సాధారణ ఆటోవాలాలు అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బైక్ ట్యాక్సీల నిషేధం తర్వాత ఏకాఎకి మూడు రెట్లు చార్జీలను పెంచినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. రవాణా శాఖ ఆటో రిక్షాలకు తొలి రెండు కిలోమీటర్లకు రూ. 30 ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌కు రూ. 15 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రముఖ యాప్ ఆటోలు తుంగలో తొక్కి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. ఫిర్యాదులు పెరగడంతో రవాణా అధికారులు తనిఖీలు ప్రారంభించారు. నిషేధంతో వేలాదిమంది గగ్గోలు ఆటోల్లో పెరిగిన చార్జీల భారం ప్రజలు ఏమంటున్నారు? బెంగళూరులో తక్కువ ఖర్చుతో గమ్యం చేరడానికి బైక్ ట్యాక్సీలు అనువుగా ఉండేవని పలువురు నగరవాసులు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి రోజూ ప్రయాణ ఖర్చు పెరుగుతోందని చెప్పారు. ట్రాఫిక్‌లో సులభంగా వెళ్లే అవకాశం ఉండేదని అన్నారు. ఆటోలు, క్యాబుల్లో అధిక ధరలు వసూలు చేస్తుండడంతో తమకు ఆర్థిక భారంగా మారిందని సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులు తెలిపారు. ఆటోడ్రైవర్ల సంఘాలు మాత్రం వాటిని నిషేధించాలని, లేకుంటే తమకు ఉపాధి ఉండదని పట్టుబట్టాయి. కాగా బైక్ ట్యాక్సీల మీద పలు ఆరోపణలున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అనేక కేసులున్నాయి. బైక్ ట్యాక్సీల భవిష్యత్తు ఏమిటనేది సందిగ్ధంలో ఉంది. -
దేవుడా.. ఎంతపని చేశావయ్యా
బాగేపల్లి(కర్ణాటక): తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబాలు కొంతసేపటికే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు అక్కడే చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో కురబలకోట వద్ద చెన్నామర్రి మిట్ట అనేచోట హైవేలో సోమవారం ఉదయం జరిగింది. బాగేపల్లి తాలూకాలోని శ్రీనివాసపుర (సాకోళ్ళపల్లి ) గ్రామానికి చెందిన శ్రావణి (27), హోసహుడ్యకు చెందిన హెచ్.ఎస్.చరణ్ (17), బాగేపల్లి పట్టణవాసి మేఘర్శ (17) మృతులు. అంతా భీతావహం వివరాలు.. బాగేపల్లి పట్టణంలోని గంగమ్మగుడి రోడ్డుకు చెందిన రామచంద్రప్ప, హెచ్.టి.శివప్ప, నరసింహరెడ్డి కుటుంబాలకు చెందిన 13 మంది కలిసి టెంపో ట్రావెలర్‌లో తిరుమల యాత్రకువెళ్లారు. దర్శనాలయ్యాక బయల్దేరారు. ఘటనాస్థలంలో యమ శకటంలా వచ్చిన భారీ లారీ ఈ టెంపోను ఢీకొట్టింది. టెంపో పూర్తిగా ధ్వంసమైంది. లోపలున్నవారు విసిరేసినట్లు బయటకు పడిపోయారు. అందరికీ తీవ్ర రక్త గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడే మరణించారు. నరసింహారెడ్డి, భార్య హెచ్.ఎన్. రూప, కుమారుడు ఆదర్శ, రామచంద్రప్ప, భార్య కళావతి, పెద్ద కుమారుడు అశోక్, కోడలు శ్రావణి, చిన్న కుమారుడు దర్శన్, టైలర్ హెచ్.టి.శివప్ప, భార్య సునందమ్మ, కుమార్తె చైత్ర, టెంపో డ్రైవర్ మంజునాథ్‌లు గాయపడ్డారు. రక్తగాయాలు, ఆర్తనాదాలతో ఘటనాస్థలి భయంకరంగా కనిపించింది. స్థానికులు గాయపడినవారికి దొరికిన వాహనాలలో ఆస్పత్రులకు తరలించారు. కొందరిని బెంగళూరుకు తీసుకెళ్లారు. ఘటన గురించి తెలియగానే ఇక్కడి నుంచి బంధువులు వెళ్లారు.దేవుడా..ఎంతపని చేశావయ్యాకురబలకోట: దేవుడా నీ దర్శనానికి వచ్చామే, ఎంత పనిచేశావయ్యా అని గుండెలవిసే వేదనలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. కాళ్లు, చేతులు విరిగిన వారు, ఇలా వివిధ రకాలుగా గాయాల పాలైన వారిని చూసి గుండె తరుక్కుపోయింది. ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఢీకొన్న లారీ ఎక్కడ? టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ కేసు నమోదు చేశారు. టాప్‌తో సహా లేచిపోయింది టెంపో ట్రావెలర్‌కు జరిగిన ప్రమాదం చూస్తే భయాందోళన కలగడం ఖాయం. లారీ ఢీకొన్న ధాటికి టెంపో టాప్ ఎగిరిపోయింది. బాధితులు తీవ్ర గాయాలతో అంగలార్చడం చూపరులను చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. స్థానికులు సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఇద్దరూ క్షేమం టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32), ఇతని వెనుక సీట్లో ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమలలో గుండు చేయించుకున్నాడు. ఈ యాక్సిడెంట్లో వీరిద్దరే క్షేమంగా బయటపడడం విశేషం. డ్రైవర్ మంజునా«థ తీవ్ర గాయాలతో కోమాలో ఉన్నాడు. దర్శనం తరువాత బయల్దేరాం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నాం. కొంత సేపు విశ్రాంతి తీసుకుని సోమవారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో బయలు దేరాం. కురబలకోట మండలంలోని చెన్నామర్రి వద్ద వస్తుండగా ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. – ఓ క్షతగాత్రుడు -
సిద్దూ సర్కారులో అవినీతి తాండవం
బళ్లారిఅర్బన్: రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి ప్రజలకు ఉత్తమ పాలన అదించడంలో పూర్తిగా విఫలం అయిందని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఆరోపించారు. ఆయన డీసీ కార్యాలయ ఆవరణలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగి పోయిందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆరోపణలే దీనికి నిదర్శనం అన్నారు. గృహ వసతి శాఖలో లంచం ముట్టనిదే పనులు కావడం లేదని ఎంఆర్ పాటిల్ చేసిన ఆరోపణలను గుర్తు చేశారు. ఈ విషయంలో ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తిగా ఉంటూ బహిరంగంగా మండిపడుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా ఇప్పటి వరకు కనీస వసతులైన రోడ్లు, వంతెనలు, చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. పేదలు, రైతుల వ్యతిరేక సర్కారు ఇది అని మండిపడ్డారు. షెడ్యూల్ కులాలకు కేటాయించిన నిధుల విడుదలలో కూడా పక్షపాతం చూపుతున్నారన్నారు. ఫలితంగా ఆ వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించడానికే తాపత్రయ పడుతుందని విమర్శించారు. మిగిలిన వర్గాలకు ఎంతో అన్యాయం జరుగుతుందన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం పక్షపాత ధోరణికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్‌ను ఆ స్థానం నుంచి తొలగించాలని సీఎంను డిమాండ్ చేశారు. ఆ పార్టీ ప్రముఖులు కిరణ్‌కుమార్, రాజునాయక్, లక్ష్మికాంతరెడ్డి, పుష్ప, జమిల, హొన్నూరుస్వామి, అశోక్ సంగనకల్లు తదితరులు పాల్గొన్నారు. -
సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉంది
రాయచూరు రూరల్: సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉందని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో గాన సుధ సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన సంగీతోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటిి జీవిత విధానంలో మానసిక ఒత్తిడి అధికమైందని అన్నారు. డివైడర్‌కు లారీ ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు హొసపేటె: నగర బైపాస్ రోడ్డులో కరివేపాకు లోడ్‌తో వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ పడిన ఘటన సోమవారం జరిగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హొసపేటె నగరం మీదుగా ద్వారా ముంబైకి కరివేపాకు లోడ్‌తో వెళుతున్న లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని నగరంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో చేర్పించారు. హొసపేటె ట్రాఫిక్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి తనిఖీ చేశారు. పీడీఓపై చర్యకు డిమాండ్రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా మలదకల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి(పీడీఓ)పై చర్యలు చేపట్టాలని సమాజ సేవకుడు భీమరాయ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024–25లో రూ.720 లక్షల మేర నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. స్వార్థం కోసం నిధులు వినియోగించుకున్నారని, రెండు రోజుల్లో చర్యలు చేపట్టకపోతే జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామన్నారు. -
నల్లబజారుకు తరలిస్తున్న బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దారి తప్పుతున్నాయి. పేదలకు అందిస్తున్న బియ్యం చౌక ధర దుకాణాల్లో ఉచితంగా బీపీఎల్ కార్డుదారులకు పంపిణీ చేస్తుండగా, వాటిని నల్ల బజారులో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి వారి కార్డులను రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నా ఫలితం లేకుండా పోయింది. అంత్యోదయ కార్డులకు 14 కేజీలు జొన్నలు, 21 కేజీలు బియ్యం, బీపీఎల్ కార్డుదారులకు 2 కేజీలు జొన్నలు, 3 కేజీలు బియ్యం పంపిణీ చేయకుండా నల్ల బజార్‌కు తరలిస్తున్నారు. సిరుగుప్ప నుంచి రాయచూరుకు 550 ప్లాస్టిక్ బస్తాల్లో తరలిస్తున్న రూ.6.50 లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా విజయ్ రాయచూరు రూరల్: రాయచూరు రిపోర్టర్ గిల్డ్ అధ్యక్షుడిగా విజయ్ జాగటగల్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2025–27 సంవత్సర కాలానికి ఉపాధ్యక్షుడిగా జయరాం, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, సభ్యులుగా ఈరణ్ణ, వెంకట సింగ్, శ్రీకాంత్, చంద్రకాంత్ ఎంపికయ్యారు. -
కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
హొసపేటె: కళాకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు మరిన్ని గ్రాంట్లను అందించాలి. కళాకారుల జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం వారికి సహాయం చేయాలి. అప్పుడే కళాకారుల జీవితాలు మెరుగుపడతాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత మాతా మంజమ్మ జోగతి తెలిపారు. ఆదివారం దుర్గాదాస్ కళామందిర్లో జరిగిన రంగబింబ 3వ వార్షికోత్సవం, సంగ్యా బాళ్యా నాటక ప్రదర్శన ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. కన్నడ, సంస్కృతి శాఖ కళాకారుల జీవితాలను మెరుగు పరిచేందుకు మరిన్ని గ్రాంట్లను అందించాలన్నారు. పేద కళాకారులు, కళా సంస్థలకు సహాయం చేయడం ద్వారా రంగస్థల కళాకారులను ప్రోత్సహించాలన్నారు. అప్పుడే కళాకారులు, కళ మనుగడ సాగించగలరని ఆమె అన్నారు. ప్రస్తుతం రంగబింబ కళా ట్రస్ట్ గత మూడు సంవత్సరాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కళా మనుగడ కోసం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఆర్యవైశ్య సమాజ్ అధ్యక్షుడు చిద్రి సతీష్, గుబ్బి వీరణ్ణ అవార్డు గ్రహీత, సీనియర్ నాటక కళాకారిణి డాక్టర్ నాగరత్నమ్మ, నాటక అకాడమి సభ్యుడు శివనాయక, పంచ గ్యారంటీ యోజన అమలు కమిటీ అధ్యక్షుడు కే.శివమూర్తి, పీపీ అధ్యక్షుడు ఆదిమని హుస్సేన్ బాషా, లలిత కళారంగ ఉపాధ్యక్షుడు జీఎం.కొట్రేష్, సభ్యుడు కే.మంజునాథ్, జీపీ మాజీ సభ్యుడు గోవింద పరశురామ, గరగ ప్రకాష్, ఎం.కీర్తిరాజ్ జైన్, రోగాని మంజునాథ్ పాల్గొన్నారు. -
మహాద్భుతం.. పనస సంరక్షణ క్షేత్రం
కోలారు: కోలారు సమీపంలోని ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే విరగ కాసిన కాయలతో అలరారుతున్న పనస చెట్లు స్వాగతం పలుకుతాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు 46 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా పనస చెట్లు దర్శనమిస్తాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో 5 కి.మి.ల దూరంలో ఉన్న హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన వారికి తాము కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోనే మొదటి పనస సంరక్షణా క్షేత్రం అని కూడా ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ దాదాపు 1600లకు పైగా పనస చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టుకు ఒక్కో సంఖ్య ఇచ్చారు. కొన్ని పనస చెట్ల కింద ఆ పనస ఏ రకానికి చెందినదనే వివరాలు రాసి ఉంచారు. ఒక్కొక్క చెట్టులోను పనస ఆకృతి, సైజు, వాటి రుచి, లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. పనస కొమ్మలకు విరివిగా కాసిన పనస కాయలు చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తాయి. కొన్ని చెట్ల మొదలులోనే పనస కాయలు కాచి ఉండడాన్ని గమనించవచ్చు. మరో చెట్టులో మొదలు నుంచి కొన వరకు పనస కాయలు విరగకాశాయి. సీజన్లో మాత్రమే కాకుండా యేడాది పొడవునా పనసకాయలు కాచే రకాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా తోట నిండా పనస రకాల లోకమే మనకు దర్శనమిస్తుంది. 50 వసంతాల పనస తోట కర్ణాటక హార్టికల్చర్ పితామహుడు దివంగత ఎం.హెచ్.మరిగౌడ దూరదృష్టి ఫలితంగా 1969వ సంవత్సరంలో మహాత్మాగాంధీ జన్మశతమానోత్సవం సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హార్టికల్చర్ శాఖ నుంచి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 100 పనస తోటలను పెంచాలని మరిగౌడ సంకల్పం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నగర సమీపంలోని టమక వద్ద పనస తోట తలెత్తింది. భూస్వాధీనం తదితర ప్రక్రియల కారణంగా 1973లో ఈ పనస తోటలో పనస మొక్కలను నాటడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న పనస చెట్లు 1973–75 సంవత్సరాల మధ్య నాటినవి. అంటే ఈ పనస తోట 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ పనస తోటలో ఆరంభం నుంచే విత్తనాల ద్వారా మొక్కలను పెంచి నాటారు. హార్టికల్చర్ శాఖ అధికారులు ఎక్కడ నాణ్యమైన పనస పళ్లు కనిపించినా వాటి విత్తనాలను తెచ్చి మొక్కలుగా పెంచి పోషించేవారు. సుమారు మూడున్నర దశాబ్దాల కాలం పాటు ఈ చెట్లను ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించారు. ప్రస్తుతం ఈ చెట్లు ఉత్తమ ఫలాలను అందిస్తున్నాయి. 2009లో ఈ పనస క్షేత్రంలో బాగలకోటె విశ్వవిద్యాలయానికి చెందిన హార్టికల్చర్ కళాశాల ప్రారంభమైంది. అనంతరం పనస తోటను హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అంతకు ముందు ఈ క్షేత్రం పనస రకాల సేకరణ కేంద్రంగా ఉండింది. విశ్వవిద్యాలయానికి అప్పగించిన అనంతరం శాసీ్త్రయంగా పనస రకాల అభివృద్ధి ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో విశ్వవిద్యాలయ, కళాశాల శాస్త్రవేత్తలు చెట్లను రక్షణ చేయడంతో పాటు వివిధ రకాల పనస వంగడాల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తున్నారు. అభివృద్ధి చేసిన పనస రకాలను రైతులకు కూడా అందిస్తున్నారు. ఈ పనస క్షేత్రంలో ప్రతియేటా పనస కాయలను వేలం వేస్తారు. వ్యాపారులు వేలంలో పనస కాయలను కొంటారని వ్యవసాయ విజ్ఞాన కేంద్రం ప్రముఖుడు శివానంద హొంగల్ తెలిపారు. ఇప్పటికీ ఎంతో మంది ఇతర ప్రాంతాల నుంచి రైతులు, విద్యార్థులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలో పనసకాయల తోట చూపరులకు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనుభూతి -
హుబ్లీ ధార్వాడ పాలికెకు కొత్త రథసారథులు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర పాలికె సంస్థ కొత్త మేయర్‌గా బీజేపీ తరపున జ్యోతిపాటిల్, డిప్యూటీ మేయర్‌గా సంతోష్ చవాన్ ఎన్నికయ్యారు. పాలికె కార్యాలయంలో 24వ అవధికి సంబంధించి 19వ వార్డు కార్పొరేటర్ జ్యోతి పాటిల్ అత్యధిక 47 ఓట్లతో మేయర్‌గా ఎన్నికయ్యారు. పాలికె 49వ వార్డు కార్పొరేటర్ సంతోష్ చవాన్ కూడా 47 ఓట్లను పొంది డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి బెళగావి డివిజన్ కమిషనర్ ఎస్బీ శెట్టన్నవర్ ప్రకటించారు. కాగా విపక్ష కాంగ్రెస్ తరపున 59వ వార్డు కార్పొరేటర్ ప్రవాసాంధ్ర మహిళా నాయకురాలు సువర్ణ కల్వకుంట్ల, 76వ వార్డు కార్పొరేటర్ వహీదాఖానం అల్లాభక్షి కిత్తూరు వరుసగా డిప్యూటీ మేయర్ స్థానాల కోసం నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ మేయర్ పదవికి 14వ వార్డు కార్పొరేటర్ శంభుగౌడ రుద్రగౌడ కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఈ ఎన్నికలను సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా తమ ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో పాలికె కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మొత్తం 90 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముగ్గురు గైర్హాజరు తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం 87 మంది పాల్గొనగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. అదనపు డివిజినల్ కమిషనర్ ఎస్ఎస్ బిరాదార్, పాలికె కమిషనర్ రుద్రేష్ గాళి ఎన్నికలను పర్యవేక్షించారు. కొత్త మేయర్ జ్యోతి పాటిల్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కనీస వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తానన్నారు. రక్షిత మంచి నీరు, చెత్త నిర్వహణ తీవ్ర సమస్యగా ఉందన్నారు. ఈ రెండింటిని తొలి ప్రాధాన్యతగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జంట నగరాల సౌదర్యానికి కూడా తగు ప్రాధాన్యతను ఇస్తానన్నారు. ఇక ఆరోగ్యం దృష్యా పాలికె ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు కృషి చేస్తానన్నారు. వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసానికి జంట నగరాలకు వస్తారు. వారికి కనీస సౌకర్యాలు దక్కేలా చూస్తానన్నారు. సీనియర్ల సలహా సూచనలను తీసుకుని వారిని విశ్వాసంలోకి పరిగణించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శ్రమిస్తానన్నారు. మేయర్‌గా జ్యోతి పాటిల్ ఉప మేయర్‌గా సంతోష్ చవాన్ -
హాసన్‌లో హృదయ వేదన
బనశంకరి: హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు ఆగకపోగా, ప్రజల్లో కలవరం పెరిగిపోతోంది. ఒకే రోజు నలుగురు మరణించారు. దీంతో గత 40 రోజుల్లో గుండెపోటుకు బలైనవారి సంఖ్య 22 కు పెరిగి భీతావహం నెలకొంది. బేలూరులో జేపీ లేపాక్షి (50) అనే మహిళ, హొళెనరసీపుర ప్రభుత్వ పీయూ కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్ ముత్తయ్య (58), నుగ్గేహళ్లి నాడకచేరి డీ గ్రూప్ ఉద్యోగి కుమార్ (53), చెన్నరాయపట్టణ తాలూకా కెంబాళు గ్రామంలో లోహిత్ (38) అనే జవాన్ గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయారు. అయ్యో.. సైనికుడు ● లోహిత్ గత 18 ఏళ్లుగా ఆర్మీ జవాన్‌గా పనిచేస్తుండగా సెలవుల్లో ఊరికి వచ్చారు. జూలై 3 నాటికి సెలవు పూర్తయి డ్యూటీకి వెళ్లాలి. కానీ సోమవారం ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చి ప్రాణాలు వదిలాడు. ● చెన్నరాయపట్టణ తాలూకా నుగ్గేహళ్లి గ్రామ నాడ కచేరి డీ గ్రూప్ ఉద్యోగి కుమార్ ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుండె నొప్పి అనిపించింది. వెంటనే కుటుంబీకులు చెన్నరాయపట్టణ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. బెంగళూరులో మెడికో మరోవైపు బెంగళూరులో మెడికల్ విద్యార్థి వైభవ్ కులకర్ణి (26) గుండెపోటుతో మృతిచెందారు. బాగల్‌కోటేలో వీవీఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేవాడు. స్నేహితులతో కలిసి తమిళనాడు టూర్‌కి వెళ్లి తిరిగి వస్తున్నాడు. బెంగళూరుకు రాగానే గుండెపోటు పట్టేయడంతో అతడిని ఓ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. పరిశోధిస్తాం: సీఎం హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాల గురించి మైసూరులో ఉన్న సీఎం సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడారు. దీనిపై పరిశీలన చేస్తున్నామని, కారణాలు ఏమిటి అనేది నిపుణుల ద్వారా తెలుసుకుంటామన్నారు. ఆరోగ్యశాఖ జయదేవ హృద్యోగ సంస్థకు చెందిన 10 మంది వైద్యనిపుణులతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయనుంది. హాసన్‌లో మరణాలు, కారణాలపై విచారణ జరుపుతారు. మరో నలుగురు ఆకస్మిక మృతి మృతుల్లో లెక్చరర్, ఉద్యోగి, జవాన్ -
తీర్థయాత్రలో ఎంత ఘోరం?
బాగేపల్లి: తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబాలు కొంతసేపటికే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు అక్కడే చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో కురబలకోట వద్ద చెన్నామర్రి మిట్ట అనేచోట హైవేలో సోమవారం ఉదయం జరిగింది. బాగేపల్లి తాలూకాలోని శ్రీనివాసపుర (సాకోళ్ళపల్లి ) గ్రామానికి చెందిన శ్రావణి (27), హోసహుడ్యకు చెందిన హెచ్.ఎస్.చరణ్ (17), బాగేపల్లి పట్టణవాసి మేఘర్శ (17) మృతులు. అంతా భీతావహం వివరాలు.. బాగేపల్లి పట్టణంలోని గంగమ్మగుడి రోడ్డుకు చెందిన రామచంద్రప్ప, హెచ్.టి.శివప్ప, నరసింహరెడ్డి కుటుంబాలకు చెందిన 13 మంది కలిసి టెంపో ట్రావెలర్‌లో తిరుమల యాత్రకువెళ్లారు. దర్శనాలయ్యాక బయల్దేరారు. ఘటనాస్థలంలో యమ శకటంలా వచ్చిన భారీ లారీ ఈ టెంపోను ఢీకొట్టింది. టెంపో పూర్తిగా ధ్వంసమైంది. లోపలున్నవారు విసిరేసినట్లు బయటకు పడిపోయారు. అందరికీ తీవ్ర రక్త గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడే మరణించారు. నరసింహారెడ్డి, భార్య హెచ్.ఎన్. రూప, కుమారుడు ఆదర్శ, రామచంద్రప్ప, భార్య కళావతి, పెద్ద కుమారుడు అశోక్, కోడలు శ్రావణి, చిన్న కుమారుడు దర్శన్, టైలర్ హెచ్.టి.శివప్ప, భార్య సునందమ్మ, కుమార్తె చైత్ర, టెంపో డ్రైవర్ మంజునాథ్‌లు గాయపడ్డారు. రక్తగాయాలు, ఆర్తనాదాలతో ఘటనాస్థలి భయంకరంగా కనిపించింది. స్థానికులు గాయపడినవారికి దొరికిన వాహనాలలో ఆస్పత్రులకు తరలించారు. కొందరిని బెంగళూరుకు తీసుకెళ్లారు. ఘటన గురించి తెలియగానే ఇక్కడి నుంచి బంధువులు వెళ్లారు. దేవుడా..ఎంతపని చేశావయ్యాకురబలకోట: దేవుడా నీ దర్శనానికి వచ్చామే, ఎంత పనిచేశావయ్యా అని గుండెలవిసే వేదనలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. కాళ్లు, చేతులు విరిగిన వారు, ఇలా వివిధ రకాలుగా గాయాల పాలైన వారిని చూసి గుండె తరుక్కుపోయింది. ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఢీకొన్న లారీ ఎక్కడ? టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ కేసు నమోదు చేశారు. టాప్‌తో సహా లేచిపోయింది టెంపో ట్రావెలర్‌కు జరిగిన ప్రమాదం చూస్తే భయాందోళన కలగడం ఖాయం. లారీ ఢీకొన్న ధాటికి టెంపో టాప్ ఎగిరిపోయింది. బాధితులు తీవ్ర గాయాలతో అంగలార్చడం చూపరులను చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. స్థానికులు సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఇద్దరూ క్షేమం టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32), ఇతని వెనుక సీట్లో ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమలలో గుండు చేయించుకున్నాడు. ఈ యాక్సిడెంట్లో వీరిద్దరే క్షేమంగా బయటపడడం విశేషం. డ్రైవర్ మంజునాఽథ తీవ్ర గాయాలతో కోమాలో ఉన్నాడు. దర్శనం తరువాత బయల్దేరాం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నాం. కొంత సేపు విశ్రాంతి తీసుకుని సోమవారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో బయలు దేరాం. కురబలకోట మండలంలోని చెన్నామర్రి వద్ద వస్తుండగా ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. – ఓ క్షతగాత్రుడు బాగేపల్లి భక్తుల టెంపోను లారీ ఢీ ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన -
ఆలయం ఆరంభం
మాలూరు: తాలూకాలోని అంచెముస్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ దేవి దేవాలయంలో అమ్మవారి ప్రతిష్టాపన, మహా కుంభాభిషేకం పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్రామంలో భక్తులు, ప్రజల సహకారంతో శ్రీ గంగమ్మ దేవి దేవాలయాన్ని నూతనంగా నిర్మించారు. వేదమంత్ర పారాయణం, కళశ స్థాపన, మహా కుంభాభిషేకం తదితరాలను నెరవేర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనాలు చేసుకున్నారు. ఘరానా రైలు దొంగ అరెస్టు మైసూరు: రైలులో దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర దొంగను మైసూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన జితేంద్రకుమార్ చమ్లా (37) అరెస్టయిన నిందితుడు. ఇతని నుంచి రూ. 22.75 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకొన్నారు. రైళ్లలో 17 చోరీల కేసులు పరిష్కారమయ్యాయి. మంగళూరు, అరసికరే రైల్వేపోలీస్ స్టేషన్లలో 4 కేసులు ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక లో రైళ్లలో ప్రయాణిస్తూ డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లాడని కేసులున్నాయి. పలుసార్లు అరెస్టయి విడుదలైనా మళ్లీ దొంగతనాలే చేసేవాడు. రైల్వే ఎస్పీ శ్యామలత ఆధ్వర్యంలో గాలింపు జరిపి పట్టుకున్నారు. యథేచ్ఛగా జింకల వేట బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలో ఆనేకల్ తాలుకాలో ఉన్న బన్నేరుఘట్ట అభయారణ్యంలో జింకలను, అడవి పందులను వేటాడి మాంసాన్ని, కొమ్ములను అమ్ముతున్న ముఠాని అటవీ అధికారులు గుర్తించారు. 74 కేజీల మాంసాన్ని సీజ్ చేశారు. నైస్ రోడ్డు జంక్షన్ వద్ద ఓ కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. కారు డ్రైవర్ ప్రతాప్ (31)ని అరెస్టు చేసి ప్రశ్నించి సీకే పాళ్యలో ఉన్న ఒక షెడ్లో గాలించగా మరింత మాంసం, చర్మాలు లభించాయి. ఒక సింగిల్ బ్యారెల్, డబుల్ బ్యారెల్ తుపాకీలు, పదితూటాలు, రెండు కార్లు, ఒక బైక్, తూకం యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలరాజు, షెడ్ యజమాని భీమప్ప, రమేష్, ఫిలిప్లపై కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నారు. అభయారణ్యంలో చుక్కల జింకలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని వేటాడి మాంసాన్ని అమ్మేవారని తెలిపారు. సహజీవనంలో హత్య ● అసోంవాసి అరెస్టు బనశంకరి: బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు స్కేటింగ్ గ్రౌండ్ వద్ద బీబీఎంపీ చెత్త లారీలో లభించిన మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమైంది. సహజీవనంలో ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. అసోంకు చెందిన షంషుద్దీన్ (33) అనే వలస కూలీని అరెస్ట్ చేశారు. వివరాలు.. ఇద్దరు పిల్లల తల్లి అయిన పుష్ప అలియాస్ ఆశ (40) హత్యకు గురైన మహిళ. భార్య పిల్లలను అసోంలోనే వదలిపెట్టిన నిందితుడు హుళిమావు వద్ద ఓ హౌస్ కీపింగ్ సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే స్థానికురాలు వితంతువు పుష్పా పనిచేస్తూ ఇద్దరి మధ్య పరిచయమై ఏడాదిన్నర నుంచి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. పుష్ప ఫోన్లో ఎక్కువగా మాట్లాడడంతో అనుమానంతో షంషుద్దీన్ వేధిస్తున్నాడు. జూన్ 28వ తేదీ రాత్రి గొడవ జరిగి, నిందితుడు కత్తితో దాడి చేసి, ఆపై గొంతు పిసికి పుష్పని హత్య చేశాడు. మృతదేహాన్ని మూటగట్టి బైకులో పెట్టుకుని హుళిమావు నుంచి వచ్చి చెత్త లారీలో పడేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం చెత్త లారీలో మృతదేహం కనిపించడంతో స్థానికులు భయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి హంతుకుని కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. -
నందికొండపై కేబినెట్‌కు ఏర్పాట్లు
చిక్కబళ్లాపురం: ఇక్కడి ప్రఖ్యాత నంది హిల్స్ మీద 2వ తేదీన సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. కొండ మీదకు మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ సీఈఓ నవీన్భట్ సోమవారం నందిగిరిని పరిశీలించారు. ఏర్పాట్లను వీక్షించారు ఆయన మాట్లాడుతూ సమావేశానికి ముందు నంది ఆలయాన్ని సందర్శిస్తారు. కొండపైకి వెళ్లే మార్గంలో సూచనా ఫలకాలను అమరుస్తాం, ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తరువాత కుప్పహళ్లి గ్రామ పంచాయతీని ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రిమండలి భేటీతో చిక్కతో పాటు నందిహిల్స్ పరిసరాలలో కోలాహలం నెలకొంది. పర్యాటకుల రాకను నిషేధించారు.ఘరానా ఓఎల్ఎక్స్ మోసగానికి సంకెళ్లు యశవంతపుర: ఓఎల్ఎక్స్లో కారు అమ్ముతున్నట్లు ప్రకటన ఇచ్చి డబ్బులు తీసుకుని ఉడాయించే మోసగాన్ని దక్షిణకన్నడ జిల్లా మంగళూరు సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన రవిచంద్ర మంజునాథ్ రేవణకర (29)ని అరెస్ట్ చేశారు. రూ.2.5 లక్షలకు కారు అమ్ముతున్నట్లు ఓఎల్ఎక్స్ యాప్‌లో ఇతడు ప్రకటన ఇచ్చాడు. ఓ వ్యక్తికి ఈ డీల్ నచ్చి సంప్రదించాడు, డబ్బులు పంపగానే కారును డెలివరీ చేస్తానని మోసగాడు చెప్పాడు. సరేనని బాధితుడు డబ్బులు బదిలీ చేశాక వంచకుడు స్పందించలేదు. బాధితుడు మంగళూరు సైబర్‌ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలించి నిందితుడు హొసపేటలో ఉండగా వెళ్లి అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించారు. నిందితునికి 21 బ్యాంక్ ఖాతాలున్నాయి. 8 సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నాడు. ఇతని మీద 80 కి పైగా సైబర్ వంచన కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. మూడేళ్ల నుంచి కార్ల ఫోటోలను ఓఎల్ఎక్స్లో పెట్టి మోసాలకు పాల్పడడమే వృత్తిగా చేసుకున్నాడని బయట పడింది. తోటలోకి ఆవు వచ్చిందని.. శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని హోసనగర తాలూకాలోని విజాపుర గ్రామంలో ఆవు పొదుగును కత్తిరించిన కేసులో రామచంద్ర అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవీన్శెట్టి అనే వ్యక్తి ఆవును జూన్ 28వ తేదీన మేతకు వదిలాడు. అప్పుడు ఒక పొదుగును ఎవరో కత్తిరించారు. హోసనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగింది. నిందితుడు రామచంద్ర చాకుతో పొదుగును కోయడంతో పాటు కట్టెతో ఆవును చావబాదినట్లు ఒప్పుకున్నాడు. తన తోటలోకి వచ్చి మేసిందనే కోపంతో దాడి చేశానన్నాడు. పేలిన బస్సు టైరు, 10 మందికి గాయాలు మైసూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు టైరు పేలి పది మందికి పైగా ప్రయాణికులు గాయపడిన సంఘటన సోమవారం నంజనగూడు తాలూకాలోని హెడియాల దగ్గర జరిగింది. బేగూరు నుంచి హెడియాల మీదుగా సరగూరుకు వెళ్తున్న బస్సు టైరు పేలిపోయింది. ఆ తాకిడికి బస్సులోని వారికి గాయాలయ్యాయి. హెడియాల మాజీ జీపీ సభ్యుడు నేమతుల్లాఖాన్, అతని స్నేహితులు గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తీసుకెళ్లారు. హెడియాల సరిహద్దుల్లో తరచూ ఆర్టీసీ బస్సులు చెడిపోతున్నాయి. ఉచిత బస్సు కావడంతో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. రద్దీకి తగినట్లు బస్సులు నడపడం లేదు. పైగా పాత డొక్కు బస్సులు తిప్పుతున్నారని ప్రజలు ఆరోపించారు. కొత్త బస్సులను వేయాలని కోరారు. -
ఆ వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ?.. సీఎం మార్పు ఖాయమేనా?
బెంగళూరులో తొక్కిసలాట ఘటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందా?, కర్ణాటకలో సీఎంను మార్చాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా చర్చిస్తున్న అంశం. మరొకవైపు తొక్కిసలాట ఘటన పేరుతో డీకే శివకుమార్‌ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందా? అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ హైకమాండ్ నుంచి ఎటువంటి ప్రకటనా నేరుగా రాకపోయినప్పటికీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటకలో సీఎంను మార్చబోతున్నారా? అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే డైరెక్ట్‌గా ఏమీ చెప్పలేకపోయారు. ఆయన నో అనే అవకాశం ఉన్నా కూడా ‘ అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ హైకమాండ్ అంటే తానే అనే విషయం మరిచిపోయి ఖర్గే ఇలా వ్యాఖ్యానించినప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదో జరుగబోతుందనే సంకేతాలిచ్చారు ఖర్గే. మీడియా అడిగిన దానికి.. ‘ఇప్పుడు కర్ణాటకలో సీఎంను మార్చాల్సిన అవసరం ఏమిటి?’ అని చెప్పకుండా, అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది అనడం త్వరలో ఏదో జరగబోతుందనే దాన్ని బలపరిచింది.డీకే శివకుమార్‌కు చాన్స్..? అక్కడ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పిస్తే, ఆ తర్వాత రేసులో ఉన్నది డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌కే అవకాశం దక్కుతుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డీకే శివకుమార్ సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే సీఎంను చేసింది. కర్ణాటకలో ఎటువంటి మార్పులు లేకుండా సీనియర్ అయిన సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య కాస్త దూరం పెరిగిందనేది జనాల్లో వినిపిస్తున్న మాట. అయితే సిద్ధరామయ్య కోసం తన చివరి శ్వాస వరకూ నిలబడతా అనే వ్యాఖ్య కూడా డీకే శివకుమార్ ఒకానొక సందర్భంలో చేసి తమ మధ్య ఏమీ విభేదాల్లేవని సంకేతాలిచ్చారు. ఈ ఏడాది శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే డీకే శివకుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా తాను చివరి శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని తేల్చి చెప్పారు.మరింత పటిష్టం చేసే దిశగా పావులు..!కర్ణాటకలో కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేసి.. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు అప్పజెప్పాలని గత కొద్దికాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఆలోచన చేసే దిశగా ముందుగా సాగుతున్నట్లు ఖర్గే వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. -
దైవ దర్శనానికి వచ్చి పరలోకానికి
● పుష్కరిణిలో పడి బాలుడు మృతి శ్రీనివాసపురం: దైవ దర్శనానికి వచ్చిన కుటుంబంలో విషాదం పొంగిపొర్లింది. పుష్కరిణిలో మునిగి బాలుడు మరణించిన ఘటన ముళబాగిలు కురుడుమలై గ్రామంలో చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా కాలఘట్ట గ్రామానికి చెందిన కుశాల్ (9) మృతుడు. తండ్రి మంజునాథ్, కుమారుడు కుశాల్, కుటుంబంతో కలిసి ఆదివారం కురుడుమలై గ్రామంలోని పురాణ ప్రసిద్ధ వినాయక దేవాలయానికి దర్శనం కోసం వచ్చారు. అక్కడ ఆటలాడుకుంటూ పుష్కరిణి వద్దకు వెళ్లిన బాలుడు జారి నీటిలోకి పడిపోయాడు. కొంతసేపు ఎవరూ గమనించలేదు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. చివరికి పుష్కరిణిలో బాలుని శవం కనిపించింది. కుమారుడి మరణంతో దంపతులు ఇద్దరు కన్నీరు పర్యంతమయ్యారు. ముళబాగిలు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. వరదలు ఉధృతం
రాయచూరు రూరల్: మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు కర్ణాటకలోకి పోటెత్తుతోంది. వేదగంగా, పంచగంగా, దూద్ గంగా, హిరణ్య కేశి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, భాగల్ కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాద గిరి, రాయచూరు జిల్లాలు వరద ప్రభావానికి గురవుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. బెళగావి జిల్లాబెణ్ణే తుప్రి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. 14 వంతెనలు నీటమునిగాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలమట్టి జలాశయానికి లక్షా35వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ నారాయణ పుర డ్యాంకు విడుదల చేస్తున్నారు.నారాయణపుర డ్యాం 30 గేట్లను ఎత్తి లక్షా10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలు నది తీరాలకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు వరద నీటి ప్రవాహంతో పలు గ్రామాలకు ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లింగసూగురు తాలూకాలోని మాదరదొడ్డి, కడదరగడ్డ, ఓంకార గడ్డి, యరగూడి, హంచినాళ, మల్లమ్మ గడ్డ, జలదుర్గ, రాయచూరు తాలూకా అత్కూరు, కురువకుర్ద, కురవకుల, దొంగ రాంపూర. కాడ్లూరు, గురాజపూర్, గంజల్లి, దేవదుర్గ తాలూకా వీరగోట, ముదగోట, లింగదహల్లి, చిచోడి, బాగురు, అంచేసూగురు, గోపాల పుర, కర్క హల్లి, హేరుండి, అప్రాళ, బసవంతపుర, చిక్కరాయకుంపి, హిరే రాయకుంపి, గూగల్ తదితర ప్రాంతాలు జలావృతం అయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. వరద నీటిలో చిక్కుకుపోయిన కాపరులు కరకల గుడ్డకు చెందిన గొర్రెల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారు ఉన్న ప్రాంతాన్ని వరదనీరు చుట్టుముట్టింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు బాధితులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలివెళ్లాయి. -
సాహిత్య సమ్మేళన అధ్యక్షురాలిగా బాను ముస్తాక్
బళ్లారిఅర్బన్: డిసెంబర్లో బళ్లారిలో జరగనున్న 88వ అఖిల భాతర సాహిత్య సమ్మేళనం అధ్యక్షురాలిగా బుకర్ ప్రైజ్ గెలుచుకున్న హార్ట్ ల్యాంప్ రచయిత, హాసన్‌కు చెందిన బాను ముస్తాక్ ఎంపికయ్యారు. కసాప రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ జోషి ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారిగా కన్నడ రచయిత్రి బుకర్ ప్రైజ్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా కన్నడ కస్తూరి పరిమాళలను ప్రసరింపజేశారన్నారు. దీంతో ఆమెను సమేళ్మన అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం సమంజసమని కమిటీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ఇతర మంత్రుల సహకారంతో సమ్మేళనాన్ని వైభవోతంగా జరపడానికి కసాప ఇప్పటినుంచే ప్రక్రియ మొదలు బెట్టిందన్నారు. సమావేశంలో కసాప జిల్లాధ్యక్షుడు నిష్ట రుద్రప్ప, గౌరవ కార్యదర్శి డాక్టర్.హెచ్ఎల్ మల్లేశ్ గౌడ, తదితరులు పాల్గొన్నారు. -
అపురూపం మరడిహళ్లి రంగప్పన పర్వతం
సాక్షి,బళ్లారి: కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన లావారసం గుట్టలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వీటిని చూడాలంటే చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా మరడిహళ్లి గ్రామానికి వెళ్లాల్సిందే. భూ గర్భం నుంచి ఎగసిన లావారసం ఉప్పునీటితో కలవడంతో ర్యాపిడ్ బెల్ట్ గణీకృతమై పిల్లోలావాగా ఏర్పడుతుంది. ఆలివన్, పైరాక్సిన్, హంపిబోల్, బయోటైల్, ఐరన్,క్యాల్షియం, శిలికాన్ ఖజజాల మిశ్రమ సమ్మేళనమే పిల్లోలావా. మరడిహళ్లిలో ఉన్న ఇలాంటి గుట్టను భారతీయ పురాతత్వ శాఖ 1976లో గుర్తించి జాతీయ భూవిజ్ఞాన స్మారకాలుగా ప్రకటించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే వీటిని పర్యవేక్షిస్తున్నారు. మరడి అంటే మట్టి దిబ్బా అని, దిబ్బ అంచున వెలసిన ఊరే మరడిహళ్లి. దిండు ఆకారంలో ఉన్న ఈ గుట్టను రంగప్పన పర్వతంగా స్థానికులు పిలుస్తారు. భూమి పుట్టి 460 కోట్ల సంవత్సరాలు కాగా మరిడిహళ్లి పిల్లోలావాకు 260 కోట్ల సంవత్సరాల వయస్సు ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పిల్లోలావాను తొలిసారిగా గనులు భూవిజ్ఞానశాఖ డైరెక్టర్ పీఎస్ పిచ్చముత్తు గుర్తించినట్లు ఆ సంస్థ చిత్రదుర్గం సీనియర్ భూశాస్త్ర తెలిపారు. ముట్టుకుంటే పత్తిని తాకినట్లు అనుభూతి మరిడిహళ్లి గుట్టలు, రాళ్లు అడవిగా కనిపిస్తోంది. బంతి ఆకారంలో సైజు రాళ్లను, బండరాళ్లను చూడవచ్చు. ప్రతిరాయి కూడా లావా నుంచి ఏర్పడిందే. ముట్టుకుని చూస్తే పత్తిని స్పర్శించినట్లుగా భావన కలుగుతుంది. గ్రామీణ ప్రజలు ఒకటిపై ఒకటి పెట్టి గుడిని కట్టారు. పై కప్పుపై శంఖము, చక్రము, గదా చిత్రాలు లిఖించి రంగనాథ స్వామిగా నామకరణం చేశారు. శ్రీరంగ పట్టణం కరిగట్టలోను లావా చిహ్నలు ఉన్నాయి. మైసూరులోని జ్వాలాముఖి త్రిపురసుందరి దేవిని జ్వాలాముఖి అమ్మగా పూజిస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. మరడిహళ్లిలోని లావా గుట్టలు ఏర్పడి కోట్లాది సంవత్సరాలు గడిచినా వాటి రూపంలో ఇసుమంతైనా మార్పులేదు. వానలు, గాలులు, ఉష్ణోగ్రత్తలు తాకిడి ప్రభావంతో ఎటుమంటి మార్పు చెందలేదు. 50కి పైగా జాతీయ భూవిజ్ఞాన స్మారకాలు ఉన్న మరిడిహళ్లి పిల్లోలావాను అత్యంత ప్రాచీనమైనదిగా చెబుతున్నారు. కోట్ల సంవత్సరాలు గడిచినా రూపంలో మార్పు లేదు లావారసం ప్రవాహాలను నాలుగు విధాలుగా విభజించారు. మొదటి మూడు లావా రసభూమి పై అంచులో కనిపించగా, పిల్లోలావా సముద్రపు అడుగు భాగంలో సంభవించే జ్వాలాముఖి రూపాన్ని సంతరించుకుంటాయి. నిప్పు, నీటీ మధ్య ఘర్షణలో ఏర్పడిన ఘనరూప వస్తువే పిల్లోలావాగా పరివర్తన చెందిందిగా శాష్త్రవేత్తలు చెబుతున్నారు. చల్లటి నీటితో తీవ్రమైన ఉష్ణాంశాలతో లావారరసం కలిసినప్పుడు ఒత్తిళ్లుకు గరై సుడులు, సుడులుగా రూపాన్ని ఏర్పరుడుంది. ఒకదానిపై ఒకటి తలదిండులు పేర్చినట్లుగా గట్టిపడుతుంది. ఈ కారణంగా దీన్ని దిండు ఆకృతి లావా అని అంటారు. కోట్లాది సంవత్సరాల క్రితం ఏర్పడిన పిల్లోలావా(దిండు) పర్వతాలు ప్రపంచస్థాయిలో ఘనత వహించిన మరడిహళ్లి పిల్లోలావా -
జల సవ్వడి.. జన సందడి
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు జీవనాడి అయినా తుంగభద్ర జలాశయం ఆదివారం పర్యాటకుల సందడితో కళకళలాడింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యాం నిండు కుండల తొణికిస లాడుతోంది. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి డ్యాం అందాలను వీక్షించారు. డ్యాంలో ఎగసి పడుతున్న అలలను, ఆస్వాదించారు. బళ్లారి, కొప్పళ రాయచూరు, చిత్రదుర్గ గదగ్తో పాటు తదితర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. -
పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం
రాయచూరు రూరల్ : పాత్రికేయులు సమాజానికి అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత అన్నారు. ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల భారత పాత్రికేయుల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పాత్రికేయుల తరహాలో సమాజానికి సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. పాత్రికేయులు నిష్పక్షపాతంగా కథనాలు రాయాలన్నారు. అనంతరం ఉత్తమ పాత్రికేయులకు అవార్డులు అందించారు. రామచంద్ర ప్రభు, చంద్రు, విజయ జాటగల్, వెంకట సింగ్, దండెప్ప బిరదార్ పాల్గొన్నారు. ఎయిమ్స్ మంజూరుకు కమిటీ ఎందుకు? రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ మంజూరు కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర అహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి పేర్కొనడాన్ని బీఎస్పీ అధ్యక్షుడు జైబీమ్ తప్పు బట్టారు. అదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క రాయచూరు విషయంలోనే ఈ నిబంధన పెడుతున్నారన్నారు. ఏపీలోని మంగళగిరి, తెలంగాణ, బీబీనగర్, జమ్మూలో ఎయిమ్స్ ఏర్పాటుకు కమిటీలు ఏర్పాటు చేశారా? అని జైబీమ్ ప్రశ్నించారు. ఆ ప్రాంతాలకు లేని మార్గదర్శకాలు రాయచూరులో ఎయిమ్స్ మంజూరు విషయంలో ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తోందని ప్రశ్నించారు. గూడ్సుషెడ్ తరలింపునకు శ్రీకారంరాయచూరు రూరల్: నగరంలోని రైల్వే గూడ్స్ షెడ్‌ను యరమరాస్కు తరలించేందుకు కేంద్ర దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు శ్రీకారం చుట్టారని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు బాబారావ్ తెలిపారు. నగరంలో 60 ఏళ్లుగా ఉన్న రైల్వే గూడ్స్షెడ్తో ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో నగరానికి 8 కి.మీ.దూరంలోని యరమరాస్కు తరలించడానికి చర్యలు తీసుకున్నారన్నారు. బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించిన ఎంపీ హొసపేటె: నగరంలో ఏర్పాటు చేసిన వై.ఉమామహేశ్వర రావు రోటరీ బ్లడ్ బ్యాంక్ సెంటర్‌ను ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే గవియప్ప ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా రోటరీ క్లబ్ హోస్పేట్లో ఆరోగ్యం, విద్య, ఇతర సామాజిక సేవలు అందిస్తోందన్నారు. రోటరీ సంస్థ నేతలు తదితరులు పాల్గొన్నారు. చెస్ పోటీలు మెదడుకు పదును బళ్లారిఅర్బన్: ప్రతిభ పాఠవాల వెలికి తీతకు చెస్ పోటీలు దోహద పడుతాయని ట్‌రెడ్డి పేపర్ యజమాని సునిల్ గుండే విద్యార్థులకు సూచించారు. నగరంలోని గాంధీననగర్ వాటర్బూస్టర్ వద్ద ట్రెండి పేపర్ కాంప్లెక్స్లోబళ్లారి చెస్ అకాడమి ఆధ్వర్యంలో అండర్–15 బాలుర విభాగంలో ఆదివారం ఏర్పాటు చేసిన చెస్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాగా బళ్లారి, హోస్పేట్, బెంగళూరు, బీదర్, ఉడుపి, కుందాపుర, హైదారాబాద్, అనంతపురం, గుంతకల్లు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అకాడమి కోచ్ ఎస్ఎండీ రఫిక్, బసవేశ్వర డాక్టర్ భరత్, బళ్లారి చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డీహెచ్ఎం విరుపాక్షయ్య, నాగరాజు, రాఘవేంద్ర, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏటీఎంలో నకిలీ నోట్ల డిపాజిట్ ●
● పదిమంది నిందితుల అరెస్ట్ రాయచూరురూరల్: ఏటీయంలోకి నకిలీ నోట్లును డిపాజిట్ చేస్తున్న పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచూరు జిల్లా మాన్విలోని ఏటీఎంలోకి ఆదివారం పదిమంది వ్యక్తులు వెళ్లారు. రూ.18 వేల నకిలీ నోట్లు డిపాజిట్ చేసేందుకు యత్నించారు. రూ.500 విలువైన 36 నోట్లు యంత్రంలో ఇరుక్కుపోయాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించగా నకిలీ నోట్లుగా తేలింది. దీంతో రాయచూరుకు చెందిన విరుపాక్షి, శేఖర్, ఖాజా హుసేన్, కొప్పళ బీమేష్తో పాటు మరో అరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెలలో శేఖర్ నుంచి విరుపాక్షి ఖాతాకు రూ.20, 500 నకీలి నోట్లను డిపాజిట్ చేశారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి రాయచూరు రూరల్: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యంకణ్ణపై చర్యలు చేపట్టాలని కర్ణాటక నాయక్ ఓక్కూట వేదిక అధ్యక్షుడు రవి కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. అదివారం పా త్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన విద్యా పథకం జారీ కావడంతో కన్నడ భాషతో పాటు అంగ్లం, హిందీ, ఉర్దు భాషలను తప్పకుండా నేర్చుకోవాలని ఒత్తిడి తేవడాన్ని తప్పు బట్టారు. కళాశాల, విశ్వ విద్యాలయాల నియమాలను ప్రిన్సిపాల్ ఉల్లఘింసున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అశ్లీల ఫొటోలు పంపి వేధింపులు హుబ్లీ: పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు మహిళా అధ్యాపకురాలు ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శశి అనే యువకుడికి అధ్యాపకురాలితో గతంలో పరిచయం ఉంది. ఆ సమయంలో అధ్యాపకురాలి ఫొటో సేకరించాడు. అనంతరం ఆమెకు అశ్లీల వీడియోలను వాట్సాప్‌నకు పంపించి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. లేని పక్షంలో వీడియోలు, ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిలేడీల చేతివాటం హుబ్లీ: బుర్కా ధరించి వచ్చిన కిలేడీలు చేతివాటం ప్రదర్శించారు. కొప్పళ జిల్లా కారటగి పట్టణంలోని వీఏ బజార్‌కు ఈ నెల 18న ఇద్దరు మహిళలు బుర్కాలు ధరించి వచ్చి చోరీలకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. మొహర్రంను శాంతియుతంగా ఆచరించండి రాయచూరురూరల్: మోహర్రంను శాంతియుతంగా నిర్వహించుకోవాలని అడిషనల్ ఎస్పీ హరీష్ సూచించారు. ఆదివారం సదర్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మోహర్రం వేడుకులు జూలై 6 వరకు జ రుగుతాయన్నారు. హిందూ ముస్లింలు సోదరభావంతో మెలుగుతూ పండుగను ఆచరించాలన్నారు. సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, యస్ఐలు మంజునాథ్, మహ్మద్ ఇసాఖ్, బసవరాజ్ నాయక్, లక్ష్మి సన్న వీరే్ష్ నాయక్ పాల్గొన్నారు. -
దేశంలో ఎమర్జెన్సీకి మించి దారుణ పరిస్థితులు
హుబ్లీ: ఎమర్జెన్సీకిమించి దేశంలో దారుణ పరిస్థితులతో కూడిన వాతావరణం ఉందని, ఈ విషయం గురించి బీజేపీ నేతలు చర్చిస్తే మంచిదని జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్‌లాడ్ సూచించారు. ధార్వాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పహల్గాం, పూల్వామ దాడుల విషయాలను ప్రజలు మరచిపోయేలా 50 ఏళ్లనాటి ఎమర్జెన్సీ విషయాన్ని బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. ఎమర్జెన్సీ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ సారి మైసూర్ దసరా వేడుకలను కొత్త సీఎం ప్రారంభిస్తారన్న ఆర్ అశోక్ వ్యాఖ్యలపై సంతోష్‌లాడ్ మాట్లాడుతూ ఎవరు సీఎం అవుతారనేది ఆయన్నే అడగాలని పాత్రికేయులకు సూచించారు. -
బస్టాండ్‌ను స్వచ్ఛంగా ఉంచండి: కలెక్టర్
హొసపేటె: జిల్లా కలెక్టర్ ఎంఎస్ దివాకర్ నగరంలోని కేంద్ర బస్టాండ్‌ను ఆదివారం తనిఖీ చేశారు. బస్టాండ్‌లో ఉన్న అపరిశుభ్రతను చూసి అధికారులపై మండిపడ్డారు. బస్టాండ్‌ను స్వచ్ఛంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత ప్లాట్‌ఫారంపై ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి తినుబండారాలు, వాటర్ బాటళ్ల గడువు తేదీని తనిఖీ చేశారు. అనంతరం వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు.ప్రయాణికులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ఆదేశించారు. బాత్రూమ్కు వెళ్లాలంటే రూ.10 వసూలు చేస్తున్నట్లు మహిళా ప్రయాణికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. కేవలం రూ. 3 మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులకు అన్ని విధాలా మౌలిక సౌకర్యాలను కల్పించాలని సూచించారు. హుడా అధ్యక్షుడు ఇమామ్ నియాజీ, అధికారులు రాజశేఖర్ వాజంత్రి, వార్త సమాచార అధికారి ధనుంజయ పాల్గొన్నారు. -
భార్యతో స్నేహితుడి అక్రమ సంబంధం
● నరికి చంపిన భర్త సాక్షి బళ్లారి/ హొసపేటె: స్నేహం ముసుగులో భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని కొడవలితో నరికి చంపిన భర్త ఉదంతం గంగావతిలో జరిగింది. గంగావతి తాలూకా విఠలాపురానికి చెందిన నాగరాజ్(28), హనుమంతప్ప చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఏడేళ్ల క్రితం హనుమంతప్పకు వివాహమైంది. నాగరాజు అప్పుడప్పుడు వస్తూపోతూ హనుమంతప్ప భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం పసిగట్టిన హనుమంతప్ప స్నేహితుడితో గొడవ పడి, పంచాయతీ చేసి పోలీసు స్టేషన్ కూడా వెళ్లాడు. స్నేహితుడిలో మార్పు రాక పోవడంతో శనివారం సాయంత్రం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని రైస్ మిల్లు వద్దకు నాగరాజును పిలిపించాడు. అనంతరం అతన్ని కొడవలితో నరికి, తలపై బండరాయి వేసి హత్య చేశాడు. అనంతరం కనకగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన విఠలాపురంలో కలకలం రేపింది. -
లారీ ఢీకొని ఎస్ఐ దుర్మరణం
దొడ్డబళ్లాపురం: గంజాయి కేసులో నిందితులను అరెస్టు చేసి తీసుకువస్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు తలఘట్టపుర పోలీస్‌స్టేషన్ ఎస్సై మెహబూబ్ కన్నుమూశారు. శనివారం రాత్రి గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అత్తిబెలెలో అరెస్టు చేసి కారులో తీసుకువస్తుండగా సూర్యసిటీ వద్ద కారు టైర్ పంచర్ అయ్యింది. రోడ్డుపక్కన కారు ఆపి డ్రైవర్ టైర్ మారుస్తుండగా ఎస్సై మెహబూబ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన లారీ మెహబూబ్‌పై దూసుకెళ్లింది. ఈ గందరగోళంలో గంజాయి నిందితులు పరారయ్యారు. గాయపడ్డ ఎస్సైని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే మెహబూబ్ చికిత్స ఫలించక ఆదివారంనాడు మరణించారు. అస్పృశ్యత వివాదం దొడ్డబళ్లాపురం: కొన్ని గ్రామాలలో ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతోంది. దళితులకు క్షవరం చేయడానికి నిరాకరించిన క్షురకునిపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా కిణిసుల్తాన గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో ఒకే ఒక క్షౌ రశాల ఉంది. దళితులకు కటింగ్ చేయనని క్షురకుడు తెగేసి చెప్పిన వీడియో ప్రచారమైంది. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆళంద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అధికారులు, పోలీసులు నిందితున్ని పిలిపించి చట్టంపై అవగాహన కల్పించారు. ఇక నుంచి దళితులకు కటింగ్ చేస్తానని అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది. మోదీ నోట, రొట్టెల మాటశివాజీనగర: కలబుర్గి గట్టి జొన్న రొట్టెల గురించి తెలియనివారుండరు. జొన్న రొట్టెలు రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా పేరుపొందాయన్నది తెలిసిందే. ఇక్కడ తయారయ్యే రొట్టెలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఎంతోమంది మహిళలు రొట్టెలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వారి కృషిని ప్రధాని మోదీ మెచ్చుకొన్నారు. ఆదివారం సాగిన మన్‌కీ బాత్‌లో మహిళా స్వావలంబన భారతదేశ అభివృద్ధికి కొత్త మంత్రమైంది. కలబుర్గి మహిళలు జొన్న రొట్టెల తయారీ ద్వారా ఆత్మనిర్భరతకు బ్రాండ్‌గా నిలిచారు అని ప్రశంసించారు. స్వసహాయ సంఘాల ద్వారా ప్రతిరోజు 3 వేల రొట్టెలు తయారు చేస్తున్నారు. ఈ రొట్టెలు గ్రామాలకే కాకుండా నగరాల్లో, ఆన్లైన్లో విక్రయిస్తున్నారు అని కొనియాడారు. జలపాతం నుంచి పడి టూరిస్టు మృతి దొడ్డబళ్లాపురం: బెళగావి– మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంబోలి జలపాతం వద్ద విషాదం జరిగింది. 300 అడుగుల ఎత్తు నుండి కిందపడి పర్యాటకుడు మరణించాడు. కొల్హాపుర నివాసి బాలసో సాగర్ (45) మృతుడు. ఆదివాంనాడు అంబోలి ఫాల్స్ చూడడానికి స్నేహితులతో వచ్చాడు. ఫాల్స్‌ను దగ్గరగా చూస్తుండగా జారి 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలై అక్కడే మరణించాడు. పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాన్ని పైకి తీసుకువచ్చారు. రన్యకు జైల్లో వేధింపులు బనశంకరి: బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు చేరిన నటి రన్య రావు ఇబ్బందుల్లో ఉంది. జైలు భోజనం ఆమెకు సరిపడలేదు. ఆ వాతావరణం, అక్కడ సిబ్బంది ప్రవర్తనతో సమస్యలు ఎదుర్కొంటోంది. మహిళా ఖైదీలు తనను వేధిస్తున్నట్లు, బంగారు దొంగ అని సతాయిస్తున్నట్లు బంధువులకు తెలిపింది. ఇది తట్టుకోలేని ఆమె మరో బ్యారక్‌లోకి మార్చాలని జైలు అధికారులను కోరింది. అందుకు వారు అంగీకరించారని, త్వరలోనే మార్చవచ్చని సమాచారం. వెల్డింగ్ కార్మికుడు దుర్మరణం మైసూరు: నగరంలోని బివిఎల్ లేఔట్లో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడు చనిపోయాడు. మైసూరు అజీజ్ నగర నివాసి సుహేల్ (25)గా గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి సుహేల్ మరణించాడు భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని మృతుని భార్య ఫిర్యాదు చేసింది. భవన యజమాని ప్రదీప్, ఇంజనీర్ అనిల్‌పై ఆలనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాస్మొటిక్స్‌లో హాని కారకాలు?
బనశంకరి: నేటి రోజుల్లో కాస్మొటిక్స్ అనబడే సౌందర్య ఉత్పత్తులు జీవితంలో ఓ భాగమయ్యాయి. పేద, ధనిక, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ స్థాయికొద్దీ వాటిని వాడుతున్నారు. అందంగా కనిపించాలనే ఆరాటమే కారణం. కానీ కాస్మొటిక్స్ ఆరోగ్యానికి హానికరమే అభిప్రాయాలున్నాయి. స్టెరాయిడ్స్‌ను కలిపిన క్రీమ్స్, ఉత్పత్తులను వాడటం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిపై రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ నిఘాపెట్టింది. మగువలు నిత్యం వాడే క్రీమ్స్, లిప్‌స్టిక్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. సౌందర్య ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్‌లలో పరీక్షించాలని నిర్ణయించారు. ముఖం అందంకోసం వాడే ఫోలిక్ యాసిడ్, స్టెరాయిడ్ బేస్క్రీమ్, విటమిన్ డీ, సి కలిగిన క్రీమ్‌లు, సీరమ్‌లలో నాణ్యత లోపించిందని ఆ సంస్థ తనిఖీలలో రుజువైంది. అనేకమంది ప్రజలు ముఖం కాంతిని పెంచుకోవడానికి ఈ మూలకాలు కలిపిన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని కంపెనీలు నాసిరకం మూలకాలను కలిపి తయారు చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను చేపట్టింది. ఈ సంస్థ గతంలో అనేక బొంబై మిఠాయి, పానీ పూరి, పన్నీర్, స్వీట్లు వంటి ఆహార ఉత్పత్తులను తనిఖీ చేసి క్యాన్సర్ రోగ కారకాలు వాడుతున్నారని హెచ్చరించడం తెలిసిందే. ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు -
చెత్త లారీలో మహిళ శవం
శివాజీనగర: బెంగళూరులో ఓ మహిళ హత్యకు గురైంది. మహిళను హత్యచేసిన దుండగులు శవాన్ని మూటకట్టి చెత్త లారీలో ఉంచి పరారయ్యారు. చెన్నమ్మకెర అచ్చుకట్ట ప్రాంతంలో ఓ స్కేటింగ్ మైదానం వద్ద లారీలో శవాన్ని పడేశారు. శనివారం అర్ధరాత్రి ఆటోలో వచ్చిన దుండగులు నిలిపిన చెత్త లారీలో శవం మూట ఉంచి పరారయ్యారు. ఆదివారం ఉదయం లారీ సిబ్బంది చూసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశీలించారు. మృతురాలి వయసు 30–35 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాల కోసం, అలాగే హంతకుల కోసం విచారణ సాగుతోంది. భారీగా నకిలీ జీన్స్ సీజ్ దొడ్డబళ్లాపురం: మార్కెట్లో అనేక కంపెనీల బ్రాండెడ్ జీన్స్ ఫ్యాంట్లు, వస్త్రాలు లభిస్తుంటాయి. కానీ అవి అసలైనవా, కాదా? అనేది తెలుసుకోకుంటే నకిలీవి అంటగడతారు. నకిలీ బ్రాండెడ్ జీన్స్ తయారీ ఫ్యాక్టరీపై దాడి చేసిన పోలీసులు రూ.30 లక్షలకు పైగా విలువైన జీన్స్ దుస్తులను సీజ్ చేశారు. బెంగళూరు మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి బైలకోనేనహళ్లిలోని సదరు ఫ్యాక్టరీలో సోదాలు చేయగా, నాసినకం బట్టతో తయారు చేసిన జీన్స్ దుస్తులకు ప్రముఖ కంపెనీల లేబుళ్లు తగిలించి షాపులకు తరలిస్తున్నట్లు తేలింది. వాటిని అధిక ధరలకు విక్రయించేవారు. అలాగే అనుమతులు కూడా లేకుండా గోడౌన్లో గార్మెంట్స్ని నడుపుతున్నారు. కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఐదేళ్లూ సిద్దునే సీఎం: మంత్రి మైసూరు: సీఎం సిద్దరామయ్య పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రంగా ఉంది, ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది, ఎలాంటి సమస్యలు లేవని మంత్రి హెచ్.సి.మహాదేవప్ప అన్నారు. ఆదివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు సంక్రాంతి పండుగ గురించి తెలుసు కానీ, సెప్టెంబర్ నెలలో వచ్చే క్రాంతి, మహాక్రాంతి గురించి వినలేదని బీజేపీ నేతల విమర్శలపై మండిపడ్డారు. రాజ్యాంగం రక్షణ కోసం క్రాంతి జరుగుతుందని అన్నారు. ఐదు సంవత్సరాలపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారని చెప్పారు. సీఎం కావాలని అందరికీ ఆశ ఉంటుందని, అవకాశం ఒక్కరికే వస్తుందని అన్నారు. కావేరి హారతిపై నోటీసు: డీసీఎం శివాజీనగర: కృష్ణరాజ సాగర జలాశయం వద్ద కావేరి హారతిని నిర్వహించడాన్ని కొందరు ప్రశ్నిస్తూ వేసిన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీచేసినట్లు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ చెప్పారు. త్వరలో సర్కారు నుంచి సమాధానం ఇస్తామన్నారు. ఆయన ఆదివారం నగరంలో మీడియాతో మాట్లాడారు. హారతికి కొందరు అభ్యంతరం చెబుతున్నారు, ఎవరి అనుమతి అవసరం లేదు అని అన్నారు. ఆగస్టులో రాష్ట్రంలో మార్పు సంభవిస్తుందని బీజేపీ నేత అశోక్ చెప్పడాన్ని హేళన చేశారు. అశోక్ జ్యోతిష్యం చెప్పటం ఆరంభించారా? నాకు సమయం ఇప్పించండి, నేను వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొంటానని చమత్కరించారు. త్వరలో పార్టీ ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా వస్తారని, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయి మాట్లాడతారని చెప్పారు. చోరీ చేసి, షాపులకు నిప్పు మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు పట్టణంలో దుండగులు ఓ షాపుల పై కప్పును తొలగించి లోపలికి చొరబడి దోచుకుని, నిప్పుపెట్టి పారిపోయారు. బెత్తలిమారమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డులోని రిషి స్టోర్స్, నంది స్టోర్స్ లోకి శనివారం రాత్రి దొంగలు చొరబడ్డారు. విలువైన దుస్తులు, బూట్లు, రూ. 20 వేల డబ్బును దొంగిలించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు షాపుల నుంచి పొగలు మంటలు వస్తున్నట్లు గమనించిన స్థానికులు యజమానులకు తెలిపారు. వారు చేరుకుని వెంటనే స్థానికుల సాయంతో మంటలు ఆర్పివేశారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. అతనే నా బిడ్డకు తండ్రి యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన బీజేపీ నాయకుని కొడుకు కృష్ణ జె రావ్ తన కొడుక్కి తండ్రి అని ఓ బాలింత చెబుతోంది. అతని వల్లే తనకు మగ బిడ్డ పుట్టాడని పేర్కొంది. తన బిడ్డకు తండ్రి కృష్ణ జె రావ్ కారణమంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కృష్ణ తనను ప్రేమ, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకున్నాడని ఆమె తెలిపింది. ఫలితంగా గర్భం దాల్చి మగ బిడ్డ పుట్టాడని, ఇప్పుడు ప్రియుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని, మోసపోయానని విలపించింది. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
ఇంటిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడంతో అదుపుతప్పి ఇంటిని ఢీకొట్టింది. బస్సులోని 35 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వివరాలు.. శివమొగ్గ నుంచి బెంగళూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు కేఎ.57 ఎఫ్ 2826.. తిపటూరు తాలూకాలోని కోనెహళ్ళి సిద్దాపుర గ్రామం వద్ద బస్సు టైరు పేలిపోయి రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభం, కొబ్బరి చెట్టును ముక్కలు చేసుకుంటూ వెళ్లి పుట్టణ్ణ ఇంటిని ఢీకొట్టింది. భారీ శబ్ధం, కుదుపులు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. సీట్లకు గుద్దుకోవడంతో ఎక్కువమందికి ముఖానికి, తలకు గాయాలయ్యాయి. ఇంటిలో ఉన్న వారికి గాయాలు తగిలాయి. ఎక్కువ గాయాలైనవారిని తిపటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 35 మందికి గాయాలు తుమకూరు జిల్లాలో ప్రమాదం -
హలో.. లంచం త్వరగా ఇచ్చేయాలి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన డాక్టర్ ఆడియో ఒకటి వైరల్‌గా మారిన ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా జవగొండనహళ్లిలో వెలుగు చూసింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ రెన్యూవల్ కోసం అక్కడి వైద్యుడు డాక్టర్ క్రిష్ణను కోరగా రూ.5వేలు లంచం అడిగాడు.డబ్బు ఇవ్వకపోతే రేటు రూ.10వేలు అవుతుందని, ఇంకా లేట్ చేస్తే రూ.15వేలు అవుతుందని, ఎవరికి చెపుకున్నా తాను సంతకం పెట్టబోనని నర్స్‌ను హెచ్చరించాడు. ఈమేరకు ఆడియో లీక్ అయ్యి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
చావే శరణ్యం
యశవంతపుర(కర్ణాటక): తమ జీవనానికి ఆసరాగా ఉండే భూమిని బ్యాంక్‌లో తాకట్టు పెడితే, అప్పు తీర్చలేదని వేలం వేసేశారు, మేమిక జీవించలేం, కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని వృద్ధ దంపతులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. డిఆర్ విజయ్, హెచ్ఎన్ పార్వతికి 7 ఎకరాలు ఉండగా, మూడిగెరె కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో కుదువపెట్టి రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కరోనా విపత్తు, అడవి జంతువుల బెడద వల్ల పంటలు పండలేదు. దీంతో అప్పులు తీర్చలేకపోయారు. గతేడాది రూ.5.30 లక్షలను చెల్లించారు. మిగతా డబ్బులను కట్టలేకపోయారు. బ్యాంక్ అధికారులు హడావుడిగా ఆ పొలాన్ని వేలం వేసి అమ్మేశారు. తమకు చెప్పకుండానే ఇదంతా చేశారని, ఇక మరణమే శరణ్యమని వృద్ధ దంపతులు విలపించారు. వృద్ధులం అయినందున ఏ పనీ చేయలేం. మా భూమిని అప్పగించాలని, లేదంటే మరణాన్ని ప్రసాదించాలని లేఖలో మనవి చేశారు. -
అపార్టుమెంటులో యువతి క్షుద్ర పూజలు
బనశంకరి(కర్ణాటక): క్షుద్ర పూజల కోసం ఓ మహిళ పెంపుడు శునకాలను హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ బెంగళూరు మహదేవపుర చిన్నప్పలేఔట్‌లోని అపార్టుమెంట్లో ఉంటోంది. త్రిపర్ణ పైక్ అనే మహిళ 4 లేబ్రడార్ పెంపుడు కుక్కలను నాలుగురోజులు క్రితం గొంతుకోసి హతమార్చింది.ఆమె ఫ్లాటులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు. మహదేవపుర పోలీసులు, బీబీఎంపీ సిబ్బంది చేరుకుని చూడగా కుక్కల కళేబరాలు కనిపించాయి. మొదట వారు ఇంట్లోకి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటానని నానా యాగీ చేసింది. చివరకు లోపలకు వెళ్లి చూడగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. చచ్చిపోయిన కుక్కలు, రకరకాల పూజల దృశ్యాలు చూసి హడలిపోయారు. కళేబరాలను శవ పరీక్షల కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. వాటిని చాకుతో కోసి చంపారని నివేదికల్లో వచ్చింది. సదరు మహిళ చేతబడి కోసం కుక్కలను చంపి వాటి రక్తంతో పూజలు చేసి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. మరో 2 కుక్కలను కాపాడి తరలించారు. మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. -
రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న తమను కిడ్నాప్ చేసేందుకు యత్నంచారని నవ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేకల్ తాలూకా చందాపుర వద్ద చోటుచేసుకుంది. సంజయ్, దివ్య ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు వ్యతిరేకించడంతో 15 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈక్రమంలో దివ్య తల్లి కాల్ చేసి మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని, జయదేవ ఆస్పత్రిలో అడ్మిట్ చేశామని, చూసివెళ్లమని కోరింది. దీంతో సంజయ్, దివ్యలు బైక్‌పై ఆస్పత్రికి వెళ్తుండగా బొమ్మసంద్ర నివాసి శోభ, ఆమె గ్యాంగ్ సభ్యులు రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అయితే నవదంపతులు వారిబారి నుండి తప్పించుకొని సూర్యా నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
కూతురిపై తల్లి అత్యాచార పర్వం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కన్నకూతురిపై తల్లి లైంగిక దాడులు చేస్తున్న దారుణ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. ఆరేళ్లుగా ఓ తల్లి కుమార్తెపై లైంగికదాడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక తల్లి దాష్టీకం గురించి ఉపాధ్యాయురాలికి మొరపెట్టుకుంది. దీంతో విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసి, తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వివాహం జరిగాక భర్తతో ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లు నిందితురాలు బుకాయించింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన తల్లి కుమార్తె మీద లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
హుబ్లీ: నైరుతి రైల్వే జోన్ పరిధిలో రైల్వే పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు స్థానిక సిద్దారూఢ రైల్వేస్టేషన్లో కార్యాచరణ చేపట్టి రూ.5 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం–3లో అమరావతి ఎక్స్‌ప్రెస్ రైల్లో దొరికిన ఓ ఎర్ర సంచిని పరిశీలించగా అందులో 5.123 కేజీల గంజాయి ఉన్నట్లు తేలింది. సదరు గంజాయిని ఎకై ్సజ్ శాఖకు అప్పగించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. బంగారు ఆభరణాలు చోరీ కాగా మరో ఘటనలో తబీబా ల్యాండ్ ఫిష్ మార్కెట్ వద్ద ఉన్న ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారు ఆభరణాలు దోచుకొని పరారయ్యారు. ముబారక్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో లాకర్లో పెట్టిన రూ.21,500 విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.12 వేల నగదు చోరీ అయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపు తాళం పగలకొట్టి ఈ చోరీ చేసినట్లు బాధితుడు హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌గా సంగీతరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేసింది. వీరిలో దేవదుర్గలో గ్రేడ్–2 తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సంగీతను లింగసూగూరుకు బదిలీ చేశారు. లింగసూగూరు తహసీల్దార్గ విధులు నిర్వహిస్తున్న సయ్యద్ శాలంను రాయచూరు కార్పొరేషన్‌కు రెవిన్యూ శాఖ అధికారిగా నియమించారు. శుక్రవారం సంగీత లింగసూగూరు తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. పోస్టాఫీసులో డెలివరి కేంద్రం ప్రారంభం బళ్లారి టౌన్: నగరంలోని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయం తొలి అంతస్తులో డెలివరి కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈసందర్భంగా పోస్టాఫీసు కేంద్రం సూపరింటెండెంట్ పీ.చిదానంద మాట్లాడుతూ ఈ కేంద్రం వల్ల పోస్టు కార్డులను, ఇతర వస్తువులను త్వరితంగా ప్రజలకు అందజేయవచ్చన్నారు. ఈ సేవలు సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు త్వరితంగా పార్సిళ్లు అందచేసేందుకు ఎంతో ఉపయోగపడనుంది. దీన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్సీ వాలికర్, భీమసేన, రాజశేఖర్, తిందప్ప, నాగభూషణం, రాంప్రసాద్, చెన్నబసప్ప, రాఘవరెడ్డి, హనుమంతరెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాధికారి అరెస్టుకెలమంగలం: వారసుదారు సర్టిఫికెట్‌ను అందజేసేందుకు రూ. 6 వేలు డిమాండ్ చేసిన గ్రామాధికారిని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు.. తాలూకా కేంద్రం అంచెట్టి మారెమ్మ ఆలయ వీధికి చెందిన మారియప్ప కొడుకు జయరామన్ (40). ఇతని తండ్రి గత 1999లో చనిపోయాడు. వారసుదారు సర్టిఫికెట్ కోసం గత 24వ తేదీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్నాడు. 27వ తేదీ శాలివారం గ్రామాధికారి ఆఫీసుకు వచ్చి సర్టిఫికెట్ గురించి అడిగాడు, గ్రామాధికారి లక్ష్మీకాంత్ రూ. 6 వేలు లంచం ఇవ్వాలని కోరడంతో రూ. 1500 అందజేసి ఇంటికెళ్లాడు. మరోవైపు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. మిగిలిన రూ.4500 శనివారం తీసుకుంటూ ఉండగా లక్ష్మీకాంత్‌ను అరెస్ట్ చేశారు. విద్యా సామగ్రి అందజేత శ్రీనివాసపురం : దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షుడు ఎం భైరేగౌడ అన్నారు. తాలూకాలోని జోడి కృష్ణాపుర గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఆయన పాల్గొని విద్యార్థులకు ఉచిత బ్యాగులు, విద్యా సామగ్రి అందించి మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేస్తానన్నారు. రఘునాథరెడ్డి, కాళాచారి, సభ్యుడు శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు కోలారు : దాతలు ఇచ్చిన సహకారంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్ విద్యార్థులకు సూచించారు. టెన్త్, ఇంటర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కోలారు యువ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు సయ్యద్ అఫ్రిది నేతృత్వంలో నగరంలోని టి చెన్నయ్య రంగమందిరంలో శనివారం ఉచితంగా ల్యాప్‌టాప్, 500 మంది విద్యార్థులకు ప్రశస్తి పత్రాలు అందించి మాట్లాడారు. దేశానికి ఐఏఎస్, ఐపీఎస్‌లను అధిక సంఖ్యలో పరిచయం చేసిన ఘనత కోలారు జిల్లాకు ఉందన్నారు. కార్యక్రమంలో కోలారు జిల్లా యువ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అఫ్రిది, కెఎండీసీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖయ్యూం పాల్గొన్నారు. -
విద్యార్థులు కౌశల్యాలు పెంచుకోవాలి
కోలారు : విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందివ్వడం బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయ చరిత్రలోనే ఇదే తొలిసారి అని విశ్వ విద్యాలయ కులపతి ప్రొఫెసర్ నిరంజన వానళ్లి అన్నారు. నగర సమీపంలోని మంగసంద్ర స్నాతకోత్తర కేంద్రంలో శనివారం ఆయన 341 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించి మాట్లాడారు. ఉచిత ల్యాప్‌టాప్‌లను వినియోగించుకొని కౌశల్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. విశ్వ విద్యాలయ వ్యాప్తిలో చదువుతున్న 271 మంది విద్యార్థులకు ఉచిత కౌశల్య శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాలనావిభాగం కులపతి సి.ఎన్.శ్రీధర్, సిండికేట్ సభ్యుడు వెంకటేశప్ప, డైరెక్టర్ డాక్టర్ కుముద పాల్గొన్నారు. -
కృష్ణా తీరం.. వరద విలయం
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలతో కృష్ణా, దాని ఉప నదుల్లో వరద పోటెత్తుతోంది. వేద్ గంగా, పంచగంగా, దూద్ గంగా, హిరణ్యకేశి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యాంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వస్తోంది. ఈనేపథ్యంలో ఆల్మట్టి డ్యాంతో పాటు నారాయణపూర్ డ్యాం నుంచి 26 గేట్లను తెరిచి కృష్ణా నదికి లక్ష క్యూసెక్కుల నీరు వదిలారు. ఈనేపథ్యంలో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్ కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల్లోని 14 వంతెనలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరద విలయం సృష్టించడంతో నీట మునిగాయి. భీమా నదిలో ఇద్దరు గల్లంతు మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో పొంగి ప్రవహిస్తున్న భీమానదిలో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా మాచనూరు వద్ద చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను పశువుల కాపరులు సిద్దప్ప(21), రమేష్(17)లుగా పోలీసులు గుర్తించారు. గురుసుణిగి బ్రిడ్జి కం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. నీటి ఉధృతికి మృతదేహాలు కొట్టుకుపోయి ఉంటాయని లేదా మొసళ్లు అధికంగా ఉన్నందున పీక్కు తిని ఉంటాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక దళం, రెవెన్యూ అధికారులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి మర పడవతో గాలింపు చేపట్టినట్లు వడగేర ఎస్ఐ మహబూబ్ అలీ, రెవెన్యూ అధికారి బసవరాజ్ తెలిపారు. యువకుల గల్లంతుతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ అన్ని డ్యాంల నుంచి పరవళ్లు -
ఏ క్షణంలోనైనా తుంగభద్ర తుళ్లింత
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయం నుంచి ఏ క్షణంలోనైనా నదికి నీరు విడుదల చేసే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంకు వరద పోటెత్తి క్రమంగా నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యాంకు 60 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రూపంలో వస్తుండటంతో డ్యాంలో గరిష్ట నీటి నిల్వ 65 టీఎంసీలకు పైగా చేరింది. డ్యాం క్రస్ట్‌గేట్లు బలహీనంగా ఉండటంతో డ్యాంలో 80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలని ఇటీవల తీర్మానించారు. ఈనేపథ్యంలో డ్యాం నిండితే ఏక్షణంలోనైనా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున నదీ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా గత ఏడాది డ్యాంలో 19వ క్రస్ట్‌గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. డ్యాంలో 100 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ డ్యాం భద్రత దృష్ట్యా 80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని మిగిలిన నీరు డ్యాం నుంచి నది ద్వారా దిగువకు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత పదేళ్లలో జూలై మొదటి వారంలోనే కాలువలకు నీరు విడుదల చేయడంతో పాటు నదికి కూడా నీరు వదులుతుండటం విశేషం. లోతట్టు ప్రాంత వాసులకు హెచ్చరిక జారీ -
నోరూరిస్తున్న నేరేడు పండ్లు
బళ్లారి టౌన్: ఒకప్పుడు సామాన్య ప్రజలు కొనేందుకు వెళితే అధిక ధరలతో వెక్కిరించే నేరేడు పండ్లు ఈ ఏడాది సామాన్యులకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. గత ఏడాది కిలో రూ.200లు పలికిన ఈ పండ్లు ఈఏడాది కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో అధిక దిగుబడి వచ్చినందున ధరలు తగ్గాయని రైతులు తెలిపారు. పండ్లను పండించేందుకు పేరుగాంచిన డీ.నాగేనహళ్లిలో మామిడి, సపోటా, నేరేడు పండ్లను ఎక్కువగా పండిస్తారు. నగరానికి కూడా ఈ ప్రాంత వాసులే ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముతుంటారు. ప్రధానంగా తాలూకా ఆఫీసు, అనంతపురం రోడ్డు, కూల్ కార్నర్ సెంటర్, సుధా క్రాస్ వంటి అధిక జన రద్దీ గల ప్రాంతాల్లో రైతులు తీసుకువచ్చి ఉదయం తాజాగా ఉన్నప్పుడు కిలో రూ.100 ధరకు, సాయంత్రం రూ.80 నుంచి రూ.60 ధరకు అమ్ముతున్నారు. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తుండటంతో షుగర్ పేషెంట్లు ఎక్కువగా వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏదేమైనా ఈసారి నేరేడు పండ్లు మాత్రం ఎక్కడపడితే అక్కడ అధికంగా కనిపిస్తూండటంతో సామాన్యులు కొనేందుకు ఆశక్తి చూపుతున్నారు. ముందస్తు వర్షాలతో ఈసారి అధిక దిగుబడి సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న వైనం -
కరుణించని మేఘాలు.. కరువు కోరల్లో కర్షకులు
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్ ముగిసిపోతున్నా వరుణ దేవుడి కరుణ లేక రైతులు బిక్కముఖం వేసుకొని ఆకాశంలో మేఘాల వైపు చూస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో సాగు, తాగునీటి పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లాలో ఖరీఫ్‌లో తొలకరి వానలు కురువక లక్షలాది హెక్టార్లలోని భూముల్లో రైతులు విత్తనాలు వేయక బీళ్లుగా మారాయి. నల్లరేగడి భూములు బీటలు బారి నోళ్లు తెరుచుకున్నాయి. రైతులు వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో ఎర్ర భూముల్లో ఎద్దులతో చదును చేస్తున్నారు. మేఘాలు కరుణించక రైతులు వర్షం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరుణించని వరుణుడితో కర్షకుల కళ్లలో కన్నీరు మాత్రం తప్పడంలేదు. వర్షం కురిపించని మేఘం లక్షల హెక్టార్లలో పడని విత్తనం -
పదవిని కాపాడుకునేందుకే ఎమర్జెన్సీ
కోలారు : దివంగత ఇందిరా గాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి దేశంపై అత్యవసర పరిస్థితిని రుద్దారని, ఫలితంగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు అరవింద లింబావళి తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలోని కన్నడ భవనంలో సిటిజన్ ఫోరం సోషల్ జస్టిస్ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో పత్రికలపై సెన్సార్షిప్ విధించారని, వేలాది మంది ప్రతిపక్ష నేతలను జైళ్లలో వేశారన్నారు. నాటి కాంగ్రెస్‌లోని కీచలాటలు కూడా అత్యవసర పరిస్థితిని విధించడానికి ఒక కారణమైందన్నారు. ఎమెర్జెన్సీ సమయంలో సిద్దరామయ్య కూడా జైలులో ఉన్న విషయాన్ని ఆయన మరచి పోయినట్లున్నారన్నారు. ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు కేవీ శంకరప్ప, జేడీఎస్ నాయకుడు సిఎంఆర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో అత్యవసర పరిస్థితిలో పోరాటాలు సాగించిన వారిని సన్మానించారు. -
అంగన్వాడీల్లో పోషణ్ ట్రాక్‌ను రద్దు చేయరూ
రాయచూరు రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలకు తలనొిప్పిగా మారిన పోషణ్ ట్రాక్ పద్ధతిని రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. మహిళా శిశు అభివృద్ధి, సంక్షేమ శాఖ జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు పద్మ మాట్లాడారు. పోషణ్ ట్రాక్ పద్ధతి ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడానికి మొబైల్ ఫోన్లో వారి ఫోటోలు తీసి అప్లోడ్ చేసి, కేవైసీ నంబర్‌తో పాటు ఆధార్ కార్డును లింక్ చేసి ఓటీపీ ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేయాలని జారీ చేసిన ఆదేశాలను మరోసారి పరీశీలించాలని, నెట్ వర్క్ వున్న సమయంలో లబ్ధిదారులు రారని, వారు వచ్చినప్పుడు నెట్వర్క్ ఉండదని, ఆ పద్ధతిని రద్దు చేయాలని కోరుతూ జిల్లాధికారి కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. పచ్చదనం వృద్ధికి పెద్దపీట రాయచూరు రూరల్: నగరంలో పచ్చని చెట్లు పెంచి పచ్చదనం పెంపొందించడానికి ప్రాధాన్యత ఇచ్చి పర్యావరణాన్ని సంరక్షించాలని అటవీ శాఖ అధికారి రాజేష్ నాయక్ పేర్కొన్నారు. శనివారం రాయచూరు తాలూకా హీరాపుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో ప్రతి ఒక్క దాని నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు గంగాధర్, మౌనేష్, సీహెచ్ లావణ్య, హఫీజుల్లా, శంకర్‌గౌడ, నరసింహ, ఆంజనేయ, ఈరేష్ తదితరులు పాల్గొన్నారు. వారసులకు మొబైళ్ల అందజేత రాయచూరు రూరల్: నగరంలో గత రెండు నెలల నుంచి మొబైళ్లను పోగొట్టుకున్న వ్యక్తుల విచారణ జరిపి చోరీ సోత్తును తిరిగి సొంతదారులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శాంతవీర బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించి విలేఖర్లతో మాట్లాడారు. సుమారు 25 మంది మొబైళ్లను పోగోట్టుకున్నారు. ఈ విషయంపై సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, పోలీసులు శ్రీనివాస్, రవికుమార్, బసవరాజ్, శివానందలున్నారు. సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన వద్దురాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల భాషా బోధనను ప్రారంభించడానికి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని కన్నడ క్రియా సమితి అధ్యక్షుడు రఫీక్ పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో మాతృభాష కన్నడకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆంగ్ల భాషను ప్రవేశ పెట్టి కన్నడ భాషకు తిలోదకాలివ్వటానికి సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే కన్నడ భాష ఉనికి మిగిలిందని, దానికి కూడా చరమగీతం పాడటానికి సర్కార్ కసరత్తు ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల భాషకు ప్రాధాన్యత కల్పిస్తే కన్నడ భాష ఉనికికి ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పున పరిశీలించి ఆంగ్ల భాషకు బదులుగా కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మాలూరు: తాలూకాలోని చిక్కకంతూరు గ్రామ సంతె మైదానం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం స్థానికులు గమనించారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల లోపు ఉంటుందని నిర్ధారించారు. కేసరి రంగు టీషర్టు, కాఫీ కలర్ ఫ్యాంట్ ధరించాడని, కుడిచేతికి కేసరి రంగు దారం ఉందని, ఇతని వివరాలు వారు మాలూరు పోలీస్ స్టేసన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. -
అట్టహాసంగా తంబిట్టు
కోలారు: తాలూకాలోని టి గొల్లహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని నల్లూరులో శనివారం ఊరి పండుగ సందర్భంగా గ్రామ దేవతకు తంబిట్టు దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఊరి పండుగను జరపలేదు. దీంతో ఈసారి గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి పండుగను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. గ్రామాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇతర ప్రాంతాలలో స్థిరపడినవారు కుటుంబాలతో తరలివచ్చారు. గ్రామ దేవతలు గంగమ్మ, వీరభద్ర, కుంటి గంగమ్మ, సుగ్గులమ్మ తదితర దేవతలకు మహిళలు తంబిట్టు దీపాలను తలపై మోసుకు వెళ్లి సమర్పించారు. యువతికి లిఫ్ట్ ఇచ్చాడని దాడి దొడ్డబళ్లాపురం: తమ వర్గం యువతికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడనే కారణంతో యువకునిపై దాడి చేసిన ఆరుమందిని కలబుర్గి పట్టణ పరిధిలోని ఎంబీ నగర పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 26న తన సహోద్యోగి అయిన ముస్లిం యువతి ఇంటికి వెళ్లడానికి ఆటో దొరకలేదు. దీంతో బైలప్ప ఆమెకు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు ముస్లిం యువకులు అడ్డగించి బైలప్పపై దాడి చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుమందిని అరెస్టు చేశారు. కారు ఢీకొని ఇద్దరు రైతుల మృతి మైసూరు: చామరాజనగర జిల్లా కొల్లేగాళ తాలూకాలోని సత్తెగల్ గ్రామాన్ని కలిసే బైపాస్ రోడ్డులో కారు బైక్‌ని ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలో కారు బోల్తాపడినప్పటికీ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. సత్తెగల్ గ్రామానికి చెందిన నటరాజు (65), మహేష్ మాయప్ప(50), పొలం పని ముగించుకొని ఒకే బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. కారులో ఉన్నవారు న్యూఢిల్లీకి చెందినవారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారు సత్తెగల్ మీదుగా ఊటీ విహారానికి వెళ్తున్నారు. కారు ఢీకొనడంతో నటరాజు, మాయప్ప తీవ్ర గాయాలై అక్కడే చనిపోయారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోల అధిక చార్జీలపై మంత్రి ఆగ్రహం శివాజీనగర: నగరంలో యాప్ ఆధారిత ఆటోలు సంచరిస్తున్నాయి. ఈ యాప్ ఆధారిత ఆటో డ్రైవర్లు అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి దృష్టికి వచ్చింది. అధిక చార్జీలను వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణ సురక్షిత శాఖ కమిషనర్‌కు మంత్రి లేఖ రాశారు. బెంగళూరులో ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న యాప్ ఆధారిత ఆటోలు, సాధారణ ఆటోల డ్రైవర్లను వెంటనే కట్టడి చేయాలని ఆదేశించారు. ఆటోల పర్మిట్‌ను రద్దు చేయటంతో పాటుగా కేసు నమోదు చేయాలని తెలిపారు. అధిక చార్జీల మీద ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
క్షుద్ర పూజలకు శునకాలు బలి
బనశంకరి: క్షుద్ర పూజల కోసం ఓ మహిళ పెంపుడు శునకాలను హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ కు చెందిన మహిళ బెంగళూరు మహదేవపుర చిన్నప్పలేఔట్‌లోని అపార్టుమెంట్లో ఉంటోంది. త్రిపర్ణ పైక్ అనే మహిళ 4 లేబ్రడార్ పెంపుడు కుక్కలను నాలుగురోజులు క్రితం గొంతుకోసి హతమార్చింది. ఆమె ఫ్లాటులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు. మహదేవపుర పోలీసులు, బీబీఎంపీ సిబ్బంది చేరుకుని చూడగా కుక్కల కళేబరాలు కనిపించాయి. మొదట వారు ఇంట్లోకి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటానని నానా యాగీ చేసింది. చివరకు లోపలకు వెళ్లి చూడగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. చచ్చిపోయిన కుక్కలు, రకరకాల పూజల దృశ్యాలు చూసి హడలిపోయారు. కళేబరాలను శవ పరీక్షల కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. వాటిని చాకుతో కోసి చంపారని నివేదికల్లో వచ్చింది. సదరు మహిళ చేతబడి కోసం కుక్కలను చంపి వాటి రక్తంతో పూజలు చేసి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. మరో 2 కుక్కలను కాపాడి తరలించారు. మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అపార్టుమెంటులో బెంగాలీ మహిళ అకృత్యం -
ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌కు కేంద్రం ఓకే
బనశంకరి: రాష్ట్రప్రభుత్వాన్ని తీవ్ర అప్రతిష్టపాలు చేసిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ జట్టు విజయోత్సవంలోతొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరిగిన సంఘటనలో అప్పటి పోలీస్ కమిషనర్ బీ.దయానంద్, మరో ఇద్దరు ఐపీఎస్‌లను సర్కారు సస్పెండ్ చేయడం తెలిసిందే. వారి సస్పెన్షన్‌ను కేంద్రహోం శాఖ ఆమోదించింది. బీ.దయానంద్, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్కుమార్, బెంగళూరు సెంట్రల్ డీసీపీ శేఖర్‌లను సస్పెండ్‌చేసి ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఐఏఎస్, ఐపీఎస్‌లపై చర్యలు తీసుకుంటే నిబంధనల ప్రకారం కేంద్ర సిబ్బంది నిర్వహణ మంత్రిత్వశాఖకు, హోంశాఖకు సమాచారమివ్వాలి. సస్పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. విచారణకు హాజరు శివాజీనగర: తొక్కిసలాట కేసులో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి మైకేల్ డి కున్హాతో విచారణ జరిపిస్తోంది. ఆయన ముందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. శనివారం కుమారకృప గెస్ట్ హౌస్‌లో విచారణ సాగింది. దయానంద, హెచ్.టీ.శేఖర్, వికాస్కుమార్ వికాస్ హాజరై వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ఆ రోజు బందోబస్తుతో పాటు పలు అంశాల మీద జడ్జి మైకేల్ సమాచారం సేకరించారు. -
భద్ర, లింగనమక్కి కళకళ
శివమొగ్గ: గత కొన్నిరోజుల నుంచి పరివాహక వ్యాప్తిలో కురిసిన భారీ వర్షాలతో ప్రధాన జలాశయాలైన భద్రా, లింగనమక్కిల్లో నీటి నిల్వ భారీగా వృద్ధి చెందింది. జూన్ 28వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు అందిన సమాచారం మేరకు మధ్య కర్ణాటకలోని ప్రధాన జలాశయం భద్రా డ్యాం గరిష్ట నీటిమట్టం 186 అడుగులు కాగా 161.4 అడుగులకు చేరింది. 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 1290 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత ఏడాది ఇదే రోజుకు భద్రా డ్యాం నీటిమట్టం 122.3 అడుగులు మాత్రమే ఉండేది. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం లింగనమక్కి డ్యాం గరిష్ట నీటిమట్టం 1819 అడుగుల కాగా, ఇప్పుడు 1784 అడుగులకు చేరింది. డ్యాంలోకి 24,752 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోండగా 7198 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున నీటిమట్టం 1748 అడుగులు మాత్రమే ఉండేది. ఇక తుంగా డ్యాంకు 40,954 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 41,151 క్యూసెక్కుల నీటిని వదలడంతో హొసపేటె టీబీ డ్యాంకు చేరుతోంది. నిండుగా త్రివేణి సంగమం మరోవైపు వర్షాలు తగ్గినా, మైసూరులో ఆకాశం దట్టంగా మేఘావృతమైంది. జిల్లాలో హుణసూరు వద్దనున్న లక్ష్మణతీర్థ నది ఉధృతంగా ఉంది. టి.నరసిపుర వద్ద కావేరి, కపిలా, స్ఫటిక సరోవర నదుల త్రివేణి సంగమం నిండుగా ప్రవహిస్తోంది. నిండడానికి సిద్ధంగా డ్యామ్‌లు -
హాసన్‌లో ఆగని గుండెపోటు మరణాలు
యశవంతపుర: హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం గుండెపోటుతో మరో వ్యక్తి చనిపోయాడు. హాసన్ నగరంలోని సిద్ధేశ్వరనగరకు చెందిన గోవింద (37) ఆటో డ్రైవర్. ఆటో నడుపుతుండగా ఒక్కసారిగా ఎదలో నొప్పి వచ్చింది, ఆటోలోనే జిల్లా ఆస్పత్రికి వెళ్లి సిబ్బందికి తన బాధ చెబుతూ ఉన్నాడు, అంతలోనే కుప్పకూలిపోయాడు. పరిశీలించిన వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. ఈ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో గుండెపోటు వచ్చి 17 మంది మరణించడం ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు ఇలా ఆకస్మికంగా మరణిస్తున్నారో, గుండెపోటుకు కారణాలేమిటో అని చర్చ సాగుతోంది. బస్ కండక్టర్ గిరీశ్.. యశవంతపుర: హాసన్ జిల్లాకు చెందిన బెంగళూరు బీఎంటీసీ కండక్టర్ గిరీశ్ (41) గుండెపోటుతో మరణించారు. శనివారం సెలవు కావటంతో సొంతూరు హాసన్ తాలూకా కట్టాయి హొబళి హ్యరానె గ్రామానికి వెళ్లారు. పొలానికి వెళ్లి మొక్కజొన్న పంటకు ఎరువులు వేసి ఇంటికి వచ్చారు. ఎదలో నొప్పిగా ఉందని అక్కడే పడిపోయారు. కుటుంబసభ్యులు చూసేసరికి విగతజీవి అయ్యాడు. గిరీశ్‌కు ప్రతి వారం సెలవు రోజున ఊరికెళ్లి పొలం చూసుకోవడం అలవాటు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
నెలలోగా బెంగళూరు పాలికెల ఖరారు
● రూ. లక్ష కోట్లతో నగరాభివృద్ధి: డీసీఎం బనశంకరి: కెంపేగౌడ వేసిన పునాదిపై మేము బ్రాండ్ బెంగళూరును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నామని, మనందరం కలిసి బలిష్టమైన, శాంతియుత, గ్రీన్, బెంగళూరును నిర్మిద్దామని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో నాడప్రభు కెంపేగౌడ 516 జయంతి ఉత్సవం, పలు రంగాలలో సేవచేసిన 53 మందికి కెంపేగౌడ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. డీకే పాల్గొని మాట్లాడారు. మనిషి గా జననం, మరణం అనివార్యమని, ఈ రెండింటి మధ్య మనం ఏమి సాధించామనేది చాలా ముఖ్యమన్నారు. బెంగళూరు అన్నివర్గాల ప్రజల శాంతి తోట అని, దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని అన్నారు. గ్రేటర్ బెంగళూరుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నామని, సిటీని ఎన్ని పాలికెలుగా చేయాలనేది నెలలోగా తీర్మానిస్తామని తెలిపారు. సొరంగ మార్గం రోడ్డుకు రూ.37 వేల కోట్లు, ఫ్లై ఓవర్లకు రూ.17వేల కోట్లు, స్వచ్ఛతకు రూ.15 వేల కోట్లతో పాటు బెంగళూరు సమగ్రాభివృద్ధికి రూ.లక్ష కోట్లతో పథంకం రూపొందించామని తెలిపారు. మీడియా విమర్శలను సంతోషంగా స్వీకరించి పనిచేస్తామని చెప్పారు. చావే శరణ్యం ● రాష్ట్రపతికి వృద్ధ దంపతుల లేఖ యశవంతపుర: తమ జీవనానికి ఆసరాగా ఉండే భూమిని బ్యాంక్‌లో తాకట్టు పెడితే, అప్పు తీర్చలేదని వేలం వేసేశారు, మేమిక జీవించలేం, కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని వృద్ధ దంపతులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. డిఆర్ విజయ్, హెచ్ఎన్ పార్వతికి 7 ఎకరాలు ఉండగా, మూడిగెరె కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో కుదువపెట్టి రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కరోనా విపత్తు, అడవి జంతువుల బెడద వల్ల పంటలు పండలేదు. దీంతో అప్పులు తీర్చలేకపోయారు. గతేడాది రూ.5.30 లక్షలను చెల్లించారు. మిగతా డబ్బులను కట్టలేకపోయారు. బ్యాంక్ అధికారులు హడావుడిగా ఆ పొలాన్ని వేలం వేసి అమ్మేశారు. తమకు చెప్పకుండానే ఇదంతా చేశారని, ఇక మరణమే శరణ్యమని వృద్ధ దంపతులు విలపించారు. వృద్ధులం అయినందున ఏ పనీ చేయలేం. మా భూమిని అప్పగించాలని, లేదంటే మరణాన్ని ప్రసాదించాలని లేఖలో మనవి చేశారు. దావణగెరె బంద్ దొడ్డబళ్లాపురం: భద్రా డ్యాం నుంచి మంగళూరుకు నీరు తరలించేందుకు చేపడుతున్న పనులను వ్యతిరేకిస్తూ శనివారంనాడు దావణగెరె బంద్ జరిగింది. ఇందుకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు మాట మాత్రం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేపట్టాలనుకోవడం దారుణమని బీజేపీ ఆరోపించింది. భద్రా డ్యాం నుంచి మంగళూరుకు నీటిని తరలిస్తే ఈ జిల్లా రైతులకు, ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని రైతు నేతలు చెప్పారు. ఇందుకు అనుమతించబోమని బంద్ నిర్వహించగా ఓ మోస్తరుగా స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులు తగ్గాయి. కొన్నిచోట్ల ఆఫీసులు మూతపడ్డాయి. -
గోవధ.. పులికి మరణ శాసనం
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర పరిధిలోని అరణ్యంలో హూగ్యం వలయంలో ఓ తల్లి పులి, దాని నాలుగు పిల్లలను దుండగులు విషాహారం పెట్టి చంపడం సంచలనం కలిగిస్తోంది. అరుదైన వన్యజీవులను పొట్టనపెట్టుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ముగ్గురు స్థానికులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. హనూరు తాలూకాలోని కొప్ప గ్రామానికి చెందిన మాద అలియాస్ మాదరాజు, నాగరాజ్, కోనప్పను పోలీసులు, అటవీ సిబ్బంది అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తన ఆవును పులి చంపి తిన్నందుకు తానే విషం పెట్టి చంపినట్లు మాదరాజు తండ్రి శివణ్ణ మొదట తెలిపాడు. తానే పులి కుటుంబాన్ని చంపినట్లు చెప్పాడు. అయితే తీవ్రంగా అనుమానపడిన పోలీసులు విచారణ జరపగా శివణ్ణ కుమారుడు మాదరాజు హస్తం బయటపడింది. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆవును పులి చంపి కొంత తినేసింది. ఈ కోపంతో ఆవు కళేబరంపై పురుగుల మందును చల్లాను, తరువాత వచ్చి ఆ మాంసాన్ని తిన్న పులి, పిల్లలు మృత్యువాత పడ్డాయని వివరించాడు. ల్యాబ్‌కు శరీర భాగాలు మరింత దర్యాప్తు కోసం పులి, ఆవుల శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అటవీ అధికారులు తెలిపారు. దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి సమితిని ఏర్పరిచామని, వారు కూడా పరిశీలించారని చెప్పారు. ఘటనాస్థలిలో పరిసరాల మొబైల్‌ఫోన్ లొకేషన్‌పై దృష్టి పెట్టారు. పులులకు విషం పెట్టినట్లు రుజువైతే నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని రిటైర్డ్ డీసీఎఫ్ పూవయ్య తెలిపారు. మరో పులి మృత్యువాత మైసూరు: సరిహద్దుల్లో గుండ్లుపేట తాలూకాలోని బండిపుర పులి అభయారణ్యంలో మరో పులి మృత్యువాత పడింది. గుండ్రే ప్రాంతంలో ఐదేళ్ల ఆడపులి కళేబరం లభ్యమైంది. అటవీశాఖ గస్తీ సిబ్బంది దానిని కనుగొన్నారు. ఆ పులిది సహజ మరణమేనని తెలుస్తోంది. అటవీ అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆవు కళేబరంపై పురుగుల మందు పిచికారీ దానిని భక్షించి తల్లీ, పిల్ల వ్యాఘ్రాల మృతి ముగ్గురు అరెస్టు -
వైభవోపేతంగా మైసూరు దసరా
శివాజీనగర: రాష్ట్ర పండుగ మైసూరు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా ఆచరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి దసరా 10 రోజులు కాకుండా 11 రోజులు జరుపుతారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 రాత్రి వరకు సాగుతుంది. మైసూరు దసరా సంబరాల గురించి శనివారం బెంగళూరులో విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సిద్దరామయ్య, మైసూరు దసరా వేడుకలలో ప్రజల భద్రత, సౌకర్యాలకు తొలి ప్రాధాన్యత ఉండాలి. ఆడంబరం మాటున దసరా చరిత్రాత్మక ప్రాధాన్యత కనుమరుగు కారాదన్నారు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం వైభవం కాదు. దసరా చరిత్ర యశస్సును కాపాడుతూ ప్రజల అనుకూలాలను దృష్టిలో పెట్టుకొని వేడుకలను ఆచరించాలని సూచించారు. దసరా సమయంలో పోలీసులు పర్యాటకులతో ప్రేమాభిమానంతో ప్రవర్తించాలని తెలిపారు. ఆర్భాటంగా జరుపుతాం రాష్ట్రంలో ఈసారి కూడా మంచి వర్షాలు పడ్డాయి. నదులు, చెరువులు నిండిపోయాయి. అందుచేత ఈసారి దసరాను వైభవంగా ఆచరిస్తామని సీఎం తెలిపారు. దసరా సమయంలో ప్రభుత్వ సాధనలను ప్రతిబింబించే వస్తు ప్రదర్శన, స్తబ్ధ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 2న విజయదశమి వచ్చింది, శకటాల్లో గాంధీ ఆశయాలను కూడా అద్దంపట్టేలా ఉండాలన్నారు. వేడుకలలో 10 లక్షల మందికి పైగా ప్రజలు చేరుతారు, విదేశీయులు ఎక్కువగా రావచ్చు, అందుచేత ప్రమాదాలు సంభవించకుండా అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు వహించాలి, ప్యాలెస్ ముందు రద్దీ నియంత్రణ చేపట్టాలన్నారు. వసతులకు లోటు రాకూడదు మైసూరులోని అన్ని రోడ్లకు ఇప్పటినుంచే మరమ్మతు పనులు ప్రారంభించాలని, గతేడాది మాదిరిగా ఈదఫా కూడా నగరాన్ని సుందరంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని సీఎం తెలిపారు. గతంలో దసరా ఆచరణకు రూ.40 కోట్లు కేటాయించాం, ఈసారి కూడా నిధులు ఇస్తామన్నారు. మైసూరు నగర సౌందర్యాన్ని పెంచాలి, దసరా నెపంతో ప్రజల పనులు, అభివృద్ధి పనులు కుంటుపడకుండా చూడాలని తెలిపారు. ప్రజల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట సీఎం సిద్దరామయ్య సూచన ఈసారి 11 రోజుల పాటు సంబరాలు దసరాకల్లా సీఎం మార్పు బీజేపీ పక్ష నేత అశోక్ మైసూరు: కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చడం కచ్చితమని, అందువల్ల త్వరలో జరిగే మైసూరు దసరా ఉత్సవాలను కొత్త ముఖ్యమంత్రి ప్రారంబిస్తారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ అన్నారు. శనివారం మైసూరులో ఓ కళ్యాణ మండపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం మార్పు తథ్యమని, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. సిద్దరామయ్య ఏమీ కాలేదనే రీతిలో మాట్లాడుతున్నారు, కాంగ్రెస్‌లో అధికారం కోసం కుమ్ములాట తారాస్థాయికి చేరిందని, పైగా అవినీతిలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. సిద్దరామయ్య మాత్రం అబద్ధాలు చెబుతూ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారని, అసలైన ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ హయాంలో ఉండేదని అన్నారు. సెప్టెంబరు 22 నుంచి దశమి వేడుకలు అక్టోబరు 2న జంబూసవారీ ఉత్సవం మైసూరు: ఈసారి నాడహబ్బ విజయదశమి ఉత్సవాలకు ఆగస్టు 4వ తేదీన గజ పయనం మొదలవుతుంది. నాగరహోళె అరణ్యంలో వీరనహోసహళ్ళి గ్రామం వద్ద ఏనుగులకు స్వాగతం పలుకుతారు. అక్కడ సంబరాల తరువాత మైసూరుకు చేరుకుంటాయి. దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం 10:10 గంటలనుంచి 10:40 గంటల శుభ వృశ్చిక లగ్నంలో చాముండికొండ పైన నాడదేవత చాముండేశ్వరి మాతకు విశేష పూజలతో ఆరంభిస్తారు. అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుంచి 1:18 గంటల ధనుర్ లగ్నంలో రాజప్రముఖులు దసరా పూజను గావిస్తారు. ఆ రోజు సాయంత్రం సుమారు 4:42 గంటల నుంచి 5:06 గంటల శుభ కుంభ లగ్నంలో జంబూసవారీ ఊరేగింపు జరుగుతుంది. -
అత్తతో కలిసి అల్లుడి పరార్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్య సవతితల్లితో అల్లుడు పరారైన సంఘటన దావణగెరె జిల్లా ముద్దేనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. చెన్నగిరి తాలూకా మరవంజి గ్రామం నివాసి గణేశ్(25) గతనెల 12న తన భార్య హేమను వదిలి ఆమె సవతి తల్లి శాంత(55)తో పరారయ్యాడు. వివాహం జరిగినప్పటి నుంచి గణేశ్ శాంతతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఈ విషయం భార్య హేమకు తెలియడంతో ఇద్దరూ ఊరు వదిలి పరారయ్యారు. -
ఎయిమ్స్ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తాం
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ కోసం పోరాటం పేరుతో శాంతికి భంగం వాటిల్లకుండా బహిరంగ పోరాటానికి కోర్టు మెట్లెక్కాలని యోచిస్తున్నట్లు అంబేడ్కర్ వేదిక సంచాలకుడు మహేంద్ర వర్మ తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటులో శాసన సభ్యుడు, ఆందోళనకారుల మధ్య అసభ్య పదజాలాలతో దూషిస్తూ దారి తప్పిస్తున్న విషయంలో ఆందోళనకారులకు మరో అవకాశముందన్నారు. న్యాయస్థానంలో రాయచూరుకు ఎయిమ్స్ కావాలని రిట్ పిటిషన్ వేస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆరోగ్య శాఖ కమిషనర్లకు నోటీసులు పంపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ జిల్లాలో ఎయిమ్స్ కోసం సహజ సారథి ఫౌండేషన్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. -
పోరాట యోధులను బెదిరించడం తగదు
రాయచూరు రూరల్: రాయచూరు ఎయిమ్స్ పోరాట సమితి సంచాలకులను, ఆందోళనకారులను శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ బెదిరించడాన్ని రాయచూరు ఎయిమ్స్ పోరాట సమితి సంచాలకులు తప్పు బట్టారు. శుక్రవారం పోరాట వేదిక వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. కర్ణాటకలోని రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటులో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ్ కళస, అశోక్ కుమార్ జైన్లను అసభ్య పదజాలాలతో నిందించాడని, అలాంటి వ్యక్తిపై చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
రైళ్లు బిరబిర.. వసతులు అరకొర
బళ్లారిటౌన్: నగరంలోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ మీదుగా చాలా రైళ్లు వెళుతున్నా సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా సింధనూరు– బెంగళూరు మధ్య సంచరించే రైళ్లు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌కు వెళ్లకుండా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ నుంచి బైపాస్ క్యాబిన్ మీదుగా వెళుతున్నందున రైళ్ల రాకపోకల కోసం కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ స్టేషన్లో తగిన తాగునీరు, మరుగుదొడ్లు, లిఫ్ట్ లేకపోగా, కూర్చొనేందుకు తక్కువ ఆసనాలు ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు అటు నుంచి ఇటు, ఒకటో ప్లాట్‌ఫాం నుంచి రెండవ ప్లాట్ఫారం చేరుకోవాలంటే మెట్లు ఎక్కి రావాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ రైళ్లు బెంగళూరుకు ఎక్కువగా ఉన్నందున రోగులు, ఉన్నత వైద్యం కోసం వీటిని ఆశ్రయిస్తుంటారు. అయితే సరైన సదుపాయాలు లేనందున ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. గతంలో ఈ రైళ్లు ప్రధాన రైల్వే స్టేషన్‌కు వచ్చి వెళుతుండేవి. కాని ప్రధాన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ సాకుతో కొన్ని రైళ్ల రాకపోకల దిశను మార్చివేశారు. పట్టించుకోని పాలకులు, అఽధికారులు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారులు, పాలకులకు తెలిపినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాలకు భద్రత లేనందున దొంగతనాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు ఇక్కడ నిలిపి ఉంచేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా అయితే రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాలు ఉంచేందుకు భద్రత కల్పిస్తారు. ఇక్కడ లేనందున పలుసార్లు దొంగతనాలు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. స్టీల్ సిటీగా పేరుగాంచిన బళ్లారిలో ప్రయాణికుల రాకపోకల సంఖ్య అఽధికంగా ఉంది. రైల్వే స్టేషన్లో వసతులు కల్పించడంపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిత్యం ప్రయాణికులకు తప్పని అవస్థలు మౌలిక సదుపాయాలు కరువైన కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తా సమస్యలపై కర్ణాటక రాష్ట్ర రైల్వే క్రియా సమితి అధ్యక్షుడు కేఎం మహేశ్వర స్వామి దృష్టికి తీసుకెళ్లగా రాయదుర్గం నుంచి బెంగళూరుకు వెళ్లే రైళ్లకు జిల్లా స్టేడియం వద్ద మరో నూతన రైల్వే స్టేషన్ ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. తాము కూడా ఈ విషయంపై ఒత్తిడి చేస్తున్నామన్నారు. అంతవరకు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో ఉన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు. –రైల్వే క్రియా సమితి అధ్యక్షుడు మహేశ్వరస్వామి -
ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ పరవళ్లు
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, కృష్ణాతో పాటు దాని ఉప నదుల పరివాహక ప్రాంతంలో వానలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు వరద పోటెత్తుతోంది. కృష్ణా నదీ పరివాహకంలోని వేద గంగా, పంచగంగా, దూద్ గంగా, హిరణ్యకేశి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బంగాలి బాబా మందిర్ జల దిగ్బంధం అయింది. బెళగావి జిల్లా చిక్కోడి డివిజన్లో కల్లోళ, యడూర, మలికవాడ, దత్తవాడ, నిప్పాణి తాలూకాలో బారవాడ, కున్నూర, కారదగ, బోజ వంతెనలు జలావృతం అయ్యాయి. ఆల్మట్టి డ్యాం నుంచి కృష్ణా నదికి 14 గేట్లను తెరిచి 1,08,250 క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో శిశిలేశ్వర దేవాలయం నీటిలో మునిగింది. 8 వంతెనలు పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు నది తీరానికి వెళ్లకుండా పోలీసులు అక్కడకక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బెళగావి జిల్లాలో బెణ్ణెతుప్రి వాగు కూడా ఉరకలెత్తుతోంది. నదికి 1.08 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల వరద నీట మునిగిన నదీ తీరంలోని ఆలయాలు -
క్రీడలతో స్నేహం, ఆరోగ్యం వృద్ధి
సాక్షి, బళ్లారి: జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు కలిసి క్రికెట్ ఆడదామని, క్రీడలు స్నేహాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో వీరశైవ కళాశాల మైదానంలో బళ్లారి మీడియా క్లబ్ క్రికెట్ టోర్నీ–2025 ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాత్రికేయులందరూ కలిసికట్టుగా వివిధ జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడటం హర్షణీయమన్నారు. సమాజాభివృద్ధిలో కీలకంగా పని చేసే విలేకరులతో క్రికెట్ ఆడే దిశగా జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడిన తర్వాత పోటీలను ఏర్పాటు చేద్దామన్నారు. క్రీడలతో స్నేహం పెంపొందడంతో పాటు ఆరోగ్యం, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్టుకు తాను వ్యక్తిగతంగా రూ.1 లక్ష, రన్నరప్ జట్టుకు రూ.50 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. పాత్రికేయుల క్షేమాభివృద్ధి సంఘానికి కూడా తాను చేతనైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. నగర మేయర్ ముల్లంగి నందీష్ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉండే పాత్రికేయులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రీడలు ఎంతో అవసరం అన్నారు. పాత్రికేయుల క్షేమాభివృద్ధి నిధికి రూ.51 వేల సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ పాత్రికేయుడు వీరభద్రగౌడ పాత్రికేయుల క్షేమాభివృద్ధి సంఘం నిధికి రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా క్రికెట్ పోటీలు బళ్లారిటౌన్: నగరంలో వీరశైవ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న విలేకరులకు క్రికెట్ పోటీలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగాయి. కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పాత్రికేయుల క్రికెట్ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు క్రికెట్ జట్లు పాల్గొనగా, వీటిలో బళ్లారి నగరం నుంచి రెండు జట్లు, సిరుగుప్ప తాలూకా నుంచి ఒక జట్టు, కంప్లి, కురుగోడుల నుంచి ఒక జట్టు పాల్గొని తమ ప్రతిభను చాటాయి. ఫైనల్స్‌కు బళ్లారి లయన్స్ జట్టు, కేకేఆర్ బుల్స్ జట్టు చేరుకోగా, కేకేఆర్ బుల్స్ జట్టు విజేతగా నిలిచింది. బళ్లారి లయన్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తొలుత ఈ క్రికెట్ పోటీలను మేయర్ ముల్లంగి నందీష్ ప్రారంభించారు. ఆ తర్వాత సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వచ్చి కాసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. కాగా విజేత జట్టుకు జూలైలో నిర్వహించే పాత్రికేయుల దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తారు. మాజీ మేయర్ మోదుపల్లి రాజేశ్వరి, వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరభద్రగౌడ, వార్త సహాయక అధికారి గురురాజ్, అడహక్ కమిటీ సభ్యులు మల్లయ్య, వెంకోబి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి -
జూలై 10 నుంచి తుంగభద్ర కాలువలకు నీరు
సాక్షి,బళ్లారి: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ముందస్తు వర్షాలు కురవడంతో డ్యాంలో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే 50 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో ముందుగానే కాలువలకు నీరు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయం నుంచి సాగు నీటి విడుదలకు సంబంధించి శుక్రవారం బెంగళూరులోని విధానసౌధలో సమితి అధ్యక్షుడు, మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తుంగభద్ర నీటి పారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశంలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కాలువలకు నీటి విడుదలపై చర్చించిన తర్వాత తేదీని ఖరారు చేశారు. ముందుగా ఈ ఏడాది డ్యాంలోకి ఎంత నీరు చేరుతుందన్న అంచనాపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ ఏడాది డ్యాంలోకి 157 టీఎంసీల నీరు చేరతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో దామాషా ప్రకారం మూడు రాష్ట్రాల పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎంతెంత నీరు అందించాలో తీర్మానం చేశారు. గేట్ల మరమ్మతు కోసం రబీలో క్రాప్‌హాలిడే? ముఖ్యంగా ముందుగా డ్యాంలోకి నీరు చేరినందున జూలై 10వ తేదీ నుంచి హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకు నీరు విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జూలై 2 నుంచి తుంగభద్ర ఎడమ కాలువకు నీరు వదలాలని నిర్ణయించారు. కర్ణాటక నీటి కోటాను విడుదల చేసేందుకు తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నీటి కోటాను విడుదల చేసేందుకు కూడా అదే తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాలకు నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తుంగభద్ర క్రస్ట్‌గేట్లను మరమ్మతు చేసే విషయంపై చర్చించిన తరుణంలో ఈసారి ఖరీఫ్ సీజన్లో మాత్రమే డ్యాం ఆయకట్టు పరిధిలో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. రబీ సీజన్లో పంటలు వేసుకునేందుకు అవకాశం దాదాపుగా లేకపోవచ్చని తెలుస్తోంది. సమావేశంలో విజయనగర, బళ్లారి, రాయచూరు జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు జమీర్ అహమ్మద్ ఖాన్, శరణ ప్రకాష్ పాటిల్, ఎమ్మెల్యేలు బాదర్లి హంపనగౌడ, నాగేంద్ర, గవియప్ప, రాఘవేంద్ర, గణేష్, తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్, సీఈ బసవరాజు తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ పంటకు మాత్రమే సాగునీటి విడుదలకు చర్యలు ఈఏడాది డ్యాంకు 157 టీఎంసీలు వస్తాయని అంచనా -
ఇంటిలో చోరీ కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: ఇంటిలోకి చొరబడి దొంగతనానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శాంతవీర తెలిపారు. గురువారం సాయంత్రం రాయచూరు తాలూకా యరగేర పోలీస్ స్టేషన్లో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఏప్రిల్ నెలలో ఇడపనూరు, యరగేర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇళ్ల చోరీల్లో చిక్కమగళూరు జిల్లా కడూరు నంజుండప్ప(46), ఎమ్మిగనూరు తాలూకా ఇబ్రహీంపుర మాల నరేష్(40)లను పట్టుకుని విచారణ జరిపి వారి వద్ద నుంచి రూ.4.55 లక్షల విలువ చేసే బంగారు నగలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యల్లమ్మ దేవికి రూ.1.04 కోట్ల కానుకలు హుబ్లీ: రాష్ట్రంలో సుప్రసిద్ధమైన సవదత్తి యల్లమ్మ దేవస్థానం హుండీ కానుకలు లెక్కింపు పూర్తి చేశారు. శుక్రవారం లెక్కింపులో రూ.1.04 కోట్ల కానుకలు హుండీల్లో లభించాయి. ఇందులో రూ.5.22 లక్షల విలువ చేసే 53 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.27 లక్షల విలువ చేసే 1276 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.98.23 లక్షల నగదు కానుకలు లభించాయని ఆలయ ప్రాధికార కార్యదర్శి ఆశోక్ దుడగుంటి తెలిపారు. ఏడు గుట్టలపై వెలసిన యల్లమ్మ సన్నిధికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతూ వివిధ రకాల కానుకలు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ కానుకలు వచ్చినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కెంపేగౌడ ఆదర్శాలు అనుసరణీయం రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో కెంపేగౌడ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ పేర్కొన్నారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెంపేగౌడ జయంతిని విద్యార్థినులతో కలిసి ప్రారంభించి చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. కుల, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కెంపేగౌడ పెద్దపీట వేశారన్నారు. సాహితీవేత్త వీరహనుమాన్, బీఈఓ ఈరణ్ణ, తహసీల్దార్ సురేష్, కన్నడ సంస్కృతి శాఖ అధికారి వీరేష్నాయక్లున్నారు. అమలు కాని సాగునీటి పథకాలు ● దేవదుర్గలో కాంగ్రెస్ సర్కారుపై దేవెగౌడ విసుర్లురాయచూరు రూరల్: మహిళళా శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ ప్రాతినిథ్యం వహిస్తున్న దేవదుర్గ నియోజకవర్గంలో సాగునీటి పథకాల అమలుకు సర్కారు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ విమర్శించారు. ఆయన శుక్రవారం దేవదుర్గలో ప్రజలతో జనతాదళ్ జాతా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేవదుర్గ నియోజకవర్గంలో 10కి పైగా పెండింగ్‌లో ఉన్న సాగు నీటి పథకాలను అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమది కార్యకర్తల పార్టీ అన్నారు. బీజేపీతో 20 నెలలు, కాంగ్రెస్ పార్టీతో 13 నెలలు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన కుమార స్వామి రూ.28 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి జేడీఎస్ పార్టీకి పూర్వ వైభవం లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు దేవదుర్గ తాలూకా చిక్కహొన్నకుణి వద్ద మాజీ ప్రధానమంత్రి దేవెగౌడపై అభిమానంతో గ్రామస్తులు తయారు చేసిన దేవెగౌడ ప్రతిమను ఆవిష్కరించారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, కందకూరు శరణే గౌడ, నేమిరాజ్ నాయక్, చంద్ర శేఖర్, రాజు గౌడ, మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్, హన్మంతప్ప, వెంకట్రావ్ నాడగౌడ, రైతు మల్లనగౌడ నాగరాళ తదితరులు పాల్గొన్నారు. -
క–క అభివృద్ధిపై శ్వేతపత్రం ప్రకటించాలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి సర్కారు ఎంత మేర నిధులు కేటాయించింది? ఎంత మేర నిధులు ఖర్చు చేశారో శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర యువ జనతాదళ్(ఎస్) అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్త్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాయచూరు జిల్లా దేవదుర్గలో ప్రజలతో జనతాదళ్ జాతా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధికి బడ్జెట్లో కేటాయించిన రూ.5 వేల కోట్ల నిధుల్లో రూ.3 వేల కోట్లు నిధులు విడుదల చేశామని అధికార పార్టీ పెద్దలు గొప్పలు చెప్పడం మాని శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధికి బడ్జెట్లో పెట్టిన విషయాలపై ఏ రహదారులు, పాఠశాలలు, బస్టాండ్లు, ఇతర సంక్షేమ పథకాలు చే పట్టారో జాబితాను విడుదల చేయాలని ఒత్తిడి చేశారు. గత 10 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో కొలువు దీరిన శాసన సభ్యులు ప్రభుత్వంపై విరుచుకు పడ్డారన్నారు. దీంతో ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, వైఫల్యాల గురించి విదితమవుతుందన్నారు. మధ్యవర్తుల ఆధారంగా కమీషన్ల దందాలతో ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. మంత్రి రాజణ్ణ పేర్కొన్నట్లు ఏడాదిలోగా రాష్ట్రంలో విప్లవం జరుగుతుందడంలో ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు పండించిన వరి, జొన్న పంటలకు రక్షణ కల్పించలేదన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తరుణంలో మంత్రి కుమారస్వామి మామిడి, పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించారన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, హన్మంతప్ప ఆల్కోడ్, శాసన సభ్యుడు నేమిరాజ్ నాయక్, మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్, చంద్రశేఖర్, రశ్మి రామేగౌడ, బసవరాజ్, విరుపాక్షి, శివశంకర్, తిమ్మారెడ్డిలున్నారు. సర్కారుకు నిఖిల్ కుమారస్వామి సవాల్ -
కెంపేగౌడ దూరదృష్టి కలిగిన నేత
శివాజీనగర: బెంగళూరును అభివృద్ధి పరిచే కలను నెరవేర్చే పనిని తమ ప్రభుత్వం చేయనుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం నాడప్రభు కెంపేగౌడ 516వ జయంతిని పురస్కరించుకొని బెంగళూరు విధానసౌధ తూర్పు దిక్కున ఉన్న ఆయన ప్రతిమకు పూలమాలను సమర్పించిన తరువాత కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. బెంగళూరు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. బెంగళూరు అభివృద్ధికి పలు పథకాలను అమలుపరిచి ఆ కలను నెరవేరుస్తామన్నారు. కెంపేగౌడ దూరదృష్టి కలిగిన పరిపాలకుడు, ఆధునిక బెంగళూరు నిర్మాత అని తెలిపారు. కెంపేగౌడ జయంతిని ప్రభుత్వం, కెంపేగౌడ అభివృద్ధి ప్రాధికార, బీబీఎంపీ సంయుక్త ఆధ్వర్యంలో ఆచరించారు. 2013–18వ కాలావధిలో తమ ప్రభుత్వం నిర్మలానందస్వామితో చర్చలు జరిపి జన్మతేదీని తెలుసుకొని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కెంపేగౌడ జయంతిని ఆచరిస్తోందన్నారు. బెంగళూరు నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందంటే పునాది వేసింది కెంపేగౌడ అన్నారు. ఆయనను ప్రభుత్వం స్మరించిందన్నారు. బెంగళూరులోని నాలుగు భాగాల్లో గోపురాలను నిర్మించిన కెంపేగౌడ ఆరోజే బెంగళూరు పరిపాలన ఇలా ఉండాలని తెలుసుకొని వృత్తి ఆధారంగా నగరత్ పేట, చిక్కపేట, బళెపేటతో పాటు అనేక పేటలను తమ పాలనావధిలో నిర్మించారు. ఆయన పాలన తమకందరికీ కూడా ఆదర్శం అని తెలిపారు. సుమనహళ్లి జగ్జీవన్‌రాం నగరలో కెంపేగౌడ జయంతిని ఆచరించారు. కెంపేగౌడ భవనానికి శంకుస్థాపన: సుమనహళ్లి సర్కిల్లో కెంపేగౌడ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. భారతీయ విజ్ఞాన సంస్థకు చెందిన కౌశల్ వర్మ, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాధికార మేనేజింగ్ డైరెక్టర్ హరి మరార్, మైసూరు స్యాండల్ సోప్ సంస్థ ఎండీ ప్రశాంత్ పీ.కే.ఎంకు అవార్డు ప్రదానం చేశారు. విమానాశ్రయం వద్ద కెంపేగౌడ ప్రతిమకు డిప్యూటీ సీఎం శివకుమార్ నివాళులర్పించారు. కెంపేగౌడ ఎంతో దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. బెంగళూరు అభివృద్ధికి కంకణం జయంతి వేడుకల్లో సీఎం సిద్దరామయ్య -
విద్యుదాఘాతానికి దంపతులు బలి
బొమ్మనహళ్లి: విద్యుదాఘాతానికి దంపతులు బలైన ఘటన శివమొగ్గ జిల్లా సొరబ తాలూకా కప్పగళలె గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామంలో కృష్ణప్ప(50), వినోద(42) దంపతులు నివాసం ఉంటున్నారు. వినోద గురువారం రాత్రి సమారు 7 గంటల సమయంలో ఉతికిన దుస్తులను ఇంటి వెనుక వైర్లపై ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. ఇంట్లో ఉన్న భర్త కృష్ణప్ప పరుగు పరుగున వెళ్లి భార్యను కాపాడేందుకు యత్నించగా అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఘటన స్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు. ఇంటి విద్యుత్ కనెక్షన్ ఇన్సులేటర్ వైర్ జీవైర్‌ను తాకడంతో ఈఘటన జరిగినట్లు చెబుతున్నారు. సొరబ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పిచ్చికుక్క స్వైర విహారం ●చిన్నారులు సహా 20 మందికి గాయాలు మైసూరు: పిచ్చి కుక్క స్వైర విహారం చేయడంతో 20 మంది గాయపడ్డారు. ఈఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హుల్లహళ్లి గ్రామంలో జరిగింది. గురువారం సాయంత్రం చిన్నారులు పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో బస్టాండు, డబల్ రోడ్డు తదితర చోట్ల్ల పిచ్చికుక్క దాడికి పాల్పడింది. చిన్నారులు భయంతో పరుగులు తీయగా వెంటాడి అందిన చోటల్లా కరిచింది. చిన్నారులను కాపాడేందుకు వెళ్లిన వారిపై కూడా కుక్క దాడి చేసింది. గాయపడిన నిశ్చిత్(4), అనిత(35), వినోద(18), గిరీష్(12), ఆంజలి(10), ధనుష్(5), రవికుమార్ (12) ఆర్మాన్ (3), సవిత(37), గిరిష్(40), ఉసబ్ఖాన్(7) కాళస్వామి(36)తోసహా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించారు. రేబిస్ సోకకుండా ఇంజక్షన్లు వేశారు. సినీ ఫక్కీలో రూ.2 కోట్ల దోపిడీ యశవంతపుర: పట్టపగలే సినీ ఫక్కీలో రూ.2 కోట్ల నగదును దోచుకెళ్లిన ఘటన బెంగళూరు విద్యారణ్యపుర పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఎస్ పాళ్య వద్ద జరిగింది. కెంగేరికి చెందిన పారిశ్రామికవేత్త శ్రీహర్ష పరిశ్రమల కోసం యంత్రాలను జర్మనీ నుంచి కొనుగోలు చేయటానికి రూ.2 కోట్లను యూఎస్డీఐటీకి కన్వర్ట్ చేసువాల్సి ఉంది. డబ్బు కన్వర్ట్ చేయడానికి ఎం.ఎస్.పాళ్య వద్దకు రావాలని స్నేహితుడి ద్వారా పరిచయమైన బెంజమిన్ సూచించగా శ్రీహర్ష ఈ నెల 25న మధ్యాహ్నం వెళ్లాడు. అక్కడ గదును లెక్కిస్తుండగా ఒక్కసారిగా అంగడిలోకి చొరబడిన 6–7 మంది దుండగులు కత్తులు చూపించి శ్రీహర్షపై దాడి చేశారు. శ్రీహర్ష, బెంజమిన్, అతడి స్నేహితులను గదిలో బంధించి నగదుదో ఉడాయించారు. గది తలుపును బద్దలు కొట్టి బయటకు వచ్చిన బెంజమిన్, అతని స్నేహితులు మాయమయ్యారు. దిక్కుతోచక బాధితుడు శ్రీహర్ష విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంజమిన్, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
భక్తులతో చాముండి కొండ కిటకిట
ఉచిత టికెట్ ప్రకటన వల్లే తొక్కిసలాట ● సస్పెండైన బెంగళూరు కమిషనర్ దయానంద్ వెల్లడి శివాజీనగర: తొలిసారిగా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ చేపట్టిన నేపథ్యంలో గత జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆర్సీబీ అభిమానులు వచ్చినపుడు తొక్కిసలాట సంభవించి 11 మంది మృతి చెందారు. కేసుకు సంబంధించి బెంగళూరు కమిషనర్ బీ.దయానంద్‌తో పాటు పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సస్పెండ్ అయిన బెంగళూరు కమిషనర్ బీ.దయానంద్ విచారణకు హాజరైనపుడు ఉచిత టికెట్ ప్రకటించటంతో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిందని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు గురువారం విచారణకు హాజరైన దయానంద్ ఆరోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించారు. ఘటన జరిగిన రోజు 21 గేట్లను కూడా తానే నేరుగా భేటీ చేశాను. పూర్తి బందోబస్త్ ఏర్పాటు చేశాం. ప్రతిసారి ఐపీఎల్ మ్యాచ్ జరిగేటపుడు ఉన్నంత బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. అయితే ఆరోజు గేట్ తెరవటానికి ఆలస్యం చేశారు. ఉచిత టికెట్ ప్రకటించటంతో ఇలాంటి ప్రమాదం నెలకొందని సాక్ష్యాలు వెల్లడించారు. ఆర్సీబీ విజయోత్సవ సమయంలో తొక్కిసలాటకు బలైన 11 మంది మరణం తనిఖీ తుది దశకు వచ్చింది. శుక్రవారం రోజంతా విచారణ జరిగింది. తనిఖీ ఆఖరి భాగంలో ప్రజలు పాల్గొననున్నారు. తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటి వరకు 140 మంది సాక్షులు తమ వాంగ్మూలాన్ని తెలియజేయగా, వచ్చే వారం ప్రభుత్వానికి తనిఖీ నివేదిక సమర్పించే అవకాశముందని ఉన్నత వర్గాల ద్వారా తెలియవచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు లేదు ● ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ స్పష్టీకరణ శివాజీనగర: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఇటు రెబల్ నాయకులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌ను భేటీ చేశారని తెలిసింది. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి అధిష్టానం వద్ద ఎలాంటి చర్చ జరగలేదన్నారు. రాష్ట్రాధ్యక్షుడి మార్పుపై మీడియాలో మాత్రమే కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏమైనా కేంద్ర నాయకుల నిర్ణయమే అంతిమమన్నారు. కేవలం కర్ణాటక మాత్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నియామకం జరుగుతోందన్నారు. విజయేంద్రకు విరుద్ధంగా ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి అవకాశం లేదన్నారు. మూడు నెలలకు ఒకసారి వచ్చి నివేదిక ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలిపారు. తాను అంతమాత్రమే చేస్తానని, మిగతా విషయాలు తెలియవని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఏరో నాటికల్ ఇంజినీర్ మృతి దొడ్డబళ్లాపురం: స్కూటర్‌ను ఫార్చూనర్ కారు ఢీకొని ఏరోనాటికల్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన బెంగళూరులోని బాగలూరు రోడ్డులోని కేఐఏడీబీ జంక్షన్లో చోటుచేసుకుంది. బెంగళూరు సమీపంలోని నెలమంగల తాలూకా హుస్కూరు గ్రామానికి చెందిన నందిని(24) బాగలూరులోని పీజీలో ఉంటూ ఏరోనాటికల్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. గురువారం రాత్రి పని ముగించుకుని తన స్కూటర్లో పీజీకి తిరిగి వస్తుండగా కేఐఏడీబీ జంక్షన్లో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ నందినిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతిచెందింది. చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బనశంకరి: వాయు కాలుష్యంలో ఢిల్లీ తర్వాత చోటు దక్కించుకున్న సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో ఊపిరి తీసుకోవాలంటే కష్టమే. లక్షలాది వాహనాల సంచారంతో నిత్యం టన్నుల కొద్దీ కాలుష్యం గాలిలో కలుస్తోంది. దీంతో స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం ప్రజలు తపించి పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బెంగళూరు నగరంలో హెచ్చుమీరుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లు పెంచి పోషించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బీబీఎంపీ కూడా ప్రాణవాయువును ఎక్కువ విడుదల చేసే మొక్కలతో ట్రీపార్కుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. నగరంలో వందలాదిగా ఉద్యానవనాలు వాస్తవంగా బెంగళూరు నగరం వందలాది ఉద్యానవనాలతో అలరారుతోంది. లక్షలాది చెట్లు నగరవాసులకు ప్రాణవాయువు అందిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఉద్యానవనాలు కలిగిన నగరంగా బెంగళూరు ఖ్యాతి పొందింది. కొన్ని దశాబ్దాలుగా బెంగళూరు నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. సంఖ్యాపరంగా ఉద్యాన నగరిగా చెబుతున్నప్పటికీ ఈ పార్కులనుంచి కాలుష్య ప్రమాణం తగ్గించడం సాధ్యం కాలేదు. అలంకరణచెట్లు, కుజ్జ మొక్కలను పెంచడానికి ఇచ్చే ప్రాధాన్యత దేశీయ వృక్షజాతులైన ఎక్కువ ప్రాణవాయువు విడుదల చేసే అల్లనేరేడు, వేప, అర్జున, శ్రీగంధ, వెదురు, రావి తదితర చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ట్రీ పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రస్తుతం పాలికె పరిధిలో ఏటా పార్కులను అబివృద్ధి చేస్తుండగా వీటి నిర్వహణకు ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు అవుతోంది. స్థలం సమస్యతో కొత్త ఉద్యానవనాల విస్తీర్ణం తగ్గుతోంది. ఒకపార్కు అభివృద్ధి చేయడానికి రూ.3 నుంచి 4 కోట్లు ఖర్చు అవుతోంది. కొన్ని పార్కులకు రూ.5 కోట్లుకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పార్కుల సుందరీకరణ పేరుతో లాన్, అలంకరణమొక్కలు, గ్రానైట్రాతి బెంచీలు, వాకింగ్ ట్రాక్‌కు నిధులు వ్యయం చేస్తున్నారు. వీటికి బదులు చెట్లను పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఉద్యానవనాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్ల పాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దాల క్రితం ట్రీపార్కు తరహాలో పాలికె ఏర్పాటు చేసినప్పటికీ దానిని పూర్తిగా అమల్లోకి తీసుకురావడంలో సఫలీకృతం కాలేదు. వందేభారత్ రైలులో మంటలు సాక్షి,బళ్లారి: వందేభారత్ రైలులో మంటలు చెలరేగాయి. అయితే తృటిలో పెనుప్రమాదం తప్పింది. శుక్రవారం ధార్వాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా దావణగెరె జిల్లాలోకి రాగానే బోగీల్లోని చక్రాల్లో మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన రైల్వే శాఖ అధికారులు రైలును ఆపేశారు. ప్రయాణికులను వేరే రైలు ద్వారా బెంగళూరుకు పంపించారు. మైసూరు : ఆషాఢ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలో చాముండి కొండ పైన వెలసిన నాడ శక్తి దేవత చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం మొదటి శుక్రవారం కావడంతో చాముండేశ్వరి దేవి దర్శనానికి కర్ణాటక నుంచి మాత్రమే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. తెల్లవారుజామునే చాముండేశ్వరి అమ్మవారి అలయాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అమ్మవారిని సైతం వివిధ రకాల రంగుల పూలతో అలంకరించారు. మూల విరాట్‌తోపాటు ఉత్సవమూర్తిని సైతం అలంకరించారు. తెల్లవారు జామునుంచే భక్తులు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు లలిత మహల్ మైదానం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. నటి శృతి, మాళవికా అవినాష్ తదితర నటులు అమ్మవారిని దర్శించుకున్నారు. మైసూరు జిల్లాధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, ఎమ్మెల్యే జీ.టీ.దేవెగౌడ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన ముత్తైదువులకు శ్రీదుర్గా పరమేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, గాజులు వాయనంగా అందజేశారు. అధ్యక్షురాలు రేఖా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉద్యాననగరిలో వాయుకాలుష్య నియంత్రణకు ట్రీ పార్కులు వేప, అర్జున, శ్రీగంధ, వెదురు, రావి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత కసరత్తు చేస్తున్న బీబీఎంపీ ఉద్యానవన విభాగం లక్ష్మీదేవిగా భక్తులకు చాముండేశ్వరి దేవి దర్శనం నాడ శక్తి దేవత దర్శనానికి తరలివచ్చిన భక్తులుట్రీపార్కులపై దృష్టి బీబీఎంపీలో ట్రీపార్కులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించాం. ఇప్పటికే అభివృద్ధి చేసిన ఉద్యానవనాల్లో ఆక్సిజన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే వివిధ జాతుల మొక్కలు నాటాం. కొత్తపార్కుల్లో కూడా ఇదే విధానాన్ని అమలుపరుస్తున్నాం. దేశీయ జాతుల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ ఏడాది 50 పార్కులను అభివృద్ధి చేయాలని పథకం రూపొందించాం –ఎంఆర్.చంద్రశేఖర్, బీబీఎంపీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ అప్పట్లో మొత్తం పచ్చదనమే ‘గతంలో మేము బెంగళూరుకు వచ్చినప్పుడు ఎక్కడచూసినా భారీ వృక్షాలు, కూడళ్లలో వాటర్ ఫౌంటేన్లు కనిపించేవి. బెంగళూరు నగరం శరవేగంగా విస్తరించడంతో కాలుష్యం కూడా పెరుగుతోంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పచ్చదనం పెంచడంతో పాటు ఆక్సిజన్ లభించే మొక్కలు నాటి పోషించాలి’ అని కేఎస్‌పీసీబీ అధ్యక్షుడు పీఎం.నరేంద్రస్వామి అన్నారు. -
వీడిన పులుల మరణాల మిస్టరీ
మైసూరు: చామరాజనగర జిల్లాలోని మలెమహదేవ వన్యజీవుల ధామంలోని మీణ్యం అటవిలో ఒక తల్లి పులితో పాటు దానికి చెందిన నాలుగు పులి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును అటవీ శాఖాధికారులు చేధించారు. వాటికి విషం పెట్టడంతో మృతి చెందాయని అధికారుల విచారణలో తేలింది. ఈమేరకు హనూరు తాలూకాలోని గాజనూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన పులుల కళేబరాలు లభించిన స్థలంలో ఆవు మాంసం లభించడంతో పాటు వేటాడి చంపిన ఆవు మృతదేహంపై పురుగులమందు చల్లడంతో దానిని తిన్న పులితోపాటు దాని పిల్లలు తిని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పులి దాడిలో మృతి చెందిన ఆవు ఎవరిది? అన్న విషయం కనిపెట్టి ఆవును చంపిన కోపంతో దుండగులు పులిని చంపడం కోసం విషం పెట్టారా? లేక ఇది వేటగాళ్ల పని అయి ఉంటుందా? అన్న దానిపై తనిఖీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతి చెందిన వాటిలో నాలుగు ఆడ పులులు, ఒక మగ పులి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును పూర్తిగా తనిఖ చేయడానికి పీసీసీఎఫ్ బీ.పీ.రవి ఆధ్వర్యంలో ఆరు మంది అధికారుల బృందాన్ని నియమించారు. పులులు మృతి చెందిన స్థలానికి అధికారులు వచ్చి పరిశీలించారు. 14 రోజుల్లో పులుల మరణానికి కారణాలపై సరైన నివేదికను ఇవ్వాలని తనిఖీ బృందం అధికారులకు సూచించారు. శుక్రవారం నాలుగు పులి పిల్లలకు పోస్టుమార్టం జరిపిన అనంతరం ఎన్టీసీఏ ఆదేశాల ప్రకారం 5 పులుల కళేబరాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విషం పెట్టినట్లు నివేదికలో వెల్లడి నలుగురు నిందితుల అరెస్ట్ -
భవనం టెర్రస్ పైకి యువతి.. రీల్స్ పిచ్చే బలి తీసుకుందా?
బెంగళూరు: తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన ఒక యువతి, నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం రాత్రి ఆ మహిళ తన స్నేహితుల బృందంతో కలిసి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ భవనానికి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు.పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్‌పైకి వెళ్లింది.. అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి నుంచి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బీహార్‌కు చెందిన యువతిగా గుర్తించారు. నగరంలోని ఓ షాపింగ్ మార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటననుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే, ఆమె రీల్ షూట్ కోసమే భవనం టెర్రస్‌పైకి వెళ్లినట్లు చెబుతున్నప్పటికి.. ఆమె ఫోన్ నుంచి అలాంటి రికార్డింగ్ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఆ యువతి ప్రమాదవశాత్తు పడిపోయిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో ఆరో తరగతి బాలిక హఠాన్మరణం.. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా అధికమయ్యాయి. నూరేళ్ల జీవితం కళ్లముందే ఆవిరైతే కన్నవారి ఆవేదన మిన్నంటుంతోంది. ఈ కడుపు కోతకు పరిష్కారమే లేదా అని ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు కొన్ని పరిశోధనలు చేసి మొబైల్‌ఫోన్‌తో పాటు మరికొన్ని లింకులు ఉన్నట్లు తేల్చారు. కర్ణాటక: హాసన్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అర్ధాంతరంగా కన్నుమూసింది. బెంగళూరులో నివాసం ఉంటున్న సుప్రియా (22) గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు విడిచింది. దీంతో గత నెలరోజుల్లో గుండెపోటుతో చనిపోయిన హాసన్వాసుల సంఖ్య 14కు పెరిగింది. సుప్రియా హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా కట్టళ్లి వాసి, బెంగళూరు బ్యాటరాయనపురలో నివాసం ఉంటూ కర్ణాటక ఓపెన్ వర్శిటీలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఇంటిలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలింది. కుటుంబీకులు ఆస్పత్రి తరలిస్తుండగా దారిలో మరణించింది. -
ఆ రోడ్డులో ప్రయాణం.. నరకప్రాయం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలోని తుంగభద్ర విద్యా సంస్థ సమీపంలోని ఉజ్జయిని– జోలా రోడ్డు గుంతలు పడి వాహన సంచారం నరకప్రాయంగా మారింది. ఈ రోడ్డులో సంచరించే వాహనదారులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సంచరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటు వహించినా వారు ఆస్పత్రి పాలయ్యే అవకాశం ఉంది. రోడ్డుపై గుంతలు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. వర్షాలతో అధికంగా నీరు చేరడం వల్ల గుంతల్లో నీరు నిలిచి రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడిన ఉదంతాలు ఉన్నాయి. గుంతలు పడిన రోడ్డును చూసి పట్టణ గ్రీన్ టీం, రైడర్లు సజావుగా ప్రయాణించడానికి వీలుగా గుంతలను మట్టితో నింపింది. అయితే వర్షం కారణంగా రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. ఏదైనా ప్రమాదం జరగక ముందే అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డుకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. -
జాతీయ పార్టీలను తిరస్కరించాలి
● సీపీఎం నాయకుడు కరుణానిధి పిలుపు హొసపేటె: కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించాలని ఈనెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీపీఎం తాలూకా కమిటీ నాయకుడు ఏ.కరుణానిధి పిలుపునిచ్చారు. బుధవారం చిత్తవాడిగిలో పార్టీ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. పహల్గాం దాడి తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య శత్రుత్వాన్ని నాటుతోందని, మత సహనాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కలహాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రజల బాధలను వినడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించి, నిరంతర పోరాటం ద్వారా ముందుకు నడిచే సీపీఎం పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. పార్టీ నాయకుడు హెచ్ఎం.జంబునాథ్ మాట్లాడుతూ హొసపేటెలోనే చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలకు జీవనాధారమైన చక్కెర కర్మాగారం, డిస్టిలరీ మూతపడటానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే ప్రత్యక్ష బాధ్యత వహించాలన్నారు. ప్రజలకు నివసించడానికి సొంత ఇల్లు లేదు, చేయడానికి పని లేదు, మతతత్వ శక్తులు ఈ పరిస్థితులన్నింటినీ దోపిడీ చేస్తున్నాయి. కనుక ప్రజలు ఎలాంటి విధి లేకుండా పోరాటానికి ముందుకు రావాలన్నారు. -
మత్తుతో చేసుకోవద్దు జీవితాలు చిత్తు
రాయచూరు రూరల్: నగర, ,గ్రామీణ ప్రాంతాల్లో యువకులు గంజాయి, హఫీమ్ వంటి మత్తు పదార్థాలను సేవించి ఆరోగ్యాలను నాశనం చేసుకోరాదని జిల్లాధికారి నితీష్ సూచించారు. గురువారం ప్రైవేట్ పాఠశాలలో జిల్లాధికారి, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య శాఖ, మానసిక ఆరోగ్య శాఖ, రిమ్స్, నవోదయ ఆస్పత్రి, భండారి ఆస్పత్రి, ఐఎంఏల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో గంజాయి మాదక వస్తువుల సేవన నిర్మూలనపై జన జాగృతి జాతాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ఈ విషయంపై ప్రజలను జాగృతం చేయాలన్నారు. ఇంటింటికెళ్లి యువకులు మాదక వస్తువులను సేవించకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చైతన్యపరచాలన్నారు. జాతాలో జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్రబాబు, ఎస్పీ పుట్టమాదయ్య, డీఎస్పీ శాంతవీర, రిమ్స్ అధికారులు విజయ శంకర్, రమేష్, మనోహర్ పత్తార్, యశోద, గణేష్, ప్రజ్వల్, పవన్ పాటిల్, కుంటెప్పలున్నారు. రిమ్స్ కళాశాల విద్యార్థులకు గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి నాటక ప్రదర్శన చేశారు. -
దర్వేశ్ ఆస్తుల జప్తుకు సూచన
రాయచూరు రూరల్: నగరంలో అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి రూ.900 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టిన దర్వేశ్ కంపెనీ ఆస్తులను జప్తు చేయాలని రెవెన్యూ శాఖ ఉప కార్యదర్శి అన్వర్ పాషా రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి డిపాజిట్ల పేరుతో అధిక శాతం వడ్డీ ఇస్తామని ఏజెంట్ల నుంచి తెచ్చుకున్న డబ్బులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి ఆస్తులను స్వాధీనపరచుకోవాలని సూచించారు. దర్వేశ్ బ్యాంక్ ఖాతాలోని డబ్బును సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుజాతో పాటు 22 మందికి చెందిన బ్యాంక్ ఖాతాలను జప్తు చేశారు. మహీంద్ర, స్కార్పియో, క్రెటా, సోనెట్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. తాగునీరు అడిగినందుకు దాడి రాయచూరు రూరల్: గ్రామంలో కొళాయిలకు తాగునీరు విడుదల చేయరా? అని ప్రశ్నించినందుకు దాడి చేసిన ఘటన జిల్లాలోని సిరవార తాలూకాలో చోటు చేసుకుంది. గురువారం తాలూకాలోని బాగలవాడలో జీపీ అధ్యక్ష స్థానం అలంకరించిన తిప్పణ్ణను గత వారం రోజుల నుంచి కొళాయిల్లో తాగునీరు రావడం లేదని బసప్ప అనే వ్యక్తి ప్రశ్నించినందుకు తిప్పణ్ణ మద్దతుదారులు బసప్పపై దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గుంతకల్లులో రాయచూరు జిల్లా వాసి బలవన్మరణం గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులోని రైల్వే పార్సిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్క్‌లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అటుగా వెళ్లిన ప్రయాణికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. చొక్కా జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు కర్ణాటకలోని రాయచూరు జిల్లా గుడదనాళకు చెందిన శరణప్ప(39)గా గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. జొన్నల డబ్బులు చెల్లించండి రాయచూరు రూరల్: కర్ణాటక వ్యవసాయ మండలి రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నల డబ్బులు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం సింధనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నిరుపాది మాట్లాడారు. నాలుగు నెలల క్రితం రైతులు విక్రయించిన జొన్నలకు ఇంకా అధికారులు డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. మిగిలిన జొన్నల కొనుగోళ్ల గడువును 15 రోజుల పాటు విస్తరించాలని, బకాయి ఉన్న రూ.13 కోట్ల నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
విభిన్న పంటల సాగులో దిట్ట ముత్తణ్ణ
హుబ్లీ: వైవిధ్యమయమైన సాగుకు హావేరిలోని కామనహళ్లి రైతు ముత్తణ్ణ ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. స్కూల్ మెట్లు ఎక్కని రైతు ముత్తణ్ణ బీరప్ప పూజార అన్ని విద్యల కన్నా వ్యవసాయం మిన్న అని నిరూపించారు. ఆయనకు రాజ్యోత్సవ అవార్డు కూడా లభించింది. అంతేగాక ధర్మస్థల సాగు మేళా, జిల్లా మేళాతో పాటు వివిధ మేళాల్లో పలు అవార్డులను ముత్తణ్ణ స్వీకరించారు. ఆయన స్వగ్రామం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలోని నవిలెహాళ. రెండు దశాబ్దాల క్రితం ఆయన తల్లిదండ్రులతో కలిసి గొర్రెలను పెంచుకుంటూ హావేరికి వచ్చారు. ఆయనతో పాటు ఉన్న 2500 గొర్రెలు, మేకల్లో రోగాల బాధతో 1000కి పైగా మరణించాయి. దీంతో గొర్రెల పెంపకానికి స్వస్తి చెప్పిన ముత్తణ్ణ తల్లిదండ్రుల సహాయంతో కామనహళ్లిలో సుమారు 10 ఎకరాల పొలంలో సాగు బాట పట్టారు. అయితే ఆ పొలం వట్టిపోయినందున గ్రామస్తులు ఎద్దేవా చేసేవారు. అయినా మొక్కవోని దీక్షతో ముత్తణ్ణ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సహాయ సహకారాలతో ఆ 10 ఎకరాల పొలంలో వివిధ పంటలు సాగు చేశారు. అలాగే వక్క నర్సరీని ప్రారంభించారు. ఇక అప్పట్నుంచి తిరుగు లేదు ఇక అప్పటి నుంచి ముత్తణ్ణకు తిరుగు లేకుండా పోయింది. ప్రారంభంలో వేలాది వక్క మొక్కలను అమ్ముతున్న ఈయన ఈ ఏడాది మూడు లక్షల వక్క మొక్కలతో పాటు మామిడి, కొబ్బరి మొక్కలను విక్రయించాడు. ప్రస్తుతం ముత్తణ్ణ వద్ద 37 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొబ్బరి, అరటి, వక్క, సపోటా, మామిడి తదితర వైవిధ్యమైన సాగు చేస్తున్నారు. అంతేగాక పాడిపరిశ్రమ, చేపల పెంపకం, తేనెటీగల సాగు, అజోళతో పాటు సేంద్రియ సాగు పద్ధతులతో జిల్లాలోని అందరి రైతులకు స్పూర్తినిస్తున్నారు. సుమారు 24 రకాల వరిని పండిస్తున్నారు. అవన్ని కూడా జేసీ వంగడాలు కావడం విశేషం. ఆయన పండించిన వరి కొనుగోలుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ఆసక్తిని చూపుతున్నాయి. ప్రారంభంలో ఎకరాకు 20 క్వింటాళ్ల వరి పండిస్తున్న ముత్తణ్ణ అత్యాధునిక సాగు పద్ధతులతో ఒక్కో సారి ఎకరాకు 48 క్వింటాళ్ల వరి పండించిన ఉదాహరణలు ఉన్నాయి. 37 ఎకరాల భూమిలో 15 బోరు బావులు ఉన్నాయి. ఆయన పొలానికి మొత్తం మూడు టీసీలు ఉన్నాయి. పైపు లైన్ ద్వారా జల ఎరువు సరఫరా ఇంట్లో జైవిక బయోట్యాంక్ నిర్మించి ఇక్కడి నుంచి లభించే సేంద్రియ జల ఎరువును తోటలకు పైపు లైన్ ద్వారా సరఫరా చేస్తారు. ముఖ్యంగా ఆయన తోటలో రాత్రి సమయాల్లో సంగీతం వినిపించడం సాగుకు ప్రత్యేకతగా చెబుతున్నారు. పగలు మనం తోటలో సంచరిస్తాం. పశువులు, పక్షులు, పని మనుషులు కూడా ఉంటాయి. దీంతో వృక్షాలకు ఎటువంటి ఒంటరితనం అనుభవంలోకి రాదు. అయితే రాత్రి వేళ ఎటువంటి శబ్దాలు ఉండవు. ఈ సమయంలో శాసీ్త్రయ సంగీతం, వైవిధ్యమయ సంగీత పరికరాలతో ధ్వని సురళి వేయడం ద్వారా పాటలు వినిపిస్తాయి. వీటికి చెట్లు చేమలు స్పందిస్తాయి. ఫలితంగా ఎక్కువ దిగుబడి వస్తుంది. సంగీతానికి ఆ శక్తి ఉందని ముత్తణ్ణ సంతోషంగా చెబుతారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా ఆయన తోటకు అన్నదాతలు విచ్చేసి కొత్త ప్రయోగాల గురించి వివరాలు తెలుసుకుంటారు. ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం తనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన ముత్తణ్ణ ఈ అవార్డుతో నా బాధ్యత మరింతగా పెరిగింది. ఇదంతా నాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వ్యవసాయ అధికారులకు, తోటి రైతులకు చెందుతుందని ఆయన తెలిపారు. 24 రకాల వరితో మేలైన దిగుబడి రాత్రి వేళ పొలంలో సంగీత శ్రావ్యం -
నేడు దేవెగౌడ ప్రతిమ ఆవిష్కరణ
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గలో శుక్రవారం ప్రజలతో జనతాదళ్ జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ తెలిపారు. గురువారం దేవదుర్గలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవదుర్గ తాలూకా చిక్క హొన్నకుణి వద్ద రైతు మల్లనగౌడ నాగరాళ, గ్రామస్తులు అభిమానంతో తయారు చేసిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ప్రతిమను మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం ఆవిష్కరిస్తారన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి జేడీఎస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి మాజీ ప్రధాని దేవెగౌడ చేస్తున్న అవిశ్రాంత పోరాటానికి విజయం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేవెగౌడ ప్రతిమను నిర్మించిన దాతలను సన్మానిస్తున్నట్లు తెలిపారు. -
కుండపోత వర్షాలు.. ఉపనదుల పరవళ్లు
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మతో పాటు ఉప నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. బెళగావి జిల్లా చిక్కోడి డివిజన్లో కల్లోళ, యడూర, మలికవాడ, దత్తవాడ, జత్రోట, బివశి సిద్దాళ, అకోళ, నిప్పాణి తాలూకా బారవాడ, కున్నూర, కారదగ, బోజ తదితర ఎనిమిది వంతెనలు జలావృతం అయ్యాయి. ఈ మార్గంలో కర్ణాటక, మహారాష్ట్రల మధ్య రాకపోకల సంబంధాలు స్తంభించాయి. ఆల్మట్టి డ్యాం నుంచి 10 గేట్లను తెరిచి కృష్ణా నదిలోకి 98,250 క్యూసెక్కుల నీటిని వదిలారు. మరో వైపు రోడ్డు కోతకు గురి కావడంతో బెళగావి, గోవా మధ్య రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. కుసుమళ్లి వద్ద నదిపై నిర్మించిన వంతెన నీట మునిగింది. ఏళ్ల తరబడి నూతన వంతెన నిర్మాణం విషయంలో గందరగోళం నెలకొంది. ప్రజా ప్రతినిధులు వంతెన పనులను పూర్తి చేయడానికి నిధుల కొరతను సాకుగా చెబుతున్నారు. ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. నది ఒడ్డున ఉన్న శిశిలేశ్వర ఆలయం జలావృతమైంది. బెళగావి జిల్లాలో బెణ్ణెతుప్రి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల రైతుల్లో ఆనందం తాండవిస్తోంది. -
ఆరోగ్యకర దేశ నిర్మాణం అందరి బాధ్యత
హొసపేటె: ఆరోగ్యకరమైన దేశ నిర్మాణానికి అందరి సహకారం అవసరం, ఇది ఒక బాధ్యత కూడా అని కన్నడ సినీ నటుడు అజయ్‌రావు తెలిపారు. గురువారం నగరంలోని పునీత్ జిల్లా క్రీడా మైదానంలో జిల్లా పోలీస్ శాఖ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు నాటకం, వ్యాసరచన పోటీలు వంటి కార్యకలాపాల ద్వారా మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల వాడకానికి బానిసైన వారిని గుర్తించి వ్యసన రహిత కేంద్రాల ద్వారా చికిత్స చేయాలన్నారు. మాదకద్రవ్యాలు వాడే వ్యక్తి తన స్వంత ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవడం ద్వారా వ్యసనం నుంచి విముక్తి పొందవచ్చని ఆయన అన్నారు. అనంతరం ఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉజ్వల భవిష్యత్ నిర్మించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కొప్పళ గవిమఠం అభినవ గవిసిద్దేశ్వర మహాస్వామీజీ, నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భూముల రక్షణకు రైతుల దండయాత్ర
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి తాలూకాలోని చెన్నరాయపట్టణ, చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఏరోస్పేస్, టెక్ పార్క్ నిర్మాణం కోసం వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారంనాడు వందలాదిమంది రైతులు, దళిత సంఘాల కార్యకర్తలు ముఖ్యమంత్రి నివాసం వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వారు గతంలో ప్రతిపక్షంలో ఉండగా భూస్వాధీనాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తూ రైతులకు అన్యాయం చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. రైతులు మూడున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తానన్నారు. 24 గంటల లోపు ప్రభుత్వం భూస్వాధీనం నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరించారు. తమపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కోరారు. జులై 4న ముఖ్యమంత్రి రైతులను చర్చలకు పిలిచారని అయితే అప్పటి వరకూ తమ పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేసారు. అభివృద్ధి కోసం ప్రతిసారీ రైతుల భూములే లాక్కుంటున్నారని,ఇది చాలా అన్యాయమన్నారు. -
చాముండి కొండపైకి ఉచిత బస్సులు
మైసూరు: ఆషాడమాసంలో ప్రతి శుక్రవారం చాముండి కొండపై అమ్మవారికి విశేష పూజలకు మైసూరు నగరం నుంచి వేలాదిగా భక్తులు తరలివెళ్తారు. భక్తుల కోసం 60కి పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ అధికారి వీరేష్ గురువారం తెలిపారు. లలిత మహాల్ నుంచి వెళ్లే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం ఉందని చెప్పారు. మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణమని తెలిపారు. అమ్మవారి దర్శనానికి రూ.2 వేల టికెట్ కొన్నవారి కోసం లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. సీఎంకు అన్నీ చెప్పాను: బీఆర్ శివాజీనగర: సంతృప్తి, అసంతృప్తి అంటూ నాదేమీ లేదు, జరిగింది ఆయనకు చెప్పాను, అని సీఎం సిద్దరామయ్యను భేటీ తరువాత కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యే బీ.ఆర్.పాటిల్ తెలిపారు. ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరుగుతోందని ఆయన ప్రకటించడంతో కలకలం రేగడం తెలిసిందే. గురువారం కావేరి నివాసంలో సిద్దరామయ్యను భేటీ చేసి చర్చించారు. తరువాత మీడియాతో మాట్లాడారు, నేను చెప్పాల్సింది చెప్పి వచ్చాను. డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌కు కూడా వివరంగా చెప్పానన్నారు. వారు ఓపికగా విన్నారు. ఎలాంటి చర్యలు తీసుకొంటారనేది వారికి సంబంధించినది అని అన్నారు. తొక్కిసలాట కేసు.. దయానంద్ విచారణ బనశంకరి: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో సస్పెండైన నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ గురువారం బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ ముందు మెజస్టీరియల్ విచారణకు హజరయ్యారు. గంటకు పైగా కలెక్టర్ విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. భద్రతా లోపం , విధుల్లో లోపాలున్నాయా అని అడిగారు. విజయోత్సవం వద్దంటూ డీసీపీ కరిబసవనగౌడ రాసిన లేఖ గురించి కూడా కలెక్టర్ జగదీశ్ ప్రస్తావించారు. ఆర్సీబీ, డీఎన్ఏ ప్రతినిధులు ఒత్తిడి చేశారా అని అడిగారు. భారీ సంఖ్యలో వస్తారని ఊహించారా, అంచనా వేసినట్లైతే ఎందుకు మీరు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు అని ఆరా తీశారు. స్టేడియం వద్ద భద్రత కల్పించడానికి ఎందుకు ఆలస్యమైంది అని విచారించారు. సెప్టెంబరులో రాజకీయ మార్పులు: మంత్రి శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ ఎత్తున మార్పులు జరగనున్నాయని సీఎంకు సన్నిహితుడు, మంత్రి కే.ఎన్.రాజణ్ణ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు జరుగనున్నాయని, దీని గాలి చల్లగా వీస్తోంది. సెప్టెంబర్ గడవనీ అని అన్నారు. సీఎం సిద్దరామయ్య 2013లో ఉన్నట్లుగా ఇప్పుడు లేరని విలేకరులు ప్రస్తావించగా, పవర్ సెంటర్లు అధికమయ్యాయి, ఏం చేయడానికీ సాధ్యపడదు అని అన్నారు. అప్పట్లో అయితే ఒకే పవర్ సెంటర్ ఉండేదని, సిద్దు మీద ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు, నేడు పరిస్థితి మారిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు డిమాండ్‌కు తగినట్లు నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తి ఉండవచ్చు. గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉందన్నారు. బనశంకరి: అధికంగా మొబైల్‌ఫోన్ వినియోగం, ఆటపాటలు వంటి పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, దానివల్ల స్థూలకాయం పెరిగి తదితర కారణాలతో బాలలు, విద్యార్థులు హృద్రోగానికి గురవుతున్నారని హుబ్లీలోని కర్ణాటక మెడికల్ కాలేజీ , పరిశోధనా సంస్థ (కిమ్స్) పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విష వలయంపై క్షుణ్ణంగా పరిశోధన చేసి నివేదికలను రూపొందించారు. కొవ్వు శాతం పెరిగింది ● ఇటీవ రోజుల్లో రాష్ట్రంలో చిన్న వయసు పిల్లలు, 30 ఏళ్లలోపు యువతీ యువకులు గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్న దుర్ఘటనలు ఎక్కువయ్యాయి. ● దీనిపై పలు వాదనలు వినబడుతుండగా నిజానిజాలను వెలికి తీయడానికి కిమ్స్ డాక్టర్లు నడుం కట్టారు. ● కిమ్స్ ఆసుపత్రి విభాగం పరిశోధన కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ రామ కౌలగుడ్డ, సముదాయ ఆరోగ్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంజునాథ్ నేకార, శాస్త్రవేత్తలైన డాక్టర్ శివకుమార బేలూర, డాక్టర్ అరుణ శెట్టర్ బృందం అధ్యయనం చేపట్టారు. ● ధార్వాడ జిల్లాలోని ఆరు పాఠశాలలకు చెందిన 8 , 9 తరగతులు చదువుతూ అధిక బరువు ఉన్న సుమారు 30 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ● 26 మంది విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు వెలుగుచూశాయి. చిన్న వయసులోనే షుగర్, అధిక రక్తపోటు, 11 మందిలో కొవ్వు సంబంధ ట్రైగ్లిజరైడ్స్, హోమోసిస్టీన్స్ అంశాలు ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. ● గుండె జబ్బుల వ్యాప్తికి ఇవి కారణమవుతున్నట్లు తేల్చారు. ఇంకా ఏం సూచించారు..? కిమ్స్ వైద్యులు తమ నివేదికలను భారతీయ ఆయుర్ విజ్ఞాన సంస్థకు, విద్యశాఖ మంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రికి సమర్పించారు. తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు పాఠ్యేతర కార్యకలాపాల్లో అధికంగా పాల్గొనేలా పాఠశాలలు, కాలేజీలను ఆదేశించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి సమగ్ర వైద్య పరీక్షలు చేయడానికి రూ.5 వేలు చొప్పున ఖర్చవుతుంది. ప్రభుత్వమే ఈ పరీక్షలు నిర్వహించి తగిన వైద్యసేవందిస్తే బాలల్లో గుండెపోటు ముప్పును తగ్గించవచ్చునని డాక్టర్లు పేర్కొన్నారు. నివేదికపై స్పందన నిల్ నివేదిక ఇచ్చి ఐదునెలలు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని సదరు వైద్యులు ఆవేదన వ్యక్తంచేశారు. బాలలు అధికంగా మొబైల్ చూస్తూ కదలకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఆటలు ఆడడం తగ్గింది అని డాక్టర్ రామ కౌలగుడ్డ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో ఆరో తరగతి బాలిక హఠాన్మరణం.. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా అధికమయ్యాయి. నూరేళ్ల జీవితం కళ్లముందే ఆవిరైతే కన్నవారి ఆవేదన మిన్నంటుంతోంది. ఈ కడుపు కోతకు పరిష్కారమే లేదా అని ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు కొన్ని పరిశోధనలు చేసి మొబైల్‌ఫోన్‌తో పాటు మరికొన్ని లింకులు ఉన్నట్లు తేల్చారు. సెల్ వ్యసనం, ఆటపాటలకు దూరం బాలల్లో గుండెజబ్బులకు ఇవీ కారణాలే హుబ్లీ కిమ్స్ వైద్యనిపుణుల అధ్యయనం తరగతిలో ఉపాధ్యాయుడు.. సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో రోజు రోజుకు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించే ఘటనలు అధికమయ్యాయి. గురువారం బాగల్‌కోట జిల్లా జమఖండిలో తుంగళ హైస్కూల్లో కన్నడ ఉపాధ్యాయుడు గురుపాద (49) పాఠం చెబుతూనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఉడ్తా కర్ణాటక కానివ్వం
శివాజీనగర: రాష్ట్రంలో గత సంవత్సరంలో నాలుగు వేల కేజీల గంజాయితో పాటుగా రూ.45 కోట్ల విలువ చేసే వివిధ తరహాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నాం. ఈ దందాలో పాల్గొంటున్న 200 మంది విదేశీయులను వారి దేశాలకు పంపించామని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ప్రపంచ డ్రగ్స్, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా గురువారం బెంగళూరు నగర పోలీస్ ద్వారా కంఠీరవ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విచ్చలవిడి డ్రగ్స్ వాడకం వల్ల పంజాబ్‌ను ఉడ్తా పంజాబ్ అని పిలుస్తున్నారు. ఉడ్తా కర్ణాటక కానివ్వబోము అని చెప్పారు. డ్రగ్స్ వల్ల మనిషికి శారీరకంగా, మానసికంగా దుష్పరిమాణాలను అర్థం చేసుకోవాలన్నారు. మాదక వ్యసనానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోరాదన్నారు. డ్రగ్స్ దందాను చట్టం ద్వారా అడ్డుకోలేం, యువకుల మనస్సును జాగృత పరచాలని చెప్పారు. డ్రగ్స్ రవాణా, వాడకం అడ్డుకట్టకు మరిన్ని కఠిన చర్యలను తీసుకుంటామని తెలిపారు. ప్రతి కాలేజీలో డ్రగ్స్ వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మత్తు వ్యాపారం గురించి తెలిసిన తక్షణమే ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చి సహకరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ నిల్వలను నాశనం చేసే కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రజలు సమాచారం అందించడానికి రక్ష క్యూ ఆర్ కోడ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, డీజీపీ ఎం.ఏ.సలీం, ఐపీఎస్‌లు పాల్గొన్నారు. కాగా, బెంగళూరుతో పాటు అన్ని జిల్లాల్లో విద్యార్థులు జాగృతి ర్యాలీలను నిర్వహించారు. డ్రగ్స్ అడ్డుకట్టకు చర్యలు హోంమంత్రి పరమేశ్వర్ -
మళ్లీ వరుణ తాండవం
బనశంకరి: మరోసారి కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటక తో పాటు పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. కొడగులో రెడ్ అలర్ట్ ప్రకటించి, 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు. పలుచోట్ల బడులు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బెళగావి, ఉత్తరకన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, శివమొగ్గ, హాసన్, చిక్కమగళూరు జిల్లాల్లో ఉధృతంగా వానలు పడుతున్నాయి. మహారాష్ట్రలో, పశ్చిమ కనుమల్లో కుండపోత కారణంగా బెళగావి జిల్లాలో సప్త నదులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. పరిసర గ్రామాల ప్రజలకు ముంపు ముప్పు ఏర్పడింది. అనేకమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తీవ్ర వర్షాలతో బెళగావి జిల్లా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖానాపుర వద్ద హబ్బానట్టి మారుతి ఆలయం జలమయమైంది. ఇక్కడ హలాత్రి కాలువ కూడా వంతెన మీద నుంచి ప్రవహిస్తోంది. 10కి పైగా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. గోవా కు అనుసంధానంగా ఉండే వంతెన కూడా నీటి మునిగింది. దీంతో ధారవాడ నుంచి గోవాకు వెళ్లాల్సి వస్తోంది. కొడగు సతమతం కొడగు జిల్లాలో వానలు విజృంభించాయి. విద్యాలయాలకు సెలవుఇచ్చారు. ఒక్క రోజులో సరాసరి 61 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మడికెరి తాలూకాలో 57.18 మిల్లీమీటర్ల వాన పడింది. జలపాతాలు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల జలపాతాల వద్ద ప్రజలు, టూరిస్టులు ఉత్సాహంగా గడిపారు. కావేరి నదికి వరద తీవ్రత కొనసాగుతోంది. మండ్య జిల్లాలో కేఆర్ఎస్ డ్యాం గేట్లను ఎత్తేశారు. కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటకలో కుంభవృష్టి పొంగిపొర్లిన నదులు, వాగులు జనజీవనానికి ఆటంకం హైవేలో కూలిన కొండచరియలు యశవంతపుర: హాసన్ జిల్లా సకలేశపుర తాలూకాలో భారీగా వానలు పడుతున్నాయి. జోరుగా కురుస్తున్న వానలతో జాతీయ హైవే– 75లో శిరాడి ఘాట్ మార్గంలో హెగ్గద్ద మారనహళ్లి వద్ద మట్టి చరియలు విరిగి పడ్డాయి. దీంతో బెంగళూరు– మంగళూరు మధ్య సంచరించే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించారు. బేలూరు మార్గంలో చార్మాడి ఘాట్ మార్గంలో వెళ్లాలని అధికారులు సూచించారు. మంగళూరు నుంచి బెంగళూరుకు వెళ్లే వాహనాలను కొడగు జిల్లా సంపాజె మార్గంలో వెళ్లాలని తెలిపారు. ఘటనాస్థలిలో వందల వాహనాలు నిలిచిపోయాయి. అక్కడ చిక్కుకున్న వాహనాల ప్రయాణికులు నరకాన్ని అనుభవిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఆహారం, మంచినీరు లేక అవస్థల్లో ఉన్నారు. -
భర్తను కాదని భార్య వేరే యువకుడితో..
కర్ణాటక: ఓ యువకుడు తమ ప్రియురాలిని చంపి తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన జిల్లాలోని కరోటి గ్రామంలో జరిగింది. హాసన జిల్లా హొసకొప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి హత్యకు గురైంది. పునీత్ అనే యువకుడే హత్య చేసిన నిందితుడు. ప్రీతికి వివాహమై పిల్లలున్నా పునీత్ వెంటపడింది. గత ఆదివారం మండ్య, మైసూరులకు ట్రిప్ వెళ్లిన ఇద్దరూ జాలీ జాలీగా సమయాన్ని గడిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కేఆర్ పేటె కత్తరఘట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పునీత్ ఆమెను చంపి బంగారు ఆభరణాలను దోచుకుని ఆమె మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పునీత్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రీతి పెళ్లయి పిల్లలు ఉన్నా పునీత్ వెంటపడి తనువు చాలించగా తల్లిని కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు. -
సంచార నియమాలను పాటించండి
బళ్లారి రూరల్ : విద్యార్థులు చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛందంగా నగరంలో సంచార నియమాలను పాటించాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాపూజీ సముదాయ భవన్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా జాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. విద్యార్థులకు బంగారు భవష్యత్తు ఉంది. రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ చూసి సురక్షితంగా వెళ్లాలన్నారు. పాదచారులు సంచార నియమాలను పాటించాలన్నారు. సంచార నియమాలను పాటించేలా పాఠశాలల్లో కెప్టెన్, వైస్ కెప్టెన్లను నియమించి విద్యార్థులను జాగృత పరచాలన్నారు. 18 ఏళ్లు పైబడివారు మాత్రమే వాహనాలను నడపాలన్నారు. జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్, ఏఎీస్పీ మంజునాథ, కేఎస్ఆర్టీసీ విభాగ నియంత్రణాధికారి కిరణ్‌కుమార్, డీడీపీఐ డీఎస్పీ కొట్రేశ్ తదితరులు పాల్గొన్నారు. దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున -
కేంద్ర మంత్రిపై నోరు జారడం తగదు
రాయచూరు రూరల్: ఎయిమ్స్ మంజూరు విషయంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై రాయచూరు ఎయిమ్స్ పోరాట సమితి నేతలు అసభ్య పదజాలాన్ని వాడి నోరుజారడం తగదని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి, తెలంగాణలో బీబీనగర్, జమ్ము విజయ నగర్లో ఎయిమ్ష్, కశ్మీర్‌లోని అవంతికల్లో పోరోనిక్స్ విశ్వవిద్యాలయం మంజూరుకు కమిటీలు పరిశీలన చేశాయా? అని ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో కమిటీలు రూపొందిస్తాయనడం అపహాస్యంగా ఉందన్నారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఈ విషయంలో మౌనం వహించాడని చెప్పడం అవివేకమన్నారు. మూడేళ్ల నుంచి పోరాటం చేస్తున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ, శంకరప్ప, పాపారెడ్డి, రవీంద్ర, యల్లప్ప, శంశాలం, శ్రీనివాసరెడ్డిలున్నారు. -
టీచర్ దండనకు బాలిక బలి
యశవంతపుర: యూనిఫారం ధరించలేదని ఉపాధ్యాయురాలు మందలించినందుకు విద్యార్థిని భయపడి పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా లింగదహళ్లిలో సర్కారీ బడిలో జరిగింది. నివేదిత (13) మృతురాలు. బాలికకు సర్కారు సరఫరా చేసిన యూనిఫారాన్ని ఇచ్చారు. ఈ నెల 23 నుంచి తప్పనిసరిగా యూనిఫారం ధరించి రావాలని సూచించారు. అయితే బట్టను కుట్టడానికీ టైలర్‌కు ఇచ్చారు. టైలర్ యూనిఫారంను ఇవ్వని కారణంగా విద్యార్థిని మామూలు దుస్తులు వేసుకుని వచ్చింది. అది చూసి ఓ టీచర్ బాలికను దండించింది. మళ్లీ ఇలా వస్తే కొడతామని బెదిరించింది. దీంతో భయాందోళనకు గురైన చిన్నారి ఇంట్లో పురుగుల మంది తాగడంతో ప్రాణాలు కోల్పోయింది. తరీకేరె పోలీసులు కేసు విచారిస్తున్నారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలిక చావుకు కారణమైన టీచరును శిక్షించాలని కోరారు. -
నాణ్యతగా నిర్మాణం వల్లే ప్రారంభం జాప్యం
బళ్లారి అర్బన్: గడిగి చెన్నప్ప సర్కిల్ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టడం వల్లే ప్రారంభంలో జాప్యం జరిగిందని, మరే ఇతర కారణాలు లేవని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తెలిపారు. బుధవారం సలాం బళ్లారి అభియాన్‌లో భాగంగా 16వ వార్డు శ్రీరాంపురం కాలనీలో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగర నడిబొడ్డున ఉన్న గడిగి చెన్నప్ప సర్కిల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తే తర్వాత సమస్యగా మారరాదన్న ఉద్దేశంతోనే నిర్మాణ పనుల్లో నాణ్యతకు పెద్ద పీట వేశామన్నారు. రెండు నెలల్లో పనులు పూర్తి అవుతాయి. స్థానికులు ఈ విషయంలో సహకరించాలన్నారు. సీఎం, డీసీఎంలను పిలిచి సదరు సర్కిల్‌ను ప్రారంభిస్తామన్నారు. తాగునీటి పథకం, రోడ్లు, మసీదులు, మందిరాలు, అంతర్గత భూగర్భ డ్రైనేజీ తదితర కొన్ని నిర్మాణ పనులకు సీఎం, డీసీఎం, జిల్లా ఇన్చార్జి మంత్రి తగిన నిధులు ఇచ్చారన్నారు. సలాం బళ్లారి అభియాన్‌కు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తోందన్నారు. మాజీ మేయర్ రాజేశ్వరి, జబ్బార్, నూర్ మహమ్మద్, పార్టీ నేతలు సుబ్బారాయుడు, మంజుల, హొన్నప్ప, హగరి గోవింద తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి -
మాట్లాడకండి.. బుజ్జగిస్తాం
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా ఆరోపణలు చేయడం మీద పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక ముందు ఏ ఎమ్మెల్యే కూడా బహిరంగంగా మాట్లాడరాదని ఆదేశాలిచ్చింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళ, బుధవారం ఢిల్లీలో హైకమాండ్ నాయకులను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల్లేవు, గృహ నిర్మాణశాఖలో ముడుపుల గోల, మంత్రులు మమ్మల్ని ఖాతరు చేయడం లేదు అని ఎమ్మెల్యేలు పలు రకాలుగా రభస చేయడం మీద ఢిల్లీ నాయకులు ఆరా తీశారు. మంత్రి పదవులు రాలేదని, నామినేటెడ్ పోస్టులు రాలేదని కొందరు ఆక్రోశంగా ఉన్నారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇది ప్రతిపక్షాలకు అస్త్రం అందజేసినట్లవుతోంది. ప్రభుత్వానికి గౌరవం లేకుండా పోతుంది, అందుచేత ఎలాంటి సమస్యలున్నా దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని హైకమాండ్ స్పష్టంచేసినట్లు సూచించినట్లు తెలిసింది. గతంలో సీఎం పదవి గురించి కూడా నేతలు తలోరకంగా మాట్లాడడంతో ఇలాగే కట్టడి చేయడం తెలిసిందే. అసంతృప్తే అజెండాగా ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌తో సీఎం గంటపాటు చర్చించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి మీద ఎక్కువ చర్చ సాగింది. వారితో మాట్లాడి కోపాన్ని చల్లార్చాలని తీర్మానించారు. మంత్రులు హెచ్.సీ.మహదేవప్ప, సతీశ్ జార్కిహొళి, కే.జే.జార్జ్ తదితరులు సీఎంతో ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, వీలైతే మంత్రిమండలి విస్తరణ గురించి మల్లికార్జున ఖర్గే తదితరులతో మంతనాలాడారని సమాచారం. ఎమ్మెల్యేలతో సీఎం భేటీలు? హైకమాండ్ సూచనల ప్రకారం సీఎం బెంగళూరుకు చేరుకోగానే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడి బుజ్జగించనున్నారు. విడతలవారీగా సమావేశాలు జరుపుతారు. మొదట అళంద ఎమ్మెల్యే బీఆర్ పాటిల్‌ను పిలిచే అవకాశముంది. ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి అని ఆయనే రచ్చ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకమాండ్ ఆదేశం ఢిల్లీలో సీఎం సిద్దు సుదీర్ఘ చర్చలు -
పల్లెల్లో నీటి సరఫరాకు డిమాండ్
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు ముజాహిద్ మాట్లాడారు. మన్సలాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని మర్చేడ్, ఇతర ప్రాంతాలలో కూడా తాగునీరు లబించక పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని పీడీఓ, అధ్యక్షులు, అధికారుల దృష్టికి తెచ్చినా నీటి ఎద్దడి నివారణలో అధికారులు విఫలమయ్యారన్నారు. వారం రోజుల్లో నీటిని సరఫరా చేయకపోతే పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి తాళం వేయడం జరుగుతుందంటూ తాలూకా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. -
అనుచిత వ్యాఖ్యలపై నిరసన
రాయచూరు రూరల్: భూములను ముస్లింలకు కట్టబెట్టే రెవెన్యూ అధికారులను ఉరి తీస్తామని చెప్పిన శ్రీరంగపట్టణ ఎమ్మెల్యే రమేష్ బండిసిద్దేగౌడను పార్టీ నుంచి తొలగించాలనీ ఎస్డీపీఐ డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉపాధ్యక్షుడు మతీన్ అన్సారీ మాట్లాడారు. దేశంలో శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి గందరగోళం సృష్టించడం తగదన్నారు. ఎమ్మెల్యేను శాసన సభ్యుడి స్థానం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అక్బర్, తౌసిఫ్ అహ్మద్, ఇర్ఫాన్, హఫీజ్, ముస్తాక్, మీర్జా హుసేన్ బేగ్లున్నారు. అక్రమ మద్యం రవాణా అరికట్టండి రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాలో అక్రమంగా సరఫరా అవుతున్న మద్యం రవాణాకు కళ్లెం వేయాలని దళిత సంఘర్ష సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం కలబుర్గి బసవేశ్వర సర్కిల్ వద్ద ఉపాధ్యక్షుడు రవీంద్ర గుత్తేదార్ మాట్లాడారు. జిల్లాలోని జేవర్గి, యడ్రామి తాలూకాల్లో వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందన్నారు. దీనిని నియంత్రించడంలో ఎకై ్సజ్ అధికారులు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు దాఖలాలు చూపించిన అధికారులు తప్పుడు కేసులను బనాయించి దారి తప్పిస్తున్నారన్నారు. రైలు ఎక్కుతుండగా వ్యానిటీ బ్యాగ్ చోరీ హుబ్లీ: హుబ్లీలోని రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం–3లో వచ్చిన విశ్వ మానవ ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కేటప్పుడు బంగారు ఆభరణాలతో ఉన్న సుమారు రూ.4.06 లక్షల విలువ చేసే వస్తువులు ఉన్న మహిళ వ్యానిటీ బ్యాగ్ చోరీ చేసిన ఘటన బుధవారం వెలుగు చూసింది. గదగ్ జిల్లా సిద్దలింగనగర్ అన్నపూర్ణ అదరకట్టి అనే మహిళ బ్యాగ్ చోరీకి గురైంది. హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైల్లో గదగ్ నుంచి హుబ్లీకి వచ్చి దిగిన ఆమె బెంగళూరు వెళ్లడానికి విశ్వమానవ రైలు ఎక్కుతుండగా దొంగ చేతి వాటం చూపారు. ఫలితంగా రూ.3.5 లక్షలు విలువ చేసే బంగారు తాళి, రూ.40 వేల విలువ చేసే చెవి దుద్దులు, మొబైల్ తదితర వస్తువులు చోరీకి గురైనట్లు మహిళ హుబ్లీ రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బుద్ధిమాటలు చెప్పినందుకు.. కాగా మరో ఘటనలో బుద్ధి మాటలు చెప్పినందుకు అన్నను చాకుతో తమ్ముడు పొడిచిన ఘటన నవనగర్‌లోని నందీశ్వర నగర్ లేఅవుట్లో మంగళవారం చోటు చేసుకుంది. తౌఫిక్ ఇదిళిగార తమ్ముడి చేతిలో కత్తిపోట్లకు గురైన అన్న. బాధితుడిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు ముస్తాక్ ఇదిళిగారను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి పట్ల బాధ్యతగా ఉండాలని అన్న తౌఫిక్ మంచి మాటలు చెబుతున్న వేళ కోపగించుకున్న తమ్ముడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపిన నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో భారీగా గుట్కా క్రిష్ణగిరి: నిషేధిత గుట్కా ఉత్పత్తులను భారీ మొత్తంలో ఇంట్లో దాచి అమ్ముతున్న వ్యక్తిని ఊత్తంగేరి పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లూరు గ్రామానికి చెందిన కుమార్ (32) ఇంట్లో ఎస్ఐ జయగణేష్, పోలీసులు సోదాలు చేయగా 130 కిలోల గుట్కా పట్టుబడింది. సీజ్ చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. -
కలబుర్గి ధాబాలో ముగ్గురు దారుణ హత్య
రాయచూరు రూరల్: పాత కక్షలను మనస్సులో పెట్టుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేసిన ఘటన కలబుర్గి ధాబాలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ధాబాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో దుండగులు మారణాయుధాలతో సిద్దారూడ(32), రామచంద్ర(35), జగదీష్(25)లను హత్య చేసి పరారయ్యారు. రెండు బీరు సీసాల బిల్లుల కోసం రాద్ధాంతం కావడంతో గొడవ అధికమై ఒకరినొకరు కొట్టుకోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. గత ఏడాది నవంబర్‌లో కూడా ధాబా యజమాని సోము రాథోడ్‌పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చోరీల బెడదకు కళ్లెం వేయరూ బళ్లారిఅర్బన్: నగర శివారులోని ఆంధ్రాళ్లో పెచ్చుమీరిన చోరీలు, అసాంఘిక కార్యకలాపాలపై సంబంధిత ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ సీఐకు ఆంధ్రాళ్ సేవా సంఘం ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ రామాంజినేయ, సహ కార్యదర్శి జిన్ రుద్ర, ప్రముఖులు సన్నత్కుమార్, రమణయ్య, వెంకటేశులు, గోవిందరెడ్డి, చిదానంద, బోలంరెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8వ వార్డు పరిధిలోని అంధ్రాళ్ చుట్టు పక్కల కేవలం 6 నెలల్లో పలు చోరీలు, పేకాట తదితర జూదాలు యథేచ్చగా సాగుతున్నాయని తెలిపారు. యశ్వంత్ నారాయణ సింగ్ పొలం దగ్గర మోటార్లు కూడా చోరీకి గురయ్యాయన్నారు. ఈ నెల 24న బూదిహాళ్ తదితర చోట్ల కూడా చోరీలు జరిగాయన్నారు. రెండు నెలల క్రితం బొరుగుల బట్టీ వెనుక ఐరన్ అంగట్లో చోరీ జరిగిందన్నారు. మేకలు కూడా చోరీ చేశారు. కొండాపురం తదితర చోట్ల కూడా పశువుల చోరీ జరిగిందన్నారు. తక్షణమే సంబంధిత పోలీసులు ఈ చోరీల వెనుక ఎవరున్నారో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ గస్తీని తక్షణమే పెంచాలని కోరారు. ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి చెప్పండి రాయచూరు రూరల్ : ప్రతి ఒక్కరూ ప్లాిస్టిక్ వాడకానికి స్వస్తి పలకాలని జిల్లా న్యాయమూర్తి స్వాతిక్ పేర్కొన్నారు. బుధవారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జాతీయ మొక్కలు నాటే దినోత్సవం, ప్లాస్టిక్ ముక్త దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేడు మానవుడు పరిసరాల సంరక్షణకు తోడు ప్లాస్టిక్‌ను దూరం చేయడం వల్ల భవిష్యత్తులో రోగాల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. నగరసభ కమిషనర్ సంగమేష్, విద్యా శాఖ అధికారి బడిగేర్, మురళీధర్, ప్రకాష్, సాగర్‌లున్నారు. కసాప సమ్మేళనానికి ఏర్పాట్లు చేయాలి బళ్లారిఅర్బన్: డిసెంబర్లో నగరంలో జరగనున్న 88వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి నగరాన్ని ఇప్పటి నుంచే చక్కగా తీర్చిదిద్దాలని కన్నడ నాడు రైతు సంఘం జిల్లాధ్యక్షుడు మెణసినకాయి ఈశ్వరప్ప విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మేయర్ ముల్లంగి నందీష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. నగరంలో గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ విషయంలో పాలికె అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకొని సమ్మేళనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. సమ్మేళనాన్ని బళ్లారిలో ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను ఇప్పటి నుంచి ప్రారంభించాలని ఆయన మేయర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఆ సంఘం పదాధికారులు, నేతలు పాల్గొన్నారు. -
గంగాభవానీ నమోస్తుతే
చింతామణి: ఆషాడ మాస మోదటి బుధవారం సందర్భంగా పట్టణంలో ఆరాధ్య శక్తి అయిన గంగాభవానీ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు సురేష్ అభిషేకం, అలంకారం, అర్చన చేపట్టారు. పెద్దఎత్తున భక్తులు దర్శించుకొన్నారు. ఇంటి లాకర్లో నగలు మాయం మైసూరు: నగరంలోని బోగాది 2వ స్టేజ్ నివాసి క్షమా అనే వైద్యురాలి ఇంట్లో అనూహ్య చోరీ జరిగింది. ఇంటి లాకర్లో ఉంచిన రూ.17.75 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కనిపించలేదు. డాక్టర్ క్షమకు పెళ్లి సమయంలో తండ్రి 326 గ్రాముల బంగారు ఆభరణాలను చేయించి ఇచ్చారు. తరువాత క్షమ దంపతులు 128 గ్రాముల బంగారు నగలను చేయించుకుని వాటిని ఇంటి పడక గదిలోని సేఫ్ లాకర్లో భద్రపరిచారు. దానిని తెరిచే పాస్వర్డ్ దంపతులకు మాత్రమే తెలుసు. ఇటీవల లాకర్లో సమస్య రావడంతో కంపెనీ సిబ్బంది ద్వారా మరమ్మతు చేయించారు. తర్వాత లాకర్‌ను పరిశీలించగా నగలు లేవు. మరమ్మతులకు వచ్చిన సిబ్బందే మాయం చేసినట్లు అనుమానాలున్నాయి. సరస్వతీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్జాగా గంధపు చెట్టు చోరీ మండ్య: సినిమాలో ఎర్ర చందనం దొంగల మాదిరిగా, నలుగురు దుండగులు గంధపు చెట్టును నరికి ఎత్తుకెళ్లారు. తాలూకాలోని కిరంగూరు గ్రామానికి చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని గంధపు చెట్టును దుండగులు నరికి, అక్కడే దుంగలుగా కత్తిరించి భుజానికెత్తుకుని మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు ఎదురింటి వారు అమర్చిన సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల ఆవరణలోని గంధపు చెట్లను దొంగలు ఎత్తుకెళ్లడం అధికమైంది. గతంలో నదీ తీరంలో చేపలు పట్టేందుకు వచ్చిన కొందరు చుట్టుపక్కల గంధపు చెట్లను నరుక్కొని వెళుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పట్టణ సీఐ బీజీ కుమార్ స్థానికుల నుంచి వివరాలు సేకరించి దొంగలను పట్టుకుంటామని తెలిపారు. ఆగిన 9వ తరగతి బాలిక గుండె దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ఆకస్మిక గుండెపోట్లతో యువత, బాలలు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 9వ తరగతి బాలిక చనిపోయిన ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా చమకేరి గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. విద్యార్థిని రేణుక (15) గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో ఆటమైదానంలో ఆడుకుటూ కుప్పకూలి పడిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కన్నుమూసింది. గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఐగళి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జైశ్రీరాం అనాలని దాడి? శివాజీనగర: జై శ్రీరాం అనాలని దాడి చేశారని ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదుచేశారు. బెంగళూరులో జూన్ 22న సంపిగెహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి హెగ్డే నగర ఏజెబీజే మైదానం వద్ద ఖాళీ స్థలం వద్ద ఈ ఘటన జరిగింది. ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉండగా, మరో వర్గానికి చెందిన ఎనిమిది మంది మద్యం మత్తులో గొడవకు వచ్చారు, దాడి కూడా చేశారని బాధితులు చెబుతున్నారు. తమను జై శ్రీరామ్ అని చెప్పాలని ఒత్తిడి చేయగా, నిరాకరించినట్లు తెలిపారు. దీంతో వారు కొట్టడంతో ఒకరికి కుడి చెవిలో గాయాలైనట్లు చెప్పారు. పోలీసులు స్పందిస్తూ, జై శ్రీరాం నినాదాలు చేయాలని ఒత్తిడి చేయలేదని తెలిపారు. కన్నడలోనే పరిపాలన: సర్కారు శివాజీనగర: పరిపాలనలో అన్ని శాఖల్లో కూడా పూర్తి స్థాయిలో కన్నడ భాషను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అన్ని శాఖల కార్యాలయం నామఫలకాలు, రికార్డులు కన్నడలోనే ఉండాలి. దరఖాస్తు, లేఖలకు కన్నడలోనే సమాధానం చెప్పాలి. శాసనసభా కార్యకలాపాలు, పత్రాల లావాదేవీలు కన్నడలోనే ఉండాలని స్పష్టం చేసింది. భాషా విధానాన్ని అమలు చేయడం అధికారులు, ఉద్యోగుల బాధ్యత. విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంఘ–సంస్థలతో పాటుగా అందరు అధికారులు, ఉద్యోగులు కట్టుదిట్టంగా నియమాలను పాటించాలి. ఉల్లంఘించిన వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోబడునని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్ తెలిపారు. -
చిక్కమగళూరులో వర్షం తాకిడి
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల మట్టి చరియలు విరిగిపడ్డాయి. శృంగేరి నెమ్మార్ వద్ద రోడ్డులో ఈ ఘటన వల్ల వాహనాలకు ఆటంకం ఏర్పడింది. శృంగేరి–కార్కళ మార్గంలో రాకపోకలు నిలిచిపోగా తొలగింపు పనులు చేపట్టారు. శృంగేరి, కొప్ప, ఎన్‌ఆర్‌పుర, కళస తాలూకాలలో బడులకు సెలవులిచ్చారు. బస్సు– లారీ ఢీ ఉత్తర కన్నడ జిల్లాలోనూ భారీ వానలు కురుస్తున్నాయి. యల్లాపుర వద్ద వర్షం రభస వల్ల అరబైలు ఘట్టలో లారీ–బస్సు ఢీకొని బస్సు పల్టీ పడింది. బస్సులోని 25 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జోరువాన వల్ల ఎదరుగా వస్తున్న వాహనాలు కనిపించని కారణంగా ప్రమాదం జరిగింది. కూలిన కొండ చరియలు -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హుబ్లీ: బాత్రూమ్లో జరిగిన రాజేంద్ర శ్రీనివాస్ (30) హత్య కేసును ఛేదించడంలో హొసదుర్గ పోలీసులు సఫలీకృతులయ్యారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా హుణనవిడులో ఓ ఇంటి బాత్రూమ్లో స్నానం చేస్తున్న రాజేంద్రను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. ఆ రక్తసిక్త ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసి వికృతం ప్రదర్శించిన హొళల్కెరె నివాసి సాగర్, సోదరుడు అభిషేక్, బంధువులు కిరణ్‌కుమార్, కృష్ణమూర్తితో పాటు హత్యకు సహకరించిన సంజు కరియప్ప, యశ్వంత్‌తో పాటు మొత్తం 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక ఆ అకృత్యానికి వాడిన స్కూటీ, ఎర్టిగా కారు, రెండు మారణాయుధాలను జప్తు చేసిన పోలీసులు కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసు గురించి జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ బండారు మీడియాతో మాట్లాడారు. హొళల్కెరెకు చెందిన కిరణతో రాజేంద్ర లివింగ్ రిలేషన్షిప్లో ఉండేవాడు. కొన్ని నెలలు గడిచాక వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. అయినా విడిపోయాక కూడా కిరణకు రాజేంద్ర ఫోన్ చేసి వేధించేవాడు. దీంతో కిరణ సోదరుడు సాగర్, అభిషేక్ ఓ సారి ఇద్దరూ కలిసి రాజేంద్రకు ఫోన్ చేసి హెచ్చరించారు. కిరణను వాడుకొని మోసం చేశాడన్న కక్షతో పిలిపించి దారుణంగా హత్య చేశారు. హత్య చేశాక సదరు హత్య దృశ్యాలను ఇన్‌స్టాలో నిందితుడు సాగర్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. హత్యకు గురైన మృతదేహం ఫోటో షేర్ చేయడంపై కేసుకు సాక్ష్యంగా పరిగణిస్తామని ఎస్పీ తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో మట్టి ఎద్దుల అమావాస్య
సాక్షి,బళ్లారి: మట్టి ఎద్దుల అమావాస్య పండుగను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. బుధవారం మట్టి ఎద్దుల అమావాస్య పండుగ నేపథ్యంలో జిల్లాలోని కురుగోడు, గెణికెహాళు, భైరాపుర, బేవినహళ్లి, శ్రీధరగడ్డ, శంకరబండ తదితర అన్ని గ్రామాల్లో ఎక్కడ చూసినా రైతులు భక్తిశ్రద్ధలతో మట్టి ఎద్దుల అమావాస్య పండుగను జరుపుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పంటలు వేసే ముందు వచ్చే అమావాస్య పండుగను రైతులు ఎంతో సంతోషంగా జరుపుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ముందస్తు వర్షాలు కురవడంతో దుక్కులు దున్ని ముంగారు పంటలను వేయడానికి అన్నీ అనుకూలంగా మారడంతో రైతులు ఇంటింటా మట్టి ఎద్దులకు పూజలను మరింత ఉత్సాహంగా చేశారు. పంటలు బాగా పండాలని.. అమావాస్య రోజున భక్తిశ్రద్ధలతో మట్టి ఎద్దులకు పూజలు చేసి, పంటలను వేయడం ద్వారా బాగా పంటలు పండుతాయని నమ్మకం ఉందని, దీంతో ప్రతి ఏటా పండుగను ఆచరిస్తున్నామని రైతులు తెలిపారు. రైతులు ఇంటింటా మట్టి ఎద్దుల అమావాస్య పండుగను ఆచరించిన తర్వాత పొలాల్లో ఎద్దులకు పూజలు చేసి ముంగారు(ఖరీఫ్) పంటలను సాగు చేస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. జిల్లాలో ఉత్సాహంగా, ఉల్లాసంగా మట్టి ఎద్దుల అమావాస్య పండుగ చేసుకుని ఖరీఫ్‌లో పంటలు సాగు చేయడంపై రైతులు దృష్టి సారించారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఇక ఖరీఫ్ పంటల సాగుకు అన్నదాతలు సంసిద్ధం -
కాంట్రాక్టర్ హత్య కేసు నిందితుడి ఇల్లు దహనం
హుబ్లీ: హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణ శివారులో మంగళవారం జరిగిన కాంట్రాక్టర్ శివానంద కున్నూర దారుణ హత్య కేసులో నిందితుడి ఇంటికి బుధవారం రాత్రి నిప్పు పెట్టి దహనం చేశారు. ఈ హత్య కేసులో 5 మంది నిందితుల్లో సూత్రధారి నాగరాజ్ సౌదత్తి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫస్ట్ గ్రేడ్ కాంట్రాక్టర్ అయిన శివానంద కున్నూర(40)ను శిగ్గాంవి పట్టణ శివారులోని గంగిబావి క్రాస్ వద్ద మంగళవారం మారణాయుధాలతో నరికి చంపిన సంగతి తెలిసిందే. సదరు హత్య వీడియో దృశ్యాలు వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా హతుడు శివానంద భార్య ఫిర్యాదు మేరకు శిగ్గాంవి పోలీసులు నాగరాజ్ సౌదత్తి, హనుమంత, అష్రఫ్, సుదీప్, సురేష్ అనే 5 మందిపై కేసు నమోదు చేశారు. ఆస్తి గొడవే ఈ హత్యకు కారణంగా ఫిర్యాదులో తెలిపారు. ఈ హత్య వల్ల కక్షలు చెలరేగిన నేపథ్యంలో శిగ్గాంవిలో 5 మంది సీఐలు, 7 మంది ఎస్ఐలు, 2 డీఏఆర్ వాహనాలతో పాటు 20 మందికి పైగా అదనపు పోలీస్ సిబ్బందితో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. -
తుంగభద్రకు జలకళ
హొసపేటె: తుంగభద్ర జలాశయం క్రస్ట్‌గేట్ల తొలగింపు పనులు ప్రారంభించక పోవడంతో నిపుణుల నివేదిక, సలహా ఆధారంగా తుంగభద్ర బోర్డు ఈసారి జలాశయంలో 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈలోగా బోర్డు రిజర్వాయర్ కాలువలపై కూడా పనులు చేపట్టింది. ఇప్పుడు ఐసీసీ సమావేశం షెడ్యూల్ ఖరారైనందున రైతులకు నీటిని పంపిణీ చేస్తే ఈ పనులను కూడా నిలిపి వేయాల్సి ఉంటుంది. అయితే రైతులకు నీటి సరఫరా చాలా ముఖ్యం, ఈ పనులను తిరిగి ప్రారంభించవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 124వ నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం ఈనెల 27న బెంగళూరులో జరగనుంది. రైతులు ఈ సమావేశం కోసం ఎదురు చూస్తున్నారు. 10 లక్షల ఎకరాలకు నీరు విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 3 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తుంది. వర్షాకాలంలో జలాశయంలో అందుబాటులో ఉన్న నీటి పంపిణీ కోసం కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన విధానసౌధలోని రూమ్ నెంబర్– 334లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఐసీసీ సమావేశం జరగనుంది. రాయచూరు, బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ కమిషనర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే ప్రారంభమైనందున, జలాశయంలో ఇప్పటికే 46.290 టీఎంసీల నీరు నిల్వ చేరింది. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో కూడా క్రమంగా పుంజుకుంటోంది. కాగా జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ఈ సంవత్సరం కేవలం 80 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేసుకోవాలని నిర్ణయించారు. రోజురోజుకు పెరుగుతున్న వరద ఉధృతి ఈఏడాది 80 టీఎంసీల నిల్వకు తీర్మానం -
ఇళ్ల నిర్మాణాల్లో అవినీతిపై ఆందోళన
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చాక, అన్నింటా అవినీతి, అక్రమాలు, పర్సెంటేజీలు లేకుండా ఏ పనులూ చేయడం లేదని, చివరకు స్లం బోర్డు ద్వారా చేపట్టే పేదలకు ఇళ్ల నిర్మాణాలను కూడా అర్ధంతరంగా ఆపేశారని, లంచాలు ఇస్తేనే ఇళ్లు మంజూరు చేస్తున్నారని మండిపడుతూ బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్లం నిర్మూలన మండలి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, మహిళా మోర్చా పదాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఇళ్ల నిర్మాణాల్లో అవినీతిపై ప్రశ్నిస్తున్నారంటే అవినీతి పతాక స్థాయికి చేరిందని మండిపడ్డారు. లంచం ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రి అవసరమా? ఈ నేపథ్యంలో ఇలాంటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అవసరమా? అంటూ ప్రశ్నించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ పేదల ఇళ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఆయన అవినీతిపై తనిఖీ చేయాలని, తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పేరుకే కాని ఆయన జిల్లాకు వచ్చి అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. అంతా అవినీతిమయంగా మార్చారన్నారు. చివరకు పేదల ఇళ్ల నిర్మాణాల్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన వారే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అలాంటి అవినీతి మంత్రిని పదవి నుంచి తప్పించాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. నగరంలో 2019లో 1160 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. అర్థంతరంగా ఆగిన నిర్మాణాలు అర్ధంతరంగా ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. 100 ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభం కాలేదన్నారు. లబ్ధిదారులు వాటా కింద డబ్బులు కూడా చెల్లించారని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్న గుడిసెలు కూడా తొలగించి, గూడు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో 14,700 మందికి పట్టాలు మంజూరు చేశామని, అయితే అందులో 1000 మంది లోపు మాత్రమే అనుమతి ఇచ్చారని, మిగిలిన వేలాది మందికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈసందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు నిలువ నీడ లేకుండా పోయిందన్నారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కన్నీరు పెట్టుకున్నారు. సంబంధిత అధికారులతో బీజేపీ నాయకులు చర్చించి, సత్వరం బాధితులకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మేయర్, పాలికె ప్రతి పక్ష నాయకుడు ఇబ్రహీంబాబు, బీజేపీ నాయకులు హనుమంతప్ప, రామచంద్రయ్య, మల్లనగౌడ, చెంచు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కళంకితులు పదవులకు రాజీనామా చేయాలి కదం తొక్కిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు -
దొంగల బీభత్సం
● మహిళను బంధించి నగలు దోపిడీ మైసూరు : చామరాజ్నగర్ జిల్లా రామాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హనూర్ తాలూ రామాపూర్లోని ఖదీమా అనే మహిళ ఇంటిలోకి దుండగులు చొరబడ్డారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి బంగారు నగలు దోచుకొని పారిపోయారు. బాధితురాలు కట్లు విప్పుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. బైక్‌లు ఢీ.. ఒకరి మృతి మైసూరు : కొల్లేగల్ తాలూకాలోని తెరంబల్లి గ్రామంలోని బస్టాండు సమీపంలో మంగళవారం రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. కొల్లేగల్ తాలూకాలోని తెరంబల్లి గ్రామానికి చెందిన శివమల్లప్ప(55), సాగర్(26)లు గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా శివమల్లప్ప మృతి చెందాడు. అగర్మాంబల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి బొమ్మనహళ్లి : పేదరికంలో ఉన్న బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు అఖిల కర్ణాటక బ్రహ్మణ మహాసభ అధ్యక్షుడు ఎస్.రఘునాథ్ తెలిపారు. ఆనేకల్ తాలూకా ఆత్తిబెలిలో ఉన్న శ్రీనంజుండేశ్వర సముదాయ భవనంలో శ్రీగాయత్రీ విప్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య త్రయర జయంతి, ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్రాహ్మణ మహాసభ పదాధికారుల ఎన్నిక ఇటీవల పూర్తయ్యిందన్నారు. సముదాయ ప్రజలు తమపై ఎంతో నమ్మకం ఉంచారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామని అన్నారు. అనంతరం సముదాయంలోని ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. మహాసభ ఉపాధ్యాక్షుడు బిదరగుప్పె వి.అచ్యుత్మూర్తి, రాష్ట్ర నాయకుడు ఎస్.సుదర్శన్, ఎం.కే.రామ్, ప్రసాద్, రథయాత్ర సురేష్, రవి.కుమార్, సతీష్ పాల్గొన్నారు. మలేమాదేశ్వరస్వామి బెట్టలో బైక్‌లు దగ్ధం మైసూరు : చామరాజ్నగర్ జిల్లా హనూరు తాలూకా మలేమాదేశ్వరస్వామి కొండలో భక్తులు పార్కింగ్ చేసిన మూడు బైక్‌లు దగ్ధమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మదేశ్వరస్వామి కొండకు వచ్చిన భక్తులు సుంకమ్మ నిలయం వద్ద బైక్‌లను పార్కింగ్ చేస్తుంటారు. ఈక్రమంలో మంగళవారం వేకువజామున మంటలు చెలరేగి మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. మంగళవారం ఉదయం పోలీసులు వచ్చి పరిశీలించారు. ఎవరైనా నిప్పు పెట్టారా? ప్రమాదవశాత్తూ కాలిపోయాయా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
ఆనేకల్‌లో భారీ వర్షం
బొమ్మనహళ్లి : బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకాలో ఈదురు గాలులతో కూడిన వర్సం బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి జల్లులతో ప్రారంభమైన వర్షం సోమవారం వేకవజాము వరకు ఏకధాటిగా కురిసింది. ఆనేకల్ పట్టణంలో రోడ్లు జలమయం అయ్యాయి. తాలూకాలోని గ్రామాల్లో వంకలు, వాగులు ఏరులై ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంత్రి జమీర్ ఇంటి ముట్టడికి యత్నం శివాజీనగర: గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహమ్మద్ ఇంటి ముట్టడికి కన్నడ పోరాటకులు రూపేశ్ రాజణ్ణ యత్నించగా పోలీసులు భగ్నం చేశారు. రూపేశ్ రాజణ్ణపై మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ సన్నిహితుడు సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తీవ్ర ఆరోపణ చేశారు.దీంతో ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తూ రూపేశ్ రాజన్న మంగళవారం తన అనుచరులతో కలిసి జమీర్ ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేపేశ్ రాజణ్ణ అనుచరులను అరెష్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పార్కింగ్ విషయంలో గొడవ ● ఇద్దరికి గాయాలు మైసూరు : బస్టాండ్‌లో వాహనాల పార్కింగ్ విషయంలో గొడవ జరిగి ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని హుణసూరు బస్టాండ్‌లో జరిగింది. హుణసూరు కేఎస్ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రజలు దర్జాగా తమ వాహనాలను నిలిపి బస్సుల సంచారానికి ఆటంకం కల్గిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇక్కడ వాహనాన్ని నిలపవద్దని ఓ వ్యక్తికి ఆర్టీసీ సిబ్బంది సూచించారు. ఆ సమయంలో మాటామాటా పెరిగి పరస్పరం చేయి చేసుకున్నారు. గొడవలో ఇద్దరికీ గాయాలయ్యాయి. జోక్యం చేసుకున్న గ్రామీణ పోలీసులు ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు. వాహనం ఢీకొని జింక మృతిశివమొగ్గ : వాహనం ఢీకొని జింక మృతి చెందింది. శివమొగ్గ జిల్లా సొరభ హళెసోరభలోని గౌరికేరె మఠం సమీపంలో తవనంది రోడ్డులో జింక కళేబరం పడి ఉండగా మంగళవారం ఉదయం స్థానిక రైతులు గమనించారు. అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు నిర్ధారించారు. కళేబరాన్ని అక్కడే ఖననం చేయించారు. జీపీ సభ్యుడి అనుమానాస్పద మృతి దొడ్డబళ్లాపురం: గ్రామ పంచాయతీ సభ్యుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన చెన్నపట్టణ తాలూకా మాకళి గ్రామంలో చోటుచేసుకుంది. మాకళి గ్రామపంచాయతీ సభ్యుడు లోకేశ్(45) గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గమనించి ఎంకే దొడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించారు. మృతదేహం పక్కనే విషం బాటిల్ లభించింది. ఆయనకు సంబంధించిన కారు అక్కడే నిలిపి ఉంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. లోకేశ్ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య చేసారా ?అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది. యువతి పట్ల పోకిరీల వికృత చేష్టలు బొమ్మనహళ్లి : సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన యువతి పట్ల గంజాయి మత్తులో ఉన్న యువకులు అసభ్యకంగా, లైంగికంగా వేధించారు. ఈఘటన ఆనేకల్ తాలూకా మైలసంద్రలో ఆదివారం జరిగింది. చైన్నెకి చెందిన ఓ యువతి వారం రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి రేణుకా యల్లమ్మ లౌఔట్లో అద్దె ఇంటిలో ఉంటోంది. ఆదివారం సాయంత్రం సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో రిచర్డ్(24), ఆంథోని(52) అనే వ్యక్తులు ఆ యువతిని అసభ్యకరంగా తాకారు. యువతి వారినుంచి తప్పించుకొని ఇంటికి రాగా ఆ ఇద్దరు వ్యక్తులు వెంటాడి గొడవ చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆ ఇద్దరూ అసభ్యంగా దూషించారు. ఒక జిమ్‌ట్రైనర్ మందలించగా అతనిపై కూడా దాడికి యత్నించారు. సహనం కోల్పోయిన స్థానికులు బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించి నిందితులను అరెస్ట్ చేశారు. -
పాల డెయిరీ కార్యదర్శి తీరును నిరసిస్తూ ధర్నా
మండ్య : పాండవపుర తాలూకా నరహళ్లి గ్రామంలో ఉన్న పాలడెయిరీ కార్యదర్శి తీరును నిరసిస్తూ పాడి ఉత్పత్తిదారులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. డెయిరీ వద్దకు పాలు తీసుకొని వచ్చి నేలపై పోసి నిరసన వ్యక్తం చేశారు. పాల డెయిరీ కార్యదర్శి కాళమరిగౌడ తమకు ఎలాంటి బోనస్‌లు ఇవ్వడం లేదని, కనీసం ప్రోత్సాహ ధనం కూడా పంపిణీ చేయలేదని పాడి రైతులు మండిపడ్డారు. పాల బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. కార్యదర్శి మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. పాలడెయిరీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అథ్లెటిక్స్‌లో చిక్కబళ్లాపురం క్రీడాకారుల ప్రతిభ
చిక్కబళ్లాపురం: బెంగళూరులోని కంఠీరవ క్రీడా మైదానంలో ఈనెల 22 నుంచి 24వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో చిక్కబళ్లాపురం జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. హైజంప్‌లో దీక్ష ప్రతిభ చాటి వెండి పతకం సాధించగా షార్ట్‌ఫుట్‌లో హర్షన్ యాదవ్ వెండి పతకం సాధించారు. త్రోబాల్‌లో ఆఫీరా, వెండి, షార్ట్‌ఫుట్‌లో కవన ఆర్ కంచు పతకం సాధించారు. విజేతలను చిక్కబళ్లాపురం జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు కేవీ నవీన్‌కిరణ్ అభినందంచారు, ప్రధాన కార్యదర్శి మంచనబలె శ్రీనివాస్, సభ్యులు లక్ష్మిశేఖర్ పాల్గొన్నారు -
ప్రైవేటు బస్సుకు ప్రమాదం
రాయదుర్గం టౌన్: రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి కల్వర్టుపైకి దూసుకెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. రోజూ బెళుగుప్ప నుంచి గుండ్లపల్లి, కెంచానపల్లి మీదుగా బెంగళూరుకు ఎస్ఆర్జే ప్రైవేటు బస్సు వెళుతుంది. బెళుగుప్ప నుంచి బయల్దేరి జుంజురాంపల్లి చేరుకోవాల్సి ఉండగా సమీపంలో అదుపుతప్పి కల్వర్టుపై దూసుకెళ్లి నిలిచిపోయింది. జుంజురాంపల్లికి చెందిన లక్ష్మీదేవి అనే ప్రయాణికురాలు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లింది. నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్‌లో చోరీ మైసూరు: నిర్మాణ దశలోని పెట్రోల్ బంక్‌లో చోరీ జరిగింది. ఈఘటన మైసూరులోని ఉత్తనహళ్లి వద్ద ఉన్న రింగ్ రోడ్డులో జరిగింది. వైశాలి అనే వ్యక్తి స్పటిక సర్వీస్ పెట్రోల్ బంక్ పేరుతో నిర్మాణ పనులు చేస్తున్నారు. పనివాళ్లు అక్కడే షెడ్లో ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం రాత్రి దుండగులు షెడ్ తలుపునకు గొళ్లెం వేశారు. తర్వాత గది వద్ద ఉంచిన రూ.3.40లక్షల విలువైన పెట్రోల్ పంప్ మోటార్, కేబుల్, వెల్డింగ్ మిషన్‌తో పాటు విలువైన వస్తువులను చోరీ చేసుకెళ్లారు. దక్షిణ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పురస్కారాలు.. ప్రతిభావంతులకు ప్రోత్సాహం మైసూరు : నగరంలోని సరస్వతీపురంలోని శ్రీకృష్ణధామ్లో మంగళవారం ప్రతిభాపురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 83 మంది బ్రాహ్మణ విద్యార్థులకు శ్రీ కృష్ణమిత్ర బోర్డు, శ్రీక్రిష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభాపురస్కారాలు అందజేశారు. చిన్మయ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.ఎస్. శరత్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిభ పురస్కారాలు ప్రతిభావంతులకు మరింత ప్రోత్సాహం ఇస్తాయన్నారు. శ్రీ కృష్ణమిత్ర బోర్డు అధ్యక్షుడు గోపాలక్రిష్ణ, గౌరవ కార్యదర్శి గురుప్రసాద్, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు రవిశాస్త్రి , పీజీఎస్ చంద్రశేఖర్, కార్యదర్శి కే.వి. శ్రీధర్, కోశాధికారి ఎం. రాఘవేంద్రరావు, శ్రీవత్స, మంగళ పాల్గొన్నారు. -
హెచ్ఎస్ఆర్ లేఔట్ క్లబ్ అధ్యక్షుడిగా శంకర్‌రెడ్డి
బొమ్మనహళ్లి : బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న హెచ్ఎస్ఆర్ క్లబ్ పాలకవర్గానికి ఎన్నిక జరిగింది. అధ్యక్ష స్థానానికి వీ.టి.శంకర్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది ఎ.ఎం.సురేష్ రెడ్డి పోటీ పడ్డారు. వీటి శంకర్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జీ.కృష్ణారెడ్డి, ఎ.ఎం.నరిసింహమూర్తి విజయం సాధించారు. మేనేజింగ్ కమిటీ 10 స్థానాలకు ఎన్నిక జరగ్గా ఆర్.సతీష్ 1619 ఓట్లు, మోహిత్ హెచ్.ఎస్.రెడ్డి 1586, దర్సన్ ఆర్. 1580, ప్రజ్వల్ ఎస్.వి. 1545, జీ.శ్రీనివాస్ రెడ్డి 1515,ఆశోక్ కుమార్ ఎస్. 1508, ఆంజినప్ప 1461, మధుకృష్ణారావు బీ.1392, రుద్రేష్ ఎస్.ఎన్. 1368, నవీన్ జయరామ్ కూమార్తె 1215 ఓట్లు సాధించి విజయం సాధించారు. బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి, జేడీఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు డి,కుపెంద్ర రెడ్డి, ఏపీలోని చిత్తురు జిల్లా శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితోపాటు అనేక మంది ప్రముఖులు హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఉత్తర కన్నడ
బనశంకరి: రాష్ట్రంలో మరే ప్రాంతానికి లేనట్లుగా రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఉత్తర కన్నడ జిల్లా విభిన్న సంస్కృతులు, కళలు, సంప్రదాయాలు, విలక్షణమైన జీవనవిధానంతో అలరారుతోంది. ఆధ్యాత్మికంగా, వినోద పరంగా ఈ జిల్లాకు ఎంతో పేరుంది. దట్టమైన అడవులు, నదులతో భౌగోళికంగా, ప్రకృతి పరంగా ఎంతో వైవిధ్యతను కలిగి ఉంది. వన్యజీవులు, అరుదైన పక్షులు, అనేక ఔషధ రకాల మొక్కలకు నిలయం. 140 కిలోమీటర్ల పొడవున్న సముద్రతీర ప్రాంతం కలిగిన ఈ జిల్లా పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించి పర్యాటక రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. 8.28 హెక్టార్లలో అడవులు మొత్తం 10.25 లక్షల హెక్టార్ల భూబాగం కలిగిన ఉత్తరకన్నడ జిల్లాలో 8.28 హెక్టార్లలో అడవులు విస్తరించాయి.1.2 లక్ష హెక్టార్ల సుమారు(10)శాతం వ్యవయాసయ యోగ్యమైన భూములు ఉన్నాయి. ఉత్తరకన్నడ జిల్లాలోని కార్వార, అంకోలా, కుమటా, భట్కళ, హొన్నావర, సిద్దాపుర, శిరసి, యల్లాపుర, ముండగోడ,జోయిడా, హళియాళ, దాండేలి 12 తాలూకాలు ఉన్నాయి. ఈ జిల్లాలో జోయిడా ఆనకట్ట, కద్రా, కొడసళ్లి, గేరుసొప్ప ఆనకట్టలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. అణువిద్యుత్ ఉత్పత్తి చేసే కై గా స్థావరం పేరుగాంచింది. వర్షాకాలంలో అధిక వర్షపాతం నమోదయ్యేది ఉత్తరకన్నడ జిల్లాలోనే. జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు కాళి (కార్వార–జోయిడాతాలూకా), అఘనాశిని(కుమటా, శిరసి, సిద్దాపుర) శరావతి( హొన్నావర) వెంకటాపురనది(భట్కళ తాలూకా) నదులు ప్రవహిస్తున్నాయి. ప్రముఖ ఆలయాలు బనవాసి మదుకేశ్వర ఆలయం, ఉళవిచెన్నబసవేశ్వర, ఇడగుంజి శ్రీ సిద్దివినాయక, గోకర్ణ మహాబలేశ్వర, మురుడేశ్వర, శిరసి మారికాంబ ఆలయాలు ఆధ్యాత్మికతను పంచుతున్నాయి. జైనబసది, సోండాకోట, మిర్జాన్కోట ప్రాచీన స్మారకాలు. భట్కళ మసీదు ప్రధానమైంది. విభిన్నమైన కళలు ఉత్తరకన్నడ జిల్లాలో సుగ్గికుణిత, హోళినృత్య, పులివేషాలు, సిద్దినృత్య మొదలైనవి ప్రముఖ జానపద, సంప్రదాయకళలు. యక్షగానం పేరుగాంచిన కళగా రాష్ట్రంలో ప్రముఖమైనది. వ్యవసాయమే ప్రధాన ఆధారం గ్రామీణప్రాంతాల్లో నివసించే ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారు. ప్రధాన సంప్రదాయ వృత్తులు వ్యవసాయం, చేపలవేట, పశుపాలన, పట్టు, ఉద్యానవనాలు, తేనెటీగలు పెంపకం. వివిధ జాతుల ప్రజలు ఉత్తరకన్నడ జిల్లాలో సిద్ది, కుణచి, హలక్కి, ఒక్కలిగ, గొండ, గౌలి, సిద్ది ప్రజలు నివాసం ఉంటున్నారు. సుమారు 400 క్రితం ఆఫ్రికా నుంచి పోర్చుగీసు గులాములుగా వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అందమైన సముద్ర తీరాలు ఉత్తరకన్నడ జిల్లా పర్యాటకులను మంత్ర ముగ్దులను చేసే అనేక సముద్రతీర ప్రాంతాలకు నిలయం. కార్వార, గోకర్ణ, మురుడేశ్వర, కుమటా, అంకోలా, దేవ్‌బాగ్, ఓమ్బీచ్, కుడ్లేబీచ్, ప్యారడైజ్, హాప్మూన్, తిలమట్టి, రవీంద్రనాద్ఠాగూర్, కాసరగూడుబీచ్, మజాలీబీచ్లు ప్రధానమైనవి. హండిగోన్, హువినహొళే, కడ్లేబీచ్, ఎకోబీచ్, నిర్వాణాబీచ్లు ఉన్నాయి. ఉంచళ్లి, సాదోడి, మాగోడు, శరావతి, విభూతి,యాణ జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రమణీయమైన పర్యాటక ప్రాంతాలు అందమైన సముద్ర తీరాలు దట్టమైన అడవులు -
మరో 2 రోజుల్లో రిటైరు కానుండగా.. కోట్లాది సంపాదన
బనశంకరి : పెద్ద బంగ్లాల మాదిరి ఇళ్లు, కళ్లు చెదిరే వస్తు సామగ్రి, ఖరీదైన జీవన విధానం.. ఇదీ కొందరు అధికారుల తీరు. అక్రమంగా ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టిన 8 మంది ప్రభుత్వ అధికారులకు లోకాయుక్త షాక్ ఇచ్చింది. మంగళవారం వేకువ నుంచే ఆకస్మిక దాడులను నిర్వహించారు. శివమొగ్గ సేంద్రియ వ్యవసాయ విభాగం పరిశోధన డైరెక్టర్ ప్రదీప్, చిక్కమగళూరు నగరసభ అకౌంట్స్ సూపరింటెండెంట్ లతామణితో పాటు 8 మంది పై దాడులు జరిగాయి. భారీగా నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువచేసే బంగారం, విలువైన వస్తువులు, ఇళ్లు, భూములను కనిపెట్టారు. బెంగళూరు, చిక్కమగళూరు, ధార్వాడ, శివమొగ్గ, గదగ, కలబురిగితో పాటు 12 కు పైగా జిల్లాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.బాత్రూంలో దాక్కున్న సీఐగదగ్ పట్టణ సీఐ ధృవరాజ్ అయితే బయపడి ఇంటి బాత్రూమ్ దాక్కున్నారు. వదిలిపెట్టని లోకాయుక్త అధికారులు ఆయనను బయటకు రప్పించి ఇంట్లో గాలింపు నిర్వహించారు. ఈయన బాగల్‌కోటే, జమఖండిలో ఇళ్లు, అపారమైన సంపాదన చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఆయన పోలీస్ జీపులోనూ కొన్ని రికార్డులు లభించాయి. ఇంట్లోని నగదుతో పాటు బంగారం, విలువైన వస్తు సామగ్రిని సీజ్ చేశారు.బెంగళూరు పరిధిలోబెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ పట్టణ పంచాయతీ ఈఓ అమరనాథ్, బీబీఎంపీ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ ఇళ్లలో తనిఖీలు చేశారు. ప్రకాష్ అనేక స్థలాలు, వాణిజ్య సముదాయాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీలు సాగాయి. బ్యాంకు ఖాతాలు, లాకర్లలోను ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఆ అధికారులను అదుపులోకి తీసుకున్నారు.మరో 2 రోజుల్లో రిటైరు కానుండగా.. ధార్వాడలో మలప్రభ ప్రాజెక్టు ఇంజినీర్ అశోక్ వాల్సంద్, కలబుర్గి పీఆర్‌ఈ విభాగం ఈఈ మల్లికార్జున అలీపుర, సణ్ణూరు పీడీఓ రామచంద్ర ఇళ్లు, ఆఫీసులు, వారి బంధుమిత్రుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేశారు.ఇంజినీర్ మల్లికార్జున కలబుర్గి, బెంగళూరులో ఇళ్లలో తనిఖీలు చేశారు. మరో రెండురోజుల్లో ఈయన రిటైరు కానుండగా సన్మానానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంతలో లోకాయుక్త ఝలక్ ఇచ్చింది. ఇంట్లోని విలువైన వస్తువులను కనిపెట్టి విలువను అంచనా వేస్తున్నారు.సణ్ణూరు గ్రామ పీడీఓ రామచంద్రకు సేడం రోడ్డులో ఉండే ఇళ్లు, విజయపురలో ఉండే ఇంట్లో గాలించారు. అనేక చోట్ల పొలాలు, ఇళ్లతో పాటు భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.నిందితులు రాష్ట్రంలో అనేకచోట్ల భూములతో పాటు పలుచోట్ల వాణిజ్య వ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.చిక్కమగళూరు నగర సభ లెక్కాధికారిణి లతామణి నివాసం, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. నగదు, బంగారంతో పాటు అనేక బ్యాంకు అకౌంట్లలో ఉన్న డిపాజిట్లను పరిశీలించారు.లోకాయుక్త ఎస్పీలు ఉమేశ్, మంజునాథ్, డీఎస్పీ గీతా బేనాళ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. -
కబ్జాల తొలగింపు
కృష్ణరాజపురం: బెంగళూరు తూర్పు తాలూకా కాడుగోడి ప్లాంటేషన్ సర్వే నంబర్–1లో కబ్జాకు గురైన వేలాది కోట్ల రూపాయల విలువ చేసే 120 ఎకరాల అటవీ శాఖ భూమిని గట్టి పోలీసు బందోబస్తుతో ఖాళీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా కబ్జాదారులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. చాలా ఏళ్లుగా తాము ఇక్కడే నివాసం ఉంటున్నామని, కోర్టులో కేసు కూడా ఇంకా పెండింగ్‌లో ఉందని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద షెడ్లు, నిర్మాణాలను కూల్చే పని సాగుతోంది.పబ్‌లో లైంగిక వేధింపులు.. టెక్కీ అరెస్టుశివాజీనగర: నగరంలో కబ్బన్ పార్కు వద్ద ఉన్న ఓ పబ్‌లో ఓ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఓ టెక్కినీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనురాగ్ అనే వ్యక్తి. ఓ ప్రైవేట్ కంపెనీలో నిందితుడు, బాధితురాలు టెక్కీలుగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి కబ్బన్ పార్కు వద్ద ఓ పబ్‌కు పార్టీకి వెళ్లారు. తాగిన మైకంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారానికి ప్రయత్నించాడని యువతి ఆరోపించింది. ఈ మేరకు కబ్బన్ పార్క్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు పరియస్తులని, మద్యం మత్తులో అకృత్యానికి ప్రయత్నించినట్లు పోలీసుల తనిఖీలో తెలిసింది. కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.కారు ఢీకొని మహిళల మృతిదొడ్డబళ్లాపురం: కారు ఢీకొన్న ప్రమాదంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఇద్దరు మహిళలు అక్కడే మృతి చెందిన సంఘటన దేవనహళ్లి తాలూకా బొమ్మవార గ్రామం వద్ద జరిగింది. తిమ్మక్క (60) యశోద (33) మృతులు. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఇద్దరినీ ఢీకొంది. తీవ్ర గాయాలైన మహిళలు దుర్మరణం చెందారు. విశ్వనాథపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.కాంట్రాక్టరు నరికివేతహుబ్లీ: హావేరి జిల్లాలో పట్టపగలే ఓ కాంట్రాక్టర్‌ను దుండగులు హత్య చేశారు. వివరాలు సిగ్గావి పట్టణ శివారులో మంగళవారం మధ్యాహ్నం ఈ హత్య జరిగింది. శివానంద కున్నురు (40) ఫస్ట్‌గ్రేడ్ కాంట్రాక్టరు, గంగిబావి క్రాస్ వద్ద పట్టపగలే పెద్ద కత్తులతో నరికి హత్య చేసి పరారయ్యారు. ఈ ఉదంతంతో స్థానికులు భీతావహులయ్యారు. ఆస్తి వివాదమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కిరాయి హంతకులతోనే హత్య చేయించినట్లు ఆయన కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ, సీఐ పరిశీలించారు.7 బిల్లులను ఆమోదించండి● రాష్ట్రపతికి సీఎం సిద్దు వినతిశివాజీనగర: రాష్ట్ర గవర్నర్ పరిశీలన కోసం పంపిన ఏడు బిల్లులను ఆమోదించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును భేటీ చేశారు. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర బిల్లులకు ఆమెదం తెలుపాలని విన్నవించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన, మైనారిటీలకు ప్రభుత్వ పనుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే కర్ణాటక ప్రజా సేకరణ పారదర్శక సవరణ బిల్లు–2025, రాష్ట్రంలో ఏ– కేటగిరి ఆలయాల ఆదాయంలో 10 శాతం వరకూ నిధులను సీ– కేటగిరి దేవాలయాల అభివృద్ధికి వినియోగించే కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ ట్రస్ట్‌ల సవరణ బిల్లు తదితరాలకు పచ్చజెండా ఊపాలని విన్నవించారు. 7 బిల్లులను మీ పరిశీలనకు పంపించారని తెలిపారు. సీఎం వెంట మంత్రి డాక్టర్ హెచ్.సీ.మహదేవప్ప, పలువురు నేతలు ఉన్నారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన బాలీవుడు నటుడు అమీర్‌ఖాన్, సిద్దరామయ్య పలకరించుకున్నారు. -
ఉపాధి కూలీ ఇవ్వండి
కేజీఎఫ్: ఉపాధి హామీ కూలీ పనులు చేసి నెలలు గడిచినా కూలీ డబ్బులు ఇవ్వలేదని పారాండహళ్లి గ్రామానికి చెందిన మహిళలు పంచాయతీ ఆఫీసు ముందు బైఠాయించారు. ఉపాధి పనులలో అక్రమాలు జరిగాయని ఈమధ్యనే గ్రామానికి చెందిన కొంతమంది పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులను అధికారులు నిలిపి వేశారు. ఎవరో ఫిర్యాదు చేయడం వల్ల పనులను నిలిపి వేసి, కూలీని కూడా ఇవ్వకపోవడం తగదని మహిళలు వాపోయారు. కొంతమంది ధనవంతులు వ్యక్తిగత కారణాల వల్ల ఉపాధిహామీ పనులను బంద్ చేయడానికి కుట్ర చేశారన్నారు. పీడీఓ మంజునాథ్ మాట్లాడుతూ మూడు రోజులలో కూలీ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. భవనం మీద నుంచి పడి మృతి బనశంకరి: నిర్మాణంలో ఉన్న బృహత్ కట్టడం మీద నుంచి పడి యువతి మృతి చెందింది. ఈ ఘటన నగరంలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చూడసంద్రలో మూలతః ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని (23) అనే యువతి నివాసం ఉంటుంది. స్నేహితులతో కలిసి నిర్మాణ దశలో ఉన్న కట్టడంపైకి నందిని వెళ్లింది. ఈ సమయంలో అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే కన్నుమూసింది. పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుత్రికి తరలించారు. షేర్ల ట్రేడింగ్ పేరిట రూ.26 లక్షల టోకరా మైసూరు: వారసత్వ నగరిలో సైబర్ మోసాలు తగ్గడం లేదు. పేరొందిన ప్రైవేట్ బ్యాంకు పేరిట నకిలీ ట్రేడింగ్ నెట్వర్క్ ద్వారా దుండగులు మైసూరువాసికి రూ.26 లక్షల మేర టోపీ వేశారు. మైసూరులోని విశ్వేశ్వరనగర నివాసి (42) నెల రోజుల క్రితం ఇన్‌స్టాలో షేర్ల ట్రేడింగ్ ప్రకటనను చూశాడు. అందులో పెట్టుబడి పెట్టాలని లింక్‌ను క్లిక్ చేశాడు. వెంటనే అతని మొబైల్ నంబర్ ఓ వాట్సప్ గ్రూప్‌లో యాడ్ అయింది. ఆ గ్రూప్‌లో షేర్ల వ్యాపారానికి సులభంగా ఉండేలా తమ వెబ్సైట్లో అకౌంట్ తెరవాలని సూచించారు. ఆశపడిన ఆ వ్యక్తి తన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి వెబ్సైట్లో ఖాతా తెరిచారు. ఆ తర్వాత దశల వారీగా రూ.26 లక్షలను పెట్టుబడి పెట్టి వంచనకు గురయ్యాడు. బాధితుడు సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇళ్లు, ఆటోల దొంగ అరెస్టు బనశంకరి: ఇళ్లు, వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగను మంగళవారం రాజగోపాలనగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.33.35 లక్షల విలువచేసే సొత్తును సీజ్ చేశారు. పరప్పన అగ్రహార నివాసి నాగేశ్ పట్టుబడిన దొంగ. 208 గ్రాములు బంగారు నగలు, 358 గ్రాములు వెండి వస్తువులు, ఆటోరిక్షా, 2 కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.33.35 లక్షలు గా పోలీసులు అంచనా వేశారు. హెగ్గేనహళ్లి క్రాస్ ఇంటి ముందున్న ప్యాసింజర్ ఆటోను చోరీ చేశాడు. పోలీసులు ఆటో కోసం గాలిస్తుండగా లగ్గరె సర్కిల్లో ఆటోలో వెళ్తూ కనిపించాడు. బెంగళూరు గ్రామాంతర జిల్లాలో పలు ఇళ్లలో, ఆటోలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇతని అరెస్ట్‌తో 7 కేసులు వీడిపోయాయి. -
ఆ 495 ఎకరాలకు మినహాయింపు
దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు రూరల్‌లోని దేవనహళ్లి తాలూకాలో పలు గ్రామాలలో భూసేకరణను విరమిస్తున్నట్లు చెప్పింది. దేవనహళ్లి తాలూకాలోని చెన్నరాయపట్టణ, చుట్టుపక్కల గ్రామాల పరిధిలో హైటెక్ డిఫెన్స్– ఏరోస్పేస్ పార్క్ కోసం 495 ఎకరాలు భూ స్వాధీనం కోసం గతంలో రైతులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ప్రకటించారు. మంగళవారంనాడు ఈ విషయం తెలిపారు. 2021లో ఆగస్టులో 13 గ్రామాల పరిధిలోని 1,777 ఎకరాల భూమిని డిఫెన్స్– ఏరోస్పేస్ పార్క్ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకుంటామని సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. చెన్నరాయపట్టణ, మట్టబార్లు, శ్రోత్రీయ, తెల్లోహళ్లి గ్రామాల పరిధిలో 495 ఎకరాలను మినహాయించామని చెప్పారు. మిగతా గ్రామాల్లో 1,232 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. మంత్రి ప్రకటనతో ఆయా గ్రామాల్లో మళ్లీ రైతుల ఆందోళనలు జరగవచ్చని అనమానాలున్నాయి. తమ భూములకూ మినహాయింపును కోరే అవకాశముంది. 1,232 ఎకరాల్ని సేకరిస్తాం పరిశ్రమల మంత్రి పాటిల్ -
రోడ్డెక్కిన మామిడి రైతులు
కోలారు: మామిడి రైతులకు సహాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయడం లేదని ఆరోపిస్తూ మామిడి రైతులు, వ్యాపారులు మళ్లీ నిరసనకు దిగారు. నగర శివార్లలోని కొండరాజనహళ్లి సమీపంలో బెంగళూరు– చైన్నె హైవేలో మామిడి పండ్లను పోసి రోడ్డును దిగ్బంధించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు అడ్డుకోవడంతో మీకు రైతుల బాధ అర్థం కాలేదా అని ప్రశ్నించారు. జిల్లా మామిడి రైతుల అధ్యక్షుడు నీలతూరి చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ మామిడి ధర అత్యల్ప స్థాయికి పడిపోయిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనట్లు తోతాపురికి మార్కెట్లో డిమాండ్ పడిపోయింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని మద్దతు ధరను జారీ చేయడం లేదని దుయ్యబట్టారు. మామిడికి పరిహారధనం బనశంకరి: కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు పరిహారం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ.. ప్రతి టన్ను మామిడికి రైతుకు రూ.1616 పరిహారం ప్రకటించింది. రాష్ట్రంలో 2,50,000 మెట్రిక్ టన్నుల మామిడికి పరిహార ధనం అందుతుందని కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామి తెలిపారు. మామిడిని రోడ్డుపై పడేసి ఆందోళన -
పేదల ఇళ్లు ఫలహారం
మైసూరు: రాష్ట్రంలో ఇళ్ల చుట్టూ రాజకీయం దుమారం రేగుతోంది. రోజూ దీనిపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పేదలకు ఇళ్ల మంజూరు ఎమ్మెల్యే స్థాయిలోనే అమ్ముడుపోతోందని సీనియర్ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. మంగళవారం మైసూరులో జలదర్శినిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల కేటాయింపుల్లో ఆశ్రయ సమితే సుప్రీం. లబ్ధిదారులు గ్రామ సభల ద్వారా ఎంపిక కావాలి. కానీ ఆశ్రయ సమితి, ఎమ్మెల్యే స్థాయిలోనే ఇళ్లను లంచాలకు అమ్మేస్తున్నారు. పనుల్లో మంత్రికి 10 శాతం కమీషన్ పోతుంది. కాంట్రాక్టర్లకు 25 శాతం పోతుందన్నారు. సీఎంపై మండిపాటు సీఎం నియోజకవర్గంలో ముడా కూడా పాడైందని, మైసూరు ప్యాలెస్ దివాళా తీస్తోందని విశ్వనాథ్ ఆరోపించారు. సీఎం సిద్దరామయ్య రాష్ట్రాన్ని వేలం వేశారు అని మండిపడ్డారు. మైసూరు ప్యాలెస్‌కు ప్రపంచ ఖ్యాతి ఉంది, అయితే ముగ్గురు ముఠాగా ఏర్పడి దసరా చేసుకొంటున్నారు. అన్ని చోట్లా ఆయన శిష్యులే కూర్చొని పాడు చేస్తున్నారన్నారు. సిద్దరామయ్య ఇంక ఏం ఉద్ధరిస్తారని హేళన చేశారు. అన్ని గ్యారంటీ భాగ్యాలను మహిళలకు ఇచ్చారన్నారు. మీరు పిచ్చోడు అయితే ప్రజలు పిచ్చోళ్లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల వాడకం అన్ని చోట్లా ఎక్కువైందని ఆరోపించారు. ఎమ్మెల్యే, మంత్రులకు కమీషన్లు ఎమ్మెల్సీ విశ్వనాథ్ ఆరోపణ -
జూన్‌లోనే.. కావేరి నీటి విడుదల
మైసూరు: కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వరదాయినిగా పేరుపొందిన కావేరి నది మంగళవారం మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ జలాశయం నుంచి పరుగులు తీసింది. ఎగువన వర్షాలతో భారీగా ప్రవాహం చేరడం వల్ల అధికారులు గేట్లను ఎత్తారు. 30 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. ఆ నీరు తమిళనాడుకు వెళ్తుంది. జూన్‌లోనే డ్యాం నీటిని విడుదల చేయడం కేఆర్ఎస్ చరిత్రలో 2 సార్లు మాత్రమే జరిగిందని ఇంజినీర్లు తెలిపారు. 1932లో డ్యాం నిర్మాణం పూర్తయింది. 1941లో ఏకధాటి వానల వల్ల జూన్‌లో నీటిని వదిలారు. మళ్లీ ఇప్పుడు అలా జరిగిందని చెప్పారు. కాగా, నదికి అటు ఇటు ఉన్న గ్రామాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డ్యాం నుంచి నురగలు కక్కుతూ నది పరవళ్లు తొక్కుతోంది. కేఆర్ఎస్ గేట్లు ఎత్తివేత -
Heart Attack: ఆందోళనకరంగా గుండెపోటు మరణాలు
హాసన్ జిల్లా అనగానే పశ్చిమ కనుమలకు ప్రవేశ ద్వారంగా, ప్రకృతి అందాలకు, వ్యవసాయానికి చిరునామాగా గుర్తుకొస్తుంది. కానీ ఎప్పుడు ఎవరి గుండె ఆగిపోతుందోననే దిగులు అక్కడ రాజ్యమేలుతోంది. గుండెపోట్ల భయం హాసన్‌ను పట్టిపీడిస్తోంది.యశవంతపుర: తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్న నాటి నుంచి 60, 70 ఏళ్ల వరకు మోటారు పంపులా పనిచేసే గుండె త్వరగా అలసిపోతోంది. కరోనా వైరస్ విపత్తు వచ్చాక గుండె లయ తప్పుతోందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. రాష్ట్రంలో హాసన్ జిల్లాలో నెల రోజుల్లో 13 మంది గుండెపోటుతో కన్నుమూయడం ఆందోళనకరంగా మారింది. హాసన్‌కు చెందిన రాజారాం ఆనే వ్యక్తి సీఎం సిద్ధరామయ్య కు ఈ జాఢ్యంపై లేఖ రాసి విచారణ చేయాలని మనవి చేశారు. 4 నెలల్లో 250 మంది.. ఈ నేపథ్యంలో యువకుల్లో గుండెపోటు గురించి 10 మంది వైద్యుల బృందం విచారణ చేసింది. 18 నుంచి 45 ఏళ్ల లోపువారు ఎందుకు చనిపోయారు అనేది అధ్యయనం చేశారు. దీంతో పాటు జిల్లాలో గత నాలుగు నెలల వ్యవధిలో 250 మంది గుండెపోటు, ఆకస్మికంగా మరణాలకు గురయ్యారు. కరోనా వైరస్ టీకా కారణమని కొందరు ఆరోపించారు. వైద్యుల బృందం విచారణలో టీకా సంబంధం లేదని నిర్ధారించారు. ఇతరత్రా కారణాలు యువతీ యువకులకు వివిధ కారణాలతో గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి సమాచారం క్రోడీకరించారు. కొందరు అధిక ధూమపానం, మద్యపానం, గుట్కా సేవించడం వల్ల ఇతరత్రా వ్యాధులు సోకి గుండెపోటుతో చనిపోయారని పేర్కొన్నారు. అయితే ఇటువంటి అలవాట్లు లేని యువతులు, మహిళలు కూడా చాలామంది చనిపోయారు. తమ నిర్ధారణలతో వైద్యుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. ఒకే నెలలో 13 మంది బలి ఇటీవల హాసన్ నగరంలోని సత్యమంగల లేఔట్‌కు చెందిన చేతన్ (25), బేలూరు పట్టణవాసి నిషాద్ అహ్మద్ (35), మే 28 హొళెనరసిపుర పట్టణంలో సంధ్య (20), అరకలగూడు తాలూకా కోణనూరువాసి అభిõÙక్ (19), అదే రోజు హాసన్ తాలూకా కెలవత్తి గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనలియ్ యువతి కవన (20), జూన్ 11న హొళెనరసీపుర పట్టణవాసి నిశాంత్ (20)లు ఆకస్మికంగా మరణించారు. జూన్ 12న ఆలూరు తాలూకా మగ్గె గ్రామం వద్ద బస్సులో ప్రయాణిస్తున్న రవాణా శాఖ ఉద్యోగి బీఆర్ నాగప్ప(55), హాసన్ మాజీ నగరసభ సభ్యుడు నీలకంఠప్ప(58), జూన్ 13న హాసన్ వద్ద రాజఘట్ట లో కారులో వెళ్తూనే దేవరాజ్ (43) చనిపోయారు. అలాగే హాసన్ నగరం తెలుగువారి వీధికి చెందిన సతీశ్ (57), జూన్ 14న హాసన్ తాలూకా దొడ్డపురవాసి కాంతరాజు (51) గుండెపోటుతో మృతి చెందారు. -
అసమ్మతి రణభేరి
సమర్థంగా పనిచేయాల్సిన మంత్రులు, ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన పార్టీ ఎమ్మెల్యేలు.. ఇద్దరూ కూడా ఇప్పుడు అసంతృప్తి మంత్రం పఠిస్తున్నారు. తమకు ప్రాధాన్యత దక్కడం లేదు, పనులు జరగడం లేదని బాహాటంగా ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. వారి బాటలోనే మరికొందరు శాసనసభ్యులు వెళ్తే పుట్టి మునిగే ప్రమాదముందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. దీనికి సిద్దరామయ్య, డీకే శివ ఎలా చెక్ పెడతారో?సాక్షి, బెంగళూరు: ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పరిస్థితి ఇది.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలే ప్రభుత్వానికి రెబెల్స్‌గా మారుతున్నారు. సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేయాల్సిన ప్రతిపక్ష బీజేపీ పనిని సొంత నేతలే చేస్తుండడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ నుంచి మరో ఇబ్బంది సిద్దరామయ్య సర్కారుకు ఎదురవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ నిలుపుదల చేస్తున్నారు. ఈ పరిణామాలతో సర్కారు సారథులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సతమతం అవుతున్నారు. ఒకరకంగా చెయ్యి పార్టీలో సంక్షోభం రేగినట్లు భావిస్తున్నారు. సీఎం సలహాదారుడు బీఆర్ పాటిల్, ఆర్థిక సలహాదారుడు బసవరాజ రాయరెడ్డి, మంత్రి హెచ్‌కే పాటిల్, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్, తాజాగా రాజు కాగే సొంత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పేల్చుతున్నారు. తద్వారా బీజేపీ పని సులువుతోందని కాంగ్రెస్ విచారిస్తోంది. వీటిని ఎలా సర్దుబాటు చేయాలా? అని కేపీసీసీ చీఫ్‌తో పాటు డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్, సీఎం సిద్దరామయ్య అంతర్మథనంలో పడ్డారు. బుజ్జగింపుల ద్వారానే దారికి తేవాలి తప్ప భయపెడితే సంక్షోభం మరింత ముదురుతుందని నేతలు చెబుతున్నారు. పలు ఉదాహరణలు ● ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 మందికి పైగా మంత్రులు తమ వినతులపై స్పందించడం లేదని ఎమ్మెల్యే బీఆర్ పాటిల్‌తో పాటు 10 మంది ఎమ్మెల్యేలతో సంతకం చేసిన లేఖ ఒకటి విడుదల అయింది. గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక్ ఖర్గే, రెవెన్యూ మంత్రి కృష్ణబైరేగౌడపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ● విద్యుత్ సమస్యల మీద అధికారులు, మంత్రి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్‌పై పలు ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్‌తో ఎలా? గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ప్రభుత్వం పంపించిన 11 బిల్లులను ఏ గవర్నర్ కూడా తిరస్కరించలేదు. ఈ 11 బిల్లులపై సుదీర్ఘ వివరణ కోరుతూ వాటిని వెనక్కి పంపించారు. ఇందులో 5 బిల్లులు తరువాత పరిష్కారం అయ్యాయి. మిగిలిన ఐదు బిల్లులను రాష్ట్రపతి పరిశీనల కోసం పంపించారు. గ్రామీణాభివృద్ధి విశ్వవిద్యాలయాలు, కేపీఎస్సీ సవరణ బిల్లులను గవర్నర్ తిరస్కరించారు. 00000000000000000000000 వరుసగా ఎమ్మెల్యేల ఆగ్రహ జ్వాలలు బీఆర్ పాటిల్, రాజు కాగె అసంతృప్తి మరోవైపు గవర్నర్ కఠిన వైఖరి సీఎం సిద్దరామయ్యకు దిక్కుతోచని స్థితి పరిపాలన అస్తవ్యస్తం నేను రాజీనామా చేస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే శివాజీనగర: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అందులోనూ ఉత్తర కర్ణాటక శాసనసభ్యులు తిరుగుబాటుస్వరం పెంచారు. బీ.ఆర్.పాటిల్ వ్యవహారాన్ని మరువకముందే, బెళగావి జిల్లా కాగవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరమగౌడ ఆలాగౌడ (రాజు) కాగే సంచలన హెచ్చరిక చేశారు. అవినీతి గురించి బీ.ఆర్.పాటిల్ చెప్పింది అబద్ధం కాదు, ఆయన నిజమే చెప్పారు అన్నారు. రాజు సోమవారం కాగవాడలో మీడియాతో మాట్లాడుతూ అసంతృప్తిని వెళ్లగక్కారు. నా నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఇచ్చామన్నారు. ఉత్తర్వులు మాత్రం రాలేదు, రాష్ట్రంలో పాలనా వ్యవస్థ సంపూర్ణంగా విఫలమైందని ఆరోపించారు. నేను కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీకి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. రెండు రోజుల్లో బెంగళూరులో సీఎం సిద్దరామయ్యను భేటీ చేసి రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు. నా నియోజకవర్గంలో రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు స్తంభించిపోయినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇటువంటి పాలనా వ్యవస్థను చూసి నాకు చాలా బాధగా ఉందన్నారు. -
అర్జున స్మారకానికి విఘ్నాలు
● మంత్రికి ఎమ్మెల్యే షరతులు.. ● ప్రారంభోత్సవం వాయిదా మైసూరు: మైసూరు దసరా వేడుకల్లో అమ్మవారి బంగారు అంబారీని మోసి లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న గజరాజు కెప్టెన్ అర్జున స్మారకం ప్రారంభానికి విఘ్నాలు అడ్డు పడుతున్నాయి. గతంలో హాసన్ జిల్లాలో అటవీ సిబ్బంది పొరపాటుగా కాల్పులు జరపడంతో తూటాలు తగిలి అర్జున చనిపోవడం తెలిసిందే. ప్రజల డిమాండ్ మేరకు స్మారకాన్ని నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరాల వల్ల సోమవారం జరగాల్సిన స్మారకం ప్రారంభం వాయిదా పడింది. మైసూరు జిల్లాలోని నాగరహోళె అడవిలో డి.బి.కుప్పెలో అర్జున స్మారకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. అటవీ మంత్రి ఈశ్వర ఖండ్రె ఇందుకోసం మండ్యలోని శ్రీరంగపట్టణం వరకూ వచ్చారు. అయితే హెచ్.డి.కోటె ఎమ్మెల్యే అనిల్ చిక్కమాదు.. కొన్ని షరతులు పెట్టారని తెలిసింది. స్మారకం ప్రారంభించిన రోజే స్థానిక ప్రజలతో ఏనుగుల దాడులు , నివారణ గురించి సమావేశం జరపాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ఇప్పడు చర్చ వద్దు అని మంత్రి చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. దాంతో మంత్రి కార్యక్రమాన్ని వాయిదా వేయించి బెంగళూరుకు వెళ్లిపోయారు.రూ.4 వేల కోట్ల భూమిలో కబ్జాల తొలగింపు శివాజీనగర: బెంగళూరు తూర్పు తాలూకా బిదరహళ్లి ఫిర్కా, కాడుగోడి ప్లాంటేషన్ 120 ఎకరాల అటవీ భూమిలో ఆక్రమణల తొలగింపును అధికారులు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తుతో సోమవారం ఉదయమే జేసీబీలతో నగర అటవీ శాఖ అధికారులు కబ్జాల తొలగింపును ప్రారంభించారు. ఆ భూమిని పునః స్వాధీనానికి కార్యచరణ కొనసాగుతోంది. సరిహద్దులను గుర్తించి కంచె వేసి, మొక్కలను నాటడంలో నిమగ్నమయ్యారు. ఈ అటవీ భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 4 వేల కోట్లుగా అంచనా వేశారు. కాడుగోడి అటవీ ప్రాంతం ఆక్రమణల గురించి ఇటీవల అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమీక్ష జరిపారు. బెంగళూరులో కబ్జాలకు గురైన అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సీఎం ఢిల్లీ యాత్ర ● ప్రధాని, రాష్ట్రపతితో భేటీ? శివాజీనగర: సీఎం సిద్దరామయ్య సోమవారం సాయంత్రం హడావుడిగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశముంది. పలు ఎమ్మెల్సీ పదవుల భర్తీ చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉండగా, హైకమాండ్ నాయకులతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు బిల్లులు కేంద్రంలో పెండింగ్‌లో ఉండగా, వాటికి ఆమోదం కావాలని సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారు. పన్నుల వాటాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరుగుతోందని రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఒకవేళ రాజ్‌భవన్, రాష్ట్రపతి భవన్ నుంచి సానుకూలంగా స్పందన లభించకపోతే ఏమి చేయాలన్నది హైకమాండ్‌తో మాట్లాడతారని సమాచారం. సమాఖ్య వ్యవస్థను కాపాడాలని సిద్దరామయ్య కోరనున్నారు. రాష్ట్రంలో పథకాల గురించి పలువురు కేంద్ర మంత్రులను కూడా భేటీ చేయనున్నారు. అప్పాయింట్మెంట్ మీద ప్రధాని ఆఫీసు నుంచి ఇంకా సమాచారం రాలేదని తెలిసింది. వాహనం ఢీకొని టెక్కీ మృతి దొడ్డబళ్లాపురం: బెంగళూరులో బాణసవాడి పరిధిలో హిట్ అండ్ రన్లో ఓ టెక్కీ మృతిచెందాడు. మృతున్ని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన సలగున ప్రదీప్ (25)గా గుర్తించారు. ఓ సంస్థలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రదీప్ కల్కెరెలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బైక్‌పై కళ్యాణ్ నగరకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా ఢీకొన్న వాహనం కోసం శోధిస్తున్నారు. బాలికను విక్రయించాలని కిడ్నాప్ శివాజీనగర: ఐదేళ్ల బాలికను కిడ్నాస్ చేసిన ఇద్దరిని బెంగళూరు జ్ఞానభారతి పోలీసులు అరెస్ట్ చేశారు. బసమ్మ, సులోచన అనే ఇద్దరు మహిళలు నిందితులు. 21న విశ్వేశ్వరయ్య లేఔట్లో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి సింధనూరుకు పిలుచుకొని వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు కూడా సింధనూరు నుంచి వచ్చి కూలిపనులు చేసుకుంటున్నారు. కుమార్తె కనిపించటం లేదని తల్లిదండ్రులు జ్ఞానభారతి ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలించగా వివరాలు తెలిశాయి. రాయచూరు పోలీసులకు సమాచారం అందించి నిందితులను అరెస్ట్ చేశారు. బిడ్డను వేరేవారికి అమ్మేయడానికి తీసుకెళ్లినట్లు నిందితులు తెలిపారు. -
ఈడీ ముందుకు డిప్యూటీ సీఎం తమ్ముడు
బనశంకరి: ఐశ్వర్యగౌడ అనే కిలాడీ మహిళ నగల వ్యాపారి నుంచి రూ.9.82 కోట్ల నగలు తీసుకుని డబ్బు ఎగ్గొట్టడం, పలు మోసాల కేసుల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే.సురేశ్ సోమవారం ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సోమవారం బెంగళూరులోని శాంతినగర ఈడీ ఆఫీసుకు వచ్చారు. ఐశ్వర్య బాధితులు చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా నగదు బదిలీ జరిగిందని ఈడీ కూడా విచారణ సాగిస్తోంది. గతంలో ఐశ్వర్య నివాసాలలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో డీకే సురేశ్‌కు నోటీసులు ఇచ్చారు. వందలాది మద్దతుదారులు ఆయన వెంట రావడంతో ఈడీ ఆఫీసు వద్ద కోలాహలం నెలకొంది. గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు.ఆమెతో లావాదేవీలు లేవుకొన్ని గంటలపాటు సురేశ్‌ను అధికారులు విచారించి పంపించారు. సురేశ్ మాట్లాడుతూ విచారణకు పూర్తి సహకారం అందించాను, ఐశ్వర్యతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పారు. విచారణకు ఎందుకు పిలిచారు అనేది తెలియదన్నారు. ఈడీ అధికారుల తీరు ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. కోర్టులు మందలించినా వారిలో మార్పు రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా ఈడీ పనిచేస్తుందని అనిపిస్తుందన్నారు. ఐశ్వర్యగౌడతో ఎలాంటి వ్యవహారాలు లేవు, 3–4 సార్లు తన ఆఫీసులో కలిసిందని, నా నియోజకవర్గానికి చెందిన వారనే కారణంతో వివిధ కార్యక్రమాలకు వెళ్లానని, అంతకు మించి ఏమీలేదని చెప్పానన్నారు. ఓ నటుడు తన వాయిస్‌తో వంచన చేశాడనే దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు.రూ.3.98 కోట్ల ఆస్తులు జప్తుఐశ్వర్యగౌడ వంచన కేసుల్లో ఈడీ అధికారులు రూ.3.98 కోట్ల విలువచేసే ఆస్తిని జప్తుచేశారు. సోమవారం ఎక్స్‌లో ఈ విషయం తెలిపారు. రూ.2.01 కోట్ల విలువచేసే భూమి, ప్లాట్లు, రూ.1.97 కోట్ల నగదు, వాహనరూపంలో ఆస్తులను తాత్కాలికంగా జప్తుచేశామని తెలిపారు. ఐశ్వర్యగౌడ అధిక ఆదాయం హామీ ఇచ్చి పలువురు వ్యక్తుల నుంచి బంగారం, నగదును వసూలు చేసిందని ఆరోపణలున్నాయి. -
పరిసరాల శుభ్రతతో అతిసారకు చెక్
బళ్లారి రూరల్ : అతిసార సామాన్యమైనది కాదు గంభీరమైన వ్యాధి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆ వ్యాధిని నివారించాలని దావణగెరె జిల్లాధికారి గంగాధరస్వామి తెలిపారు. సోమవారం దావణగెరె నగరంలోని చిగటేరి జిల్లాసుపత్రిలో అతిసార వ్యాధి నియంత్రణ జాగృతి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అతిసార వ్యాధికి ముఖ్యకారణం స్వచ్ఛత లోపించడం. ఇంటి ముందు, వెలుపల పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అతిసార వ్యాధిని నివారించొచ్చని తెలిపారు. పిల్లలను మట్టిలోను, మురుగునీటిలో ఆడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చెత్తకుండీల్లోనే చెత్తను వేయాలి. డ్రైనేజీ నీరు వీధుల్లోను, రోడ్లపై రాకుండా అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వానాకాలం అధికంగా అతిసార ప్రబలే ప్రమాదం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాసుపత్రిలో రోగులకు, సంబంధీకులకు అతిసార రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ గీతమాధవ విఠ్ఠల్ రావు, డీహెచ్ఓ డాక్టర్ షణ్ముకప్ప జిల్లా శస్త్ర చికిత్సాధికారి డాక్టర్ నాగేంద్రప్ప, డాక్టర్ రేణుకారాధ్య, డాక్టర్ మృత్యుంజయ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె నుంచి ప్రపంచ స్థాయికి..
హుబ్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్‌లోని యోగా అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యాప్తి చెంది యోగా శిక్షకులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. హుబ్లీ సమీపంలోని కుందగోళ తాలూకా యువత వియత్నాంలో భారతీయ యోగాను నేర్పిస్తున్నారు. ఆ మేరకు గత 10 ఏళ్ల నుంచి ఆ దేశంలో లక్ష మందికి పైగా శిక్షణ ఇచ్చారు. భారత్‌కు చెందిన వేలాది మంది విదేశాల్లో యోగా శిక్షకులుగా పని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కుందగోళ తాలూకాకు చెందిన వందలాది యువకులు వియత్నాం దేశంలో యోగా శిక్షకులుగా రాణిస్తున్నారు. వియత్నాంలోని హోచిమిన్ నగరం, పక్కన ఉన్న నగరంలో యోగా శిక్షణ, బోధన తరగతులు, శిబిరాల నిర్వహణలో వీరు నిమగ్నులయ్యారు. ఆ మేరకు వీరితో శిక్షణ పొందిన యోగా శిక్షకులు ప్రస్తుతం వివిధ చోట్ల శిక్షణ ఇవ్వడం గమనార్హం. కుందగోళ, చిక్కనార్టి, ఎరినారాయణపుర తదితర గ్రామాలకు చెందిన యువకులు యోగా శిక్షకులుగా పని చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. చిక్కనార్టి రాజీవ్ కుమార్ సోమరెడ్డి, ఎరినారాయణపుర సురేష్ కేరి, సంతోష్, ముత్తప్ప, ఈరణ్ణ మఠద, దేవరాజ్, అప్పు పరంగి, వెంకటేష్ యోగా శిక్షకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవంగా యువకులకు యోగా శిక్షకులుగా మారాలన్న ఉద్దేశం లేదు. అయితే కుందగోళ శివానంద మఠంలో, హైస్కూల్లో చదువుతున్న సందర్భంలో ఉత్సాహంగా యోగాసనాలు నేర్చుకున్నారు. అదే యోగా నేడు వారి వృత్తిగా మారి జీవనోపాధికి దారి చూపింది. ప్రస్తుతం ఈ యువకులు విదేశాల్లో నివసిస్తూ భారతీయ యోగాసనాలు నేర్పిస్తున్నారు. అంతేగాక కాలిఫోర్నియా తదితర యోగా కేంద్రాల్లో యోగాసనాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం 110 మంది యువకులు వియత్నాంలో యోగా శిక్షకులుగా మన దేశ కీర్తిని చాటి చెబుతున్నారు. వియత్నాంలో యోగా శిక్షకులుగా రాణిస్తున్న వైనం కుందగోళ యువకులతో విదేశీయులకు యోగా శిక్షణ -
వీధుల్లో మురుగు పరుగు
రాయచూరు రూరల్: పట్టణంలోని పలు వీధుల్లో మరుగుదొడ్లకు చెందిన డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ నిండిపోవడంతో పారిశుధ్య పరిస్థితి గంభీరంగా మారింది. నిండిన మ్యాన్‌హోల్స్ నుంచి మురుగునీరు రహదారిపైకి ప్రవహిస్తుండంటంతో దుర్వాసన వెదజల్లుతోంది. బందే నవాజ్ కాలనీ రహదారిపై ప్రజలు నడవాలంటే జంకే పరిస్థితి చోటు చేసుకుంది. 1976లో ఈ చాంబర్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏ మాత్రం ట్యాంకులు సరిపోవడం లేదు. నాటి నుంచి పైసా ఆదాయం లేని వీటి నిర్వహణ నగరసభకు తలనొప్పిగా మారింది. కొత్తగా మ్యాన్‌హోల్స్ చేసిన సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్ణాటక భూగర్భ జల మండలి అధికారులు నిర్వహణ నగరసభ అధికారులదే అంటూ చేతులు దులుపుకున్నారు. 1976లో రూ.కోటి నిధుల మంజూరుతో వీటిని నిర్మించారు. అప్పట్లో నగరసభ, కాంట్రాక్టర్లు ఏకమై పనులను నాసిరకంగా చేపట్టారు. రెండేళ్లు కూడా కాక ముందే మ్యాన్‌హోల్స్ నుంచి మురుగు నీరు బజారులోకి వస్తున్నాయి. వీటి శుభ్రతకు సఫాయి కర్మచారులు ఎవరూ అంతగా ముందుకు రావడం లేదు. గతంలో వేసిన పైపుల లీకేజీతో మురుగు నీరు రహదారిలోకి వస్తున్నాయి. -
రక్తదానం మహాదానం
బళ్లారి రూరల్ : స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీఎంసీఆర్‌సీ బ్లడ్ సెంటర్, బళ్లారి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బళ్లారి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో బ్యాంకు సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు సాగిన శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రముఖులు డాక్టర్ మహిపాల్, షకీబ్, వీరేశ్, విశ్రాంత రేడియాలజిస్ట్, 137 సార్లు రక్తదానం చేసి బళ్లారి బ్లడ్‌బ్యాంకుగా పేరొందిన డాక్టర్ నాగరాజరావు, బీఎంసీఆర్‌సీ బ్లడ్సెంటర్ సిబ్బంది, ఎస్బీఐ డీజీఎం అశోక్‌చంద్ర, ఆర్ఎం రవి, మెశ్రమ్, ఏజీఎం రాముముచ్చి, సీఎం, హెచ్ఆర్లు గౌతమ్ అడిగ, మధుకేశ్వరస్వామి, ప్రేమ్‌సింగ్ నాయక్, హెచ్ఆర్ మేనేజర్ ప్రతిభ, బెహ్రా, డీజీఎస్ రామకృష్ణ దేవర, ఆర్.శంక్రప్ప, డీజీఎస్ సురాజ్, డీఆర్ఎస్ వాదిరాజ్, ఏజీఎస్ ధర్మేంద్ర నాగపాల్, జడ్ఎస్ మహేశ్వరప్ప, రక్తదాన శిబిరం చైర్మన్, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి బి.దేవణ్ణ తదితరులు పాల్గొన్నారు. భిక్షకుల మధ్య కొట్లాట.. ఒకరి హత్య హుబ్లీ: భిక్షగాళ్లు ఇద్దరు తగువులాడుకున్న ఫలితంగా ఒకరి హత్యకు దారి తీసింది. వివరాలు.. తన తల్లిని తిట్టాడన్న చిన్న కారణంతో ఒకే ఇంట్లో అద్దెకు ఉన్న స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురయ్యారు. పాత హుబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన మితిలేష్ కుమార్ హత్యకు గురయ్యాడు. రాజేష్‌కుమార్ కేసులో ప్రధాన నిందితుడు. అతడిపై కేసు నమోదైంది. గత రాత్రి ఇద్దరి మధ్య ఇంట్లో మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాజేష్‌కుమార్ మితిలేష్ కుమార్ తలపై మైక్‌సెట్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మితిలేష్ కుమార్ మృతి చెందాడని పాత హుబ్లీ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. అధికారికి వీడ్కోలుబళ్లారిఅర్బన్: జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా గత మూడేళ్ల నుంచి విధులు నిర్వహించి చిత్రదుర్గ జిల్లాకు బదిలీ అయిన విజయ్‌కుమార్‌కు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. డీసీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హాల్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి విజయ్‌కుమార్‌ను అధికారులు, సిబ్బంది ఆత్మీయంగా సన్మానించారు. విజయ్‌కుమార్ కొంచెం కోపిస్టి అయినా విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించేవారని తాజాగా డీడీ బాధ్యతలు చేపట్టినా ఇప్పటి వరకు ఆ కార్యాలయంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్న రామకృష్ణ నాయక్ తెలిపారు. విజయ్‌కుమార్ ఏ ఉద్యోగికి ఇబ్బంది కలిగించకుండా పనులు సక్రమంగా నిర్వహించేలా ఉద్యోగులతో చక్కగా మెలుగుతూ విధులు సమర్థవంతంగా చేపట్టేలా చూశారని కొనియాడారు. విజయ్‌కుమార్ సతీమణి జ్యోతి, ఎస్టీ కార్పొరేషన్ అధికారి దివాకర్, జాలెప్ప, సవితతో పాటు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. వైద్యుడి బదిలీ తగదు రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడిని బదిలీ చేయడం తగదని కర్ణాటక రైతు సంఘం, టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం సింధనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు యరదిహాళ మాట్లాడారు. ఇటీవలే ప్రారంభించిన చిన్న పిల్ల్లల ఆస్పత్రిలో వైద్య సేవలు అందించే డాక్టర్ నాగరాజ్‌ను ఉన్నఫళంగా బదిలీ చేయాల్సిన అవసరం లేదని, బదిలీ అదేశాలను రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. -
రైతుల సమస్యలను పరిష్కరించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో రైతులు ఎదుర్కొంర్కొంటున్న జ్వలంత సమస్యలను పరిష్కరించాలని టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టా రు. సోమవారం రాయచూరు విశ్వ విద్యాలయం వద్ద ముఖ్యమంత్రి సిద్దరామయ్యను అధ్యక్షుడు మానసయ్య డిమాండ్ చేశారు. తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలోని కాలువలపై 748 మంది గ్యాంగ్ మ్యాన్లకు ఆరు నెలల బకాయి వేతనాలను చెల్లిం చాలన్నారు. జిల్లాలో 45 ఏళ్ల నుంచి భూమి లేని పేదలకు భూములు పంచాలని, అధికారులు గుర్తించిన 1064 ఎకరాల భూములను పంపిణీ చేయడానికి ముందుకు రావాలన్నారు. హట్టి బంగారు గనుల కంపెనీ వద్ద రూ.2000 కోట్ల పెట్టుబడిపెట్టి 3 వేల మందికి స్వయం ఉపాధి, ఉద్యోగాలు క ల్పించడానికి అవకాశముందని వాటిని పరిష్కారించాలని కోరుతు వినతి పత్రం సమర్పించారు . -
ధార్వాడ ఐఐటీకి రూ.2 వేల కోట్ల అదనపు నిధులు
● కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్లీ: ధార్వాడలోని ఐఐటీకి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేట కోట్ల నిధులను అదనంగా కేటాయించిందని, దేశంలోని అన్ని ఐఐటీల కన్నా ఈ ఐఐటీ ఉన్నతమైన అభివృద్ధి సాధిస్తోందని కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బీవీబీ కళాశాలలో ప్రభుత్వ, ఎయిడెడ్ ఫస్ట్ గ్రేడ్ కళాశాల లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో భారత్‌లో విద్య, ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యలో భారత్ మేటిగా నిలిచింది. దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. దేశంలో ఇతర ఐఐటీల కన్నా ధార్వాడ ఐఐటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం– 2020 ఓ చారిత్రాత్మకం. విద్య రంగంలో సంస్కరణలకు నాంది పలికిందన్నారు. జాతీయ విద్య విధానం ప్రపంచీకరణలో మహాశక్తిగా రూపొందించే లక్ష్యం ఉందన్నారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య వరకు సమగ్రమైన ఎంతో క్రమ శిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించే దిశలో అవసరమైన నైపుణ్యాలను పొందేలా విద్యాభ్యాసం అందిస్తున్నామన్నారు. అచ్చే దిన్ కహాహై అనే వారికి భారత్ తగిన సమాధానాన్ని ఆచరణలో చూపెట్టిందన్నారు. వారు కళ్లు తెరిచి చూడాలని హితవు పలికారు. నేటి విద్య రంగం ఆధునికత సంచరించుకుంది. 21వ శతాబ్దపు విద్య భవిష్యత్తుకు దోహదపడేలా పలు సంస్కరణలు చేపట్టామని కేంద్ర మంత్రి వివరించారు. -
రూ.936 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో రూ.936 కోట్లతో అభివృద్ధి పనులకు సోమవారం సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శ్రీకారం చుట్టారు. జిల్లాలోని యరగేర వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. సిద్దరామయ్య ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ 15వ ఆర్థిక ప్రణాళికలో రాష్ట్రానికి కేటాయించిన రూ.80 వేల కోట్లను నేటికి కూడా రాకుండా నిలుపుదల చేశారని ఆరోపించారు. రూ.111 కోట్లతో బీటీ రోడ్లు, రూ.289 కోట్లతో నీటి పథకాలు, రూ.152 కోట్లతో బ్రిడ్జి కం బ్యారేజీలను నిర్మించనున్నారు. 80 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గిరిజన ఉత్సవాలను ప్రారంభించి, రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం పేరున శిలాశాసనాన్ని ఆవిష్కరించారు. 203 మంది లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాల ద్వారా చేయూతనిచ్చారు. కల్యాణ కర్ణాటక పరిధిలో రాజ్యాంగం నుంచి జారీ చేసిన ఆర్టికల్–371(జే) అమలై దశాబ్దం కానున్న తరుణంలో సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను అభినందించారు. సమావేశంలో మంత్రులు జార్జ్, మహదేవప్ప, సతీష్ జార్కిహొళి, శరణ ప్రకాష్ పాటిల్, సుధాకర్, శరణ బసప్ప దర్శనాపూర్, బోసురాజు, ఎంపీ కుమార నాయక్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, శరణే గౌడ, చంద్రశేఖర్ పాటిల్ గుత్తేదార్, గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, శాసన సభ్యులు హంపయ్య నాయక్, హంపనగౌడ బాదర్లి, జిల్లాధ్యక్షుడు బసవరాజ పాటిల్, కరీం, అస్లాంపాషా, రాజశేఖర్ రామస్వామిలున్నారు. -
సామాజిక సందేశ చిత్రం సెప్టెంబర్ 10
బళ్లారిఅర్బన్: జీవితంలో కొందరు చిన్న కారణానికే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తారు. ఇలాంటి మనోదౌర్బల్య మనస్తత్వం ఉన్న వారిలో ఆత్మసైర్యం నింపేలా సెప్టెంబర్ 10 అనే సినిమాను రూపొందించామని ఈ చిత్ర డైరెక్టర్ ఓం సాయి ప్రకాష్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య వ్యతిరేక సందేశం ఉన్న చిత్రం అని, సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తుందన్నారు. మానసిక త్రిశంఖు స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూసి ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జీవితంలో ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ధైర్యం కావాలన్నారు. అదే ధైర్యాన్ని పుణికి పుచ్చుకొని మనం బతుకు పోరాటాన్ని ఎందుకు చేయరాదు? అనే సారాంశమే ఈ సినిమా కథ అన్నారు. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి కౌన్సిలింగ్ లాంటి మనబలాన్ని ఇచ్చే ఆశావాదం కలిగిన చిత్రం అన్నారు. జూలై తొలి వారంలో విడుదల చేస్తున్నామన్నారు. తాను ఇప్పటి వరకు 105 సినిమాలను సాయి ప్రకాష్ దర్శకత్వం వహించారని ప్రముఖ పోషక నటుడు గణేష్‌రావ్ తెలిపారు. 90 సినిమాలు శత దినోత్సవాన్ని ఆచరించుకున్నాయని ఓం సాయి ప్రకాష్‌తో కలిసి పని చేయడం తనకెంతో గర్వకారణం అన్నారు. ఈ దర్శకుడు 125 సార్లు రక్తదానం చేసి అందరికీ స్పూర్తినిచ్చారన్నారు. ఎన్ని చిత్రాలు తీసినా ఆయన ఉల్లాసం, ఉత్సాహం తగ్గిపోలేదన్నారు. కాగా ఈ సినిమాకు జీజీ కృష్ణ ఛాయాగ్రహణం, నాగేంద్ర ప్రసాద్ సంగీతం, సాహిత్యం సమకూర్చారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నటరాజ్ కాంప్లెక్స్ థియేటర్ల మేనేజర్ లక్ష్మికాంత రెడ్డి, బళ్లారి మంజ, ఈ సినిమా హీరో జయసింహ, మేయర్ ముల్లంగి నందీష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచాం
● హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ హొసపేటె: కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే డబ్బు తగినంతగా అందకపోయిన, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచాం. మన రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. జీడీపీలో కూడా ముందంజలో ఉంది. రాష్ట్రం దివాలా తీసి ఉంటే ఇదంతా సాధ్యం అయ్యేది కాదని హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ తెలిపారు. కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా శిరూరు గ్రామంలో మాజీ మంత్రి కేహెచ్.పాటిల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలో 1000 మంది పీఎస్సై పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పేదలకు హామీ పథకాలు ఇచ్చాం, మా ప్రత్యర్థులు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు హామీ పథకాలను విమర్శించారు. ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని అన్నారు. కానీ వారే మా హామీలను కాపీ కొట్టారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మంచి పథకాలను అమలు చేశాం, మంచి పాలన అందించాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో మేం చెప్పింది ఇదేనని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక భద్రతను సృష్టించారని అన్నారు. ఆ ఆరోపణలు తీవ్రమైనవి కావు మా ప్రభుత్వంలో డబ్బుకు కొరత లేదు, మాకు మంచి పాలన ఉంది, ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలో రాబోయే మూడు సంవత్సరాలు కూడా మంచి పాలన అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు శివరాజ్ తంగడిగి, కేహెచ్ పాటిల్ ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు, ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి, ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్, ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆత్మహత్యలను నివారించాలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో రైతులు అధిక స్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాటిని నివారించే దిశలో సర్కార్ కృషి చేయాలని దక్షిణ బీదర్ శాసన సభ్యుడు శ్రీశైలేంద్ర బిరాదార్ పేర్కొన్నారు. సోమవారం దక్షిణ బీదర్ శాసన సభ్యుడి కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులకు పరిహారం అందించి మాట్లాడారు. 9 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారు. కపలాపుర, అష్టూరు, మీర్జాపూర్, జమీస్తాపూర్, ఘోడంపల్లి, సంగోడి తాండాలో పాము కరిచి మరణించిన కుటుంబాల ను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తమ సర్కార్ చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీబీ యజమానిపై చర్యకు వినతి రాయచూరు రూరల్: జేసీబీ దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణానికి కారకుడైన యజమానిపై చర్యలు చేపట్టాలని కన్నడ రక్షణ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఇమ్రాన్ బడేసాబ్ మాట్లాడారు. మరణించిన చత్తీస్‌ఘడ్‌కు చెందిన విష్ణు, శివరాం, బలరాం కుటుంబాలకు పరిహారం అందించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం అందించారు. విద్యుత్ చౌర్యం నేరం రాయచూరు రూరల్: విద్యుత్ చౌర్యం నేరమని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఎంపీ కుమార నాయక్ పేర్కొన్నారు. తాలూకాలోని బిచ్చాలిలో పర్యటించిన సమయంలో గోదాములో అక్రమంగా విద్యుత్‌ను దొంగతనం చేసి రొట్టెల కేంద్రం నడుపుతుండటాన్ని గమనించి, దాడి చేసి పరిశీలించారు. ప్రభుత్వ నియమాలను ఉల్లఘించి విద్యుత్ వినియోగం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మహిళలు స్వయం ఉపాధి, స్వయంకృషితో పైకి రావాలన్నారు. ఇలాంటి అన్య మార్గాలను విడనాడాలన్నారు. సర్కారు అవినీతిపై బీజేపీ ఆందోళన హుబ్లీ: గృహ వసతి శాఖలో రాష్ట్ర ప్రభుత్వంఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి బండారం గురించి స్వపక్ష ఎమ్మెల్యేలే మంత్రుల అవినీతిపై బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే.శివకుమార్, గృహ వసతి శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో మినీ విధానసౌధ ఆవరణలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు, కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారు. సీఎం, డీసీఎం, మంత్రి జమీర్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పేదలకు పంచాల్సిన వివిధ పథకాల ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అవినీతిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేయడం కీలకం అన్నారు. సంబంధిత మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్‌తో పాటు సీఎం, డీసీఎంలు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ రాష్ట్ర గవర్నర్‌కు వారు విజ్ఞప్తి చేశారు. సంబంధిత వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మంజునాథ, ప్రభు, నారాయణ, జగదీశ్, సరోజ, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. చిన్న వర్షానికే చిత్తడి హొసపేటె: నగరంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా జాతీయ రహదారి వెంట సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న దళితుల ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. కానాహొసహళ్లి హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న దళితుల కాలనీ ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. ప్రజలు, వాహనదారులకు కష్టకరంగా మారింది. వర్షాకాలంలో వాహనదారులు కిందపడి ఆస్పత్రి పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రామస్తులు ఈ విషయం గురించి జాతీయ రహదారుల శాఖ అధికారులకు అనేక సార్లు సమాచారం అందించినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే ఈ పని భద్రత లేకుండా, అశాసీ్త్రయమైన పనిగా జరిగింది, దీని వలన ప్రజలకు, వాహన రాకపోకలకు, హైవే పక్కన నివసించే దళిత కుటుంబాలకు చాలా ఇబ్బంది కలిగింది. ఇది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సమస్యగా మారుతోంది. ఇక్కడ నివసించే ప్రజలు ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
కులం పేరుతో దూషిస్తూ.. ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ ట్రైనీ పైలట్ ఒకరు.. సంచలన ఆరోపణలకు దిగారు. తనను కులం పేరుతో అతిదారుణంగా దూషించారంటూ సహచరులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుగ్రామ్‌లోని ఎయిర్‌లైన్స్ హెడ్‌క్వార్టర్స్ ఈ ఘటన జరగ్గా.. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగళూరుకు చెందిన శరణ్ కుమార్(35) అనే ఇండిగో ట్రైనీ పైలట్.. ఎమ్మార్ క్యాపిటల్ టవర్ 2లో జరిగిన మీటింగ్‌కు హాజరయ్యారు. ఆ టైంలో మరో ముగ్గురు ఉద్యోగులు అతన్ని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. శరణ్ తండ్రి అశోక్ కుమార్ చేసిన ఫిర్యాదులో.. ‘‘కాక్ పిట్లో కూర్చుని విమానం నడిపేందుకు నీకు(శరణ్‌ను ఉద్దేశించి..) అర్హత లేదు. ఇండిగోలో గుమాస్తాగా కాదు కదా.. కనీసం మా బూట్లు నాకడానికి కూడా నువ్వు పనికి రావు. పోయి.. మీ తాతముత్తాతల్లాగా చెప్పులు కుట్టుకుని పని చేసుకుంటూ బతుకు’’ అంటూ తనపై వ్యాఖ్యలు చేశారని తపస్ డే, మనిష్ సహానీ, రాహుల్ పాటిల్‌పై శరణ్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు..తన కుమారుడి విషయంలో ఎయిర్‌లైన్స్ వాళ్లు దారుణంగా వ్యవహరించారని.. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎథిక్స్ కమిటీ, ఆఖరికి ఆ సంస్థ సీీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని అశోక్ మీడియా ముందు వాపోయారు. అంతేకాదు.. తన కొడుకు విధినిర్వహణలో సక్రమంగా ఉన్నప్పటికీ సెలవులు ఇవ్వకుండా, పైగా జీతాల్లో కోతలు పెట్టారని ఆరోపించారాయన. ఘటనపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. అయితే ఈ ఘటన జరిగింది గురుగ్రామ్(హర్యానా)లోని కార్పొరేట్ ఆఫీస్ పరిధిలో. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్-1 పీఎస్‌కు కేసును బదిలీ చేశారు. -
అంతుచూసిన అక్రమ సంబంధం
మైసూరు: చామరాజనగర జిల్లా కొళ్లేగాలలోని హలె హంపాపురలోని సువర్ణవతి నది ఒడ్డున పాతిపెట్టిన మహిళ శవం వర్షాలకు బయటకు వచ్చింది. ఆమె హత్యకు గురైనట్లు గుర్తించారు. కొళ్లేగాల పట్టణంలో నివసించే విజయ్‌కుమార్ భార్య సోనాక్షి (29) గా గుర్తించారు. పోలీసులు విచారణ జరిపగా, వారి ఇంటి దగ్గరే ఉండే మహేష్ బాబు ఈ హత్య చేశాడని తేలింది. సోనాక్షితో మహేష్‌బాబు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి సోనాక్షి భర్త గొడవ పడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసులు నిందితున్ని విచారించారు. ఇటీవల సోనాక్షిని బయటకు తీసుకెళ్లిన నిందితుడు ఆమెను హత్య చేసి శవాన్ని చిన్నపాటి గుంత తీసి పాతిపెట్టి వెళ్లిపోయాడు. వర్షాలు రావడంతో పాటు కుక్కలు శవాన్ని లాగడంతో బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని చామరాజనగర సిమ్స్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితున్ని అరెస్టు చేశారు. -
క్షయపై జాగృతి కల్పించండి
రాయచూరు రూరల్: జిల్లాలో క్షయకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల్లో జాగృతి కల్పించాలని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం ఫాండ్వే సూచించారు. ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఆదివారం డీహెచ్ఓ సురేంద్రబాబుతో కలిసి పోస్టర్లు విడుదల చేశారు. ఆ యన మాట్లాడుతూ క్షయను పూర్తిగా నిర్మూలించేందుకు ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లారోగ్యశాఖ అధికారి సురేంద్ర బాబు మాట్లాడుతూ దగ్గు, జ్వరం, అకలి నశించిపోవడంవంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. జిల్లాలో 67,388 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలు చేయగా 176 మందికి క్షయ ఉన్నట్లు తేలిందన్నారు. -
లేకలేక కొడుకు జన్మిస్తే..
యశవంతపుర: విశ్రాంత నర్సు నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతో తల్లీ, శిశువు పురిట్లోనే కన్నుమూశారు, ఈ విషాద సంఘటన కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకా వాడి పట్టణంలో ఆదివారం జరిగింది. ఇంగళగి గ్రామానికి చెందిన శ్రీదేవి ప్రభానూరు (28), నవజాత మగశిశువు మరణించారు. శ్రీదేవి ప్రసవం కోసం రిటైర్డ్ నర్సు గంగుబాయి వద్ద చేరింది. ఆమెకు ఇదివరకే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, ఈసారి కొడుకు జన్మించాడు. కానీ అతడు ప్రాణాలతో లేడని, కొంతసేపటికే ఆరోగ్యం విషమించి తల్లి కూడా మరణించిందని బంధువులు విలపించారు. నర్సుపై చర్యలు తీసుకోవాలని బంధువులు వాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ ఫీజు దొంగలపాలు శివాజీనగర: పిల్లల కాలేజీ ఫీజు చెల్లించేందుకు దాచిపెట్టిన డబ్బును దొంగలు దోచుకొని పరారైన ఘటన బెంగళూరులోని ప్యాలెస్ ఆవరణలోని ఓ ఇంట్లో జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి పిల్లల కాలేజీల ఫీజులు కట్టాలని కొంత సొమ్మును అప్పు చేసి తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తలుపులను బద్ధలు కొట్టి చొరబడ్డారు. 2 బీరువాలను పగలగొట్టి, అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం చోరీ సంగతి తెలిసి బాధితుడు సదాశివనగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి దగ్గరలో చేపలు పట్టేందుకు వచ్చేవారు దొంగతనం చేసి ఉండవచ్చని తెలిపారు. భర్తే హంతకుడు! ● భార్య, కూతురు హత్య యశవంతపుర: పొలంలోని నీటికుంటలో తల్లీ కూతురు మృతదేహాలు బయటపడ్డాయి. బెంగళూరు గ్రామాంతర జిల్లా దేవనహళ్లి తాలూకా ఇండ్రసనహళ్లిలో చోటు చేసుకొంది. స్థానికులు మాల (28), ఆమె కుమార్తె అనుశ్రీ (8) శవాలు అనుమానస్పదంగా బయట పడ్డాయి. అస్తి వివాదంలో భర్తే ఇద్దరినీ హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాల ఆస్తిలో భాగం అడిగినందుకు ఈ పనికి పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుంతలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. దేవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టుం నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు. 11 రోజుల మైసూరు ఉత్సవాలు కొత్త కాదుమైసూరు: ప్రపంచ ప్రసిద్ధ నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాలను ఈ ఏడాది 10 రోజులకు బదులుగా 11 రోజులు నిర్వహించాలని నిర్ణయించడంపై రాజవంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్ స్పందించారు. ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. గతంలోను 11 రోజులపాటు మైసూరు దసరా వేడుకలు జరిగాయని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చారిత్రక ఘటనలను ప్రస్తావించారు. 1920, 1929, 1953, 1963, 1980, 1990, 1998, 2000, 2015, 2016వ సంవత్సరాల్లో 11 రోజుల పాటు ఉత్సవాలు జరిగాయని, చాంద్రమాన క్యాలెండర్ పంచాంగాన్ని మైసూరు ప్యాలెస్ పాటిస్తుందని చెప్పారు. దసరా సంబరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. -
రూ.26.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
హుబ్లీ: జిల్లాలోని నవళగుందలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ. 26.28 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. ధార్వాడ జిల్లా ఎస్పీ డాక్టర్.గోపాల బ్యాకోడ ఆదివారం వివరాలు వెల్లిడించారు. నగరంలోని సల్మా అన్వర, హుస్సేన్ కేరూర ఇళ్లలో జరిగిన చోరీలకు సంబంధించి గాలింపు చేపట్టి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నవళగుందలోని జోషిప్యాటి గుడ్డదకేరి, గొల్లర వీధి, దాసనాళ గ్రామాల్లో జరిగిన చోరి కేసులకు సంబంధించి 30 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సౌదత్తి తాలూకా హిరేకుంబి గ్రామంలో జరిగిన చోరీకి సంబంధించి 25 గ్రాముల బంగారు, 70 గ్రాముల వెండి స్వాధీనం చేసుకుననట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన నవళగుంద సీఐ రవికుమార్, ఎస్ఐ జనార్ధన్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు బహుమానంతో పాటు ప్రసంశపత్రాలు ప్రదానం చేశారు. సీనియర్ పాస్టర్ కన్నుమూత సాక్షి,బళ్లారి: బళ్లారి నగరంలోని హవంబావి ప్రాంతంలో ఉన్న ఏజీ చర్చి సీనియర్ పాస్టర్ రెవరండ్ ఎన్.సంపత్‌కుమార్ కన్నుమూశారు. అనారోగ్యంతో కొంత కాలంగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. వారం రోజుల క్రితం బళ్లారిలోని బళ్లారి హెల్త్ సీటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. సంపత్ కుమార్ మరణ వార్త వినగానే చర్చి పాస్టర్లు, చర్చి సభ్యులు ఆస్పత్రికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని స్వగృహానికి చేర్చి ప్రజల సందర్శన కోసం ఉంచారు. సోమవారం అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సంపత్‌కుమార్ అల్లుడు రెవరండ్ రాజరత్నం వెల్లడించారు. అంత్యక్రియలకు ఆల్ ఇండియా ఏజె చర్చిల సూపరిండెంట్ పౌల్ తంగయ్య, వివిధ చర్చల పాస్టర్లు పాల్గొంటారు. వేరే ప్రాంతాల్లో ఉంటున్న సంపత్‌కుమార్ ఇద్దరు కుమార్తెలు, అల్లుడు బళ్లారికి పయనమయ్యారు. సంపత్‌కుమార్ భౌతికకాయం వద్ద చర్చి మహిళలు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంపత్‌కుమార్ సేవలను పలు చర్చిల పాస్టర్లు కొనియాడారు. సంపత్‌కుమార్ మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. ఒపెక్ అస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు రాయచూరురూరల్ : నగరంలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పేషాలిటీ–ఒపెక్–ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను రోగులకు అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ నీతిస్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన ఒపెక్ ఆస్పత్రిని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. కల్యాణ కర్ణాటకతోపాటు ఏపీ, తెలంగాణ నుంచి కూడా రోగులు ఇక్కడ వైద్యం కోసం వస్తారన్నారు. క్యాన్సర్, కార్డియాలజీ, యూరాలజీ ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో సర్జికల్ తదితర వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ సాగర్ పాల్గొన్నారు. 27న దేవదుర్గకు దేవెగౌడ రాకరాయచూరురూరల్: దేవదుర్గలో ఈనెల 27న నిర్వహించే జనతాదళ దర్శన్ కార్యక్రమానికి మాజీ ప్రధాని దేవెగౌడ హాజరవుతారని ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి తెలిపారు.అదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. 26 న సింధనూరు, మాన్విలో కార్యకర్తల సమావేశం ముగించుకోని రాయచూరులో రాత్రి బస చేస్తారన్నారు. 27న దేవదుర్గ తాలూకా చిక్క హోన్నకుణి వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన దేవెగౌడ విగ్రహాన్ని మనవడు నిఖిల్‌కుమారస్వామి ఆవిష్కరిస్తారన్నారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ మాట్లాడుతూ 2028 ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధిస్తుందన్నారు. శివ శంకర్, మహంతేస్ పాటిల్, సిద్దన తాతా, మ్లలప్ప సాహుకార్, లక్ష్మిపతి, తిమ్మా రెడ్డి, నరసింహనాయక్ పాల్గొన్నారు. ఆ గనులను ప్రైవేటుకు అప్పగిస్తారా?రాయచూరు రూరల్: దేశానికి బంగారాన్ని అందించే రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకాలోని హట్టి బంగారు గనులను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రజల్లో ప్రచారం జరుగుతోంది. డెక్క్న్, ఎక్స్పో రేషన్, జియో మైసూరు, అర్ఏంఏపీఎంపీఎల్, ఎంఎస్పీఏల్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. -
కన్నతల్లిని కాటికి పంపాడు
బనశంకరి: డబ్బు కోసం కుమారుడు కన్న తల్లిని గొంతునులిమి హత్య చేశాడు. ఈ అమానుష ఘటన ఉడుపి సమీపంలో మణిపాల్‌లో జరిగింది. పద్మబాయి (45)ని కుమారుడు ఈశనాయక్ (26) బలిగొన్నాడు. 18వ తేదీ రాత్రి పద్మాబాయి నడుము నొప్పితో ఉడుపి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఆమె చెల్లెలు శిల్పాకు పోన్చేసిన ఈశనాయక్ వైద్యం కోసం డబ్బు పంపాలని కోరాడు, శిల్పా ఆన్లైన్ ద్వారా కొంత డబ్బు పంపింది. 19వ తేదీ ఉదయం శిల్పాకు ఫోన్ చేసిన ఈశనాయక్.. అమ్మ చనిపోయిందని చెప్పాడు. శిల్పా వెళ్లి చూడగా పద్మబాయి గొంతు కింద ఎర్రగా కమిలి ఉంది. అనుమానంతో మణిపాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వైద్యులు పోస్టుమార్టం చేయగా, గొంతు పిసికి చంపారని నిర్ధారించారు. కుమారుడు ఈశనాయక్ డబ్బుకోసం ఒత్తిడి చేశాడని, ఆమె ఇవ్వను అనడంతో ప్రాణాలు తీశాడని తేలింది. హంతకున్ని అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. -
దశాబ్దాలు గడిచినా వెనుకబాటుతనమే
రాయచూరు రూరల్: ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన కల్యాణ కర్ణాటక ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. విద్య, వైద్య, అరోగ్య, ఉద్యోగ రంగాలలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు సమానంగా కళ్యాణ కర్ణాటక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గతంలో హైద్రాబాద్–కర్ణాటక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. 2015 జూన్‌లో అప్పటి ప్రధాని మనోహ్మన్‌సింగ్ అర్టికల్ 371(జే)ను అమలు చేశారు. అయినా ఇప్పటికీ కల్యాణ కర్ణాటక అభివృద్ధి చెందలేదు. కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాలు వస్తాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. బడ్జెట్లో ఏటా రూ.15వేల కోట్లు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు కేటాయిస్తున్నారు. రహదారులు, పాఠశాలలు, తాగునీటి పథకాలకు ఈ నిధులను సక్రమంగా వినియోగించడం లేదు. ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. విద్యారంగంలో ఐదు వేల మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇక్కడ నియమితులైన ఉపాధ్యాయులు ర రెండేళ్ల తర్వాత ఇతర ప్రాంతాలకు బదిలీలపై వెళ్తున్నారు. దీంతో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ పడుతున్నాయి. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఉద్యోగాల విషయంలో దక్షిణ, ఉత్తర కర్ణాటకు ఇచ్చిన ప్రాముఖ్యతను కళ్యాణ కర్ణాటకకు ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా పాలకులు చిత్తశుద్ధతో వ్యవహరించి కల్యాణ కర్ణాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో సక్రమగా అమలు కాని ఆర్టికల్ 371(జె) విద్య, అరోగ్య, ఉద్యోగ రంగాల్లో నిర్లక్ష్యం -
టీబీ డ్యాం... 45 టీఎంసీలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే తనిఖీకోలారు: నగరంలోని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి ఆదివారం ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ వెళ్లారు. ఆస్పత్రిలో సౌలభ్యాలు, సమస్యల గురించి రోగుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు పుస్తకం, రికార్డులను పరిశీలించారు. మలేరియా , డెంగ్యూ, లాంటి రోగాలు పెరుగుతున్నాయి. స్వఛ్చత కాపాడడానికి నగరసభ తగిన చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. ఆస్పత్రిలో ఎట్టి పరిస్థితిలోను రోగులకు మందుల చీటీలను బయటకు రాసివ్వకూడదని, ఆస్పత్రిలోనే ఇవ్వాలని సూచించామన్నారు. లేని పక్షంలో అలాంటి వైద్యులపై చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రిలో స్వచ్ఛతను పాటించాలన్నారు. నిత్యం ఆస్పత్రికి 120 మందికి పైగా రోగులు వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుంగా అన్ని సౌలభ్యాలు కల్పించాలని సూచించామన్నారు. పిల్లల వార్డులో శిశువులకు ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించామని తెలిపారు. ఆటో బోల్తా.. యువతి మృతి ఉరవకొండ రూరల్: ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిళం సమీపంలో ఆదివారం జరిగింది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన భక్తులు శనివారం పెన్నహోబిళం క్షేత్ర దర్శనానికి వచ్చారు. ఆదివారం స్వగ్రామానికి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆలయ సమీపంలో మలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న లావణ్య (18) అనే బాలిక గాయపడగా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఘటనలో మరో ముగ్గురు గాయపడగా వారికి చికిత్సలు అందించినటు ఎస్ఐ తెలిపారు.