
అపురూపం మరడిహళ్లి రంగప్పన పర్వతం
సాక్షి,బళ్లారి: కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన లావారసం గుట్టలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వీటిని చూడాలంటే చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా మరడిహళ్లి గ్రామానికి వెళ్లాల్సిందే. భూ గర్భం నుంచి ఎగసిన లావారసం ఉప్పునీటితో కలవడంతో ర్యాపిడ్ బెల్ట్ గణీకృతమై పిల్లోలావాగా ఏర్పడుతుంది. ఆలివన్, పైరాక్సిన్, హంపిబోల్, బయోటైల్, ఐరన్,క్యాల్షియం, శిలికాన్ ఖజజాల మిశ్రమ సమ్మేళనమే పిల్లోలావా. మరడిహళ్లిలో ఉన్న ఇలాంటి గుట్టను భారతీయ పురాతత్వ శాఖ 1976లో గుర్తించి జాతీయ భూవిజ్ఞాన స్మారకాలుగా ప్రకటించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే వీటిని పర్యవేక్షిస్తున్నారు. మరడి అంటే మట్టి దిబ్బా అని, దిబ్బ అంచున వెలసిన ఊరే మరడిహళ్లి. దిండు ఆకారంలో ఉన్న ఈ గుట్టను రంగప్పన పర్వతంగా స్థానికులు పిలుస్తారు. భూమి పుట్టి 460 కోట్ల సంవత్సరాలు కాగా మరిడిహళ్లి పిల్లోలావాకు 260 కోట్ల సంవత్సరాల వయస్సు ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పిల్లోలావాను తొలిసారిగా గనులు భూవిజ్ఞానశాఖ డైరెక్టర్ పీఎస్ పిచ్చముత్తు గుర్తించినట్లు ఆ సంస్థ చిత్రదుర్గం సీనియర్ భూశాస్త్ర తెలిపారు.
ముట్టుకుంటే పత్తిని తాకినట్లు అనుభూతి
మరిడిహళ్లి గుట్టలు, రాళ్లు అడవిగా కనిపిస్తోంది. బంతి ఆకారంలో సైజు రాళ్లను, బండరాళ్లను చూడవచ్చు. ప్రతిరాయి కూడా లావా నుంచి ఏర్పడిందే. ముట్టుకుని చూస్తే పత్తిని స్పర్శించినట్లుగా భావన కలుగుతుంది. గ్రామీణ ప్రజలు ఒకటిపై ఒకటి పెట్టి గుడిని కట్టారు. పై కప్పుపై శంఖము, చక్రము, గదా చిత్రాలు లిఖించి రంగనాథ స్వామిగా నామకరణం చేశారు. శ్రీరంగ పట్టణం కరిగట్టలోను లావా చిహ్నలు ఉన్నాయి. మైసూరులోని జ్వాలాముఖి త్రిపురసుందరి దేవిని జ్వాలాముఖి అమ్మగా పూజిస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. మరడిహళ్లిలోని లావా గుట్టలు ఏర్పడి కోట్లాది సంవత్సరాలు గడిచినా వాటి రూపంలో ఇసుమంతైనా మార్పులేదు. వానలు, గాలులు, ఉష్ణోగ్రత్తలు తాకిడి ప్రభావంతో ఎటుమంటి మార్పు చెందలేదు. 50కి పైగా జాతీయ భూవిజ్ఞాన స్మారకాలు ఉన్న మరిడిహళ్లి పిల్లోలావాను అత్యంత ప్రాచీనమైనదిగా చెబుతున్నారు.
కోట్ల సంవత్సరాలు గడిచినా
రూపంలో మార్పు లేదు
లావారసం ప్రవాహాలను నాలుగు విధాలుగా విభజించారు. మొదటి మూడు లావా రసభూమి పై అంచులో కనిపించగా, పిల్లోలావా సముద్రపు అడుగు భాగంలో సంభవించే జ్వాలాముఖి రూపాన్ని సంతరించుకుంటాయి. నిప్పు, నీటీ మధ్య ఘర్షణలో ఏర్పడిన ఘనరూప వస్తువే పిల్లోలావాగా పరివర్తన చెందిందిగా శాష్త్రవేత్తలు చెబుతున్నారు. చల్లటి నీటితో తీవ్రమైన ఉష్ణాంశాలతో లావారరసం కలిసినప్పుడు ఒత్తిళ్లుకు గరై సుడులు, సుడులుగా రూపాన్ని ఏర్పరుడుంది. ఒకదానిపై ఒకటి తలదిండులు పేర్చినట్లుగా గట్టిపడుతుంది. ఈ కారణంగా దీన్ని దిండు ఆకృతి లావా అని అంటారు.
కోట్లాది సంవత్సరాల క్రితం ఏర్పడిన పిల్లోలావా(దిండు) పర్వతాలు
ప్రపంచస్థాయిలో ఘనత వహించిన
మరడిహళ్లి పిల్లోలావా

అపురూపం మరడిహళ్లి రంగప్పన పర్వతం

అపురూపం మరడిహళ్లి రంగప్పన పర్వతం