
రాజధానిలో భారీ వర్షం
బనశంకరి: కొన్నిరోజుల విరామం తరువాత రాజధాని బెంగళూరులో బుధవారం జోరు వర్షం కురిసింది. మహదేవపుర, ఆర్‌ఆర్.నగర, బొమ్మనహళ్లి, యలహంక వలయ పరిదిలో వర్షం పడటంతో చల్లని వాతావరణం నెలకొంది. జక్కూరు, హొరమావు, ఉళ్లాల, దొడ్డ బిదరకల్లు, కోరమంగల, హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్, మడివాళ, లాల్‌బాగ్, జక్కసంద్ర తో పాటు 37 వార్డుల్లో వర్షం కురిసింది. కొన్ని లోతట్టు ప్రదేశాల్లో వర్షం నీరుచేరింది. పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే చిక్కమగళూరు నగరంలో వర్షం పడింది. కరావళి, మలెనాడు, ఒళనాడు జిల్లాల్లో పెద్ద వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

రాజధానిలో భారీ వర్షం

రాజధానిలో భారీ వర్షం